trails
-
‘కవచ్’కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు రైల్వే శాఖ మేల్కొంది. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు అవి పరస్పరం ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక ‘కవచ్’ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రయోగాలు, పరీక్షలు అంటూ కాలయాపన చేసిన తర్వాత ఆ పరిజ్ఞానాన్ని ట్రాక్ మీద, లోకోమోటివ్‌లలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచింది. ఈ పరిజ్ఞానానికి సంబంధించి 4.0 వెర్షన్ ప్రయోగాలు విజయవంతం కావటంతో, దాన్ని దశలవారీగా అన్ని జోన్లలో ఏర్పాటు చేయనుంది.ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 వేల రూట్ కిలోమీటర్లలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో ఆ వ్యవస్థ ఉండగా, కొత్తగా మరో 1,618 రూట్ కి.మీ.లలో ఏర్పాటుకు తాజాగా రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. దక్షిణ మధ్య రైల్వేతో శ్రీకారం..: దేశంలో తొలిసారి కవచ్ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కవచ్ పరిజ్ఞా నాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు 2014–15లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడి సెక్షన్లను ఎంచుకున్నారు. 250 కి.మీ. పరి ధిలో పలు దశల్లో పరీక్షించారు. 2015–16లో ప్యాసింజర్ రైళ్లలో క్షేత్రస్థాయి ట్రయల్స్ నిర్వ హించారు. 2017–18లో కవచ్ స్పెసిఫికేషన్ వెర్షన్ 3.2ను విజయవంతంగా ముగించారు. 2018–19లో ఈ పరిజ్ఞానానికి ఆర్డీఎస్ఓ ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో, 200 లోకోమోటివ్స్‌లో ఏర్పాటైంది. ఇప్పుడు కవచ్ మేజర్ వర్షన్ అయిన 4.0 ద్వారా ఆ పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షన్ ట్రయల్స్ కోసం సనత్‌నగర్–వికారాబాద్ సెక్షన్ పరిధిలో 65 రూట్ కి.మీ.లలో ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఈ పరిజ్ఞానాన్ని హై డెన్సిటీ నెట్ వర్క్ పరిధిలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోస బలార్షా–కాజీపేట– విజయవాడ, విజయవాడ–గూడూరు, విజయ వాడ–దువ్వాడ, వాడి–గుంతకల్–ఎర్రగుంట్ల–రేణిగుంట కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఈ రూట్లలో మొత్తం 1,618 రూట్ కి.మీ. లలో ఏర్పాటుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కవచ్‌తో ఇవీ లాభాలు» ఒకే ట్రాక్‌మీద రెండు రైళ్లు వచ్చినప్పు డు లోకోపైలట్ బ్రేక్ వేయకపోయినా, ఆ పరిజ్ఞానం వల్ల రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుంది. » ఎక్కడైనా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు లోకోపైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు నడిపినప్పుడు లోకో పైలట్‌ను ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ రైలును ఆపకపోతే తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది. » అవసరమైన ప్రాంతాల్లో హారన్ మోగించనప్పుడు ఇది తనంతట తానుగా ఆ పని చేస్తుంది. -
బరువు పెరిగితే సెలవులు కట్!
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు. ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజులలోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానం ఉద్దేశ్యం సైన్య సిబ్బంది పరీక్షల ప్రక్రియలో ఏకరూపతను తీసుకురావడం, శారీరకంగా అన్‌ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించడం, జీవనశైలి వ్యాధులు నివారణ. ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (బీపీఈటీ), ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పీపీటీ) నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరుగెత్తాలి. తాడు పైకి ఎక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో పొందుపరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కల్నల్లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలు కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి ఆరు నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్ , 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. -
అష్టదిగ్బంధనంలో గాజా.. భూతల దాడులకు సర్వం సిద్ధం!
గాజాపై భూతల దాడులు చేయడానికి ట్రయల్స్ పూర్తయ్యాయి. గాజాకు బయటి నుంచి ఎటువంటి సరఫరాలు జరక్కుండా చేసిన అష్టదిగ్బంధనం ఉచ్చు మరింత బిగిసింది. మానవతాసాయం ఎట్టిపరిస్థితుల్లో అందాలన్న ఐక్యరాజ్యసమితి చేతులెత్తేసింది. శాంతిస్థాపన తీర్మానం అంటూ.. మానవతాసాయానికి పరిమితమై సమావేశాన్ని ముగించింది యూరోపియన్ యూనియన్. హమాస్‌ను అంతం చేస్తానన్న ఇజ్రాయెల్ యుద్ధ గర్జన కంటిన్యూ అవుతోంది. తీవ్ర మానవతా సంక్షో భంలో కొట్టుమిట్టాడుతున్న గాజా వాసులకు ఊరట దక్కే సూచనలు కనుచూపు మేరలో కనబడ్డం లేదు. 22 రోజులుగా డే అండ్ నైట్.. ట్వంటీఫోర్ ఇన్‌టూ సెవెన్ ప్రాతిపదికన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనీయులు భీతిల్లిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, బాంబులు వచ్చి మీదపడతాయో తెలియక మృత్యువుకు సన్నిహితంగా మెలుగుతున్నారు. నిత్యావసర-అత్యవసర సరుకు సరంజామా నిల్వలు అడుగంటిపోయాయి. ఇజ్రాయెల్ దిగ్బంధించిన కారణంగా.. బయటి ప్రపంచం నుంచి సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇక గాజావాసులు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితులు దాపురిస్తున్నాయి. תיעוד מפעילות כוחות קרקעיים של צה״ל ברצועת עזה: pic.twitter.com/9dqUzXP7in — צבא ההגנה לישראל (@idfonline) October 28, 2023 గాజాకు మానవీయ సాయం అందకుండా ఇజ్రాయెల్ తన కాళ్ళూ చేతులూ కట్టిపడేసిందని ఐక్యరాజ్యసమితి వాపోయింది. హమాస్ చర్య ఊహించనిదో, మొదటిసారి చేసిందో కాదంటూ UN సెక్రెటరీ జెనరల్ ఆంటోనియో గుటెరస్ చేసిన వ్యాఖ్యలతో ఇజ్రాయెల్‌కు పుండుమీద కారంలా మారింది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు.. హమాస్‌ను పూర్తిగా తుదముట్టించేవరకు యుద్ధం ఆగదంటూ తెగేసి చెప్పింది ఇజ్రాయెల్. భూతల దాడులు చేస్తానని హెచ్చరించింది. అందుకు తగ్గట్టే..ఎంపిక చేసుకున్న టార్గెట్లపై లక్షిత దాడులతో విరుచుకుపడుతోంది. ఇంకోపక్క బ్రస్సెల్స్‌లో సమావేశమైన యూరోపియన్ యూనియన్ నేతలు కూడా కాల్పుల విరమణ తీర్మానంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాల్పుల విరమణ స్థానే గాజాకు అడపాదడపా మానవతాసాయం అందజేయడానికి ఇజ్రాయెల్ సహకరించాలని కోరుతూ తీర్మానం చేసేసి చేతులు దులుపుకున్నారు.ఇప్పటికే.. కాల్పుల విరమణ,. మానవతా సాయం అందజేతపై తీర్మానం చేయడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. Overnight, IDF fighter jets struck Asem Abu Rakaba, the Head of Hamas' Aerial Array. Abu Rakaba was responsible for Hamas' UAVs, drones, paragliders, aerial detection and defense. He took part in planning the October 7 massacre and commanded the terrorists who infiltrated… — Israel Defense Forces (@IDF) October 28, 2023 ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో.. ఎటూపోయేందుకు దారీతెన్నూలేక ఒకవైపు.. నిత్యావసరాలు దొరక్క మరోవైపు. . 20లక్షల మందికి పైగా పాలస్తీనీయులు గాజాస్ట్రిప్‌లో అలమటిస్తున్నారు. ఇంకో రోజు గడిస్తే.. ఇప్పుడు చేస్తున్న పరిమిత సాయం కూడా అందించలేనని పెదవి విరిచింది గాజాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం. తక్షణం జనరేటర్లకు అవసరమైన ఇంధనం అందకుంటే మరో ఇరవై నాలుగ్గంటల్లో ఆఫీస్ షట్‌డౌన్ చేయక తప్పదని ప్రకటించింది. ఇది కూడా చదవండి: 200 హెలికాప్టర్లతో ఇరాన్ యుద్ధ విన్యాసాలు! -
కవచ్ మరింత భద్రం
సాక్షి, హైదరాబాద్: రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా సొంతగా రూపొందించిన కవచ్ పరిజ్ఞానానికి మరింత పదును పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు గతేడాది రైల్వే బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 1,500 కి.మీ. మేర ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కానీ గత నెలలో ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన అనంతరం కవచ్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ దుర్ఘటనలో ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచే స్థాయిలో, 295 మంది వరకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కవచ్ పరిజ్ఞానం ఆ మార్గంలో ఏర్పాటు చేసి ఉంటే, ఈ ప్రమాదం తప్పి ఉండేదంటూ అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. కానీ రైల్వే అధికారులు మాత్రం ‘ఆ మార్గంలో ఒకవేళ కవచ్ పరిజ్ఞానం ఏర్పాటై ఉన్నా.. ఈ ప్రమాదాన్ని నిలువరించే వీలుండేది కాదు..’అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవచ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. కవచ్ ఏర్పాటు ఇక వేగవంతం.. ట్రయల్స్ స్థానికంగా నిర్వహించినందున దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,500 కి.మీ. మేర కవచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీతో లింక్ అయి ఉన్న మార్గాల్లో కనీసం 4 వేల కి.మీ. మేర ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక దాని ఏర్పాటు పనులు వేగంగా పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సంవత్సరానికి కనీసం 8 వేల కి.మీ. పూర్తి చేసేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండు వేర్వేరు టెండర్ల ద్వారా 12 వేల కి.మీ. ఏర్పాటుకు సిద్ధమైంది. వచ్చే పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్ష కి.మీ. వరకు దాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. కొత్త అనుమానాలు.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు చేరువగా వచ్చినా, బ్రేక్ కొట్టాల్సిన సమయంలో లోకో పైలట్ విస్మరించినా, సిగ్నల్‌ను లోకో పైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు పోనిచ్చినా.. లోకో పైలట్‌తో ప్రమేయం లేకుండా కవచ్ పరిజ్ఞానం పని ప్రారంభించి ప్రమాదం జరక్కుండా నిలువరిస్తుంది. ఇది కవచ్ పనితీరును పరిశీలించే క్రమం (ట్రయల్స్)లో స్పష్టమైంది. అంతవరకు దాని పనితీరును శంకించాల్సిన అవసరం లేదు. కానీ బాలాసోర్ ప్రమాదం కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చింది. ఆరోజు.. మెయిన్‌లైన్‌లో గ్రీన్ సిగ్నల్ ఉంది. ఎక్స్‌ప్రెస్ రైలు ఆ మేరకు దూసుకుపోయింది. కానీ ట్రాక్ పాయింట్ మాత్రం లూప్లైన్తో అనుసంధానమై ఉంది. దీంతో 127 కి.మీ. వేగంతో వచ్చిన రైలు ఒక్కసారిగా లూప్లైన్లోకి వెళ్లి.. అక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలో నిలిచి ఉన్న గూడ్సు రైలును ఎనిమిది సెకన్ల (లూప్లైన్లోకి ప్రవేశించాక) వ్యవధిలోనే ఢీకొంది. దీంతో కవచ్ ఉన్నా.. ట్రాక్ పాయింట్ లూప్లైన్తో అనుసంధానమై ఉందన్న విషయాన్ని ముందుగా గుర్తించేది కాదని నిపుణులంటున్నారు. గ్రీన్ సిగ్నల్ ఉండటం, ఎదురుగా ఆ ట్రాక్‌పై మరో రైలు లేకపోవటంతో కవచ్ మిన్నకుండిపోతుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదే కోణంలో కవచ్‌ను మరింత మెరుగ్గా తయారుచేసి, కొత్తగా పరీక్షలు నిర్వహించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సిగ్నల్‌కు విరుద్ధంగా, పాయింట్ తప్పుగా మరో లైన్‌కు లింక్ అయి ఉంటే దాన్ని కూడా కవచ్ గుర్తించేలా మార్చబోతున్నారు. కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య ట్రయల్స్ చేసినందున.. తదుపరి పరీక్షలు కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంది. -
స్పీడ్ కంట్రోల్‌కు.. ఫోర్డ్ జియోఫెన్సింగ్ టెక్నాలజీ!
-
సుప్రీంలో వాదిస్తున్నారు.. కంప్యూటర్ కొనుక్కోలేరా!
న్యూఢిల్లీ: కేసుల ఆన్లైన్ విచారణ సందర్భంగా లాయర్ల మొబైల్ ఫోన్లతో తరచూ అంతరాయాలు కలగడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే మొబైల్ ఫోనుతో కేసుల విచారణలో పాల్గొనడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. లాయర్ల మొబైల్ ఫోన్లలో ఆడియో, వీడియో లేదా రెండూ సరిగా లేకపోవడంతో సోమవారం లిస్టయిన కేసుల్లోని పది కేసుల విచారణను బెంచ్ వాయిదావేయాల్సి వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘న్యాయవాది గారు, మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. వాదనల కోసం కనీసం ఒక డెస్క్టాప్ను భరించలేరా!’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మరోకేసులో ఒక లాయర్ మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంపై స్పందిస్తూ ‘ఇలాంటి కేసులను వినే శక్తి ఇక మాకు లేదు. మాకు సరిగా వినపడే డివైజ్‌ను తెచ్చుకోండి. ఇప్పటికే పది కేసుల్లో ఇలాగే మేం గట్టిగా అరవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించింది. (చదవండి: ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!) -
Omicron Effect: సుప్రీంలో వచ్చే రెండు వారాలు వర్చువల్ విచారణలే
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈనెల 3వ తేదీ నుంచి రెండు వారాలపాటు అన్ని కేసులను వర్చువల్ విధానంలోనే విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం ఆదివారం సాయంత్రం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం అమలవుతున్న హైబ్రిడ్ విధానాన్ని కూడా కొద్దికాలం నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది. దేశంలో మహమ్మారి తీవ్రమవుతున్న సమయంలో 2020 మార్చి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులను విచారిస్తోంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో...సుదీర్ఘ కాలం వాదనలు వినాల్సిన అవసరమున్న కేసులను బుధ, గురువారాల్లో ప్రత్యక్షంగా విచారిస్తామంటూ 2021 అక్టోబర్ 7వ తేదీన జారీ చేసిన సర్క్యులర్‌లో సుప్రీంకోర్టు తెలిపింది. -
త్వరలో 5జీ నెట్వర్క్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఊరిస్తోన్న 5 జీ నెట్వర్క్ సేవలు మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు రావడం మినహా.. అసలు 5జీ నెట్వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మొబైల్ కంపెనీలో ఎడాపెడా 5జీ హ్యాండ్సెట్లను రిలీజ్ చేస్తూ మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. నవంబరులోపే 5జీ ట్రయల్స్ కోసం 2021 మే నెలలో ప్రభుత్వం టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్టీఎల్లు అనుమతి పొందాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం నవంబర్‌లోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. గడువు పెంచండి నవంబరు సమీపిస్తుండటంతో ఇక కమర్షియల్‌గా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశించిన వారికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి చేయలేకపోయామని, ట్రయల్స్‌కి మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కోలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కారణం అదేనా 5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ డాట్ తదితర ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది టెలికం కంపెనీలో కోరినట్టు మరోసారి ట్రయల్స్ గడువు పెంచితే 5 జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు 2022 ఏప్రిల్–జూన్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వోడఫోన్ ఐడియా చేపట్టిన ట్రయల్స్‌లో నెట్ స్పీడ్ 3.7 గిగాబైట్ పర్ సెకండ్‌గా రికార్డు అయ్యింది. చదవండి:ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట -
‘ఆ చిన్నారులపై మాత్రమే కోవాగ్జిన్ ట్రయల్స్ జరుపుతాం’
పట్నా: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అడ్డుకట్టకు భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక మూడో వేవ్ ప్రమాదం ఉందని అదీ పిల్లలపై అధికంగా ప్రభావం చూపనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిన్నారులపై పట్నా ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా సుమారు 70 నుంచి 80 మంది చిన్నారులను ఎంపిక చేసుకొని వాక్సిన్ ఇవ్వనున్నట్లు పట్నా ఎయిమ్స్ సూపరెంటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు ఇవ్వనున్న పిల్లలకు ఆర్టీ పీసీర్, యాంటిజెన్ పరీక్షలు ముందే జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిన వారిపై మాత్రమే ట్రయల్స్ జరపనున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో తరచూ పిల్లల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలిపారు. 2 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల పై ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ అనుమతినిచ్చింది. పట్నాలో ఈ ట్రయల్స్ నమోదుకు కోసం జాబితాలో ఓ 13 ఏళ్ల కుర్రాడు తొలుత పేరును నమోదు చేసుకున్నట్లు డా.సింగ్ తెలిపారు. ట్రయల్స్‌లో పాల్గొనే పిల్లలకు ఆస్పత్రి రావాణా అలవెన్స్ కింద 1000 ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు గత మే 11వ తేదీన డీజీసీఐ అనుమతినిచ్చింది. ఇక పట్నా ఎయిమ్స్‌తో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్‌లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందారు. కాగా దేశంలో ప్రస్తుతం 18 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. చదవండి: కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపు కోసం కేంద్రం కీలక నిర్ణయం -
హైదరాబాద్ టీకాకు ఓకే
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్సీఓ(కేంద్ర ఔషధాల ప్రమాణిక నియంత్రణ సంస్థ) నియమించిన నిపుణుల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. టీకాకు సంబంధించి కంపెనీ సమర్పించిన ట్రయిల్స్ డేటాను పరిశీలించిన అనంతరం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ టీకా భారత్‌లో వినియోగానికి ఆమోదముద్ర సంపాదించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కోవాగ్జిన్ రెండు దశల ట్రయిల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండిటిలో సత్ఫలితాలు వచ్చినందున టీకా అత్యవసర వినియోగానికి నిపుణులు అంగీకారం తెలిపారు. ఫేజ్3 ట్రయిల్స్ కొనసాగించమని సూచించారు. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ ఈ టీకాను రూపొందించింది. కోవాగ్జిన్ వినియోగానుమతుల కోసం భారత్ బయోటెక్ గతనెల 7న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్ వినియోగంపై డీసీజీఐ అంతిమ ఆమోదం తెలపాల్సిఉంది. మరోవైపు కాడిలా రూపొందిస్తున్న టీకాపై ఫేజ్ 3 ట్రయిల్స్ జరపవచ్చని కూడా నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. తర్వాతేంటి? టీకాల వినియోగానికి డీసీజీఐ పచ్చజండా చూపిన అనంతరం ఆయా కంపెనీలు తమ టీకాను మార్కెట్లో ఆథరైజ్ చేసేందుకు, భారీగా ఉత్పత్తి చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాతే మార్కెట్లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది. ఒక వ్యాధికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు కొన్ని ఔషధాలు లేదా టీకాల అత్యవసర వినియోగం కోసం ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కరోనాకు సరైన చికిత్స లేకపోవడం, మరోవైపు కొత్త స్ట్రెయిన్ గుర్తింపు నేపథ్యంలో ఆయా దేశాలు కోవిడ్ టీకాలకు అత్యవసర అనుమతులు ఇస్తున్నాయి. ఇలాంటి అత్యవసర అనుమతులు పొందిన వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకుంటారు. అలాగే సదరు టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందుగానే వివరిస్తారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు. అతి త్వరలో ముందుగా నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో టీకాను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఆదివారం రోజు డీసీజీఐ పత్రికా సమావేశం నిర్వహించనుంది. ఇందులో టీకాల అనుమతిపై వెల్లడించే అవకాశం ఉంది. -
నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్- 3 ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి నగరానికి చెందిన భారత్ బయోటెక్స్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ దిశగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ శరవేగంగా జరుగుతున్నాయని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. కోవాగ్జిన్ టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి రెడీ చేసేందుకు ఐసిఎంఆర్ కార్యచరణ ప్రణాళికలను రూపొందించినట్టు సమాచారం. ఇప్పటి వరకు మొదటి రెండు దశల్లో ట్రయల్స్ విజయవంతంగా జరిగాయి. ఆయా దశల్లో టీకా వేయించుకున్న వాలంటీర్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ చివరి దశ టీకా ప్రయోగానికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రయిల్స్‌ని నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో ఒకటైన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) సోమవారం నుంచి ట్రయల్స్‌ను కొనసాగించేందుకు సమాయత్తమవుతుంది. ఈ దశలో దాదాపుగా 600 మంది వాలంటీర్లకు టీకాలు వేయనున్నామని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ వైద్య బృందం వెల్లడించింది. -
1జీబీ స్పీడ్‌తో దూకుడు : జియో, క్వాల్కామ్ జట్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీ మొబైల్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రిలయన్స్ జియో, క్వాల్కామ్ టెక్నాలజీస్ వెల్లడించాయి. క్వాల్కామ్ 5జీ ఆర్ఏఎన్ ప్లాట్‌ఫాంపై రిలయన్స్ జియో 5జీఎన్ఆర్ సొల్యూషన్ తో 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌ను సాధించగలిగినట్లు తెలిపాయి. మరింత వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్కు 5జీ టెక్నాలజీ తోడ్పడుతుంది. దేశీ అవసరాలకు అవసరమైన 5జీ సొల్యూషన్స్, నెట్వర్క్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియోవెల్లడించింది. స్థానికంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, ఆత్మనిర్భర భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ తెలిపారు. క్వాల్కమ్ టెక్నాలజీస్, 4జీ /5జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్ దుర్గా మల్లాడి కూడా సంతోషం వ్యక్తం చేశారు. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ] -
షాకిచ్చిన ఆస్ట్రాజెనెకా.. క్లినికల్ ట్రయల్స్‌కి బ్రేక్
లండన్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా స్పూత్నిక్ వి అనే వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది. ఇక ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దాంతో క్లినికల్ ట్రయల్స్‌ని తాత్కలింగా నిలిపి వేశారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అన్నింటిలోకి ప్రభావవంతమయ్యింది అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్, మిగతావాటికంటే ముందుగా మార్కెట్లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆ సంస్థ ధ్రువీకరించలేదు. (చదవండి: ఈ వారంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ!) అయితే ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే సంస్థ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. -
కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న సమయంలో వ్యాక్సిన్ విషయంలో ఊరటనిచ్చే వార్త. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ట్రయల్స్‌లో 1600 మందికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇస్తామని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమాచారం అందించింది. ఈ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 22న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసింది. 20 కేంద్రాలలో ప్రారంభం కానున్న ఈ ట్రయల్స్ మొదటి రోజున వంద మందికి టీకాలు వేస్తారు. ముఖ్యంగా పూణే, మహారాష్ట్ర , అహ్మదాబాద్ ఢిల్లీ. ఎయిమ్స్ సహా, ముంబైలోని సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్, కేఇఎం హాస్పిటల్, టీఎన్ మెడికల్ కాలేజ్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో 3వ దశ పరీక్షలను నిర్వహించనున్నారు. కోవిడ్-19 హాట్స్పాట్లుగా ఉన్న ఐదు వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 20 వేర్వేరు ప్రాంతాలు, ఆసుపత్రులనుఎంపిక చేశామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో11-12 ఆసుపత్రులలో ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనేవారు వ్రాతపూర్వక సమ్మతి ఇవాల్సి ఉంటుందని, అలాగే స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వారు అధ్యయన ప్రాంతంలోనే నివసించాలని తెలిపింది. దీంతో కరోనా నివారణకు సంబంధించి భారతదేశంలో అందుబాటులోకి రానున్న తొలి వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానుందనే అంచనా నెలకొంది. -
సాఫీగా కోవాక్జిన్ ట్రయల్స్
లక్డీకాపూల్ (హైదరాబాద్) : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగం ముగింపు దశకు చేరుకుంది. సోమవారం మరో ఇద్దరికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా 55 మంది వలంటీర్లు ఈ టీకాలు వేయించుకున్నారు. వీరిలో ఇద్దరికి మొదటి దశలోని మలి టీకా (బూస్టర్ డోస్)ను కూడా ఇచ్చారు. మరో రెండురోజుల్లో మిగిలిన మరో ఐదుగురికి టీకాలు వేస్తే నిమ్స్‌లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ముగుస్తాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్జిన్ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియకు ఐసీఎంఆర్ మొత్తం దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో నిమ్స్ ఒకటి. నిమ్స్‌లో జూలై 14న ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్ ప్రణాళిక ప్రకారం సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ టీకా వల్ల ఎవరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోవడం గమనార్హం. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె. మనోహర్ పర్యవేక్షణలో నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉందనేది మరో నెల తర్వాతే నిర్ధారణ అవుతుందన్న అభిప్రాయాన్ని నిమ్స్ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. టీకా ప్రయోగం ఇలా.. వలంటీర్లకు తొలుత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రక్త నమూనాలు, స్వాబ్‌లను సేకరిస్తున్నారు. ఆ నమూనాలను ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఢిల్లీలోని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఢిల్లీ ల్యాబ్ జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికేట్ల ఆధారంగా నిమ్స్ వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి దశలో 3 మైక్రోగ్రాములు మోతాదులో టీకా ఇస్తున్నారు. ఇప్పటికి 55 మందికి వేశారు. ఈ టీకా తీసుకున్న వలంటీర్లకు 14 రోజుల తర్వాత అదే కోడ్ కలిగిన వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను అందిస్తున్నారు. సోమవారం నుంచి ఈ డోస్‌ను కూడా నిమ్స్ వైద్యులు ప్రారంభించారు.ఈ క్రమంలో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వలంటీర్ల ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం తెలుసుకుంటున్నారు. -
కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఊరటనిచ్చే ఒక శుభపరిణామం చోటు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు. కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. వ్యాక్సిన్ పరీక్షలకు సంబంధించిన డేటా, ఫలితాలు, ప్రోటోకాల్ పై నిపుణుల కమిటీ సంతృప్తి చెందిందని, వారి అభిప్రాయం ఆధారంగా డీసీజీఐ భారతదేశంలో పరీక్షలకు అనుమతి ఇచ్చిందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు వెంటనే టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని, త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని ఎస్ఐఐ సీఈవో అదార్ పూనవల్లా ప్రకటించారు. కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి అతిపెద్ద టీకా తయారీ సంస్థ ఎస్ఐఐ, బయోఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ టీకాపై యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయి. అధికారిక గణాంకాల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 38,135 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తర్వాత కేసుల సంఖ్యలో భారత్ మూడోస్థానంలో ఉంది. -
కరోనా టీకా ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి
-
సెప్టెంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్!
లండన్ : కరోనా మహమ్మారి నిరోధానికి తొలి వ్యాక్సిన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై నిర్వహించిన మానవ ప్రయోగాల్లో ప్రోత్సాహకర ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. మానవులపై జరిపిన ప్రాథమిక పరీక్షలో ఈ వ్యాక్సిన్ ప్రాణాంతక కరోనా వైరస్‌కు డబుల్ ప్రొటెక్షన్గా పనిచేస్తుందని గుర్తించారు. వ్యాక్సిన్ డోస్ ఇచ్చిన బ్రిటన్ వాలంటీర్ల బృందం నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించగా శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలతో పాటు టీసెల్స్నూ ఇది ప్రేరేపించిందని వెల్లడైనట్టు ది డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు కొద్దినెలలకే కనుమరుగువుతున్నాయని కొన్ని అథ్యయనాలు పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా రావడం గమనార్హం. అయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పై ఫలితాలు అద్భుతంగా ఉన్నా ప్రాణాంతక వైరస్‌ను దీటుగా ఎదుర్కొనే దీర్ఘకాల ఇమ్యూనిటీ ఇస్తుందనేందుకు ఇంకా ఆధారాలు లభ్యం కాలేదని పరిశోధకులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ శరీరంలో యాంటీ బాడీలు, టీ సెల్స్‌ను ప్రేరేపించేలా వ్యాక్సిన్ పనితీరు వెల్లడవడం కచ్చితంగా శుభవార్తేనని వారు చెబుతున్నారు. కోవిడ్-19 నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ వ్యాక్సిన్ డబుల్ ప్రొటెక్షన్గా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు ఆక్స్ఫర్డ్ బృందం వెల్లడించిన హ్యూమన్ ట్రయల్స్ ఫలితాలను ప్రచురిస్తామని ది లాన్సెట్ జర్నల్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ బృందం సరైన దారిలో పయనిస్తోందని ఆక్స్ఫర్డ్ పరీక్షలకు అనుమతించిన బెర్క్‌షైర్ పరిశోధక ఎథిక్స్ కమిటీ చీఫ్ డేవిడ్ కార్పెంటర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు బయటకు వస్తుందని ఎవరూ తేదీలు ప్రకటించలేరని, సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ర్టాజెనెకాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. చదవండి: భారత ఫార్మా రంగంపై బిల్‌గేట్స్ ప్రశంసలు -
కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన
బీజింగ్: చైనానుంచే కరోనా పుట్టిందన్న ఆందోళన మధ్య చైనా సంస్థ సినోవాక్ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పై ఫేజ్3 దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు సినోవాక్ తాజాగా వెల్లడించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 దశలను విజయవంతంగా పూర్తి చేసుకొని మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి చివరి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) బ్రెజిల్ వ్యాక్సిన్ తయారీదారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్‌తో కలిసి చేయబోయే ఈ అధ్యయనంలో, కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులలో పనిచేస్తున్న దాదాపు 9,000 మంది ఆరోగ్య నిపుణులను నియమించు కుంటామని వెల్లడించింది. బ్రెజిల్ లో నిర్వహించే ట్రయల్స్ కు వాలంటీర్ల ఎంపిక ఈ నెలలోనే ఉంటుందని వెల్లడించింది. ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి చివరిలో టీకా తయారీ పనులను సినోవాక్ ప్రారంభించింది. సంవత్సరానికి 100 మిలియన్ డోస్‌ల ఉత్పత్తి సామర్ధ్యంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని, సినోవాక్ భావిస్తోంది. వాక్సిన్ తయారీలో చివరి దశకు చేరుకున్నమూడు కంపెనీలలో ఒకటిగా సినోవాక్ నిలిచింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా తీసుకొస్తున్న వాక్సిన్ ప్రస్తుతం ఫేజ్ 3 లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సినోఫాం (చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్) కు చెందిన వ్యాక్సిన్ కూడా ఫేజ్ 3 పరీక్షల దశలో ఉంది. గాలినుండి కూడా వైరస్ వ్యాపిస్తుందన్న అంచనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలలో గాలిద్వారా మహమ్మారి విస్తరిసుందన్న అంచనాలతో వీలైనంత త్వరగా టీకా తీసుకురావాలని ఔషధ కంపెనీలు, శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం, బ్రిటన్, చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా వ్యాక్సిన్లు వివిధ దశలలో ఉన్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 11 మిలియన్లను దాటగా, మరణాల సంఖ్య 540,000 దాటింది. -
నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
లక్డీకాపూల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది. వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసే విషయంలో నగరానికి చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ నిమ్స్‌ను ఎంచుకుంది. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపిక చేశారన్నారు. దేశంలో ట్రయల్స్ నిర్వహిస్తున్న 12 సంస్థల్లో నిమ్స్ ఒకటి కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో మూడు రకాల వ్యాక్సిన్‌ను రెండు డోస్‌ల చొప్పున ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్‌లో కూడా 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఉంటుందన్నారు. ఫేస్–1, ఫేస్–2 కింద ఈ క్లినికల్ ట్రయిల్స్ చేపడతామన్నారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందన్నారు. సమావేశంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ పాల్గొన్నారు. -
కరోనా టీకా: మరో కీలక అడుగు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. తొలి స్వదేశీ వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’ ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలకు అనుమతులను సాధించింది. జూలైలో దేశవ్యాప్తంగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది. కోవిడ్ నియంత్రణకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’. కరోనా కట్టడికి మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నామని, ఇదొక మైలురాయి లాంటిదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ టీకా అభివృద్ధిలో ఐసీఎంఆర్, ఎన్ఐవి సహకారం కీలక పాత్ర పోషించాయనీ, అలాగే తమ ఆర్‌అండ్‌డి, తయారీ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నఔషధ తయారీదారులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులో భారత్, వ్యాక్సిన్లు, జెనెరిక్ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు 30 గ్రూపులు పనిచేస్తున్నాయని మేలో ప్రభుత్వం తెలిపింది. కాగా భారతదేశంలో 16,475 మంది సహా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ మహమ్మారికి బలి కాగా, భారతదేశంలో దాదాపు 5.5 లక్షలతో సహా ప్రపంచవ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనాకు భారీగా ప్రభావితమైన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. -
అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం
న్యూఢిల్లీ: ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మధ్యప్రదేశ్ పరుగు వీరులకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అత్యవసర ట్రయల్స్ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వివరించారు. కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో బోల్ట్ కన్నా వేగంగా 100 మీ. దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తిచేసిన శ్రీనివాస్ గౌడ (కర్ణాటక), మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్ గుర్జార్లకు సోషల్ మీడియాలో విపరీత ఆదరణ దక్కింది. భారత్‌కు మరో ఉసేన్ బోల్ట్ దొరికాడంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారికి ట్రయల్స్ నిర్వహించగా అంచనాలను అందుకోలేదని తాజాగా కిరణ్ రిజిజు ప్రకటించారు. ‘గుర్జార్ పరుగెత్తుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పుడు నేను స్పందించకుండా ఉంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించేవారు. అతనికి ట్రయల్స్ నిర్వహించగా గుర్జార్ అతికష్టమ్మీద 12.9 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేశాడు. ట్రయల్స్‌లో జూని యర్లతోనే పోటీపడలేకపోయాడు. అతని వయస్సు 26 ఏళ్లు కాబట్టి ఇప్పుడు అతనికి కొత్తగా శిక్షణ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే ట్రయల్స్ నిర్వహించాం. అంతర్జాతీయ స్ప్రింట్ ప్రమాణాలపై సరైన అవగాహన లేకుండానే అతను బోల్ట్‌ను మించగలడంటూ దేశమంతా నమ్మింది’ అంటూ రిజిజు వివరించారు. -
నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ముందుగా ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దోషులు పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్టు తెలిపారు. దోషుల బరువుకు సమానమైన బరువున్న ఇసుక బస్తాలను ఆ తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు. చదవండి: నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు ఉరి కంబాల పటిష్టతను పరిశీలించడం కోసం ఇలా డమ్మీ ఉరి శిక్షను అమలు చేస్తారు. ఇందులో తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే బయటపడే అవకాశముంటుంది. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి తీసేలా జైలులోని 3వ నంబరు గదిలో ఉరి ప్రాంగణాన్ని విస్తరించారు. ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు కలవకుండా చర్యలు చేపట్టారు. చదవండి: లాఠీలతో చితక్కొడతాం.. జైళ్లో పడేస్తాం -
మిషన్ భగీరథ సిద్ధం
సాక్షి, ఆదిలాబాద్ : మిషన్ భగీరథ ప్రయత్న ఫలితం ఆసన్నమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి సెగ్మెంట్‌గా తీసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరా పనులు తుది దశకు వచ్చాయి. ఈ నెల చివరి వరకు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ట్రయల్‌రన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం లోకల్‌వెల్మల్‌లో ఇంటెక్వెల్, దిలావర్పూర్ మండలం మాడెగాంలో నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణాలు పూర్తయ్యాయి. పైమూడు నియోజకవర్గాలకు ఈ ఇంటెక్వెల్, నీటిశుద్ధి ప్లాంట్ నుంచే నీటి సరఫరా జరుగుతుంది. ఇదే సెగ్మెంట్లో గడ్డన్న వాగు వద్ద ఇంటెక్వెల్ నిర్మాణం పూర్తయింది. ఈ ఇంటెక్వెల్ నుంచి భైంసా పట్టణంలోనిæ శుద్ధి ప్లాంట్‌కు నీళ్లు చేరుకుంటాయి. ఈ ప్లాంట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఇంటెక్వెల్, నీటి శుద్ధిప్లాంట్ నుంచి ముథోల్ నియోకవర్గానికి నీటి సరఫరా జరుగుతోంది. మొదట నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ ట్రయల్‌రన్ తర్వాత భైంసా ట్రయల్‌రన్ నిర్వహించాలని భావిస్తున్నారు. మాడెగాంలో ప్రారంభమైన నీటిశుద్ధి పనులు.. ఎస్సారెస్పీ నుంచి నిర్మల్ జిల్లా సోన్ మండలం లోకల్‌వెల్మల్ ఇంటెక్వెల్ నుంచి దిలావర్పూర్ మండలం మాడెగాం శుద్ధి ప్లాంట్(డబ్ల్యూటీపీ)కు నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడ శుద్ధి తర్వాత పైపులైన్ల ద్వారా నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో నిర్మించిన భూస్థాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు(జీఎల్‌బీఆర్)లు, ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్/బీపీటీ)లు, అంతర్గత సంప్‌లకు నీళ్లు చేరుకుంటాయి. ఈ నెల చివరిలోగా ఈ మూడు నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే ట్రయల్‌రన్ ప్రారంభించిన తర్వాత మూడు నెలలపాటు అది కొనసాగుతుంది. మాడెగాంలో శుద్ధి అయిన నీళ్లు నియోజకవర్గాల్లో నిర్మించిన జీఎల్బీఆర్లు, ఓహెచ్‌బీఆర్‌లు, అంతర్గత సంప్ల సామర్థ్యం మేరకు పంపిణీ చేయగలుగుతున్నామా లేదా అన్నది ఈ ట్రయల్‌రన్ ద్వారా అధికారులు నిర్ధారించుకుంటారు. ఈ నీటి పథకాల నుంచి ఈ మూడు నియోజకవర్గాల్లోని 869 ఆవాసాలకు నీటిని సరఫరా చేస్తారు. గ్రామాల్లో ఇంట్రావిలేజ్ నెట్వర్క్ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు జూన్‌లోగా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఆ తర్వాతే భగీరథ నీళ్లు గ్రామాల్లో ఇంటింటికి చేరే పరిస్థితి ఉంది. గడ్డన్న వాగు వద్ద ఇంటెక్వెల్ నిర్మాణం పూర్తయింది. భైంసా వద్ద నిర్మిస్తున్న నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం 95శాతం పూర్తయింది. ఈ నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. ముథోల్ నియోకజవర్గానికి శుద్ధ జలం అందుతుంది. ఇక్కడి నుంచి 245 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతుంది. రూ.1778 కోట్ల అంచన వ్యయంతో... ఎస్సారెస్పీ, గడ్డన్నవాగు జలాశయాల ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ముథోల్ నియోజకవర్గాలకు శుద్ధ జలం అందించే మిషన్ భగీరథ పనులు రూ.1778 కోట్ల అంచన వ్యయంతో కొనసాగుతున్నాయి. ఈ మార్చి వరకు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రెండు ఇంటెక్వెల్లు నిర్మిస్తుండగా, అందులో సోన్ మండలం లోకల్‌వెల్మల్‌లో ఒకటి, గడ్డన్నవాగు వద్ద మరొకటి నిర్మాణం పూర్తి చేశారు. నీటిశుద్ధి ప్లాంట్లు రెండు నిర్మిస్తుండగా, అందులో దిలావర్పూర్ మండలం మాడెగాం వద్ద ఒకటి, భైంసా పట్టణంలో మరొకటి నిర్మిస్తున్నారు. మాడెగాం నుంచి రోజూ 130 మిలియన్ లీటర్లు, భైంసా నుంచి రోజూ 50 మిలియన్ లీటర్లు శుద్ధజలం సరఫరా చేయనున్నారు. ఈ రెండింటి కింద భూస్థాయి బ్యాలెన్సింగ్, ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్గత సంప్ల నిర్మాణాలు పూర్తయ్యే దశకు వచ్చాయి. పైపులైన్ పనులు కూడా తుది దశకు వచ్చాయి. ఇంట్రావిలేజ్ నెట్వర్క్ పనులు మాత్రం జూన్ వరకు పూర్తయ్యే పరిస్థితి ఉంది. ప్రధాన గ్రిడ్ నుంచి నీటి పథకాల వరకు నీటిని మాత్రం ఈ ట్రయల్‌రన్ ద్వారా చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మోటార్లతో పరిశీలన.. లోకల్‌వెల్మల్‌లో ఇంటెక్వెల్ వద్ద 1274 హెచ్‌పీ సామర్థ్యం గల ఆరు మోటార్ల ద్వారా నీటిని మాడెగాంలోని నీటి శుద్ది ప్లాంట్‌కు పంపిస్తారు. మాడెగాంలో 1207 హెచ్‌పీ సామర్థ్యం గల ఆరు మోటార్లు, 74 హెచ్‌పీ సామర్థ్యం గల మూడు మోటార్ల ద్వారా ఈ జలాలను శుద్ధి చేస్తారు. అక్కడి నుంచి నీరు ఆదిలాబాద్ జిల్లాకు నేరడిగొండ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో నిర్మించిన భూస్థాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)కు చేరుకుంటుంది. గుట్ట ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి నుంచి పైపులైన్ల ద్వారా నీరు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకుండానే ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్గత సంప్‌లకు సరఫరా చేస్తారు. ట్రయల్‌రన్‌కు ఏర్పాట్లు.. మిషన్ భగీరథ ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్ నియోజకవర్గాలకు నీరందించేందుకు ట్రయల్‌రన్‌ను ఈ నెలలో నిర్వహిస్తాం. 15వ తేదీ తర్వాత నిర్మల్‌లో, 25వ తేదీ తర్వాత ఆదిలాబాద్‌లో ట్రయల్‌రన్ నిర్వహించే అవకాశం ఉంది. మాడెగాంలో ఇప్పటికే నీటిశుద్ధి ప్లాంట్‌లో నీటిశుద్ధి జరుగుతుంది. అక్కడి నుంచి ట్రయల్‌రన్ ద్వారా నీటి పథకాల సామర్థ్యం మేరకు రోజు నీరు సరఫరా అవుతుందో లేదో పరిశీలిస్తాం. మూడు నెలలపాటు ట్రయల్‌రన్ చేస్తాం. – యూఎస్‌ఎన్ మూర్తి, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
చైనాలో 5జీ ట్రయల్స్
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం మార్కెట్ అయిన చైనా మరో ముందడుగు వేసింది. 5జీ నెట్వర్క్ సేవలందించేందుకు ట్రయల్స్ నిర్వహించింది. 100 నగరాల్లో 5జీ పరికరాలను పరిశీలించింది. మొబైల్ డేటా అందించడంలో 4జీ కన్నా 20 రెట్లు వేగంగా 5జీ నెట్వర్క్ పనిచేస్తుందని భావిస్తున్నారు. మల్టిపుల్ యాంటెనా వ్యవస్థతో అనేక మంది వినియోగదారులకు సేవలందిచవచ్చని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. 5జీతో సెకనుకు 20 జీబీ స్పీడ్‌తో డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం 4జీ సెకనుకు 1జీబీ స్పీడుతో మాత్రమే పనిచేస్తోంది. ఈ 5జీ సేవలు 2020 సంవత్సరానికల్లా అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.