third day
-
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
భారత్‌తో రెండో టెస్టు: వెస్టిండీస్ నిలకడ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెపె్టన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (235 బంతుల్లో 75; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా...బ్లాక్‌వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది. తొలి సెషన్లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, విండీస్ 31 పరుగులు చేసి కిర్క్ మెకన్జీ (57 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మెకన్జీని భారత్ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ తన తొలి వికెట్‌గా పెవిలియన్ పంపించడం విశేషం. ముకేశ్ వేసిన బంతిని ఆడలేక మెకన్జీ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెకన్జీ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఉనాద్కట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సిక్స్ బాదాడు. లంచ్ విరామ సమయానికి బ్రాత్‌వైట్ 49 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్ ప్రారంభం కాగానే బ్రాత్‌వైట్ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే సెషన్లో అతని వికెట్ తీయడంలో భారత్ సఫలమైంది. అశ్విన్ వేసిన చక్కటి బంతి బ్రాత్‌వైట్ మిడిల్ స్టంప్‌ను తాకింది. ఆ తర్వాత బ్లాక్‌వుడ్, అతనజ్ కలిసి జట్టును నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్‌కు ప్రతికూలంగా వచ్చాయి. తొలి టెస్టుతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంతో మెరుగ్గా కనిపించింది. రెండో రోజు వెస్టిండీస్ ఓపెనర్లు పట్టుదలగా ఆడి శుభారంభం అందించారు. బ్రాత్‌వైట్, తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (95 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి 34.2 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి 71 పరుగులు జోడించారు. జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షాట్ ఆడబోయిన చందర్‌పాల్ పాయింట్లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే బ్రాత్‌వైట్, మెకన్జీ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (37 నాటౌట్), మెకన్జీ (14 నాటౌట్) అజేయంగా నిలిచారు. -
ఫ్రాన్స్‌లో ఆగని నిరసనలు
పారిస్: ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్‌డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు. పారిస్‌లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్‌ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది. టీనేజర్లను బయటకు రానివ్వకండి: తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్‌లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
మూడవ రోజు బీఆర్ఎస్ నేతల పై ఐటీ దాడులు..!
-
మూడో రోజూ మార్కెట్ల జోరు
ముంబై: ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బలపడ్డాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు జంప్‌చేసి 62,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 18,599 వద్ద నిలిచింది. యూఎస్ మార్కెట్లు పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రభావంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్లు ఊగిసలాడినప్పటికీ లాభాల మధ్యే కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 524 పాయింట్లు పురోగమించి 63,026కు చేరింది. వెరసి 63,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 18,641 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సానుకూల సెంటిమెంటు నేపథ్యంలో మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,072 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 313 పాయింట్లు లాభపడింది. దీంతో మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల సమీపానికి చేరాయి. యూఎస్ రుణ పరిమితిపెంపునకు ఆదివారం సూత్రప్రాయ అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఎంఅండ్ఎం జూమ్ ఎన్ఎస్ఈలో కన్సూ్యమర్ డ్యురబుల్స్, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 0.6 శాతం స్థాయిలో బలపడితే.. ఆయిల్–గ్యాస్, ఐటీ 0.4 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో క్యూ4 ఫలితాల అండతో ఎంఅండ్ఎం 3.4 శాతం ఎగసింది. ఇతర బ్లూచిప్స్‌లో టైటాన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, అల్ట్రాటెక్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, ఐటీసీ 2.6–1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఓఎన్జీసీ 3 శాతం పతనంకాగా.. దివీస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, అదానీ ఎంటర్, విప్రో 1.2–0.4 శాతం మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు..: బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,921 లాభపడగా.. 1,715 నష్టపోయాయి. ఇటీవల దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా నగదు విభాగంలో రూ. 1,758 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ సైతం రూ. 854 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నాయి. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.2 శాతం నీరసించి 76.82 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి స్వల్పంగా 4 పైసలు తగ్గి 82.63కు చేరింది. -
Agnipath Scheme: ఆరని అగ్గి
న్యూఢిల్లీ: సైన్యంలో నియామకాల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశమంతటా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శనివారం సైతం ఆందోళనలు కొనసాగాయి. పలుచోట్ల హింసాకాండ చోటుచేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో యువత రోడ్లు, రైలు పట్టాలపై బైఠాయించారు. పుషప్‌లు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 369 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూశారు. బిహార్‌లో రైల్వేస్టేషన్‌కు నిప్పు బిహార్‌లో యువకులు బంద్‌కు పిలుపునిచ్చారు. తారేగానా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దానాపూర్‌లో అంబులెన్స్‌పై దాడికి దిగారు. అందులోని ముగ్గురిని తీవ్రంగా కొట్టారు. రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఔట్‌పోస్టుపై దాడిలో పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చాయి. కర్ణాటకలోని ధార్వాడలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బెంగాల్లో రైలు పట్టాల దిగ్బంధం పశ్చిమ బెంగాల్లో శనివారం కూడా నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్నిపథ్ వద్దంటూ యువకులు పట్టాలపైనే పుషప్స్ చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ నినదించారు. ఆర్మీలో చేరేందుకు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేరళలో భారీ నిరసన ర్యాలీలు కేరళలో నిరసనలు హోరెత్తాయి. ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేసుకొని ఫలితాల కోసం చూస్తున్న యువకులు తిరువనంతపురం, కోజికోడ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అగ్నిపథ్‌తో తమ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పుషప్స్ చేశారు. పథనంథిట్టలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు గాయపడ్డారు. యూపీలో 400 మందిపై కేసులు యూపీలో మీరట్, జాన్పూర్, కన్నౌజ్‌లో యువకులు నిరసన కొనసాగించారు. బస్సులు తగలబెట్టారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బైఠాయించారు. బలియా, అలీగఢ్, గౌతమ్‌బుద్ధ నగర్, వారణాసి తదితర 17 ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన 109 మందిని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లూథియానా రైల్వేస్టేషన్లో బీభత్సం హరియాణాలోని మహేందర్‌గఢ్‌లో ఆందోళనకారులు ఓ వాహనాన్ని తగలబెట్టారు. సోనిపట్, కైతాల్, ఫతేబాద్, జింద్‌లో భారీ నిరసనలకు దిగారు. రోహ్తక్–పానిపట్ హైవేను దిగ్బంధించారు. పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. కిటికీల అద్దాలను, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. రాజస్తాన్‌లోని జైపూర్, జోద్పూర్లోనూ వందలాదిగా రోడ్లపైకి వచ్చారు. అల్వార్‌లో జైపూర్–ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఓ బస్సును ధ్వంసం చేశారు. చిదావాలో పట్టాలపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
3వ రోజు నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
రంగారెడ్డి జిల్లాలో మూడోరోజు వైఎస్ షర్మిల పాదయాత్ర
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
-
నేడు మూడోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
పార్లమెంట్లో మూడోరోజూ వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన
-
పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వాహనదారులు భయపడినట్టే అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతి రోజు నుంచి పెట్రో బాదుడు తప్పదన్న అంచనాల కనుగునే వరుసగా మూడో రోజు గురువారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. లీటర్ పెట్రోలుపై .25పైసలు, డీజిల్ రూ.30 పైసలు చొప్పున పెంచేశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.99, డీజిల్ రూ.81.42కు చేరింది. ప్రధాన నగరాల్లో లీటరుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్ రూ.88.49 చెన్నైలో పెట్రోల్ రూ.92.90, డీజిల్ రూ.86.35 కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.14, డీజిల్ రూ.84.26 బెంగళూరులో పెట్రోల్ రూ.94.01, డీజిల్ రూ.86.31 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.57, డీజిల్ రూ.88.77 అమరావతిలో పెట్రోల్ రూ.97.14, డీజిల్ రూ.90.79 విశాఖపట్టణం పెట్రోల్ రూ.95.90, డీజిల్ రూ.89.59 విజయవాడపెట్రోల్ రూ .96.72, డీజిల్ రూ. 90.41 చదవండి : కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
మూడో రోజూ బాదుడు : వాహనదారులు బెంబేలు
సాక్షి, ముంబై: దేశీయంగా ఇంధన ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు (ఫిబ్రవరి 11, గురువారం) పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరను 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ తాజాపెంపుతో దేశవ్యాప్తంగా మెట్రోలలో ధరలు కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. దీంతో వాహనా దారుల్లో అలజడి మొదలైంది. (Petrol Diesel Prices: కొనసాగుతున్న పెట్రో సెగ) ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోలు రూ. 87.85 డీజిల్ రూ. 78.03 ముంబైలో పెట్రోలు రూ. 94.36 రూ. 84.94 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .89.16డీజిల్ ధర రూ .81.61 చెన్నైలో పెట్రోల్ ధర రూ .90.18 డీజిల్ ధర రూ . 83.18 బెంగళూరులో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ.82.72 హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 91.35, డీజిల్ ధర రూ. 85.11 అమరావతిలో పెట్రోల్ రూ. 93.99, డీజిల్ రూ. 87.25 మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. -
సెంచరీతో ఆదుకున్న రూట్
గాలె: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మూడోరోజు ఆటలో లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డేనియా (7/132), కెరీర్లో 99వ టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (309 బంతుల్లో 186; 18 ఫోర్లు)ల పోరాటం హైలైట్‌గా నిలిచింది. లసిత్ స్పిన్ ధాటికి సహచరులంతా పరుగులు చేయడానికి తడబడుతుంటే... అతన్ని సమర్థంగా ఎదుర్కొన్న జో రూట్ వరుసగా రెండో టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆటముగిసే సమయానికి 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 67తో ఆదివారం బరిలో దిగిన రూట్ టెస్టుల్లో 19వ సెంచరీని సాధించాడు. దీంతోపాటు ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (8,238) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు. తొలి మూడు స్థానాల్లో అలిస్టర్ కుక్ (12,472), గ్రాహమ్ గూచ్ (8,900), అలెక్ స్టీవార్ట్ (8,463) ఉన్నారు. జాస్ బట్లర్ (55; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొమ్మిదో టెస్టు ఆడుతోన్న ఎంబుల్డేనియా ఈ మ్యాచ్‌లో స్యామ్ కరన్ (13) వికెట్‌తో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను మూడోసారి అందుకున్నాడు. ఆ తర్వాత డామ్ బెస్ (32; 4 ఫోర్లు), మార్క్ వుడ్ (1)లను కూడా పెవిలియన్ పంపి తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. శ్రీలంక ప్లేయర్ తిరిమన్నె ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా వికెట్ కీపర్లు కాకుండా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన శ్రీలంక ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. -
సుందరం శార్దూలం...
ఒక్క తొలి టెస్టు తప్ప... ప్రతీ టెస్టుకు ముందు భారత్‌కు ప్రతికూలతలే. మ్యాచ్ మొదలయ్యాక కష్టాలే! అయినా సరే ప్రతికూలతలకు ఎదురీదుతోంది. కష్టాలన్నీ అధిగమిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ అనుభవజ్ఞులు దూరమవుతున్నా... రిజర్వ్ బెంచ్ సత్తా చాటుతోంది. నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు... అంతకుమించిన ఉక్కు సంకల్పం. అందుకేనేమో ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న ప్రతీసారి భారత్ పిడికిలి బిగిస్తోంది. ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఈ భారత్–ఆసీస్ సిరీస్ రసవత్తరంగా మారి యావత్ సంప్రదాయ క్రికెట్‌కు కొత్త జీవం పోస్తోంది. ఐదు రోజుల టెస్టు బోర్ కాదు బెస్ట్ అని చాటి చెబుతోంది. బ్రిస్బేన్: మెరుపుల టి20ల ముందు వెలవెల బోతున్న టెస్టులకు కాలం చెల్లలేదని భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రతీ మ్యాచ్‌లోనూ నిరూపిస్తోంది. కాదు కాదు చూపిస్తోంది. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను భారత లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) మార్చేశారు. ఆతిథ్య బౌలర్లను వీళ్లిద్దరే శాసించారు. ఆదివారం తొమ్మిది మంది బ్యాటింగ్‌కు దిగితే ఈ జోడీ మాత్రమే ఆస్ట్రేలియాను చెమటలు కక్కించింది. భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 111.4 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ (5/57) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యమే పొందిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (20 బ్యాటింగ్), హారిస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఓవరాల్ ఆధిక్యం 54 పరుగులు. నాలుగో రోజు రెండు జట్ల ఆటతీరే ఈ మ్యాచ్ ఫలితం ఎవరివైపు మొగ్గుతుందో తేల్చనుంది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారా... భారత బౌలింగ్‌ను ధీమాగా ఎదుర్కొని భారీ స్కోరు చేసి ఆసీస్ నిలబడుతుందా వేచి చూడాలి. ‘వంద’ వరకే బాగుంది తొలి సెషన్ ఆరంభంలో బాగున్నట్లు కనిపించిన భారత ఇన్నింగ్స్ లంచ్‌లోపే కష్టాల్లోకి జారుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 62/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ 100 పరుగుల దాకా బాగానే ఉంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (94 బంతుల్లో 25; 2 ఫోర్లు), కెప్టెన్ రహానే (93 బంతుల్లో 37; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న తరుణంలో హాజల్‌వుడ్ దెబ్బతీశాడు. 105 స్కోరు వద్ద పుజారాను ఔట్ చేశాడు. వేగంగా దూసుకొచ్చి న బంతిని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా... అది పుజారా బ్యాట్ అంచును తగిలి కీపర్ పైన్ చేతుల్లో పడింది. తర్వాత లంచ్ విరామానికి కాస్తముందుగా రహానే ఆటను స్టార్క్ ముగించాడు. బెంబేలెత్తించిన హాజల్‌వుడ్ భారత్ 161/4 స్కోరుతో లంచ్ బ్రేక్‌కు వెళ్లొచ్చిన వెంటనే హాజల్‌వుడ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కుర్రాళ్లను హడలెత్తించాడు. దీంతో రెండో సెషన్ మొదలైన రెండో బంతికే మయాంక్ అగర్వాల్ (75 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ చేరాడు. షాట్‌కు ప్రయత్నించిన మయాంక్ రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే రిషభ్ పంత్ (23; 2 ఫోర్లు) కూడా హాజల్‌వుడ్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. బౌన్సర్‌ను షాట్‌గా మలిచేందుకు చేసిన పంత్ ప్రయత్నం బెడిసింది. అక్కడే గాల్లోకి లేచిన బంతిని గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ అందుకోవడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి భారత్ స్కోరు 186/6. గత టెస్టులో తమతో ఓ ఆటాడుకున్న పంత్ పెవిలియన్ చేరడం, ఇకపై వచ్చే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో ఆసీస్ శిబిరంలో ఆనందం ఆకాశాన్నంటింది. ఫిఫ్టీ–ఫిఫ్టీలతో బాగుపడింది కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ ... రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దుల్ ఠాకూర్లు బౌలింగ్ కేటగిరీలోనే తుది జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆసీస్ గడ్డపై... అది కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌నే గడగడలాడిస్తున్న ఆసీస్ పేస్ త్రయం హాజల్‌వుడ్, కమిన్స్, స్టార్క్‌ను ఎదుర్కోగలరని ఎవరూ ఊహించలేదు. కానీ వీరిద్దరి ఆట అరివీర పేసర్ల బంతుల్ని తుత్తునీయలు చేసింది. తర్వాత్తర్వాత పరుగులతో ఇన్నింగ్స్‌ను పేర్చేసింది. అటుపై కష్టాల నుంచి జట్టును గట్టెక్కించింది. ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి లొంగాల్సిన చోట భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. దీంతో పంత్ అవుటైనప్పటి ఆనందం ఆసీస్‌లో క్రమంగా ఆవిరైంది. ఓవర్లు గడిచేకొద్దీ... పరుగులు పెరిగేకొద్దీ... ఇద్దరు అర్ధశతకాలు బాదేసేదాకా సాగిపోయింది. ఇది భారత్ ఇన్నింగ్స్‌ను పటిష్టస్థితికి తీసుకెళ్లింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను నీరుగార్చేసింది. కమిన్స్ ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్ బాదిన శార్దుల్... బౌండరీలనైతే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. సుందర్ కూడా లయన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. ఇద్దరు చక్కని సమన్వయంతో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 300 మార్క్‌ను దాటింది. గబ్బాలో ఏడో వికెట్‌కు అత్యధికంగా 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక శార్దుల్ ఔటయ్యాడు. తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. సైనీ (5), సిరాజ్ (13)లను హాజల్‌వుడ్ ... సుందర్‌ను స్టార్క్ అవుట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) లయన్ 44; శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7; పుజారా (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 25; అజింక్య రహానే (సి) వేడ్ (బి) స్టార్క్ 37; మయాంక్ అగర్వాల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 38; రిషభ్ పంత్ (సి) గ్రీన్ (బి) హాజల్‌వుడ్ 23; వాషింగ్టన్ సుందర్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 62; శార్దుల్ ఠాకూర్ (బి) కమిన్స్ 67; నవదీప్ సైనీ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 5; సిరాజ్ (బి) హాజల్‌వుడ్ 13; నటరాజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (111.4 ఓవర్లలో ఆలౌట్) 336. వికెట్ల పతనం: 1–11, 2–60, 3–105, 4–144, 5–161, 6–186, 7–309, 8–320, 9–328, 10–336. బౌలింగ్: స్టార్క్ 23–3–88–2, హాజల్‌వుడ్ 24.4–6–57–5, కమిన్స్ 27–5–94–2, గ్రీన్ 8–1–20–0, లయన్ 28–9–65–1, లబ్‌షేన్ 1–1–0–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (బ్యాటింగ్) 1; డేవిడ్ వార్నర్ (బ్యాటింగ్) 20; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: సిరాజ్ 2–1–12–0, నటరాజన్ 3–0–6–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. ► అరంగేట్రం టెస్టులోనే మూడు వికెట్లు తీయడంతోపాటు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన పదో క్రికెటర్‌గా, భారత్ నుంచి మూడో క్రికెటర్‌గా వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు. భారత్ నుంచి సుందర్కంటే ముందు దత్తూ ఫాడ్కర్ (1947లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో... 51 పరుగులు; 3/14), హనుమ విహారి (2018లో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో... 56 పరుగులు; 3/37) ఈ ఘనత సాధించారు. ► భారత్‌పై టెస్టుల్లో 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. గతంలో 33 పరుగుల ఆధిక్యం పొందిన రెండుసార్లూ ఆస్ట్రేలియా (1979లో కాన్పూర్; అడిలైడ్ 2003) ఆ టెస్టుల్లో ఓడిపోవడం గమనార్హం. ► ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మన్ జోడీ ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది నాలుగోసారి. గతంలో రిషభ్ పంత్–రవీంద్ర జడేజా (204 పరుగులు; 2019లో సిడ్నీ)... విజయ్ హజారే–హేమూ అధికారి (132 పరుగులు; 1948లో అడిలైడ్)... అజహరుద్దీన్–మనోజ్ ప్రభాకర్ (101 పరుగులు; 1992లో అడిలైడ్) జోడీలు ఈ ఘనత సాధించాయి. -
రూపాయి.. హ్యాట్రిక్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటన పయనించిం ది. మంగళవారం ముగింపుతో పోల్చితే 27 పైసలు లాభంతో 74.19 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 74.49 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.09 స్థాయి గరిష్ట, 74.52 కనిష్ట స్థాయిల్లో తిరిగింది. కారణాలు చూస్తే... ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కరోనా వ్యాక్సిన్ సిద్ధమైపోయిందన్న వార్తలు రూపాయికి బలం చేకూర్చుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టరు (ఎఫ్ఐఐ) క్యాపిటల్ మార్కెట్లో బుధవారం నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. రూ.3,072 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత రెండు సెషన్లలో ఎఫ్ఐఐలు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారనీ, దీనితో ఈ నెల్లో వీరి పెట్టుబడుల విలువ 5.1 బిలియన్ డాలర్లకు చేరిందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఫారెక్స్ అండ్ బులియన్ విశ్లేషకులు గౌరంగ్ తెలిపారు. మరింత పెరగాల్సిందే.. కానీ!: నిజానికి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున ప్రభుత్వ రంగ బ్యాంకులు జరిపిన కొనుగోళ్లు రూపాయి బలోపేతానికి పగ్గాలు వేశాయి కానీ, లేదంటే భారత్ కరెన్సీ మరింత బలపడి ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్ ఉన్నట్లు రిలయెన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ పేర్కొన్నారు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కాగా, ఈ వార్త రాస్తున్న రాత్రి 7.41 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 92.40 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి విలువ లాభాల్లో 74.21 వద్ద ట్రేడవుతోంది. -
మూడో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె
-
నేలతిమ్మాయిపల్లి నుంచి మూడో రోజు యాత్ర
-
మూడో రోజూ క్షీణించిన బంగారం ధర
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారం మరింత దిగివచ్చాయి. విదేశీ మార్కెట్లో డాలర్ తిరిగి రావడంతో సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దీంతో వరుసగా మూడోరోజుకూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.55 లు క్షీణించింది. రూ. 29,370 స్థాయికి పడిపోయింది. దీంతోపాటు దేశీయ నగల మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. వెండి ధర కూడా రూ .40వేల స్థాయికినుంచి దిగివచ్చింది. రూ. 225 నష్టంతో కిలో వెండి రూ .39,900 కి చేరుకుంది. విలువైన లోహాల కోసం డిమాండ్ తగ్గడం, స్థానిక నగల స్థానిక నగల నుంచి డిమాండ్ పడిపోవడం కూడా ధరల పతనానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.88 శాతం పడిపోయి 1,266.40 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 1.35 శాతం పెరిగి 17.17 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల ధర రూ. 55 తగ్గి 29,370 రూపాయలకు పడిపోయింది. గత రెండు రోజుల్లో పుత్తడి ధరలు 370 రూపాయలు క్షీణించాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో పది గ్రా. పుత్తడి ధరలు రూ.114 తగ్గి రూ.29, 017 వద్ద ఉంది. సావరిన్ గోల్డ్ ఎనిమిది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ .24,400 కు పడిపోయింది. వెండి ధర 225 రూపాయల నుంచి రూ. 39,900 కి చేరుకుంది. -
మూడో రోజు 16,820 క్వింటాళ్ల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మూడో రోజు విత్తన పంపిణీ కొనసాగింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే పంపిణీ సరళి కాస్తంత మెరుగుపడింది. మూడో రోజు 14,595 మంది రైతులకు 16,820 క్వింటాళ్లు విత్తనకాయలు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి శుక్రవారం ప్రకటించారు. మూడు రోజుల్లో 27,158 మంది రైతులకు 31,608 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సర్వర్ మొరాయించడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక రైతులు గంటల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సెంట్రల్ సర్వర్ ఫెయిల్ కావడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం 7 గంటలకే పంపిణీ కౌంటర్ల వద్ద రైతులు వేచి ఉండటం, సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఇక విత్తన నాణ్యతపై జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో రైతులు పెదవి విరుస్తున్నారు. పుల్లలు, నాసులు, కల్తీకాయలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు ఫిర్యాదులు వచ్చాయి. అనంతపురం, ఉరవకొండ, మరికొన్ని మండల కేంద్రాల్లో రైతులు, రైతు సంఘాల నాయకులు ఈ అంశంపై అధికారులు, ఏజెన్సీలతో వాదులాటకు దిగారు. నిబంధన మేరకు విత్తనకాయల్లో నాణ్యత ప్రమాణాలు ఉన్నట్లు అధికారులు వాదిస్తున్నారు. 74 శాతం గట్టిదనం, 70 శాతం మొలక, 96 శాతం ఫిజికల్ఫ్యూరిటీ, 4 శాతం వ్యర్థాలు ఉండవచ్చనే నిబంధనలను ఏజెన్సీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, పంపిణీ సంస్థలు బాగా ఉపయోగించుకోవడంతో రైతులకు నాసిరకం విత్తనం తప్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో భారీ లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగి, వరుసగా మూడో సెషన్లో కూడా నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 6 పాయింట్లు తగ్గి 26,299 వద్ద నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 8,112 వద్ద ముగిశాయి. రెండు రోజుల భారీ నష్టాల తరువాత దేశీ స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గుల మధ్య కదలాడాయి. మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్స్ రంగాలు నష్టపోగా ఐటీ, ఆటో వంటి రంగాలు స్వల్ప లాభాల్లో ముగిసాయి. మీడియా, ఐటీ, ఆటో షేర్ల లాభాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలజోరు కొనసాగింది. ఏషియన్ పెయింట్స్, జీ, ఐషర్, టెక్‌మహీంద్రా, టీసీఎస్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, భారతీ, యస్‌బ్యాంక్ లాభాలను ఆర్జించగా హిందాల్కో, ఐటీసీ, అరబిందో, సిప్లా, అంబుజా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, గెయిల్ నష్టపోయాయి. అటు టుబాకో రంగంలో ఎఫ్‌డిఐలపై నిషేధించేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలతో ఐటీసీ భారీగా నష్టపోయింది. దాదాపు 3 శాతం పతనమైంది. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి 9 పైసలు నష్టపోయి 67.83 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి స్వల్ప లాభంతో పది గ్రా. 29.321 వద్ద ఉంది. -
ఇంగ్లండ్‌కు భారత్ ధీటైన జవాబు
-
భారత్ ధీటైన జవాబు
-
భారత్ ధీటైన జవాబు
రాజ్‌కోట్: ఇంగ్లాడుతో తొలి టెస్టులో మూడు రోజు భారత జట్టు సత్తా చాటింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 218 పరుగులు చేధించాల్సివుంది. భారత బ్యాట్స్‌మన్స్ లో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్ లు మూడో రోజు శతకాలతో అదరగొట్టారు. పుజారా 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగగా మరికొద్దిసేపు క్రీజులో నిలిచిన విజయ్(126) పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగుస్తుందనగా విజయ్ వెనుదిరగడం భారత్ కు గట్టి దెబ్బే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా కేవలం రెండు బంతులే ఎదుర్కొని వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, సువర్ట్ బ్రాడ్, అదిల్ రషీద్, జాఫర్ అన్సారీలు తలో వికెట్ పడగొట్టారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గౌతమ్ గంభీర్ ఎల్ బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. -
టాటాలకు సెబీ షాక్
ముంబై: మిస్త్రీ పేల్చిన బాంబుతో వరుసగా మూడో రోజు కూడా టాటా షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ముఖ్యంగా రతన్ టాటాతోపాటు, గ్రూప్ కార్యకలాపాలపై సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శల నేపథ్యంలో టాటా గ్రూపు షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో ఇండియన్ హోటల్స్ కౌంటర్ ఏకంగా 13 శాతానికిపైగా పతనమైంది. ఈ బాటలో టాటా పవర్, టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్ టాటా గ్లోబల్ బెవరేజెస్ , టాటా కాఫీ , టాటా ఇన్వెస్ట్మెంట్ , టాటా టెలీ సర్వీసెస్, కౌంటర్లలో అమ్మకాలు జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయికి దిగజారాయి. ఇప్పటికే భారీ నష్టాలను మూటగట్టుకున్నటాటా గ్రూప్ మార్కెట్ విలువ తాజా నష్టాలతో సుమారు రూ. 40,000 కోట్లమేరకు చేరింది. మరోవైపు ఈవ్యవహారంపై మార్కెట్లు రెగ్యులేటర్ సెబీ రంగంలోకి దిగింది. కార్పొరేట్ పాలన నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఒకవేళ గతంలో ఏదైనా మొత్తాన్ని రద్దు చేసుంటే, వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని, ఆ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలియజేయకుండా లావాదేవీలు జరిపివుంటే వాటి వివరాలు ఇవ్వాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆదేశించింది. కాగా వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ సుమారు రూ. 1.18 లక్షల కోట్లు (18 బిలియన్ డాలర్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ రాసిన లేఖతో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. -
మూడో రోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
పుష్కర పులకరింత
-
జనసంద్రంగా కృష్ణమ్మ
-
మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
మూడోరోజు పూర్తిగా నిరాశ
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు పూర్తిగా నిరాశే ఎదురైంది. ఆర్చరీ, ట్రాప్ షూటింగ్లో కనీస పోరాటం లేకుండానే భారత క్రీడాకారులు చెతులెత్తేయగా.. హాకీలో పోరాడినా ఓటమి తప్పలేదు. హాకీ: ఆఖరి క్షణాల్లో వదిలేశారు భారత్, జర్మనీ మధ్య జరిగిన ఒలింపిక్స్ పురుషుల గ్రూప్-బి హాకీ మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. మ్యాచ్ చివర్లో భారత్ చేసిన తప్పిదంతో జర్మనీ 2-1తో గెలుపొందింది. ఆట ప్రారంభం నుంచి బలమైన డిఫెన్స్‌తో భారత్ జట్టు జర్మనీని అడ్డుకున్నా.. కీలక సమయాల్లో అవకాశాలను గోల్స్‌గా మార్చటంలో విఫలమైంది. 11వ నిమిషంలో గోల్ అవకాశం వచ్చినా ఆకాశ్‌దీప్ సింగ్ గురి తప్పింది. 18వ నిమిషంలో నిక్లాస్ గోల్‌తో జర్మనీ ఆధిక్యం సాధించగా... 23 నిమిషంలో రూపీందర్‌పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. జర్మన్ గోల్ కీపర్ జాకోబీ అద్భుత ప్రతిభతో భారత్‌కు వచ్చిన నాలుగు అవకాశాలను అడ్డుకున్నాడు. అయితే మరో మూడు సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా... జర్మనీకి క్రిస్టోఫర్ రూర్ గోల్ అందించి జట్టును గెలిపించాడు. షూటింగ్: ట్రాప్‌లో మరో‘సారీ’ పురుషుల ట్రాప్ ఈవెంట్లో వరుసగా భారత షూటర్లు క్వాలిఫయింగ్‌లోనే విఫలమయ్యారు. మానవ్‌జీత్ సింగ్ సంధూ, కైనాన్ షెనాయ్ మరోసారి దారుణంగా విఫలమై వరుసగా 16, 19 స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ: లక్ష్మీరాణికి నిరాశ ఆర్చరీ విభాగంలో మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ ఎలిమినేషన్లో భారత ఆర్చర్ మాఝీ లక్ష్మీరాణి కనీస ప్రతిఘటన కూడా లేకుండానే ఇంటిబాట పట్టింది. స్లోవేకియన్ ఆర్చర్ అలెగ్జాండ్రా జోరుకు లక్ష్మీరాణి బేజారైంది. నాలుగు సెట్లలో కేవలం ఒకపాయింట్ మాత్రమే సాధించింది. స్విమ్మింగ్: సాజన్, శివానీ ఓటమి సోమవారం జరిగిన 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ హీట్స్‌లో భారత స్విమ్మర్లు సాజన్ ప్రకాశ్, శివానీ కటారియాలు చెత్త ప్రదర్శనతో నిష్ర్కమించారు. పురుషుల విభాగంలో 43 మంది పోటీపడగా సాజన్ 41వ స్థానంలో.. మహిళల్లో 29 మంది పోటీ పడగా శివానీ 28వ స్థానంలో నిలిచారు. -
వైఎస్ జగన్ మూడో రోజు రైతు భరోసా యాత్ర
-
టీమిండియా ఘనవిజయం
మొహాలి:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం మూడో రోజు 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వేన్ జిల్(36) ఫర్వాలేదనిపించగా, డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) , విలాస్(7), హర్మర్(11) లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా స్పిన్ త్రయం రాణించి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు కళ్లెం వేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ కు మూడు వికెట్లు, అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు 125/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా 200 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో టీమిండియాకు ఓవరాల్ గా 217 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా ఆటగాళ్లలో మురళీ విజయ్(47), చటేశ్వర పూజారా(77) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లి(29) మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై మరో 17 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. కాగా వృద్ధిమాన్ సాహా(20) చివరి వరస బ్యాట్స్ మెన్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. దీంతో టీమిండియా రెండొందల మార్కును చేరుకోగలిగింది. అశ్విన్, జడేజాలు తిప్పేశారు టీమిండియా ఘనవిజయంలో స్పిన్నర్ల పాత్రనే ప్రముఖం పేర్కొనాలి. తొలి ఇన్నింగ్స్ లో 51 పరుగులకే ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా రాణించాడు. 39 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. కాగా, జడేజా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లను సాధించాడు. వీరిద్దరికి జతగా స్పిన్నర్ అమిత్ మిశ్రాకు రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మూడు వికెట్లు లభించాయి. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో నలభై వికెట్లకు స్పిన్నర్లకు 34 వికెట్లు లభించడం విశేషం. యాభై వికెట్ల క్లబ్ లో జడేజా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలుపుకుని ఎనిమిది వికెట్లు సాధించిన రవీంద్ర జడేజా యాభై వికెట్ల క్లబ్ లో చేరాడు. 13 టెస్టు మ్యాచ్ లు ఆడిన జడేజా 53 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్ లీగ్ లో విశేషంగా రాణించి టెస్టుల్లో స్థానం సంపాదించిన జడేజా తదుపరి టెస్టుల్లో కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. -
విజయానికి నాలుగు వికెట్ల దూరంలో..
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడానికి నాలుగు వికెట్లు దూరంలో నిలిచింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనిస్తోంది. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. విలాస్(7)ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. -
విజయానికి నాలుగు వికెట్ల దూరంలో..
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడానికి నాలుగు వికెట్లు దూరంలో నిలిచింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనిస్తోంది. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. విలాస్(7)ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. -
విజయం దిశగా టీమిండియా
మొహాలి:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు 218 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి 21 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం వేన్ జిల్(15), విలాస్(6)లు క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు రెండు, అశ్విన్ , ఆరోన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. సౌతాఫ్రికా విజయాన్ని అందుకోవాలంటే మరో 162 పరుగులు కావాలి. స్పిన్ బౌలర్లు రాణించడంతో బ్యాట్స్ మెన్ బ్యాట్ ఝులిపించడంలో విఫలమవుతున్నారు. -
వికెట్లే.. వికెట్లు
మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ పరుగులకన్నా వికెట్ల వరద పారుతోంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా వరుసగా వికెట్లు సమర్పించుకోగా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా పరిస్థితి అలాగే తయారైంది. పది పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా అతర్వాత తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ 50 పరుగులు చేరుకునే సరికి ఐదు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా విజయాన్ని అందుకోవాలంటే మరో 160కిపైగా పరుగులు చేయాల్సి ఉంది. కానీ, బౌలర్లు ఈసారి విరుచుపడతుండటంతో బ్యాట్స్ మెన్ బ్యాట్ ఝలిపించడంలో విఫలమవుతున్నాడు. దీంతో మరో 20పరుగుల్లోపు 2వికెట్లు తీసుకుంటే భారత్‌కు తొలి టెస్టులో విజయం దక్కినట్లేనని భావించవచ్చు. ఇప్పటి వరకు జడేజా 2 వికెట్లు తీసుకోగా అశ్విన్, మిశ్రా, ఆరాన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
కట్టడి చేస్తున్న టీమిండియా
మొహాలీ: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ కీలక మలుపు తిరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. 32 పరుగలకే సౌతాఫ్రికా నాలుగు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో స్టాయాన్ వాంజిల్(4), ఎల్గార్(14) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన దిగ్గజ ఆటగాళ్లు ఫిలాందర్(1), డుప్లెసిస్(1), డివిలియర్స్(16) వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఆమ్లా డకౌట్ తో వెనుదిరిగాడు. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుందనుకున్నప్పటికీ త్వరత్వరగా వికెట్లు సమర్పించుకుంది. లంచ్ విరామం తర్వాత 200 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగి తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ వికెట్లు కోల్పోతోంది. -
టీమిండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్
మొహాలి: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత టీమిండియా ఆలౌట్ అయింది. టీమిండియా అన్ని వికెట్లను కోల్పోయి 200 పరుగులు చేసింది. చివరగా ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతికి సాహ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 217 పరుగుల ఆధిక్యం నమోదుచేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 125 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా, కొహ్లీ మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించారు. ఓవర్ నైట్ స్కోర్ కు 31 పరుగులు జోడించి.. భారీ లీడ్ దిశగా సాగుతున్నట్లు కనిపించారు. ఈ దశలో వరసగా బౌండరీలు బాది జోరుమీదున్న కెప్టెన్ కొహ్లీ(29)ని వాన్ జిల్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మూడు పరుగులకే పుజారా(77)ను తాహిర్ ఔట్ చేశాడు. మరుసటి ఓవర్ లోనే రెహానే ఔట్ కావడంతో.. టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ జడేజా, మిశ్రా, అశ్విన్ లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. ఓ దశలో 160/3 తో పటిష్టంగా కనిపించిన భారత్ లంచ్ విరామానికి 8 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం మరి కాసేపటికే 200 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ బౌలర్లు హార్మర్ 4, ఇమ్రాన్ తాహిర్ చెరో4 వికెట్లు కూల్చగా.. ఫిలాండర్, వాన్ జిల్ చెరోక వికెట్ పడగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికా తిరిగి బ్యాటింగ్ ప్రారంభించి రెండో ఓవర్లోనే తొలి వికెట్ సమర్పించుకుంది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్, ఎల్గార్ ఉన్నారు. -
టపటపా వికెట్లు సమర్పిస్తున్నారు..
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ టెన్షన్ పుట్టిస్తోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా కాస్త నిలకడగా ఆడినట్లు కనపించినా శనివారం ఆట మొదలైన తర్వాత కాసేపటికే వరుసగా మూడు వికెట్లు సమర్పించుకుంది. తొలుత విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టగా.. ఇమ్రా తాహిర్ ఆమ్లా వేసిన బంతికి పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో అతడు సెంచరీ చేసే అవకాశం కోల్పోయి 77పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆ వెంటనే, కోహ్లీ అవుటయిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రహానే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి బీహామర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సాహ, జడేజాలు క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 62 ఓవర్లలో టీమిండియా 171/5పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
కోహ్లీ అవుట్..
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా శనివారం ఆట మొదలై డ్రింక్స్ విరామ సమాయానికి మూడు వికెట్లను కోల్పోయి 162 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(1), పుజారా(76) బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా, అంతకుముందు వాన్ జిల్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ(29) అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరిన విషయం తెలిసిందే విజయ్ (47) పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరగగా.. కోహ్లీ మూడో వికెట్ సమర్పించుకున్నాడు. -
మూడో రోజు కన్నుల పండువగా పుష్కరాలు
-
వైఎస్‌ను తరతరాలూ గుర్తుంచుకుంటాం
ఆయన నగరబాట... మా జీవితాల్లో వెలుగుబాట ♦ పరామర్శ యాత్రలో షర్మిలతో నల్లగొండవాసులు ♦ నల్లగొండ జిల్లాలో మూడో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ ♦ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్న వైఎస్ తనయ ♦ అడుగడుగునా ప్రజల నుంచి ఆదరణ వెల్లువ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘2006లో వైఎస్ నల్లగొండ పట్టణానికి నగరబాటకు వచ్చారు.ఆ సందర్భంగా మా దుకాణాలు ఇరుకుగా ఉన్న విషయాన్ని గమనించారు. వెంటనే కలెక్టర్‌ను పిలిపించారు. పాత కలెక్టరేట్ స్థలాన్ని స్వర్ణకారులకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. దాంతో మా 160 కుటుంబాలకు వ్యాపారం చేసుకునేందుకు గూడు దొరికింది. వైఎస్ చేసిన మేలును మేం తరతరాలు గుర్తుంచుకుంటాం’’ నల్లగొండ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రాచకొండ గిరి మాటలివి. మలి విడత పరామర్శ యాత్రలో భాగంగా గురువారం పట్టణంలో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని సందర్శించిన షర్మిలకు ఈ విషయాన్ని చెమర్చిన కళ్లతో వివరించారాయన. వైఎస్‌ను ఎన్నోసార్లు కలిశానని, తనను ప్రేమతో చెంపపై తట్టేవారని చెబుతూ మహానేతతో తనకున్న ఆత్మీయానుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. యాత్రలో మూడో రోజు గురువారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఆరుగురి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూడోరోజు పర్యటన ఇలా రెండో రోజు పరామర్శ అనంతరం నకిరేకల్ పట్టణంలో రాత్రి బస చేసిన షర్మిల మూడో రోజు ఉదయం నకిరేకల్ నుంచి మర్రూర్ మీదుగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలో తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వెళ్లారు. రాయించు నర్సింహ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇంట్లోని చిన్నారులతో ఆడుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం సిలార్మియా గూడెంలో వైఎస్ విగ్రహానికి గ్రామస్తుల కోరిక మేరకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుని మాట్లాడారు. ఆరుబయట ఏర్పాటు చేసిన టెంట్లోనే పెద్ద ఎత్తున గుమిగూడిన జనసందోహం నడుమ వారితో గడిపారు. వారు బహూకరించిన గాజులు వేసుకున్నారు. నల్లగొండ మండలం చందనపల్లి వెళ్లి చింతా భిక్షమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పానగల్ ప్రాజెక్టు ముంపు గ్రామమైనందున వైఎస్ హయాంలోనే తమకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయిస్తే ఆయన్ను రోజూ తలచుకుంటామని చెప్పారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో ఉన్న పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బాగా చదువుకోవాలని దయానంద్ పిల్లలకు సూచించారు షర్మిల. కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాం తాగారు. అనంతరం కనగల్ మండల కేంద్రంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాంపల్లి చేరుకుని అస్తర్ బీ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి మర్రిగూడ మండలం తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెర్బర్ట్. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ర్ట కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, అమృతాసాగర్, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ లక్ష్మారెడ్డి, యువజన విభాగం నాయకుడు కొన నరందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆత్మీయ స్వాగతం షర్మిల పరామర్శ యాత్రకు నల్లగొండ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. షర్మిలను ప్రజలు అడుగడుగునా ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. గురువారం గ్రామగ్రామాన డప్పుచప్పుళ్లు, కోలాటాలతో తమ ఊరి ఆడబిడ్డ మాదిరిగా ఆమెను ఊళ్లోకి తీసుకెళ్లారు. రాజన్న కుమార్తె తమ ఊరికి వచ్చిందంటూ ఆమెను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు షర్మిలను చూసేందుకు, మాట్లాడేందుకు పోటీలు పడ్డారు. ఆమెను సెల్ఫోన్లలో బంధించేందుకు యువతీ యువకులు ఉత్సాహపడ్డారు. గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలకేంద్రంలో దస్తగిరి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తున్న షర్మిల. చిత్రంలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ తదితరులు -
మూడో రోజూ.. అదే జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మూడోరోజు గురువారం షర్మిల జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన ఆరు కుటుంబాలను కలిసిన ఆమె .. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలం ఇందుగుల, తిప్పర్తి మండల కేంద్రం, నల్లగొండ రూరల్‌మండలం చందనపల్లి, నల్లగొండ జిల్లా కేంద్రం, నాంపల్లి మండల కేంద్రం, మర్రిగూడ మండలం తానేదార్పల్లిలకు వెళ్లిన షర్మిల అక్కడ తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ఆప్యాయతలను పంచారు. ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్న షర్మిల అక్కడ వారు ప్రేమతో తినిపించిన స్వీట్లు, పాయసం తిని వారి చిన్నారులతో ఆడుకున్నారు. పెద్దవారికి బాధ్యతలను గుర్తు చేస్తూ, చిన్నారులు బాగా చదువుకోవాలంటూ సూచించిన షర్మిల ఆయా కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, షర్మిల పరామర్శయాత్ర శుక్రవారం ముగియనుంది. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని పరామర్శించడంతో జిల్లాలో మలి విడత పరామర్శయాత్ర పూర్తి కానుంది. ముచ్చటగా.... మూడో రోజు జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర మూడో రోజు అనురాగం ఆత్మీయతలతో సాగింది. నకిరేకల్ నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన షర్మిల మర్రూర్, తిప్పర్తి మీదుగా ఇందుగుల గ్రామానికి వెళ్లారు. ఇందుగుల గ్రామంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరల నుంచే డప్పు చప్పుళ్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఇందుగుల సెంటర్లో మహిళలు కొలాట చప్పుళ్లు చేస్తూ షర్మిలను పరామర్శ కుటుంబం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రాయించు నర్సింహ కుటుంబ సభ్యులను కలిసిన షర్మిల వారికి మనోధైర్యం చెప్పారు. అందరికీ మంచిరోజులు వస్తాయని ధైర్యంగా ఉండాలని సూచించారు. అదే గ్రామంలో కరుణాకర్‌రెడ్డి (గతంలో వైఎస్సార్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడికి రాజశేఖరరెడ్డి అని నామకరణం చేశారు) ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. తన తండ్రి పేరు పెట్టిన రాజశేఖరరెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి కుటుంబం షర్మిలకు చీరను బహూకరించారు. అక్కడి నుంచి ఆమె తిప్పర్తి మండల కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో సిలార్మియాగూడెంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబ సభ్యులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు నివసిస్తున్న ఇల్లు కులిపోవడంతో ఆరుబయట వెసిన టెంట్లోనే వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిలకు వారు గాజులు, పండ్లు, జాకెట్లు బహూకరించారు. గుంటి వెంకటేశం కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి నల్లగొండ రూరల్ మండలంలోని చందనపల్లికి వెళ్లారు. చందనపల్లిలో షర్మిలకు ఘనస్వాగతం లభించింది. గ్రామ శివారు నుంచే షర్మిలను పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి డప్పుచప్పుళ్లతో తోడ్కొని వెళ్లారు. భిక్షమయ్య ఇల్లు రేకుల ఇల్లు కాడవం, కరెంట్ లేకపోవడంతో షర్మిలకు చెమటలు వస్తున్నాయి. అది గమనించిన భిక్షమయ్య కోడలు టవల్ తీసుకుని ప్రేమతో షర్మిలకు చెమటలు పోయకుండా చూసుకున్నారు. అది గమనించిన షర్మిల వద్దని వారించారు. గ్రామ సర్పంచ్ భర్త భిక్షం మాట్లాడుతూ వైఎస్సార్ ఈ ఊరికి దేవుడని ముంపుకు గురైన తమ గ్రామానికి రూ. 26 కోట్లు మంజూరు చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చారని చెప్పారు. మరో స్థానికుడు మాట్లాడుతూ మా గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తే ఆయనను స్మరించుకుంటామని షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. భిక్షమయ్య కుటుంబ సభ్యులు తెచ్చిన స్వీట్లు తిన్న షర్మిల అక్కడి నుంచి నల్లగొండ పట్టణానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఖాజీరామారం గ్రామం వద్ద మధ్యాహ్న భోజనం చేసిన ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిమెంట్ రోడ్డులో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలిసారు.దయానంద్ ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారని విషయాన్ని అడిగి తెలుసుకున్న షర్మిల వారిని బాగా చదువుకోవాలని సూచించారు. దయానంద్ భార్య నర్సూబాయ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. రాజశేఖరరెడ్డి కూతురు మా ఇంటికి రావడమే.. అంటూ షర్మిల చేతిలో చెయ్యి వేసి విలపించారు. దయానంద్ కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాను తాగిన షర్మిల అక్కడి నుంచి నాంపల్లి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో కనగల్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాంపల్లి వెళ్లిన షర్మిల అక్కడ అస్తర్బీ కుటుంబ సభ్యులను కలిసారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబంలోని మూగ వ్యక్తుల గురించి సాక్షి పత్రికలో ప్రచురితమైన మానవాసక్తికర కథనాన్ని షర్మిలకు చూయించారు. అక్కడ షర్మిల అస్తర్ బీ మనుమళ్లతో కాసేపు ముచ్చిటించారు. 8వ తరగతి చదువుతున్న అల్తాఫ్ అనే విద్యార్థిని నువ్వేం చదువుకుంటావ్ అని ప్రశ్నించగా అతను పోలీస్‌ను అవుతానని చెప్పడంతో షర్మిల నవ్వులు చిందించారు. పరామర్శ అనంతరం అస్తర్బీ కుటుంబం ఎదుట పెద్ద ఎత్తున గూమిగూడిన ప్రజలను వర్షంలోనే తడుస్తూ పలుకరించారు. షర్మిలతో కరచాలనం చేసేందుకు వర్షంలోనూ స్థానికులు పోటీపడ్డారు. అక్కడ నుంచి ఆమె మర్రిగూడ మండలం తానేదార్పల్లి గ్రామానికి వెళ్లి మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మార్గమధ్యంలో నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. తానేదార్పలిల్లో పుల్లమ్మ మనువడు, మనువరాళ్లను బాగా చదువుకోవాలని, కుటుంబానికి ఉపయోగపడేలా స్థిరపడాలని సూచించారు. పరామర్శ జరుగుతున్న ఇంటి వద్ద గూమికూడిన ప్రజలను పలుకరించి చౌటుప్పల్‌లోని అన్నా మెమోరియల్ పాఠశాలకు వెళ్లి రాత్రి బసచేశారు. ఎన్టీఆర్.. ఆ తర్వాత వైఎస్ తానేదార్‌పల్లిలో పరామర్శను ముగించుకుని బయటకు వచ్చిన షర్మిలను బండి జంగమ్మ అనే వృద్ధురాలు పలకరించారు. తాను కూడా రాజకీయాలు చేశానని చెప్పిన ఆమె ఇప్పటి రాజకీయాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎవరూ పేదల గురించి పట్టించుకోవడం లేదని, కార్లలో తిరుగుతున్న వారికే పనులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్సార్‌లే పేదలకు న్యాయం చేశారని షర్మిలకు చెప్పారు. షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్. గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె. శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కృష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి. సిద్దార్థరెడ్డి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇరుగుసునీల్కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్, మేడిశెట్టి యాదయ్య తదితరులున్నారు. -
మూడోరోజు షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజూ నల్గొండ జిల్లాలో కొనసాగింది. జిల్లాలో మొత్తం ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నల్లగొండ, మునుగోడు నియోజక వర్గాల్లో యాత్ర సాగించారు. తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం, అదే మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుంటుంబాన్ని పరామర్శించారు. అదే విధంగా జిల్లాలోని చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, నల్లగొండ పట్టణంలోని దండేకార్ దయానంద్ కుటుంబం, మర్రిగూడెం మండలం తాన్ దార్ పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబం, నాంపల్లికి చెందిన అస్తర్ బీ, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుంటుంబాన్ని పరామర్శించారు. -
తెలంగాణలో మూడో రోజు కొనసాగిన సమ్మె
-
పింఛన్ వస్తోందా పెద్దమ్మా..?
పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పింఛన్లు వస్తున్నాయా పెద్దమ్మా... పిల్లలేం చేస్తున్నారు..? పంటలు పండుతున్నాయా? రాజన్న ప్రవేశపెట్టి పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటుతో మీకు ఉపయోగం జరిగిందా..’’ అంటూ పరామర్శకు వెళ్లిన ప్రతి చోట షర్మిల జనంతో మమేకమయ్యారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వారి బాగోగులు తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మూడోరోజుకు చేరుకుంది. కొల్లాపూర్, వనపర్తి, ఆలంపూర్, గద్వాల, మక్త ల్, దేవరకద్ర నియోజకవర్గాల మీదుగా సుమా రు 300 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెంట్లపల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నె, చిన్న వడ్డెమాన్, కొన్నూరు గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులను కలిసి, ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబంతో గంటసేపు గడిపారు. ఆయా కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాల్సిందిగా పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలకు సూచించారు. పేదల వెంటే జగనన్న కుటుంబం వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక పెంట్లపల్లిలో చనిపోయిన లచ్చమ్మ, చిట్యాలలో మణెమ్మ, రాణిపేటలో దస్తగిరమ్మ, నందిన్నెలో ఎర్ర నర్సింహారెడ్డి, జూరాలలో కుర్మన్న, చిన్న వడ్డెమాన్‌లో బక్కప్ప కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ‘నా తండ్రి చనిపోతే ఆ బాధ భరించలేక వందల మంది గుండెలు ఆగడం.. వారి ప్రాణం కన్నా మా నాన్నే వారికి ఎక్కువవడం ఏ జన్మ అనుబంధమో పెద్దమ్మా...’ అంటూ నందిన్నెలో ఎర్ర నర్సింహారెడ్డి భార్య లక్ష్మిని షర్మిల ఓదార్చడం అక్కడున్న వారిని కదిలించింది. జగనన్న కుటుంబం పేదల వెంట ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఇళ్లల్లో వారిచ్చిన జ్యూస్ తాగి కుటుంబ సభ్యులను దగ్గరికి తీసుకున్నారు. బుధవారం ఏకంగా 15 గంటలకుపైగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగించారు. ఎక్కువ భాగం గతుకులతో కూడిన మట్టి రోడ్ల మీదుగానే ప్రయాణం సాగింది. కొల్లాపూర్‌లో ఉదయం 9 గంటలకు మొదలైన యాత్ర రాత్రి 12 గంటల తర్వాతా కొనసాగింది. పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వనపర్తిలో ప్రజల కోరిక మేరకు షర్మిల మాట్లాడారు. వైఎస్ పట్ల మహబూబ్‌నగర్ జిల్లా ప్రజ లు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలి పారు. కోట్లాది మంది గుండెల్లో ఇంకా రాజన్న కొలువుండడం, ఆయన గుర్తొస్తే కోట్లాది మంది కళ్లల్లో నీరొలకడం తమ పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌పై అభిమానంతో వచ్చిన యువకులు ‘జై తెలంగాణ’ అనడంతో షర్మిల కూడా ‘జై తెలంగాణ’ అని నినదించారు. ధరూర్‌లో తెలంగాణ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి, వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, నాయకులు కొం డా రాఘవరెడ్డి, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముస్తా ఫా, మామిడి శ్యాంసుందర్ రెడ్డి, బీస్వ రవీంద ర్, జి.రాంభూపాల్ రెడ్డి, భగవంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
వైఎస్ షర్మిల మూడవ రోజు పరామర్శ యాత్ర
-
రాణిపేటలో దస్తగిరి కుటుంబానికి షర్మిల పరామర్శ
మహబూబ్‌నగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర పాలమూరు జిల్లాలో మూడో రోజు బుధవారం కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అకస్మిక మరణం తట్టుకోలేక రాణిపేటలో మృతి చెందిన దస్తగిరి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. దస్తగిరి కుటుంబ సభ్యులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. షర్మిల అంతకుముందు పెంట్లపల్లిలోని లచ్చమ్మ కుటుంబాన్ని, చిట్యాలలో మణెమ్మ కుటుంబాలను పరామర్శించారు. షర్మిల ఈ రోజు పర్యటనలో భాగంగా నందిన్నెలో నరసింహరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే గోవర్థనగిరి, జమ్మిచేడు, గద్వాల్, ధరూర్లలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడాన్ని తట్టుకోలేక చనిపోయిన బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకే షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం (08-12-2014) పాలమూరు జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
చిట్యాలకు వెళ్లనున్న వైఎస్ షర్మిల
మహబూబ్‌నగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకస్మిక మరణం తట్టుకోలేక మృతి చెందిన పాలమూరు జిల్లా చిట్యాలలో మణెమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. కాసేపట్లో చిట్యాల చేరుకోనున్నారు. అనంతరం రాణిపేటలో దస్తగిరి కుటుంబం, నందిన్నెలో నరసింహరెడ్డి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. అలాగే గోవర్థనగిరి, జమ్మిచేడు, గద్వాల్, ధరూర్లలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. బుధవారం ఉదయం పెంట్లపల్లిలోని లచ్చమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి చిట్యాలకు బయల్దేరి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడాన్ని తట్టుకోలేక చనిపోయిన బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకే షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం (08-12-2014) పాలమూరు జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
మూడో టెస్టు:ఎదురీదుతున్న భారత్
సౌతాంప్టన్:ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. 25/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కులు చూపించారు. వరుస వికెట్లు తీసి భారత టాప్ ఆర్డర్ ను దెబ్బతీశారు. భారత్ ఆటగాళ్లలో మురళీ విజయ్(35), పూజారా(24),విరాట్ కోహ్లి(39),రోహిత్ శర్మ(28) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అయితే రహానే మాత్రం బాధ్యతాయుతంగా ఆడి కాస్తలో కాస్త ఫర్వాలేదనిపించాడు. రహానే(54) పరుగుల వద్ద అలీ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో భారత్ భారం ధోనీ, జడేజాలపై పడింది. ప్రస్తుతం క్రీజ్ లో ధోని(20), జడేజా(14) పరుగులతో ఆడుతున్నారు. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ 253 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 316 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ పైచేయి సాధించిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు డ్రా చేసుకోవడం మినహా విజయావకాశాలు దాదాపుగా లేనట్లే కనబడుతోంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్, బ్రాడ్, అలీలకు తలో రెండు వికెట్లు లభించాయి. -
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన భారత్
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో మూడో రోజు మంగళవారం భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. 25/1 ఓవర్‌నైట్ స్కోరుతో ధోనీసేన బ్యాటింగ్‌కు దిగింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మురళీవిజయ్ (11), పుజారా (4) క్రీజులోకి వచ్చారు. రెండో రోజు టీమిండియా ఓపెనర్ ధవన్ 6 పరుగులకే అవుటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 569/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 544 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ పైచేయి సాధించిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు డ్రా చేసుకోవడం మినహా విజయావకాశాలు దాదాపుగా లేనట్టే. -
సీమాంధ్రలో మూడోరోజు సమ్మె సంపూర్ణం
-
వరుసగా 3వ రోజు కొనసాగుతున్న బంద్