Thief gang
-
బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..
భోపాల్: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య! -
షాకింగ్ ఘటన: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల కార్లు హాంఫట్
సినిమాలో చూస్తుంటాం అత్యంత ఖరీదైన లగ్జరీ కార్టు కొట్టేయడం. నిజ జీవితంలో కాస్త రిస్క్. కానీ ఈ ఘటన చూస్తే ఇంత సులభంగా కొట్టేయొచ్చా అని నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది. ఇక్కడొక దొంగల ముఠా కేవలం 60 సెకన్లలో చకచక సుమారు రూ. 7 కోట్లు ఖరీదు చేసే కార్లను కొట్టేశారు. వివరాల్లోకెళ్తే...ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఈ హైటెక్ దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు ఇంగ్లాండ్‌లోని థురోక్ బరో గ్రామంలో బ్రెంట్వుడ్ రోడ్ సమీపంలోని ఓ కాంపౌండ్‌లోకి చోరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను సినిమాలోని హీరోల మాదిరి ఎత్తుకెళ్లారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి గేటు తీసి సాయం చేస్తే మిగతా దొంగలు ఆ కార్లను ఎంచక్కా...డ్రైవ్ చేసుకుంటూ జస్ట్ 60 సెకన్లలో గప్‌చుప్‌గా కొట్టేశారు. సుమారు రూ. ఏడు కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఐదు లగ్జరీ కార్లను ఎత్తుకెళ్లారు. వాటిలో రెండు పోర్ష్లు, మెర్సిడెస్‌లు కాగా, ఒక మేబ్యాక్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఘటన మొతం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: వాటే ఐడియా! స్కూటర్ సాయంతో నిర్మాణ పనులు) -
‘దొంగ కానిస్టేబుల్’ ఈశ్వర్.. డబ్బు ‘తీసుకోవడం’తోనే గుట్టు వీడింది!
సాక్షి, హైదరాబాద్: సొంతంగా దొంగల ముఠాలను ఏర్పాటు చేసుకుని, వారితో ఏళ్లుగా స్నాచింగ్స్ చేయిస్తూ, ఆ సెల్ఫోన్లను విక్రయిస్తూ భారీ దందా నడిపిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ వ్యవహారం నల్లగొండ పోలీసుల చొరవతో గుట్టురట్టు అయ్యింది. దసరా నేపథ్యంలో ఆ పట్టణంలో రెచ్చిపోయిన సెల్‌ఫోన్ దొంగల అరెస్టుతోనే ఇతడి దందా వెలుగులోకి వచ్చిం. అతడి నేరాల చిట్టా తెలుసుకోవడంపై దృష్టి పెట్టిన అధికారులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దసరా నేపథ్యంలో నల్లగొండలో... ప్రతి గ్యాంగ్‌లోనూ ఐదారుగురు సభ్యులతో దాదాపు 20 ముఠాలు ఈశ్వర్ కనుసన్నల్లో పని చేసేవి. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్, రామగుండ ప్రాంతాల్లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలతో సహా పండుగలు, పర్వదినాల్లోనూ ఈ ముఠా తమ చేతివాటం ప్రదర్శించేది. ఇందులో భాగంగానే హఫీజ్‌పేటకు చెందిన కోటమ్మ, తిరుపతయ్య దంపతులు, ఇద్దరు మైనర్లు సహా ఆరుగురితో కూడిన గ్యాంగ్‌ను దసరా సందర్భంలో ఈశ్వర్ నల్లగొండకు పంపాడు. అక్కడి మొదటి, రెండో టౌన్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోని మార్కెట్లలో రెచ్చిపోయిన ఈ ముఠా అనేక సెల్ఫోన్లను తస్కరించింది. ఈ చోరీ ఫోన్లను ఈశ్వర్ బయటకు పంపేయడంతో పోలీసులకూ ఆచూకీ చిక్కలేదు. స్కాన్ చేసి డబ్బు తీసుకోవడంతో... దసరా సందర్భంలోనే తన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్న ఓ బాధితుడు నల్లగొండ రెండో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా ప్రయతి్నంచారు. ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేసిన చోర దంపతులు పేటీఎం వ్యాలెట్‌ను వినియోగించగలిగారు. దీంతో హైదరాబాద్, నల్లగొండల్లోని ఆరు పెట్రోల్ బంకుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకున్నారు. ఇలా మొత్తం ఆరు విడతల్లో రూ.1.4 లక్షలు తన పేటీఎం ద్వారా కట్ అయినట్లు బాధితుడు నల్లగొండ టూటౌన్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఇలా దొరికిన ఆధారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన అధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. బెదిరింపు ఫోన్లకు రూ.50 వేలు చెల్లింపు... నిందితుల గుర్తింపు కోసం ఆ ఆరు పెట్రోల్ బంకులకు వెళ్లిన పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను సంగ్రహించారు. ఇలా అనుమానితులు ఫొటోలు చేజిక్కడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లి కోటమ్మ, తిరుపతయ్యల ఆచూకీ కనిపెట్టారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలుసుకున్న ఈశ్వర్ తనదైన శైలిలో రంగంలోకి దిగాడు. వారిని వెంటనే అరెస్టు చూపించాలని లేదంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామంటూ కొందరు న్యాయవాదులతో నల్లగొండ పోలీసులకు ఫోన్లు చేయించారు. వారికి ఈశ్వర్ రూ.50 వేలు చెల్లించినట్లు తెలిసింది. చోర జంట విచారణలో ఈశ్వర్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడినీ అరెస్టు చేశారు. ఆ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
Viral Video: కారులో వచ్చి బల్బులు ఎత్తుకెళ్లారు..
జైపూర్: నిఘా కెమెరాల కారణంగా ఇటీవల వింతైన దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరూ చూడట్లేదు కదా అని పాలప్యాకెట్లు, బల్బులు ఎత్తుకెళ్తున్న సంఘటనల వీడియోలు వైరల్‌గా మారాయి. అలాంటి సంఘటనే రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. అయితే, ఇక్కడ దొంగలు ఏకంగా కారులో వచ్చి బల్బులు చోరీ చేశారు. తెల్ల రంగు ఆల్టో కారులో వచ్చిన దొంగల్లో ఇద్దరు క్షణాల్లో బల్బులను మాయం చేశారు. కారులో మరికొంత మంది ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తొలుత ఓ దుకాణం ముందు ఏర్పాటు చేసిన బల్బును దొంగలించేందుకు ప్రయత్నం చేశారు ఇద్దరు దొంగలు. సాధ్యం కాకపోవటంతో మరో దుకాణం వద్ద ఉన్న కుర్చీని తీసుకొచ్చి తమ పని తనాన్ని చూపించారు. ఈ సంఘటన జిల్లాలోని కోల్సియా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడుతున్న క్రమంలో ఏదో శబ్దం వినబడి దుకాణం యజమాని మహేంద్ర దూత్ నిత్రలేచాడు. బయటకి వచ్చి చూసేసరికి దొంగలు కారులో పరారయ్యారు. ఎదురుగా ఉన్న దుకాణం షటర్‌ను పగలగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విని బయటకు వచ్చానని, తనను చూసి పరారయ్యారని తెలిపారు దూత్. మరోవైపు.. దుకాణంలో చోరీ చేసేందుకు ముందుగా బల్బులను తొలగించాలనుకున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన -
ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..!
ముంబై: ముంబైలో వరుస చోరీలకు పాల్పడుతూ స్థానికులను హడలెత్తిస్తోంది ఓ దొంగల ముఠా. దాదర్, బైకులా ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులు లేని అపార్ట్మెంట్స్, ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తోంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య పాలు పోసేవాళ్లు, న్యూస్‌పేపర్లు వేసేవాళ్లు వస్తారని తలుపులు తీసి ఉంచే ఇళ్లనే టార్గెట్ చేసుకుని దోపిడీలు చేస్తోంది. క్షణాల్లో ఇంట్లోకి ప్రవేశించి మొబైల్ పోన్లు, వస్తువులు, నగలు, ఇలా ఏది కన్పిస్తే దాన్ని తీసుకెళ్లిపోతుంది. ఒక్క అక్టోబర్‌లోనే ఈ ముఠా 12 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల పైబడిన ఓ మహిళ, 18 ఏళ్ల యువతి, 10 ఏళ్ల బాలుడు, 10-12ఏళ్ల బాలిక కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో లభించిన వీరి ఫోటోను షేర్ చేసి స్థానికులను అప్రమత్తం చేశారు. అయితే సోమవారం రాత్రి దాదర్ రైల్వే స్టేషన్లో ఈ ముఠా లీడర్‌గా ఉన్న మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తలుపులు బార్ల తీసి ఉంచొద్దని సూచించారు. చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..! -
కారును చుట్టుముట్టిన దొంగలు.. సింహంలా పోరాడిన వ్యక్తి.. వీడియో వైరల్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. ముఠాలుగా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అయితే ఓ వ్యక్తి దొంగల బారి నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సింహంలా పోరాడాడు. ముసుగులు ధరించిన దొంగల ముఠా ఆయన కారును చుట్టుముట్టగా.. కత్తితో వారిని హడలెత్తించాడు. ఓ దొంగను దాదాపు పొడిచినంత పని చేశాడు. అతని తెగువను చూసి దొంగలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. “But why would I need a gun in South Africa” pic.twitter.com/po6zq83e7p — Roman Cabanac (@RomanCabanac) July 20, 2022 ఓవైపు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం గన్ లెసెన్సులు జారీ చేయకుండా చట్టాన్ని తేవాలని ఆలోచిస్తున్న సమయంలో.. ఈ దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుటుంబం కోసం వీరోచితంగా పోరాడిన సదరు వ్యక్తి ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా గన్ లెైసెన్స్ అంశంపై చర్చిస్తున్నారు . ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గన్ ఉంటే బాగుండేదని, అందుకే ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్సులు జారీ చేయాలనే డిమాండ్ వినపడుతోంది. మరోవైపు అమెరికాలో గన్ కల్చర్ వల్ల మాస్ షూటింగ్‌లు జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ వయోజనులందరికీ అధికారికంగా తుపాకుల పొందేందుకు అనుమతి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇదిలాఉండగా.. జులై 10న జొహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఓ బార్లో దుండగుల ముఠా అర్ధరాత్రి తుపాకులతో రెచ్చిపోయి 14 మందిని చంపిన విషయం తెలిసిందే. చదవండి: యుద్ధ ట్యాంకర్లతో జనాలను భయపెడుతూ.. మళ్లీ మారణహోమం తప్పదా?! -
పల్సర్ బైక్‌లే టార్గెట్.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం..
ఎమ్మిగనూరు రూరల్: బళ్లారి కౌల్ బజార్ ప్రాంతంలో పల్సర్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడికి చెందిన హమన్, కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కిని నుంచి 30 పల్సర్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఓ రిటైర్డ్ ఏఎస్ఐ బైక్ చోరీకి గురైంది. బళ్లారి కౌల్ బజార్ పోలీసులు బళ్లారిలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్దుల్‌ను అనుమానంతో అదుపులో తీసుకుకొని విచారణ చేపట్టగా బైక్ చోరీల వ్యవహారం వెలుగు చూసింది. కై రవాడికి చెందిన హమన్ బళ్లారిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అబ్దుల్‌తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్ బైక్‌లను చోరీ చేసి హమన్‌కు అప్పగించే వాడు. హమన్...కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కితో కలిసి బైక్‌లను కేవలం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపు విక్రయించే వారు. ఆ బైక్‌లను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో విక్రయించినట్లు సమాచారం ఇవ్వడంతో కౌలుబజార్ ఎస్ఐ శివకుమార్‌నాయక్ ఎమ్మిగనూరులో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గోనెగండ్ల పోలీస్టేషన్ పరిధిలో 19, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధిలో 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బళ్లారికి తరలించారు. చదవండి: వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి -
పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..
ఆదోని రూరల్(కర్నూలు జిల్లా): ఆదోని పట్టణంలో పందులు, గొర్రెలను అపహరించేందుకు వచ్చిన కర్ణాటక గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. వారి వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించిన యువకుడిని ఢీకొట్టి చంపేశారు. ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకు చెందిన కేఏ25 ఏఏ 4030 నంబర్ బొలేరో ట్రక్కు వాహనంలో టీజీఎల్ కాలనీ, బొబ్బలమ్మ గుడి ఏరియా ప్రాంతాల్లో పందులను అపహరించేందుకు ఓ దొంగల ముఠా చేరుకుంది. చదవండి: భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..? పందుల యజమానులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణ శివారులోని శిరుగుప్పక్రాస్ రోడ్డు వద్ద వారి వాహనానికి టీజీఎల్ కాలనీకి చెందిన సురేష్(19) తన బైక్‌ను అడ్డుగా పెట్టి పక్కనే నిలిచాడు. దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దొంగలకు చెందిన బొలేరో వాహనం బోల్తా పడటంతో.. వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇస్వీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కర్ణాటకకు చెందిన పందుల దొంగల ముఠా ఇటీవల ఆదోని మండలంలో మదిరె, హాన్వాల్, పెద్దతుంబళం, కోసిగి తదితర ప్రాంతాల్లో పట్టపగలు ఇళ్లలో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆరు నెలల క్రితం గూడూరు వద్ద పందులను అపహరించి తరలిస్తున్న ముఠాపై స్థానికులు వెంబడించగా, మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలో వాహనం టైరు పేలడంతో వాహనాన్ని వదిలి పరారయారు. పందుల దొంగలను అరెస్ట్ చేసి శిక్షించాలని పందుల యజమానులు కోరుతున్నారు. -
దొంగతనంలో కొత్త టెక్నిక్.. ధూమ్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు
చెన్నై: ఇటీవల చెన్నైలో జరిగిన ల్యాప్‌టాప్ దొంగతనాలు చూస్తుంటే బాలీవుడ్ ధూమ్ చిత్రానికి ఏ మాత్రం తక్కువ కాదనిపిస్తుంది. ఎందుకంటే దోపిడీకి దొంగలు ఉపయోగించే వివిధ పద్ధతులను మనం చూసుంటాం, కానీ ఇది అంతకు మించి అనేలా ఉంది. పక్కాగా ప్లాన్ చేస్తూ ఓ దోపిడీ గ్యాంగ్ కార్ల నుంచి ల్యాప్‌టాప్ దొంగతనం చేయడానికి కేవలం రబ్బరు బ్యాండ్, మెటల్ బాల్లను ఉపయోగించి సింపుల్‌గా తస్కరిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు వాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. అసలు వారు దానిని ఎలా చేసారంటే.... మొదటగా దొంగతనానికి టార్గెట్‌గా ఒక కారు ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత, చుట్టు పక్కల ఎవరూ లేకుండా జాగ్రత్త పడతారు. చివరగా రబ్బర్ బ్యాండ్, మెటల్ బాల్ని ఉపయోగించి కారు విండోను పగలగొట్టేసి అందులోని విలువైన వస్తువులను స్వాహా చేస్తారు. ఈ దోపిడీ ముఠా అనేక సందర్భాల్లో ఈ విధంగానే ఫాలో అవుతూ వాహనాల అద్దాలను పగలగొట్టి, చెన్నై నగరంలో పార్క్ చేసిన కార్ల నుంచి కనీసం ఎనిమిది ల్యాప్‌టాప్‌లు, రూ .1.2 లక్షలు దొంగిలించారు. కాగా బెంగుళూరులోని ఒక రహస్య ప్రదేశంలో ఉండగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో, ఓ నిందితుడు వాళ్లు ఈ ప్లాన్‌ని పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో ఈ బండారం బయటపడింది. దీన్నంతటిని పోలీసులు వీడియో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశారు. చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి -
3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే
శంకరపట్నం: మూడేళ్లుగా చెరువులో చేపలు మాయమవుతున్నాయి. ప్రభుత్వం వేసిన చేప పిల్లలు కొద్దిగా పెద్దవి అవుతున్నాయో లేదో.. అప్పుడే చెరువులో కనిపించకుండా పోతున్నాయి. దీంతో వాటిని నమ్ముకుని వ్యాపారం చేద్దామనుకున్న మత్య్సకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో చేపల మాయంపై మత్య్సకారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా చేపల దొంగలను పట్టుకోవాలని కష్టపడి గస్తీ కాశారు. ఫలితంగా దొంగలు చిక్కారు. చేపలు దొంగతనం చేస్తున్న ముఠా ఎట్టకేలకు గ్రామస్తులకు చిక్కడంతో వారు పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చెరువులో మూడేళ్లుగా చెరువులో వేసిన చేపలు మాయమవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు చెరువుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రాత్రిపూట నిఘా పెట్టడంతో చేపలు దొంగిలిస్తున్న ఏడుగురి కనిపించారు. వారిని వెంటపడగా నలుగురు మత్స్యకారులకు చిక్కారు. ముగ్గురు పారిపోయారు. ఆ నలుగురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిలో కొత్తగట్టుకు చెందిన నలుగురితో పాటు రేకొండ కమలాపూర్‌కు చెందిన మరో ముగ్గురు చేపల దొంగతనానికి పాల్పడుతున్నారని మత్స్యకారుల సంఘం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు కొత్తగట్టు చెరువు వద్ద దొంగలకు దేహశుద్ధి చేస్తున్న మత్స్యకారులు -
వేర్వేరు చోరీలకు పాల్పడుతున్న ముఠాలు అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : వేర్వేరు కేసుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్టు చేసినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అంజనీ మాట్లాడారు. ఇళ్లలో ఎవరు లేని సమయాన్ని టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ యూసుఫ్, షేక్ సాహద్, సయ్యద్ శహ్ బాజ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.10 లక్షల పది వేలు విలువైన ఆభరణాలు, లక్ష రూపాయల విలువ చేసే గడియారం, రెండు బైక్ లు, కొబ్బరి బోండాల కట్ చేసే కత్తి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.కాగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే వీరు చోరీల బాట పట్టారు. కాగా మరో కేసులో దుర్గామాతా విగ్రహంతో పాటు కోటి రూపాయల విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారని అంజనీ కుమార్ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీ. దేవేందర్, టీ. జాన్, ప్రేమ్ చంద్ గుప్తా, మహమ్మద్ అష్రఫ్ లు ఉన్నారు. దేవేందర్ మూడేళ్ల క్రితం ముంబైలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నాగమణి రాయిని కొనుగోలు చేశాడు.ఈ క్రమంలోనే విగ్రహంతో పాటు నాగమణి రాయిని అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరివద్ద లభించిన దుర్గామాతా విగ్రహం, నాగమణి రాయి పంచలోహం కాదని నకిలీవని తేలినట్లు అంజనీ స్పష్టం చేశారు. -
ఆటో మొబైల్ దొంగల ముఠా అరెస్ట్: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఆటో మొబైల్, మొబైల్ దొంగతనాలు చేస్తున్న 11 మంది గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు అమీర్‌ఖాన్‌తో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాలో ఓ మైనర్ కూడా ఉన్నాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. దొంగిలించిన వస్తువులను ఈ ముఠా నుంచి తీసుకుంటున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై సుమారు 33 కేసులు ఉన్నాన్నాయని ఆయన వెల్లడించారు. 27 బైక్‌లు, 5 సెల్ ఫోన్లు, 1 ఆటోను పోలీసుల స్వాధీనం చేసుకున్నారని సీపీ వెల్లడించారు. ఈ ముఠాలో ఏ1 దొంగ అమీర్‌ఖాన్ మెకానిక్‌గా పని చేశాడు. దీంతో తాళం లేకుండా బైక్‌లు ఎలా దొంగలించాలో బాగా నేర్చుకున్నాడని సీపీ అంజనీకుమార్ వివరించారు. అలాగే గ్యాంగ్‌కి మొత్తానికి నేర్పించి బైక్ దొంగతనాలకి పాలపడుతున్నారని ఆయన తెలిపారు. సైఫాబాద్‌లో నమోదైన కేసును విచారణ చేస్తుండగా.. ఈ గ్యాంగ్ వ్యవహారం అంతా బయటపడిందని సీపీ వెల్లడించారు. గత నాలుగు నెలలుగా వీళ్లు చోరీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఎక్కడ ఈ గ్యాంగ్ పట్టుబడలేదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మీటింగ్ గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దక్షిణ, పశ్చిమ జోన్ ప్రజలతో ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ నిర్వహించామని అయన చెప్పారు. ఒక్కో చోట ఒక్కో సమస్య ప్రజలకు ఉందని.. కాబట్టి విజన్ 2020లో ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకారం అందించాలని సీసీ అంజనీకుమారు కోరారు. ప్రజల్లో వారి రక్షణ కోసం స్వతహాగా కొత్త విధానం ఏర్పడాలని సీపీ అంజనీ కుమార్ అన్నారు. -
హైవే దొంగలు అరెస్ట్
నేరేడ్మెట్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముసుగులో గుట్కా వ్యాపారులే లక్ష్యంగా జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు పోలీసులు చెక్ పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా రాచకొండ ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా దోపిడీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.51 లక్షల నగదు, 42.62 తులాల బంగారు ఆభరణాలు, 1800 యూఎస్ డాలర్లు, రెండు కార్లు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్.. అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఐటీ సెల్ ఎస్ఐ సురేష్, ఘట్కేసర్ డీఐ కిరణ్‌కుమార్, సిబ్బందితో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం చెంగిచెర్ల గ్రామానికి చెందిన డ్రైవర్ అనంతుల వీరన్న(38) నాచారంలోని రాఘవేంద్రనగర్(విజయశ్రీ టవర్స్)లో నివాసముంటున్నాడు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన మొగుళ్ల నరేష్ అలియాస్ నారి((31) మల్లాపూర్‌లోని భవానీనగర్‌లో ఉంటున్నాడు. వీరిద్దరు 2018లో నిషేధిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం చేశారు. బీదర్ నుంచి కార్లలో గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి వరంగల్, కరీంగనగర్, జనగాం జిల్లాలో అధిక లాభాలకు దుకాణదారులకు విక్రయించేవారు. ఈ క్రమంలో పాలకుర్తి, జనగాం, జమ్మికుంట పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. దాంతో ఆర్థికంగా నష్టపోయారు. ముఠాగా ఏర్పడి దోపిడీలు తర్వాత బీదర్ నుంచి గుట్కాను తీసుకువచ్చే వ్యాపారులను దోపిడీ చేయాలని పథకం వేశారు. గుట్కా విక్రయంపై నిషేధం ఉండడంతో దోపిడీ చేసినా ఫిర్యాదు చేయరనే నమ్మకంతో ఇందుకు తెగబడ్డారు. ఇందులో భాగంగా మల్లాపూర్ భవానీ నగర్లో ఉంటున్న యాదాద్రి జిల్లా బొమ్మలారామారం మండలం ఫకీర్‌గూడేనికి చెందిన ఆటో డ్రైవర్ గంగాదేవి ప్రభాకర్(28), భవానీనగర్‌కు చెందిన సేల్స్‌మేన్‌గా పనిచేసే సయ్యద్ అమీర్(22) మహ్మద్ ఫరీద్(25), నాచారంలోని మల్లాపూర్‌కు చెందిన రజనీకాంత్‌తో కలిసి ప్రధాన నిందితులు వీరన్న, నరేష్ ముఠా ఏర్పాటు చేశారు. బీదర్ నుంచి ఎవరూ, ఎప్పుడు,ఎలా గుట్కా ప్యాకెట్లు తీసుకొస్తున్నారో పరిశీలించేవారు. వరంగల్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులు కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్టు గుర్తించిన ఈ ముఠా ఈనెల 19న రాత్రి రెండు కార్లలో ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ సమీపంలో వ్యాపారుల కారును ఆపారు. తాము హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ కోసం కూకట్‌పల్లికి రావాలని వ్యాపారులను బలవంతంగా చెంగిచెర్ల ప్రధాన రోడ్ వద్దకు తీసుకువెళ్లారు. వ్యాపారుల జేబుల్లోంచి రూ.1.50 లక్షల నగదును లాక్కు కున్నారు. మల్లాపూర్‌కు తీసుకువెళ్లి వ్యాపారుల ఏటీఎం కార్డుల నుంచి రూ.20 వేలు డ్రా చేసుకుని, రెండు బంగారు ఉంగరాలు, 1800 యూఏస్ డాలర్లు, మూడు సెల్ఫోన్లు తీసుకున్నారు. తర్వాత రూ.1.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను తీసుకెళ్లిపోయారు. బాధితులు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా ఈమేరకు ఎస్ఓటీ, క్రైం, ఐటీ సెల్ పోలీసులు విచారణలో భాగంగా సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు యమ్నంపేట్ క్రాస్ రోడ్ వద్ద వీరన్న, నరేష్, గంగాదేవి ప్రభాకర్, సయ్యద్ అమీర్, మహ్మద్ ఫరీద్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఘట్కేసర్ వద్ద దోపిడీతో పాటు ఈ నెల 11న ఓఆర్ఆర్ హైవేలో పోలీసులమని కారును ఆపి, రూ.60 వేల నగదు, రెండు సెల్ఫోన్లు గుట్కా వ్యాపారిని దోపిడీ చేసినట్టు ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులు రజనీకాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసులైతే పీడీ యాక్టు గుట్కా తినడం వల్ల నోటి కేన్సర్ వస్తుంది. ఎంతోమంది ఇది తినడం వల్ల మృతి చెందుతున్నారు. నా మిత్రుల్లో కొందరు కూడా అలాగే చనిపోయారు. గుట్కా తినడం మానేయాలి. ఈ వ్యాపారం చేసే వారు వెంటనే మానేయాలి. గుట్కా విక్రయిస్తూ రెండు సార్లు కేసులైతే వారిపైపీడీ యాక్టు పెడతాం. -
జీతానికి.. దొంగలు?
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : జిల్లాలో సెల్‌ఫోన్ దొంగల మాఫియా చెలరేగిపోతోంది. రెండేళ్ల కాలంలో వేల సంఖ్యలో సెల్ఫోన్లు చోరీ అయ్యాయి. ఫోన్ కోసం కేసులెందుకులే అనుకునే వారు కొందరైతే.. కేసు పెట్టేందుకు వెళ్లినా నమోదు, దర్యాప్తులో పోలీసు అధికారులు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ‘హలో’ అనే తెలుగు సినిమాలో చూపించిన తరహాలో ఆకివీడు కేంద్రంగా ఏకంగా ఒక గ్యాంగ్ సెల్‌ఫోన్ చోరీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్లో చోరీ కేసులో దొరికిన దొంగను విచారించగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ దొంగను ఏకంగా జీతానికి పెట్టుకున్నట్లు తేటతెల్లం కావటంతో పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారట. మరో కేసులో సెల్‌ఫోన్ ఐఎంఏ నంబర్‌ను ట్రేస్ చేయగా ఆ ఫోన్ పక్క రాష్ట్రాల్లో ఉన్న ట్లు నిర్ధారణ కావటం గమనార్హం. మొత్తానికి బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి కానరావటం లేదు. జీతానికి దొంగలా ? ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్లో ఇటీవల ఒక దొంగను విచారించిన పోలీసులకు అతను చెప్పిన సమాధానంతో దిమ్మతిరిగింది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక దొంగ తనను జిల్లాకు చెందిన ఒక గ్యాంగ్ పనిలో పెట్టుకుందని, ఏడాదికి రూ.2 లక్షలకుపైగా వేతనం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుందని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్ళినా బెయిల్, ఇతర ఖర్చులన్నీ ఈ గ్యాంగ్ చూసుకుంటుందట. దీంతో జల్సాలకు అలవాటు పడిన కొందరు ఈ తరహా చోరీలు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రాలు దాటిపోతున్న వైనం జిల్లాలో చోరీ చేసిన సెల్ఫోన్లను బల్క్‌గా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారట. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు సెల్ఫోన్లను తరలిస్తున్నట్లు తెలు స్తోంది. ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకే ఫోన్లను విక్రయిస్తూ భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట. ఆకివీడు కేంద్రంగా ఈ గ్యాంగ్ కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం. గతంలో బంగారు, వెండి ఆభరణాలపైనే ఎక్కువగా దృష్టి సారించగా.. కొంత కాలంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హలో సినిమాలో చూపించిన తరహాలో భారీ సంఖ్యలో సెల్ఫోన్లు రాష్ట్రాలు దాటిపోతున్నట్లు సమాచారం. ఏలూరు తోపాటు, పలు పట్టణాల్లో ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కేసుల నమోదుపై అనాసక్తి సెల్ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తులు పోలీసు స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసుల నమోదుకు పెద్దగా ఆసక్తి చూపించటంలేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు ఖరీదు ఫోన్లు అయితే వాటి కోసం కేసులు పెట్టినా దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంటుంది. పైగా అనేక కేసులను ఛేదించే పనిలో బిజీగా ఉండే పోలీసులకు ఈ సెల్ఫోన్ల కేసుల దర్యాప్తు తలనొప్పిగా మారుతుందనే కారణంగా వీటిపై పెద్దగా ఆసక్తి చూపించటంలేదనే అభిప్రాయం ఉంది. ఎవరైనా పెద్ద వ్యక్తులు చెబితేనో, ఏదైనా సిఫారసు వస్తేనో తప్ప సెల్ఫోన్ల చోరీ కేసులు నమోదు కావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ఖరీదు చేసే ఫోన్ల కోసం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాల్సి రావటం కూడా పోలీసులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే సెల్‌ఫోన్ మాఫియాకు వరమనే వాదన వినిపిస్తోంది. -
వరంగల్: దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, కాజీపేట అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఏసీపీ బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్, కోటగిరి రాజు, చెట్టె ప్రసాద్, చెట్టె సురేష్‌లతో పాటు దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మేకల రాములు ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. సమీపబంధువులైన ఈ ఐదుగురు జల్సాలకు మోజులో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. 2005 నుంచి చోరీలకు పాల్పడడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిందితులు గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట, పరకాల, గీసుకొండ, మామూనూర్, ఆత్మకూర్, ఇంతేజార్గంజ్, మట్టెవాడ, కాజీపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడగా పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించామన్నారు. ఈనెల 5వ తేదిన కాజీపేట బాపూజీనగర్‌లోని ఓ ఇంట్లో మహిళను తాగేందుకు నీరివ్వమని మాయమాటలు చెప్పి ఇంట్లో ఉన్న నగల బ్యాగును దొంగిలించారు. దీంతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2015లో ఖమ్మం జిల్లా ఇల్లంద ప్రాంతంలో ఇదే విధంగా చోరీలకు పాల్పడడంతో సీసీఎస్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులకు సంబంధించిన ఫొటోలను సేకరించి వారి కదలికపై దృష్టి సారించారు. కాగా శుక్రవారం చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్యాసింజర్ ఆటోలో కాజీపేట రైల్వే స్టేషన్‌కు వస్తున్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు రైల్వే స్టేడియం వద్ద గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తారసపడిన ముఠాను విచారించగా చోరీలకు పాల్పడిన విషయాన్ని ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. క్రైం ఏసీపీ బాబురావు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రవిరాజు, శ్రీనివాస్‌రావు, కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్, ఎఎస్సై శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అహ్మద్‌పాషా, జంపయ్య, కానిస్టేబుళ్ నజీరుధ్ధీలను సీపీ రవీందర్ అభినందించారు. -
బెం‘బ్లేడ్’ ఎత్తిస్తూ..
సాక్షి, రాజమహేంద్రవరం : అమాయకులను టార్గెట్ చేస్తూ నగరంలో బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్‌తో దాడులు చేయడం వారి వద్ద ఉన్న నగలు, నగదు, ఇతర వస్తువులు దోచుకోవడం ఈ బ్యాచ్‌లు అలవాటుగా మారింది. నగరంలో ఈ సమస్య మూడేళ్లుగా ఉన్నా పోలీసులు ఉదాసీనత వైఖరి వల్ల బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోయి. సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిర్మానుష ప్రాంతాలను ఎంచుకొని ఒంటరిగా వెళుతున్న వారి పై దాడులు చేసి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, నగదు చోరీలకు పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరం లోని గోదావరి రైల్వే స్టేషన్, అండర్ గ్రౌండ్, సుబ్రహ్మణ్యం మైదానం రోడ్డు, ఆనం కళా కేంద్రం వెనుక వైపు ఉన్న రోడ్డు, గోకవరం బస్టాండ్ ప్రాంతాలు, నాగదేవి ఎదురుగా ఉన్న రోడ్లు, జయరామ్, నటరాజ్ థియేటర్ల వద్ద తదితర నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకొని బ్లేడ్ బ్యాచ్‌లు దాడులకు పాల్పడుతున్నాయి. రాత్రి సమయాల్లో ట్రైను, బస్సులు దిగి వెళుతున్న వారిని ఎంచుకొని రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు చొప్పున వచ్చి ఒంటిరిగా వెళుతున్న వారిని బెదిరించి వారి జేబుల్లో ఉన్న నగదు, ఒంటిపై ఉన్న వస్తువులు చోరీలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని బ్లేడ్ చూపించి బెదిరించి వారిని దోచుకుంటున్నారు. ఐరన్ పట్టుకుపోతున్న వారిని అడ్డుకున్నందుకు రాజమహేంద్రవరం తుమ్మలావలోని జయరామ్, నటరాజ్ థియేటర్ల వద్ద నిర్మిస్తున్న మున్సిపల్ పాఠశాల వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి వాచ్‌మన్ గా పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఎనిమిది మంది బ్లేడ్ బ్యాచ్ కు చెందిన వ్యక్తులు వచ్చి స్కూల్ నిర్మాణానికి ఉపయోగించే ఐరన్ ఊచలు పట్టుకుపోతుండగా వాచ్మెన్ సత్యనారాయణ, అతడి కుమారుడు రామకృష్ణ అడ్డుకున్నారు. దీంతో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది దాడి చేసి వారిద్దరినీ రోడ్డు పైకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దాడి చేశారు. ఈ దాడిలో రామకృష్ణ కాలు విరిగిపోయింది. అతడి తండ్రికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే మాదిరిగా పేపర్ మిల్లు వద్ద ఒక వ్యక్తిని అకారణంగా కొట్టి అతడి వద్ద నగదు లాక్కున్నారు. అలాగే క్వారీ మార్కెట్ సెంటర్లో ఒక వైన్ షాపు వద్ద ఒక ఉపాధ్యాయుడిని బెదిరించి ఆయన వద్ద ఉన్న రూ.పది వేలు లాక్కున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిరోజూ రాజమహేంద్రవరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది బాధితులు ఉన్నారు. కొంత మంది ఫిర్యాదులు సైతం చేయకుండా వెళ్లిపోవడంతో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు కొన్ని బయటకు రావడం లేదు. నిఘా కొరవడడంతో రెచ్చిపోతున్న వైనం నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నా పోలీసులు నిఘా కొరవడడంతో రెచ్చిపోతున్నారు. గతంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక రక్షక్ వాహనం ఉండేది. వీటి నిర్వహణ, ఆయిల్ ఖర్చులు భారంగా మారడంతో వీటిని తొలగించారు. వీటి స్థానంలో యాంటీ గూండా స్వాడ్(ఏజీఎస్) పేరుతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. రామహేంద్రవరం మొత్తం ఈ టీమ్ తోనే పర్యవేక్షణ చేయడంతో రాత్రిపూట గస్తీ కొరవడిందని ఆరోపణలు ఉన్నాయి. అర్భన్ జిల్లా మొత్తం పరిధి పెరిగింది. జాతీయ రహదారితో పాటు ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన గామన్ ఇండియా బ్రిడ్జిపైనా బ్లేడ్ బ్యాచ్‌లు విరుచుకుపడుతున్నాయి. ఈ బ్రిడ్జి పై కూడా నిఘా ఏర్పాటు చేయకపోవడంతో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సాదరాజు గుట్ట ప్రాంతానికి చెందిన కాగిత సత్యనారాయణ తన కుమారుడికి బదిలీ కావడంతో విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి ఇంటి సామగ్రిని టాటా ఏస్ వ్యాన్‌లో తీసుకువెళుతుండగా బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు దాడి చేసి వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.ఏడు వేల నగదు, టాటా ఏస్ వ్యాన్‌తో పాటు ఇంటి సామగ్రిని దోచుకున్నారు. వ్యక్తిపై బ్లేడ్ బ్యాచ్ దాడి అడిగిన డబ్బులు ఇవ్వలేదని బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన యువకులు బీరు సీసాతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబు కథనం ప్రకారం... నగరంలోని సీతంపేట ఉప్పువారి వీధికి చెందిన షేక్ సుభానీ ఆదివారం మధ్యాహ్నం బ్రాందీ షాపు వద్ద మద్యం తాగుతుండగా బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఉప్పు శివ, బుడ్డ అనే వ్యక్తులు వచ్చి డబ్బులు అడిగారు. సుభానీ డబ్బులు ఇవ్వకపోవడంతో బీరు సీసాతో అతడి తలపై బలంగా కొట్టారు. ఈ దాడిలో గాయాలపాలైన సుభానీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దోపిడీ దొంగల బీభత్సం
చిలమత్తూరు: సోమఘట్ట గ్రామ సమీపంలోని మధుగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. హుండీలు పగలగొట్టి అందులోని నగదుతో పాటు అర్చకుని భార్యకు చెందిన నగలు, సెల్ఫోన్లను లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశిం్చచారు. అక్కడే శనివారం పూజల కోసం నిద్ర చేస్తున్న అర్చకులు పద్మనాభచారి, లక్ష్మీదేవమ్మ దంపతులను బెదిరించారు. అర్చకులు పద్మనాభచారి చేతులు, కాళ్లు కట్టేసి ఆలయంలోకి చొరబడి గునపం, తదితర రాడ్ల సాయంతో హుండీ పగలగొట్టారు. పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోని హుండీని కూడా పగల గొట్టి అందులోని సొమ్మును అపహరించారు. అర్చకుడి భార్య లక్ష్మీదేవమ్మకు చెందిన రూ.85 వేల విలువ చేసే బంగారు నగలతో పాటు రెండు సెల్ఫోన్లు దోచుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పెనుకొండ పెనుకొండ డీఎస్పీ ఐ.రామకృష్ణ, సీఐ వెంకటేశులు, ఎస్ఐ ప్రదీప్ కుమార్, పోలీసుల, క్లూస్ టీంతో శనివారం ఉదయం ఆలయంలో అణువణువూ సోదా చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించి స్థానికులతో ఆరా తీశారు. -
లారీ దొంగలూన్నారు జాగ్రతా..!
పాల్వంచ: లారీ ఓనర్లు, డ్రైవర్లు మీ లారీలను జర జాగ్రత్తగా చూసుకోండి.. ఆదమరచి ఉంటే అంతే సంగతులు.. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో లారీ దొంగలు సంచరిస్తున్నారు.. పార్కింగ్ చేసి ఉంచిన లారీలను, డీజిల్‌ను చోరీ చేసేందుకు కొన్ని రోజులుగా విఫలయత్నం చేస్తున్నారు. వారం రోజుల్లో మూడు చోట్ల లారీలను చోరీ చేసేందుకు ప్రయత్నించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. కేటీపీఎస్, నవభారత్ కర్మాగారాలు ఉన్న నేపథ్యంలో లారీల ద్వారా ముడిసరుకు తోలకాలు, యాష్ ట్యాంకర్లు నిత్యం తిరుగుతుంటాయి. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల కొద్ది వెయిటింగ్లో ఉంటాయి. ఈ క్రమంలో లారీ డ్రైవర్లు లారీలను వదిలి బయటకు వెళుతుంటారు. డ్యూటీలు దిగి మళ్లీ వస్తుంటారు. కొన్ని సమయాల్లో ఆదమరిచి నిద్రిస్తుంటారు. వారి సీరియల్ వచ్చేసరికి లారీల వద్దకు చేరుకుంటుంటారు. ఇదే అదును చేసుకుని కొందరు లారీలను చోరీ చేసేందుకు యత్నిస్తున్నారు. అంతేగాక లారీలకు చెందిన బ్యాటరీలు, డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ తరహా దొంగతనాల పట్ల లారీ యజమానులు కలవరం చెందుతున్నారు. గతంలో ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నెల్లూరు కేంద్రంగా దొంగతనాలు జరిగేవని, ఇప్పుడు లారీలను ఎక్కడ నిలిపి వెళ్లాలన్నా భయ మేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో వరస సంఘటనలు జరగడంతో పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. వీటిపై నిఘాను తీవ్ర తరం చేశారు. ఈనెల 15వ తేదీన నవభారత్ గేటు వద్ద లోడ్ కోసం టిప్పర్‌ను ఉంచారు. సీరియల్ వచ్చేసరికి లేటవుతుందని డ్రైవర్ డ్యూటీ దిగిపోయాడు. లారీ ఇంజన్ తాళాలు వేయకుండా బయటి డోర్ తాళాలు మాత్రమే వేసి వెళ్లినట్లు సమాచారం. లారీ కనిపించక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మీదేవిపల్లి పరిధిలోని బొమ్మనపల్లి సమీపంలో సుమారు 25 కిలోమీటర్లు తీసుకెళ్లి రోడ్డు పక్కన పెట్టి పరారయ్యారు. లారీలోని డీజిల్, జాకీలు, జాకీ రాడ్లు, బ్యాటరీలు చోరీ చేశారు. టైర్లు తీసేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. లారీ దొరకడంతో యజమాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 16వ తేదీ మార్కెట్ ఏరియాలో కూరగాయల లోడ్ కోసం వచ్చిన లారీలో ఉన్న డీజిల్‌ను దొంగలు చోరీ చేశారు. లారీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 18వ తేదీన కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం వద్ద యాష్(బూడిద) కోసం పాల్వంచకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి ట్యాంకర్ (లారీ) తీసుకెళ్లి అక్కడ వెయిటింగ్లో ఉంచాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఎవరూ లేనిది గమనించి ఓ దొంగ లారీని స్టార్ట్ చేసి బయటకు తీసుకొచ్చాడు. అంతలో గుర్తించి లారీ డ్రైవర్లు వెంట పడ్డారు. ఇది గమనించిన దొంగ లారీని రన్నింగ్‌లోనే ఉంచి దూకి పరారయ్యాడు. అల్లూరిసెంటర్ వద్ద ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి లారీ ఆగింది. సీసీ కెమెరాల్లో పరిశీలించగా వ్యక్తి ముఖం సరిగా కనిపించక పోవడం గమనార్హం. ఇటీవల మల్లయ్య అనే వ్యక్తి టిప్పర్ కొనుగోలు చేశాడు. బీసీఎం రోడ్లో బజాజ్ షోరూం పక్కన ఉన్న లారీ మెకానిక్ షెడ్లో ఉంచగా టిప్పర్ బ్యాటరీలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ వరుస ఘటనలపై దృష్టి సారించాలని పలువురు లారీ డ్రైవర్లు కోరుతున్నారు. -
ఏటీఎంల దొంగ అరెస్టు
చిత్తూరు, పీలేరు రూరల్ : ఏటీఎంల వద్ద అమాయకులను మోసం చేస్తూ వారి ఖాతా ల నుంచి నగదు డ్రా చేసే ఘరానా మోసగాడిని పీలేరు అర్బన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పీలేరు అర్బన్ సీఐ చిన్నపెద్దయ్య కథనం.. మేరకు అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్‌కు చెందిన షేక్ షఫీ(39) ఏటీఎంల వద్ద చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. ఏటీఎంల వద్ద నిరక్షరాస్యులు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి పిన్ నంబర్లను తెలుసుకుని వారికి తెలియకుండా నగదు డ్రా చేయడం, కుదరకపోతే తన వద్ద ఇతర ఏటీఎం కార్డులను వారికిచ్చి తరువాత డబ్బులు డ్రా చేసేవాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 4న పీలేరుకు చెందిన టెంకాయల వ్యాపారి జి.చంద్రశేఖర్ అతని భార్య స్థానిక క్రాస్ రోడ్డులోని ఏటీఎం వద్ద నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా వారిని గమనించిన షఫీ సాయం చేస్తానంటూ వారి కార్డు తీసుకుని రూ.4వేలు తీసిచ్చాడు. వారి ఖాతాల్లో మరింత డబ్బు ఉండడం గమనించి అప్పటికే తన వద్దనున్న అదే రకం కార్డు వారికిచ్చి పంపేశాడు. ఆ తర్వాత వారి కార్డుతో షఫీ అదేరోజు రాత్రి తిరుపతిలో రూ.20వేలు విత్‌డ్రా చేశాడు. మరుసటి రోజు తిరుపతిలోని వేర్వేరు బంగారు దుకాణాల్లో కార్డు ఉపయోగించి రూ.29వేలు విలువచేసే ఉంగరం రూ.63వేలు విలువచేసే బ్రాస్లెట్ కొన్నాడు. తాము మోసపోయామని గ్రహించిన చంద్రశేఖర్ దంపతులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం, బంగారు షాపుల్లో సీసీ టీవీల పుటేజీ ఆధారంగా ఈ కేటుగాడిని పోలీసులు గుర్తించారు. పీలేరులోని యాక్సిస్ ఏటీఎం వద్ద అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నంలో ఉన్న అతగాడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక ఏటీఎం కార్డు, 20వేల రూపాయలు, బంగారు ఉంగ రం, బ్రాస్లెట్ స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. ఇతడు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలోని దాదాపు 35 ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు ల విచారణలో తేలింది. కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకరరెడ్డి, వినాయకం, పోలీసు సిబ్బంది అల్తాఫ్, నరసింహులు, ఆది తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు అంతర్జిల్లా దొంగల అరెస్ట్
దొంగలించిన కారును తిరుపతిలో విక్రయించేందుకు వెళుతూ నాటకీయంగా ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో వారు నేరాల చిట్టా విప్పారు. వైఎస్సార్ జిల్లాలో కూడా వీరు వాహనాలను చోరీ చేశారు. పీలేరు (చిత్తూరు): ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు కార్లు, మూడు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పీలేరు–తిరుపతి మార్గంలోని కోటపల్లె క్రాస్ వద్ద సీఐ ఏసీ పెద్దన్న ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న మారుతి సుజుకి 800 కారు పోలీసులను చూసి వెనుదిరిగి వేగంగా పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు అనుమానించి వాహనాన్ని వెంబడించారు. అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ కారును నాలుగు రోజుల క్రితం కలికిరి మండలం ఎర్రబల్లిలో చోరీ చేసినట్లు నిందితులు వెల్లడించారు. అంతేకాక వారు నేరాల చిట్టా విప్పడంతో వీరు పాత నేరస్తులని, వీరిలో ఒకడు కలికిరిలోని కొలిమి వీధికి చెంది షేక్ అల్లాబక్ (19), మరొకడు అనంతరపురం జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవల్లీ కాలనీ వాసి సయ్యద్ మౌలాలి (35)అని తేలింది. కలికిరి మండలం బండకాడపల్లెలో ఒక పల్సర్ బైక్, స్థానిక ఇందిరానగర్‌లో హీరోహోండా బైక్, చెన్నారెడ్డి వీధిలో ఒక ఆటోను దొంగలించి పీలేరు–మదనపల్లె మార్గంలోని ఒక పాడుబడ్డ గోడౌన్లో దాచి ఉంచినట్లు దొంగలు పేర్కొన్నారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తిరుపతి రోడ్‌లోని పెయింటింగ్ షెడ్లో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మారుతి స్విఫ్ట్ డిజైర్‌ను దొంగలించినట్లు తేలింది. ఆ కారును విక్రయించేందుకు గతనెల 15న చెన్నైకి వెళుతుండగా తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో అక్కడే వదలి పారిపోయినట్లు దొంగలు తెలిపారు. బెయిల్‌పై వచ్చి చోరీలు..! అల్లాబక్ పై జిల్లాలోని రాయచోటి, చిన్నచౌక్, కడప వన్‌టౌన్‌లో చిత్తూరు జిల్లా సోమల, చంద్రగిరి, పూతలపట్టు, రొంపిచెర్ల, రేణిగుంట, తిరుపతి ఈస్ట్, తిరుపతి వెస్ట్, తిరుపతి క్రైమ్, మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో 22 కేసులు నమోదై ఉన్నాయి. వీటికి సంబంధించి 24 ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో గత ఏడాది ఫిబ్రవరిలో సోమల పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన నిందితులు అనంతపురం జిల్లా కదిరి టౌన్‌కు చెందిన సయ్యద్ మౌలాలితో కలిసి మళ్లీ మోటర్ సైకిళ్లు, కార్ల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. చోరీ చేసిన వాహనాలను దాచి ఉంచిన పాత గోడౌన్లో ఒక షిఫ్ట్ కారు, మారుతీ సుజుకి కారు, ఆటో, పల్సర్, ప్యాషన్‌ప్రో బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.95 లక్షలుగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో పీలేరు అర్బన్ సీఐ ఏసీ పెద్దన్న, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దోపిడీ, చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
గుంటూరు:వ్యసనాలకు బానిసలుగా మారి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు, ఇంటి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను అర్బన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏఎస్పీ ఎస్.రాఘవ వివరాలు వెల్లడించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌కు చెందిన పెండ్ర ముత్తయ్య పందుల పెంపకం చేస్తూ జీవిస్తుంటాడు. పేకాట, కోడి పందేలు, మద్యానికి బానిసగా మారాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో శ్రీనివాసరావు పేటకు చెందిన స్నేహితుడు బండి శేషుతో కలసి దోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. రోడ్ల వెంట చిరు వ్యాపారాలు చేసుకునే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, వారికి మాయమాటలు చెప్పి వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి కొట్టి భయపెట్టి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దోపిడీ చేసి పరారవుతుంటారు. ఈ తరహాలో గత నెల 28 వ తేదీ నుంచి ఈనెల 21 వ తేదీ వరకు అర్బన్ జిల్లా పరిధిలోని ఆరు దోపిడీలు, ఓ ఇంటి దొంగతనానికి పాల్పడ్డారు. వరుసగా జరుగుతున్న దోపిడీలపై కేసులు నమోదవుతుండటంతో సీసీఎస్ పోలీసులు, అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు మంగళవారం మంగళగిరి ఫ్లైఓవర్ వద్ద ఉన్నట్టు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, దోపిడీ,దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద ఉన్న 42 గ్రాముల బంగా>రు ఆభరణాలు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ప్రతిభను కనపరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్స్ చేశారు. నిందితులపై సస్పెక్ట్ షీట్లు ప్రారంభించామని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐలు రవిబాబు, అబ్దుల్ కరీం, ఎస్ఐ భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కరడుగట్టిన కర్రి సత్తి ముఠా అరెస్ట్
హైదరాబాద్: ప్రముఖుల ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కర్రి సత్తి ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడుకు చెందిన పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే డైమండ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్రి సతీష్, నరేంద్ర నాయక్, శ్రీనివాస్, సుధీర్ కుమార్ రెడ్డిలు దోచుకున్న సొమ్మును అమ్మడానికి ముంబాయి వెళ్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. చంచల్‌గూడ జైలులో 2014లో నలుగురు నిందితులు కలిశారని, జైలు నుంచి బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీటీవీ కెమెరాలు లేని ఇండ్లను ఈ ముఠా టార్గెట్‌గా చేసుకునేదని, టెక్నాలజీకి దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ తొడుక్కునేవారని వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు చెప్పారు. -
వరుస చోరీలు.. పోలీసులకు సవాల్
కర్నూలు, ఆదోని: వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 20 రోజుల క్రితం ఆదోని పట్టణంలో దోపిడీకి పాల్పడగా.. శుక్రవారం ఎమ్మిగనూరులో నాలుగు ఎరువుల దుకాణాల్లో అందిన కాడికి దోచుకెళ్లారు. రెండూ కూడా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు కావడం పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆదోని ఘటన మరవకముందే ఎమ్మిగనూరులో దొంగలు పడటం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులను ఛేదించడంలో పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే చోరీలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అతీగతీలేని దోపిడీ కేసు.. ఆదోని పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్ రోడ్డులో గత నెల 21న ఐదు జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలు, ఒక రైస్ మిల్లు, 30న పట్టణంలోని మున్సిపల్ ఎంఎం రోడ్డులోని స్టేట్ బ్యాంకు ఏటీఎంలో చొరబడి దోపిడీకి తెగబడ్డారు. ఆరు పరిశ్రమల్లో జేపీఆర్ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో మాత్రం రూ.82వేలు దోచుకెళ్లారు. మిగిలిన పరిశ్రమల్లో ఏమీ దొరకలేదనే అక్కసుతో సెక్యూరిటీ గార్డులను చితక బాది వెళ్లారు. పట్టణంలోని ఎంఎం రోడ్డులో ఉన్న ఏటీఎంలో క్యాష్ బాక్స్ పగలక పోవడంతో ఉత్తి చేతులతో వెనుదిరిగారు. ఏటీఎంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అది పని చేయలేదు. విద్యుత్ సరఫరా లేక పోవడం, బ్యాటరీలు పని చేయక పోవడం వల్లే సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వారి కదలికలు నమోదు కాలేదని తెలుస్తోంది. ఆరు పరిశ్రమల్లో జేపీఆర్‌లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. టీడీపీ ఆదోని ఇన్చార్జ్ మీనాక్షినాయుడుకు చెందిన సులోచనమ్మ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీతో సహా మరో నాలుగు పరిశ్రమల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదు. దోపిడీకి యత్నించిన ముఠా సభ్యులు ముసుగు ధరించినట్లు జేపీఆర్ పరిశ్రమలో నమోదైన సీసీ పుటేజీలను బట్టి తెలుస్తోంది. అయినా ఇంత వరకు అతీగతీ లేదు. వారు..వారేనా? ఆదోనిలో దోపిడీకి పాల్పడిన వారు శుక్రవారం ఎమ్మిగనూరులో చోరీ చేసిన వారు ముసుగులు ధరించి ఉండటం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం అక్కడా.. ఇక్కడా ఐదుగురే పాల్పొనడం బట్టి చూస్తే వారు వీరేనా అనే అనుమానం కలుగకమానదు. ఇక రెండు చోట్ల కూడా జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలనే ఎన్నుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆదోని ఘటనలో కేసు దర్యాప్తుకు అవసరమైన ఆధారాలు ఉన్నప్పటికీ దోపిడీ ముఠాను పోలసులు ఎందుకు గుర్తించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఠాను వెంటనే అరెస్ట్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాలుగు ఎరువు దుకాణాల్లో చోరీ ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని గురువారం అర్ధరాత్రి నాలుగు ఎరువుల దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని శ్రీనివాస సర్కిల్లో నందీశ్వర హైబ్రిడ్ సీడ్స్, శ్రీ లక్ష్మీనరసింహ రసాయన ఎరువులు, వాల్మీకి సర్కిల్ వద్ద మౌనేశ్వర ట్రేడర్స్, వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లోని మల్లికార్జున ట్రేడర్స్ షాపుల్లో అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఈ నాలుగు షాప్‌లకు డోర్స్‌ను తొలగించి లోపలికి దూరి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మల్లికార్జున ట్రేడర్స్‌లో రూ.70 వేల నగదు, నందీశ్వర హైబ్రిడ్ షాప్‌లో రెండు వెండి కాయిన్స్, మౌనిక ట్రేడర్స్‌లో రూ.2 వేల నగదు పట్టుకెళ్లారు. ఉదయం టీ తాగటానికి వచ్చిన వారు గమనించి యజమానులకు సమచారమందించడంతో వారు అక్కడికి చేరుకొని పట్టణ పోలీసులకు చేరవేశారు. పట్టణ సీఐ వి.శ్రీధర్, ఎస్ఐ హరిప్రసాద్ సంఘటనా స్థలాలను పరిశీలించి చోరీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని టౌన్ సీఐ వి.శ్రీధర్ విలేకరులకు తెలిపారు. -
అల్లుడే అసలు సూత్రధారి
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఠాణా పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారి షానవాజ్ ఇంట్లో సోమవారం జరిగిన బందిపోటు దొంగతనానికి మృతురాలి అల్లుడే సూత్రధారని తేలింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు కొత్వాల్ అంజనీ కుమార్ శుక్రవారం ప్రకటించారు. డీసీపీలు కల్మేశ్వర్ సింగవనర్, పి.రాధాకిషన్‌రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. షానవాజ్ తల్లి ఇక్బాల్ బీకి ఓ కుమార్తె కూడా ఉంది. ఈమెను కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన సయ్యద్ జమీల్‌కిచ్చి వివాహం చేశారు. ఆటోడ్రైవర్ అయిన జమీల్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. గతంలో అత్తింటి వారు కొన్నాళ్లు సాయం చేసి ఆపై చేయలేదు. నగదు ఇవ్వమంటూ ఎన్నిసార్లు అడిగినా జమీల్‌కు భంగపాటు ఎదురైంది. ఇదిలా ఉండగా.. షానవాజ్ రెండు నెలల క్రితం వారాసిగూడలో రూ.35 లక్షలతో ఇల్లు కొన్నారు. దీన్ని వేరే వారికి అద్దెకు ఇవ్వడానికి బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జమీల్ కుటుంబాన్నే ఉచితంగా ఉండమని చెప్పారు. కుటుంబంతో సహా అక్కడే ఉంటున్న ఇతగాడి కన్ను షానవాజ్ సంపాదనపై పడింది. ఇల్లు కొన్నాడంతో అతడి వద్ద భారీ మొత్తం ఉంటుందని, దాన్ని చేజిక్కించుకుంటే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడవచ్చని పథకం వేశాడు. సోదరుడి సహకారంతో కుట్ర అమలు జమీల్ సోదరుడైన బోరబండ సయ్యద్ ముజీబ్ గతేడాది సనత్‌నగర్ పరిధిలో ఓ హత్య కేసులో నిందితుడు. జైలుకెళ్లిన అతగాడు రెండు నెలల క్రితం బయటకు వచ్చి బాచుపల్లిలో ఉంటున్నాడు. విషయం అతడికి చెప్పిన జమీల్ దొంగతనానికి కుట్ర చేశాడు. తోటి డ్రైవర్, బంజారాహిల్స్ వాసి షేక్ అబ్దుల్ సలీం, సంగారెడ్డికి చెందిన బావమరిది మహ్మద్ జమీర్, సలీం స్నేహితుడైన మెహదీపట్నం వాసి మహ్మద్ అద్నాన్, ముజీబ్ స్నేహితుడైన సంగారెడ్డి వాసి మహ్మద్ ఇమ్రాన్, వీరికి పరిచయస్తురాలైన సంగారెడ్డికే చెందిన బీబీ బేగంతో ముఠా కట్టాడు. షానవాజ్ విధులకు వెళ్లిన తర్వాత ఇంట్లో అత్తాకోడళ్లే ఉంటారని దీంతో పగటిపూటే ఈ నేరం చేయాలని నిర్ణయించుకున్నారు. కారులో వచ్చి కాపుకాసి.. షానవాజ్ ఇంట్లో దోపిడీ చేయడానికి సోమవారం ఈ ఎనిమిది మందీ కలిసి సలీంకు చెందిన కారులో తిరుమలగిరికి వచ్చి జమీల్, ముజీబ్, సలీంలు ఇంటి సమీపంలో కారుతో ఆగిపోయారు. బుర్ఖా ధరించిన బీబీ బేగంతో పాటు ముసుగులు వేసుకున్న మిగిలిన నలుగురూ షానవాజ్ ఇంటికి వెళ్లారు. తలుపు కొడుతూ ఆ ఇంట్లో ఉండే వారి పేర్లు పెట్టి పిలిచారు. దీంతో ఇక్బాల్ బీతో పాటు ఆమె కోడలు తలుపు తీయగా.. లోపలకు ప్రవేశించిన ఐదుగురూ కత్తులు చూపి బెదిరిస్తూ వారిపై దాడి చేశారు. నోటికి ప్లాస్టిక్ టేప్ వేసి కాళ్లూ,చేతులు కట్టేశారు. వారి ఒంటిపై ఉన్న మూడు గ్రాముల బంగారం, 45 గ్రాములు వెండితో ఉడాయించారు. వృద్ధురాలి మృతితో మారిన తీవ్రత బందిపోట్ల దాడిలో గాయపడి అస్వస్థతకు గురైన ఇక్బాల్ బీ మంగళవారం ఆస్పత్రిలో కన్నుమూశారు. నేరం జరిగిన రోజు షానవాజ్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయిన కారు నెంబర్ కేసులో కీలక ఆధారంగా లభించింది. దొంగలు పేర్లు పెట్టి పిలవడంతో పరియస్తుల ప్రమేయం అనుమానించి దర్యాప్తు చేశారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వలపన్ని ఎనిమిది మంది నిందితులనూ పట్టుకున్నారు. వీరి నుంచి కారు, కత్తులు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీబీ బేగం భర్త కొన్నాళ్లక్రితం చనిపోయాడు. ఈమె అరెస్టుతో ఐదేళ్ల బిడ్డ అనాథగా మారి బంధువుల సంరక్షణకు చేరింది. -
తెట్టంగిలో దొంగల హల్చల్
శ్రీకాకుళం, వీరఘట్టం: మండలంలోని తెట్టంగి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. కత్తులతో గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. యజ్జల మల్లీశ్వరరావు, గేదెల కన్నబాబు ఇళ్లల్లో చొరబడి చోరీకి యత్నించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మల్లీశ్వరరావు, స్వప్న దంపతులు ఉన్న ఇంటిలోకి దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న డబ్బాను తీసి రెండు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, రూ.10 వేలు నగదు కాజేశారు. అనంతరం పక్క వీధిలో ఉన్న గేదెల కన్నబాబు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు తెరుస్తుండగా కన్నబాబు భార్య సునీతకు మెలకువ రావడంతో కేకలు పెట్టి దొంగలను ప్రతిఘటించింది. దీంతో అక్కడి నుంచి దొంగలు పారిపోయారు. అయితే బీరువా లాకరు తాళాలు మాత్రం పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అందరూ మేల్కొని చుట్టూ గాలించారు. సుమారు 5 అడుగుల ఎత్తున నల్లగా ఉన్న వీరంతా లుంగీ తప్ప ఎటువంటి దుస్తులు లేకుండా కత్తులతో వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఓ కత్తిని కన్నబాబు ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ముమ్మర దర్యాప్తు... విషయం తెలిసిన వెంటనే వీరఘట్టం ఎస్ఐ జి.అప్పారావు గురువారం అర్ధరాత్రి తెట్టంగి గ్రామం వెళ్లి దొంగలు చొరబడిన గృహాలను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శుక్రవారం శ్రీకాకుళం క్లూస్ టీం వచ్చి మల్లీశ్వరరావు ఇంట్లో సోదాలు చేసి వేలిముద్రలు సేకరించారు. దొంగలు విడిచిపెట్టిన కత్తిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ... మల్లీశ్వరరావు ఇంట్లో దొంగతనం జరిగినప్పటికీ ఆ బంగారు, వెండి నగలు తన అక్క బంగారుతల్లివని బాధితులు తెలిపారు. తన అక్క కొత్త ఇళ్లు కడుతుండడంతో వారి ఇంట్లో సామాన్లు ఉంచడానికి చోటు లేకపోవడంతో తమ ఇంట్లో నగలను భద్రపరిచారని పేర్కొన్నారు. తులం బంగారు నగలు, 5 తులాల వెండి వస్తువులు, 2 వేల నగదు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అప్పారావు విలేకర్లకు తెలిపారు. భయం వేసింది.. మా ఆయన డాబా మీద కంప్యూటర్ వర్కు చేస్తూ అక్కడే నిద్రపోయారు. నేను పిల్లలిద్దరితో కలిసి నిద్రపోయాను. అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ నాముఖంపై టార్చిలైటు కొడుతుండగా ఇంకో వ్యక్తి బీరువా తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నల్లగా పొట్టిగా ఉన్న ఓ వ్యక్తి నా నోరు మూసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో నేను కేకలు వేసేందుకు ప్రయత్నం చేయడంతో పారిపోయారు. డాబాపై మా ఆయన బయటకు రాకుండా బయట గెడ పెట్టారు. దీంతో భయమేసింది. మా ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదుగాని మా బీరువా లాకరు తాళాలు పట్టుకుపోయారు. – గేదెల సునీత, తెట్టంగి,వీరఘట్టం మండలం