traffic diversions
-
HYD: పీపుల్స్ ప్లాజా నుంచి మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
సాక్షి, హైదరాబాద్: నగరంలో రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి మారథాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇక, ఈ మారథాన్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు కొనసాగనుంది. ఈ మారథాన్‌లో పలు రాష్ట్రాల రన్నర్లు పాల్గొన్నారు.అయితే, మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ మారథాన్(42 కి.మీ) పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్, రోడ్డు నం 45, కేబుల్ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, మైహోం అబ్రా, ఐకియా రోటరీ, ట్రాన్స్‌కో, బయోడైవర్సిటీ, జంక్షన్, టెలికాంనగర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ క్యాంపస్ గేట్ నం-2 నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.The Traffic Advisory 13th Edition Hyderabad Marathon—2024 will be held on 25.08.2023 (Sunday) between 5.00 AM and 12.30 PM. The event takes place on various roads in the city starting from People’s Plaza, Necklace Road and Hitex Exhibition up to Gachibowli Stadium. pic.twitter.com/Pon7hXglZA— Cyberabad Police (@cyberabadpolice) August 24, 2024 -
అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
సాక్షి, విజయవాడ: రేపు(శుక్రవారం) విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులను వాహనదారులు గమనించాలని సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని తెలిపారు. కాగా, సీపీ కాంతి రాణా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 1.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. రేపటి కార్యక్రమం కోసం ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నాం. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలకు మళ్లింపులు కొనసాగుతాయి. విజయవాడ సిటీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. హైదరాబాద్-విశాఖ, విశాఖ-హైదరాబాద్ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదగా దారి మళ్లింపు చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్.. చీరాల, బాపట్ల మీదగా మళ్లింపు వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లింపు చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై వెళ్లే వాహనాలను మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదగా మళ్లింపు ఎంజీ రోడ్లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకి పార్కింగ్ ప్రాంతాలు కేటాయించాము రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది సందర్శకులకు శనివారం నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు అనుమతి. కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముందుగా సీఎం జగన్ ముఖ్య అతిథిగా బహిరంగ సభ జరుగుతుంది బహిరంగ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ చేతుల మీదగా ఆరు గంటలకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది దాదాపు మూడు వేల వాహనాలలో లక్షన్నర మంది ప్రజలు వస్తారని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు విజయవాడ నగరంలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేశాం విజయవాడ సెంటర్లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.405కోట్ల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరిగింది. రేపు సందర్శకులకు అనుమతి ఉండదు నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం -
విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు
సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ నగరంలో రేపు(08-08-2023) మంగళవారం ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రకటించింది. సామాన్య ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 05. గంటల నుండి సాయంత్రం 06.గంటలు ఈ క్రింది ట్రాఫిక్ రూట్లలో మళ్ళింపులు, ఆంక్షలు అమలులో అమలు కానున్నాయి. ఆంక్షలు 🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు. 🚧 మధురా నగర్ జంక్షన్ నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు. 🚧 రామవరప్పాడు నుండి పడవలరేవు(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు. 🚧 గుణదల పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుండి ESI కటింగ్(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు. డైవర్షన్లు 🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వెళ్ళవలసిన వాహన దారులు చుట్టూ గుంట జంక్షన్ నుండి నైస్ బార్ జంక్షన్ – మధు చౌక్ – జమ్మి చెట్టు సెంటర్ – సిద్దార్ధ జంక్షన్ – అమ్మ కళ్యాణ మండపం జంక్షన్ వద్ద కుడి వైపుకు -రమేష్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 🚧 రామవరప్పాడు నుండి ఏలూరు రోడ్ మరియు BRTS రోడ్ కు వెళ్ళవలసిన వాహన దారులు రామవరప్పాడు నుండి మహానాడు జంక్షన్ – రమేష్ హస్పిటల్ జంక్షన్ వద్ద కుడి వైపుకు – అమ్మ కళ్యాణ మండపం వద్ద ఎడమ వైపుకు – సిద్దార్ధ కాలేజీ జంక్షన్ – జమ్మి చెట్టు సెంటర్ – మధు చౌక్ – నైస్ బార్ జంక్షన్ – పుష్ప హోటల్ జంక్షన్ – దీప్తి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 🚧 ESI కటింగ్ (ఏలూరు రోడ్ ) నుండి రామవరప్పాడు కు విద్యుత్ సౌద మీదుగా ఎలాంటి వాహనములు కానీ పాద చారులు కానీ అనుమతి లేదు. కనుక వాహన దారులు ప్రజలు సహకరించాలని.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అనుసరించి తమ తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు యత్నించాలని సీపీ సదరు ప్రకటనలో పేర్కొంది. -
రాష్ట్రపతి రాక.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: నగరానికి రేపు(మంగళవారం, జులై 4) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంను సందర్శించనున్నారామె. ఈ నేపథ్యంలో రేపు సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లింపు ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. -
కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
Updates.. సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. సచివాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. తమ చాంబర్లలో కొలువుదీరిన మంత్రులు హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫైల్‌పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం 6వ అంతస్తులోని తన చాంబర్లో కొలువుదీరిన సీఎం కేసీఆర్ పోడు భూములు పంపిణీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్ తన కార్యాలయంలో 6 ఫైల్స్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవంలో భాగంగా మధ్యాహ్నం గం. 1.15 నిమిషాల ప్రాంతంలో సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. - కొత్త సచివాలయం చేరుకున్న మంత్రి కేటీఆర్. - మూడో అంతస్తును కేటీఆర్ పరిశీలించారు. - ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. - హుస్సేన్‌సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. - తెలుగు తల్లి జంక్షన్లో వాహనాల దారి మళ్లింపు. - ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనాలకు అనుమతి నిరాకరణ. - ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు మూసివేత. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. - గృహలక్ష్మీ సహా కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్న సీఎం కేసీఆర్, మంత్రులు. - హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం. - మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం. కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు మొత్తం ఎత్తు: 265 అడుగులు నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఉక్కు: 8,000 టన్నులు సిమెంటు: 40,,000 టన్నులు ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు ఇటుకలు: 11 లక్షలు ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు మార్బుల్: లక్ష చదరపు అడుగులు ధోల్పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు కలప: 7,500 క్యూబిక్ అడుగులు పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్ అల్ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా ఆ సమయంలో చార్మినార్–మదీనా, చార్మినార్–ముర్గీ చౌక్, చార్మినార్–రాజేష్ మెడికల్ హాల్ (శాలిబండ) మధ్య రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, సర్దార్ మహల్ సహా ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ కూడా మూసేస్తారు. వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బçస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు -
అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నగరం వేదిక కానుంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. అంబేద్కర్ మనువడు ప్రకాష్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు ప్రకటించారు హైదరాబాద్ పోలీసులు. రేపు అంటే ఏప్రిల్ 14 శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత్లాలో ఆంక్షలు అమలు చేయనున్నారు. దీంతో వాహనాల దారి మళ్లింపు ఉండనుంది. నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు అమలు కానున్నాయి. నెక్లెస్ రోడ్డు - ఎన్టీఆర్ మార్గ్ - తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు లక్డీకాపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని నెటిజన్స్‌కు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది!
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్ డిపో వద్ద ఎస్ఎంఆర్ వినయ్సిటీ, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గోపీచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వెళ్లాలన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా.. -
వాహనదారులకు అలర్ట్! విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
విజయవాడ స్పోర్ట్స్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు, వాహనచోదకుల సౌకర్యార్థం విజయవాడ నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా శుక్రవారం తెలిపారు. నగరంలోని పలు మార్గాల్లో సాగే వాహనాల రాకపోకలను వేరే రూట్లకు మళ్లిస్తున్నట్లు వివరించారు. శుక్ర వారం అర్ధరాతి 12 నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఆంక్షల సమయంలో భవానీపురంలోని కుమ్మరిపాలెం నుంచి ఘాట్‌రోడ్డుకు, గద్ద»ొమ్మ సెంటర్ నుంచి ఘాట్ రోడ్డుకు, బస్టాండ్ నుంచి ఘాట్‌రోడ్డుకు బస్సులు, కార్లు, ఆటోలు అనుమతించబోమని స్పష్టంచేశారు. స్క్యూ బ్రిడ్జి నుంచి యనమలకుదురు కట్ట వైపు, పెదపులిపాక నుంచి యనమలకుదురు కట్ట వైపు బస్సులు, భారీ వాహనాలను అనుమతించబోమని సీపీ రాణా పేర్కొన్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా.. ► హైదరాబాద్– విశాఖపట్నం మధ్య తిరిగే వాహనాలు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, సీవీఆర్ ఫ్లై ఓవర్, పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి. ► విజయవాడ – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్, గొల్లపూడి, స్వాతి జంక్షన్, వైజంక్షన్, ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించాలి. ► బస్టాండ్ నుంచి భవానీపురం, పాలప్రాజెక్ట్కు రాకపోకలు సాగించే సిటీ బస్సులు రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, శివాలయం వీధి, జోజినగర్ చర్చి, సితార సెంటర్, చిట్టినగర్ మార్గాన్ని అనుసరించాలి. ► అవనిగడ్డ నుంచి విజయవాడకు కరకట్ట మీదుగా రాకపోకలు సాగించే ఆరీ్టసీ, సిటీ బస్సులు పెదపులిపాక, తాడిగడప, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మార్గంలో ప్రయాణించాలి. -
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ట్రయల్ రన్.. అయోమయంలో వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాత్మక ఆంక్షల నడుమ వాహనాలు ఆగుతూ... సా..గుతూ కనిపించాయి. సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్లో రైట్ టర్న్‌ను తొలగించడంతో తొలి రోజు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 బాలకృష్ణ నివాసం చౌరస్తాతో పాటు జర్నలిస్టు కాలనీ, సీవీఆర్, బీవీబీపీ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్ కింద మళ్లింపులు చేపట్టి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీలు, ఇద్దరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది ఎస్ఐలు కలిసి మొత్తం 32 మంది ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు. ► మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభించారు. చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక గజిబజిగా ముందుకు సాగుతుండగా ట్రాఫిక్ పోలీసులు వారికి దారి చూపారు. ► అయితే పలుచోట్ల ట్రాఫిక్ చాంతాండాంత దూరానికి నిలిచిపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. మొదటి రోజు వాహనాలు వివిధ మార్గాల నుంచి మళ్లించడంతో చుట్టూ తిరుగుతూ వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లారు. ► నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్, ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి పలుచోట్ల యూటర్న్లు, రైట్ టర్న్‌లను పరిశీలించారు. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 ప్రధాన రోడ్డులో పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ వెళ్లే టర్నింగ్ వద్ద పిల్లర్ నెంబర్ సి–1659 నుంచి హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సు శుక్రవారం ఉదయం రాంగ్రూట్లో వస్తూ కనిపించింది. సాధారణంగా ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం కనిపిస్తుంది. ఏకంగా సిటీ బస్సు రాంగ్రూట్లో వస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఓ స్కూటరిస్ట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సర్వీసు రోడ్డులో నిండుగా... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45ల కేబుల్ బ్రిడ్జి నిర్మించి దానికి అనుసంధానంగా ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు సర్వీసు రోడ్డులో వాహనాలు ఏ రోజు కూడా నిండుగా కనిపించలేదు. కానీ తొలిసారి శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయా జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టడంతో సర్వీసు రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరో వైపు రోడ్ నెం.45లోని ఫ్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వాహనాలు తక్కువగా వెళ్లడం గమనార్హం. (క్లిక్ చేయండి: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు) జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP. @HiHyderabad #Hyderabad @KTRTRS — Vidya Sagar Gunti (@GVidya_Sagar) November 25, 2022 నగర వాసులు ఏమంటున్నారు.. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రయన్ రన్‌పై నగర వాసులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమంటే తమను ఊరంతా తిప్పుతున్నారని అంటున్నారు. So! The city traffic police woke up one day and said - everything is fine, let’s mess up? Was that the thought behind all these diversions/ no U-turns in Jubilee Hills? Such chaos! #Hyderabad #HyderabadTraffic #WhatOnly🤯 pic.twitter.com/WpDIaB0u7Y — Revathi (@revathitweets) November 26, 2022 -
వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, నేడు(సోమవారం) తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగునున్నాయి. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్టు పోలీసులు సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ఇవే.. - చాపెల్‌రోడ్, నాంపల్లి వైపు వచ్చే వాహనాలు పీసీఆర్ వైపు మళ్లింపు.. - బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు గన్‌ఫౌండ్రీ వైపు మళ్లింపు.. - రవీంద్ర భారతి నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు.. - నారాయణ గూడ నుంచి వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్ వైపు మళ్లింపు. ఇది కూడా చదవండి: మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్ -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు సూచనలివే!
గచ్చిబౌలి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఐటీ కారిడార్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రీడమ్ రైడ్ నేపథ్యంలో దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి వరకు పలు మార్లాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రారంభమయ్యే ఫ్రీడమ్ రన్ ఐకియా రోటరీ వద్ద కుడి వైపు , లెమన్ ట్రీ హహోటల్, ఫీనిక్స్ ఐటీ హబ్, డెల్, టెక్ మహీంద్రా, సీఐఐ జంక్షన్ మీదుగా మెటల్ చార్మినార్ వరకు కొనసాగుతుందన్నారు. అక్కడి నుంచి ఇందిరాగాంధీ విగ్రహం, సైబర్‌టవర్ జంక్షన్లో కుడి వైపునకు వెళ్లి మెడికవర్ హాస్పిటల్ మైండ్ స్పైస్ గేట్, రోటరీలో ఎడమ వైపు టీ హబ్ జంక్షన్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మై హోం భూజ, ఎన్సీబీ జంక్షన్ నుంచి సైబరాబాద్ కమిషనరేట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, విప్రో జంక్షన్, ఐసీఐసీఐ బ్యాంక్, కోకాపేట్ రోటరీ, యుటర్న్ తీసుకొని ఐసీఐసీఐ జంక్షన్, విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఎడమ వైపు టర్న్ తీసుకొని హెచ్‌సీయూ డిపో వద్ద యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుంది. (చదవండి: గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్ ) ► కావూరీహిల్స్ జంక్షన్ నుంచి, గచ్చిబౌలి వైపు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు సీఓడీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. సైబర్ టవర్ నుంచి మైండ్ స్పేస్ అండర్ పాస్ నుంచి బయోడైవర్సిటీ, గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లవచ్చు. ► రోడ్డు నెంబర్ 45 నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వచ్చే వాహనాలు, గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను సీవోడీ జంక్షన్, మాదాపూర్ పీఎస్‌కు మళ్లిస్తారు. ► కావూరీహిల్స్ జంక్షన్ నుంచి కొత్తగూడ,, సైబర్ టవర్ జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. సైబర్ టవర్ నుంచి ఎన్సీబీ జంక్షన్ వరకు, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు అనుమతించరు. విప్రో నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ , కొత్తగూడ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. ► మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో ట్రక్కులు, లారీలు, రెడిమిక్స్లు, డీసీఎంలకు అనుమతి లేదు. (చదవండి: గురుకుల పోస్టుల భర్తీ.. 9,096 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం) -
మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని లేదా ఉద్యోగుల హాజరు సమయాలలో మార్పులు చేసుకోవాలని ఆయా కంపెనీలకు పోలీసులు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా: ► గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ, హెచ్‌సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలి. ► లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్‌సీయూ డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మజీద్ బండ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. ► విప్రో నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్ రోడ్, హెచ్ సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లికి వెళ్లాలి. ► విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. ► కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లేవారు కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కే ర్యాంప్ దగ్గర రైట్ తీసుకుని రత్నదీప్, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లాలి. (క్లిక్: రెండో దశ మెట్రో రూట్ చేంజ్!) డ్రోన్లను ఎగురవేయొద్దు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భద్రత చర్యలలో ఐఎస్బీ, గచ్చిబౌలి స్టేడియం ప్రాంతాలలో డ్రోన్లను ఎగరేయడానికి అనుమతి లేదు. ఆయా ప్రాంతాల చుట్టూ 5 కి.మీ. పరిధిలో పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నిషేధం విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. (క్లిక్: హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!) -
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఆయా సమయాల్లో సాధారణ వాహనచోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. జమాతుల్ విదా ప్రార్థనల నేపథ్యంలో... శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్–మదీన, చార్మినార్–ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్–శాలిబండ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని మదీన జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో (ఇక్కడ కేవలం విధుల్లో ఉన్న అధికారుల వాహనాలు) పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే ప్రార్థనల నేపథ్యంలో మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: ట్విట్టర్లో పెట్రో వార్ !) -
హైదరాబాద్: సదర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సదర్ ఉత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ, ట్రాఫిక్ విభాగం ఇంచార్జి అడిషనల్ సీపీ చౌహాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాచిగూడ ఎక్స్‌రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ మార్గాల్లో వచ్చే వాహనాలను కాచిగూడ టూరిస్ట్ హోటల్ వైపునకు మళ్లిస్తున్నారు. నారాయణగూడ విఠల్‌వాడీ ఎక్స్‌రోడ్స్ నుంచి వైఎంసీఏ నారాయణగూడ వైపు వచ్చే వాహనాలు రామ్‌కోఠి ఎక్స్‌రోడ్స్ వైపు వెళ్లాల్సి ఉంది. రాజమోహల్లా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి సాబూ షాప్ పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వాలి. రెడ్డి కాలేజీ నుంచి వచ్చే వాహనాలు బర్కత్‌పురా వైపునకు వెళ్లాలి. ఓల్డ్ బర్కత్‌పురా పోస్ట్ ఆఫీస్ నుంచి వైఎంసీఏ వచ్చే వాహనాలు క్రౌన్ కేఫ్ నుంచి వేరే మార్గం ద్వారా వెళ్లాలి. శనివారం రాత్రి 7 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. (సదర్ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు) -
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మేయర్ ఎన్నికల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు గురువారం ఉదయం 9 నుంచి సా. 4 గంటల వరకు అమలులో ఉంటాయి. ►అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి లిబర్టీ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్ళిస్తారు. ►లోయర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు. కట్టమైసమ్మ చౌరస్తా నుంచి తెలుగు తల్లి ఫైఓవర్ మీదుగా పంపిస్తారు. ►హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని లిబర్టీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్, నిజాం కాలేజీ, అసెంబ్లీ మీదుగా పంపిస్తారు. ►బషీర్‌బాగ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. ►తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ వైపు వాహనాలను పంపించరు. వీటిని ఇక్బాల్ మీనార్ జంక్షన్ నుంచి రవీంద్రభారతి చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. ►పోలీసు కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ మీదుగా తెలుగుతల్లి చౌరస్తా వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి, ఇక్బాల్ మీనార్ వైపు నుంచి పంపిస్తారు. -
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, చెత్తబజార్ ప్రాంతాల్లో ఇవి ఉండనున్నాయి. నేడు రక్తదాన శిబిరం మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా అవసరం ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం పుణ్యకార్యమని మౌలానా హఫేజ్ అహెసన్ అల్ హుముమీ చేప్పారు. మిలాదున్నబిని పురస్కారించుకొని ఈ నెల30న రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్ల నుంచి సంస్థ తరుపున ప్రతిఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిలాద్ ఉన్ నబీ సందడి మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని గురువారం రాత్రి నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలను ఆకుపచ్చ తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చౌరస్తాల్లో రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిచారు. నెలవంక పచ్చ జెండాల విక్రయాలు ఊపందుకున్నాయి. పాతబస్తీతో పాటు ముస్లింలు అధికసంఖ్యలో నివసించే ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. -
నేడు, రేపు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: గురునానక్ జయంతి వేడుకలతో పాటు మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో నగరంలో శని, ఆదివారాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురునానక్ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు అశోక్ బజార్‌లోని గురుద్వారా ర్యాలీగా బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శివాజీ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్, శాంతి ఫైర్ వర్క్స్ మార్గంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపులు ఉంటాయి. మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, చెత్తబజార్ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
పంద్రాగస్టు.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ విభాగం పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతోంది. ‘కోట’ను పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఉంచనుంది. పరిసర ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గాలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదిక 120 అదనపు కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు... వీటిని బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)తో అనుసంధానించారు. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను వీక్షించేలాఏర్పాటు చేశారు. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఏవైనా సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరిస్తుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం అన్ని విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ చర్యల్లో భాగంగా కోటతో పాటు రాజ్‌భవన్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి సిటీ సీపీ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కోట, రాజ్‌భవన్‌ను సందర్శించి అవసరమైన మార్పుచేర్పులు సూచించనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ... గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి వీల్లేదు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా కచ్చితంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరవ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నిర్వహణకు ఏర్పాట్లు... పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్, రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ విభాగం తరఫున పటిష్ట ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ వింగ్ చీఫ్ అనిల్‌కుమార్ వెల్లడించారు. 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, బాబూరావులతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోల్కొండ, సికింద్రాబాద్, రాజ్‌భవన్‌లో జరిగే మూడు కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, అక్కడి నుంచి గోల్కొండ కోటకు వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఆయా రూట్లలో చేపడుతున్నట్లు వివరించారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా ప్రభుత్వం పాసులు జారీ చేసిందన్నారు. పాస్‌ల వెనకాల పార్కింగ్ స్థలం, వేడుకలకు వచ్చే మార్గం తదితర సూచనలు ఉన్నాయన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారన్నారు. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ గొడుగులను అందుబాటులో ఉచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్కొండకు వచ్చే వారి కోసం రూట్‌మ్యాప్ విడుదల చేశారు. పాస్‌లున్న వారు స్పష్టంగా కన్పించే విధంగా కారుకు ముందుభాగంలో అంటించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా...గోల్కొండ చుట్టుపక్కల... ♦ బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రాందేవ్‌గూడ–గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం 7:30–10గంటల వరకు ఈ రూట్లోకి అనుమతిస్తారు. ♦ సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్‌టర్న్ తీసుకొని బాలికా భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పుఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడ వారికి కేటాయించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేయాలి. రాజ్‌భవన్ రోడ్డులో... ♦ రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాల నేపథ్యంలో సాయంత్రం 4:30గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాజ్‌భవన్ రూట్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిదని అదనపు సీపీ సూచించారు. ♦ తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వేడుకకు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్–1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత వీటిని కేటాయించిన స్థలంలో పార్కు చేయాలి. ♦ పింక్ కారు పాస్ కల్గిన ఇతర అతిథులు గేట్–3 నుంచి లోపలికి వెళ్లి అక్కడే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గినవారు గేట్–3 వద్ద ఆగి ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి. సికింద్రాబాద్‌లో... పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు అమలులో ఉంటాయి. -
నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కేబుల్ పనుల నిర్వహణ నేపథ్యంలో శ్రీనగర్‌కాలనీ రోడ్–నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ హోటల్ మధ్య మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ ఇన్చార్జ్ కొత్వాల్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం నుంచి 43 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరిం చాలని ఆయన కోరారు. భారీ వాహనాల తో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు మాత్ర మే ఈ మళ్లింపులు వర్తించనున్నాయి. ⇔ సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు వైపు నుంచి పంజగుట్ట వైపు వచ్చే వాహనాలను కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్ జంక్షన్, లాలమ్రాయ్, సీటీఓ, ప్యారడైజ్ చౌరస్తా, ఎంజీ రోడ్, రాణిగంజ్ జంక్షన్, కర్బాలా మైదాన్, అప్పర్ ట్యాంక్‌బండ్, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, సెక్రటేరియేట్ పాత రోడ్డు, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. ⇔ పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి వైపు నుంచి అమీర్‌పేట, పంజగుట్ట మీదుగా ఏపీ, రాయలసీమల్లోని గమ్య స్థానాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులను ఎస్సార్‌నగర్‌లోని గౌతమ్ డిగ్రీ కాలేజీ పాయింట్ నుంచి కూకట్పల్లి వైపు పంపిస్తారు. ⇔ పటాన్చెరు, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వచ్చే సిటీ బస్సులు, భారీ వాహనాలను ఎస్సార్‌నగర్ చౌరస్తా నుంచి కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బి సిగ్నల్, సోనాబాయ్ టెంపుల్, అమీర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్‌భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు. ⇔ ఇదే మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులను అమీర్‌పేట జంక్షన్ నుంచి మాతా టెంపుల్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్‌భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు. ⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్‌కాలనీ రోడ్ మీదుగా ఖైరతాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను షాలిమార్ జంక్షన్ నుంచి శ్రీనగర్‌కాలనీ జీహెచ్ఎంసీ పార్క్, ఎంజే ఇంజినీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్, జీవీకే వన్ మాల్, తాజ్ కృష్ణ జంక్షన్, కేసీపీ జంక్షన్, చీఫ్ ఇంజనీర్స్ ఆఫీస్ మీదుగా మళ్లిస్తారు. ⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్‌కాలనీ రోడ్ మీదుగా బేగంపేట/ఎస్సార్‌నగర్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ జంక్షన్ నుంచి కృష్ణనగర్ చౌరస్తా, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, యూసుఫ్‌గూడ బస్తీ, కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్‌నగర్, వెంగళ్రావు నగర్, ఎస్సార్‌నగర్ మీదుగా పంపిస్తారు. -
6 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆరునెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం - 45 లోని శ్రీహరి ఇంటి నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టు సీపీ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆంక్షలు ఈ నెల 10 నుంచి జులై 10 వతేదీ వరకు అమలులో ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలో మాదాపూర్ నుంచి రోడ్డు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోకి వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు రోడ్డు నెం. 44 మీదుగా NOC పబ్, ఇక్బాల్యా ఇంటర్నేషనల్ స్కూల్, ఫెర్నాండేజ్ దవాఖానా, రోడ్డు నెం. 39/44 జంక్షన్ మీదుగా రోడ్డు నెం. 45 లోకి రావాలి. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రోడ్డు నెం. 1/12లో 15 రోజులు.. బంజారాహిల్స్ రోడ్డు నెం-12లోని 1/12 జంక్షన్ నుంచి హిందు శ్మశాన వాటిక వరకు ఎం-40 గ్రేడ్ సీసీ రోడ్డు, ఫుట్‌పాత్ తదితర పనుల కారణంగా 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ ఆంక్షలు 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమలులో ఉంటాయి. మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్డు నెం-12 కు వెళ్లే వాహనాలను 1/12 జంక్షన్లో మళ్లిస్తారు. ఈ వాహనాలు 1/10 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం-10, జహీరానగర్, క్యాన్సర్ దవాఖాన, ఒడిశా ఐలాండ్ జంక్షన్ మీదుగా రోడ్డు నెం-12 లోకి రావాలి. బంజారాహిల్స్ రోడ్డు నెం-13 లో ఒన్వేను ఏర్పాటు చేయనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి రోడ్డు నెం.1 లోకి వన్‌వే ఉంటుంది. రోడ్డు నెం. 1/12 జంక్షన్ నుంచి రోడ్డు నెం-13 కు వాహనాల అనుమతి ఉండదు. ఈ రూట్లోని వాహనాలను రోడ్డు నెం. 1/10 జంక్షన్, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ ఆస్పత్రి, ఒడిశా ఐలాండ్ జంక్షన్, రోడ్డు నెం-12 కు మళ్లిస్తారు. రోడ్డు నెం. 45, ఫిలింనగర్, అపోలో హాస్పిటల్ నుంచి రోడ్డు నెం.12 మీదుగా వచ్చే వాహనాలు.. ఒడిశా ఐలాండ్ జంక్షన్, క్యాన్సర్ ఆస్పత్రి , జహీరానగర్, రోడ్డు నెం-10, రోడ్డు నెం. 1/10 జంక్షన్ నుంచి రోడ్డు నెం-1 లోకి రావాలి. ఏసీబీ అఫీస్ నుంచి రోడ్డు నెం.1/12 జంక్షన్‌కు వచ్చే వాహనాలు.. రోడ్డు నెం-13 బంజారాహిల్స్ రోడ్ , ఫ్యామిలీ హాస్పిటల్ లైన్లోకి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. -
'అటెన్షన్ ప్లీజ్' నగరంలో ట్రాఫిక్.. మళ్లింపు మార్గాలు
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు మార్గాల్లో రద్దీ కారణంగా ట్రాఫిక్‌ను మరల్చారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు. ఆదివారం రాత్రి 10:00 గంటల నుంచి సోమవారం ఉదయం 2:00 వరకూ ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. ప్రజలు మార్పులను గమనించాలని పోలీసులు కోరారు. ⇒ నెక్లస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ రోడ్లను పూర్తిగా నిలిపివేశారు. ⇒ నెక్టస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లోని ట్రాఫిక్‌ను ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. ⇒ బూర్గుల రామకృష్ణ రావు (బీఆర్కే) భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్, లకడీకపూల్, అయోధ్యల మీదుగా మల్లించారు. ⇒ ఖైరతాబాద్ మార్కెట్ మీదుగా నెక్లెస్ రోటరీవైపు వెళ్లే వాటిని మీనా టాకీస్ మీదుగా డైవర్ట్ చేశారు. ⇒ మింట్ కాంపౌండ్ నుంచి సెక్రటేరియట్ వెళ్లే రోడ్డును పూర్తిగా నిలిపివేశారు. ⇒ నల్లకుంట రైల్వే బ్రిడ్జ్ మీదుగా సంజీవయ్యపార్క్, నెక్లస్ రోడ్వైపు వెళ్లేవాటిని మినిస్టర్ రోడ్ వైపుగా మార్పు చేశారు. ⇒ సికింద్రబాద్ నుంచి సైలింగ్ క్లబ్వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్ రోడ్డు, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డుల పైపు మల్లించారు. ⇒ అన్ని ఫ్లైఓవర్లును మూసేశారు. ⇒ ప్రైవేటు బస్సులు, లారీలు, పెద్ద వాహనాలను రాత్రి 2:00 గంటల తర్వాతనే సిటీలోకి అనుమతిస్తారు. -
ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ డైవర్షన్స్
హైదరాబాద్ : ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన సీవరేజ్ పైప్‌లైన్ మరమ్మతుల నిమిత్తం ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు. - తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్మీనార్ల వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు అనుమతించరు. - ఈ మార్గంలో రాకపోకలు సాగించే సాధారణ ట్రాఫిక్‌ను సైతం కుడి వైపు ఉన్న రోడ్ మీదుగానే పంపిస్తారు. - రవీంద్రభారతి వైపు నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా మళ్లిస్తారు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు సచివాలయాలకూ తెలుగుతల్లి చౌరస్తా నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. -
గణేష్ నిమజ్జన ఏర్పాట్లు: ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద వేడుక అయిన గణేశ్ ప్రతిమల నిమజ్జనానికి యంత్రాంగాలు సర్వసన్నద్ధమయ్యాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్ తోపాటు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నిర్మించిన కొలనుల్లో గురువారం నిమజ్జనమహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతోపాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. గురువారం ఉదయం నుంచి ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సంబంధిత వివరాలిలా ఉన్నాయి.. ప్రధాన ఊరేగింపు మార్గం : కేశవగిరి-నాగుల్చింత-ఫలక్‌నుమ-చార్మినార్-మదీనా-అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేవి : ఆర్పీ రోడ్-ఎంజీ రోడ్-కర్బాలామైదాన్-ముషీరాబాద్ చౌరస్తా-ఆర్టీసీ క్రాస్ రోడ్స్- నారాయణగూడ ఎక్స్ రోడ్-హిమాయత్‌నగర్ వై జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేవి : ఉప్పల్-రామాంతపూర్-అంబర్పేట్-ఓయూ ఎన్సీసీ-డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ తో కలుస్తుంది. - వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. - నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. - వెస్ట్-ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. - వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్: సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పుర, హరిబౌలి, ఆశ్రా హాస్పిటల్, మొఘల్‌పుర, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ వెస్ట్ జోన్: టోపి ఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ సెంట్రల్ జోన్: ఛాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కౌలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడీగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్క్ - నార్త్‌జోన్: కర్బాలామైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ల్లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ఎక్స్ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్‌మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. సందర్శకులకు పార్కింగ్ : హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అవి... ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తరువాత : విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తరవాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్‌పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్ హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు. ఇంటర్ డిస్ట్రిక్ట్/స్టేట్ లారీలకు: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులకూ: ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయి. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, సీటీఓ, వైఎంసీఏ, రెతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్, బహదూర్‌పుర, నల్గొండ చౌరస్తాలను దాటి ముందుకు రానీయరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు... నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటు నుంచే మళ్ళిస్తారు. హెల్ప్‌లైన్స్ ఏర్పాటు: ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040-27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
రేపటి నుంచి మలక్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు
హైదరాబాద్ : మలక్‌పేటలోని రైలు వంతెన వద్ద మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో శాశ్వత బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ మళ్లింపునకు నిర్ణయించారు. శనివారం మూడు నెలలపాటు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ ఎం.మహేందర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు రావాల్సిన ఆర్టీసీ బస్సుల్ని దిల్సుఖ్నగర్ బస్టాప్‌లో ఆపేస్తారు.