troubles
-
తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!
గత ఏడాదే కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఎంపికైనా ఉద్యోగాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఏడాది కింద కాలేజీలకే వెళ్లి, మెరిట్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటికీ ‘ఆన్ బోర్డింగ్ (ఉద్యోగాల్లో చేర్చుకోవడం)’ప్రక్రియను మొదలుపెట్టలే దు. పైగా మళ్లీ కొత్తవారి కోసమంటూ పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపడుతుండటం.. చిన్న కంపెనీలే కాకుండా బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ)లు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఉద్యోగం వస్తుందా, రాదా? భవిష్యత్తు ఎలా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్/డిగ్రీ చదువు ముగియగానే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక కావడంతో.. తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఊహలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగుల వెతలెన్నో.. ఇటీవల ‘ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్)’చేసిన అధ్యయనంలో ‘ఆఫర్ లెటర్ల’తో అభ్యర్థు లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తూ ఆఫర్ లెటర్లు (లెటర్ ఇంటెంట్) ఇచ్చిఏడాది దాటుతున్నా ఆన్ బోర్డింగ్ సమాచారం ఇవ్వడం లేదు. దీనితో చాలా మంది ఆందోళనలో పడిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నా యి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరేందుకు నిర్ణీతకాలానికి బాండ్లు సమర్పించాలని, ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెడుతు న్నా యి. అభ్యర్థులు ఇతర కంపెనీల్లో మంచి ఉద్యో గాలు, ఆఫర్లు వచ్చినా వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తాము శిక్షణ, ఇతరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే ఇతర కంపెనీలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. ఫైట్ నిర్వహించిన సర్వేలో వేయి మందికి పైగా ఆఫర్ లెటర్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో, క్యాప్‌జెమిని వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇందులో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆందోళన వద్దు.. ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనని, యువత తమ నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం కొన్నినెలల నిరీక్షణ ఫరవాలేదని, అది ఎక్కువ కాలమైతేనే సమస్యగా మారుతుందని చెప్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి కరెక్షన్ వస్తుందని, అది ఆయా రంగాలకు మంచిదే తప్ప హానికరం కాదని పేర్కొంటున్నారు. ముందే స్పష్టత తీసుకోవాలి.. ఎంఎన్‌సీలు సహా వివిధ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చినప్పుడే ఏ తేదీ లోగా ‘ఆన్ బోర్డింగ్’చేస్తారనే దానిపై కాలేజీ యాజమాన్యాలు స్పష్టత తీసుకోవాలి. లేకుంటే కంపెనీలు తమకు నచ్చినట్టు చేస్తూ.. అవసరముంటే నెలలోనే జాయినింగ్ ఇస్తూ, లేకుంటే నెలల తరబడి జాప్యం చేస్తూ వెళుతున్నాయి. ఈ విషయంలో అటు కాలేజీలు, ఇటు కంపెనీల తప్పిదాలు ఉన్నాయి. ఐటీ కంపెనీ లు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా శిక్షణ ఇవ్వొ చ్చు. ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్ ప్రాసెస్‌తో నడిపించవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఒక కంపెనీ ఆఫర్‌కే పరిమి తం కాకుండా మరో కంపెనీలో ప్రయత్నించొచ్చు. ఆన్‌బోర్డింగ్ వచ్చేలోగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లలో చేరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆఫర్ లెటర్లు ఇచ్చినా జాయినింగ్ తేదీపై కంపెనీలు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించాలి. ఆఫర్ లెటర్లను గౌరవించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వపరంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల మా సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు అందజేశాం.. – సి.వినోద్‌కుమార్, కన్వీనర్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆర్థిక మాంద్యం తొలగితే చక్కబడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాస్తవ పరిస్థితి ఏమిటనేది మరో మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. కంపెనీలు మంచి ఉద్ధేశంతోనే ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేపట్టాయి. కంపెనీ బిజినెస్ అవసరాలను బట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిని ఆన్‌బోర్డింగ్‌కు పిలుస్తుంటాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి పిలవనంత మాత్రాన అది నేరమేమీ కాదు. ఎకానమీ వృద్ధి చెంది పరిశ్రమకు సానుకూల పరిస్థితులు ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి. గత వందేళ్లలో ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగి ఎక్కువ ప్రచారం జరగడం తప్ప ఇది కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్కిల్స్ పెంచుకోవాలి. – కోఫోర్జ్ వెంకా రెడ్డి, సీనియర్ హెచ్ఆర్ లీడర్ -
గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది. వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు. 655 మందికే పరిహారం.. బీఎన్ తిమ్మాపూర్‌లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు. ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు.. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ►2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి. ►ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి. ►గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలి ►భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్ వద్ద 107 సర్వే నంబర్లో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లను వెంటనే బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు. మా భూమికి డబ్బులు రాలేదు బస్వాపురం రిజర్వాయర్‌లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. – ఎండీ సాబేర్, బీఎన్ తిమ్మాపురం అనారోగ్యం పాలవుతున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. – జంగిటి సుగుణ, బీఎన్ తిమ్మాపూర్ రూ. 46.35 కోట్లు విడుదల బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది. – ఫైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్‌తో సర్పంచ్ల గగ్గోలు..
ఇటీవల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బందితో కలిసి భిక్షమెత్తారు. సర్పంచ్ నయ్యా ‘దానం చేయండి’అంటూ బ్యానర్ పట్టుకుని, డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేశాడు. బిల్లులు రాకపోవడంతో, తెచ్చిన అప్పులు కట్టలేక ఈ మధ్యనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్ / నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సర్పంచ్ల పరిస్థితి అటు చెంపదెబ్బ, ఇటు గోడ దెబ్బ అన్నట్టుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రూ.వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల్లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పాడైతే మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని చోట్ల లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో వడ్డీలు కట్టలేక, కుటుంబ పోషణ కూడా భారమై దినసరి కూలీలుగా మారుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 1,692 గ్రామ పంచాయతీలున్నాయి. ఎస్ఎఫ్సీ నుంచి రూ.89.63 కోట్ల నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం, రాష్ట్రం నుంచి నెలకు రూ.13 కోట్లు వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కేంద్రం నిధులు, గత రెండు నెలలుగా రాష్ట్ర నిధులు రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలున్నాయి. ప్రతినెలా విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.30 కోట్లు రావాలి. కానీ ఈ మార్చి నుంచి నిధులు రాలేదు. ఇక చేపట్టిన పనులకు సర్పంచులకు ఏడాదిన్నరగా బిల్లులు రాలేదు. చిన్న జీపీలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా, పెద్ద జీపీలకు రూ.12 నుంచి రూ.18 లక్షల దాకా పెండింగులో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. మొత్తం జీపీలు 1,507. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్రాల నుంచి రూ.203.39 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బేల మండల సర్పంచ్‌లు నిధుల విడుదలలో జాప్యానికి నిరసనగా ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట జిల్లాలో 475 జీపీలున్నాయి. నెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8.75 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.8.25 కోట్లు రావాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. అయితే ఇటీవలే ఎస్ఎఫ్సీ ఒక నెల నిధులు రూ.8.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 15 ఆర్థిక సంఘం నిధులు రూ.70 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ. 24.75 కోట్లు పెండింగులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.2 వేల కోట్లు పెండింగ్! నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదంటే తాము కారణం కాదని అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ఇచి్చన డబ్బుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకుంటున్నాయి. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులకు సమానంగా తాము కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదాయం అంతగా లేని కొన్ని చిన్న పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (గత ఏప్రిల్ నుంచి) 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరోవైపు పలు గ్రామ పంచాయతీలకు దాదాపు 3, 4 నెలలుగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచి్చన నిధులకు సంబంధించిన వినియోగ సరి్టఫికెట్లు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్రం సమర్పించలేదని, అందుకే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో (జీపీలు) 7,100కు పైగా మైనర్ పంచాయతీలు, వాటిలో కొత్తగా ఏర్పాటైన జీపీలు 4,383 ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఐదారు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలే ఎక్కువగా ఉండగా, సొంత ఆదాయ వనరులు లేక ఈ పంచాయతీలన్నీ పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. కాగా 15వ ఆరి్ధకసంఘం నిధులు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.1,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలాగే నాలుగు నెలల కాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు పంచాయతీలకు విడుదల కాలేదు. అవి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉన్నట్టుగా సర్పంచ్‌లు చెబుతున్నారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు పెండింగ్ కూలి రూ.160 కోట్లతో పాటు, మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఆరేడు వందల కోట్లు కేంద్రం నుంచి రాలేదు. వీటితో పాటు దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉపాధి బకాయిల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధలను విరుద్ధంగా ఇతర పనులకు ఉపయోగించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.152 కోట్లు తమకు తిరిగి చెల్లించాలంటూ రాష్ట్రానికి కేంద్రం నోటీసులిచి్చంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్ల గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులతో పాటు పల్లెప్రగతి నిధులు కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో దాదాపు 80% దాకా చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్లో సర్పంచ్ల సమస్యలపై ఇటీవల ధర్నాచేశాం. – ఉప్పల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ చాంబర్ జనరల్ సెక్రటరీ రూ.4.50 లక్షల బిల్లులు రావాలి ఈ ఏడాది మా గ్రామంలో రూ.2.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2.80 లక్షలతో డ్రైనేజీ నిర్మించాం. రూ.1.50 లక్షలతో లైట్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పంచాయతీకి రూ.4.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. మలీ్టపర్పస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉంది. – కిష్ట్యానాయక్, పల్లెగడ్డతండా సర్పంచ్, నారాయణపేట జిల్లా ట్రాక్టర్ డీజిల్‌కూ అప్పు! నిధులు రాకపోవడంతో పంచాయతీ ట్రాక్టర్ రోజువారీ డీజిల్ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల జాడే లేదు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు చేస్తే ఇదీ పరిస్థితి. – కాశీ విశ్వనాథ్, 4 ఇంక్లైన్ సర్పంచ్, భద్రాద్రి జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి.. 8 నెలల క్రితం రూ.4 లక్షలు అప్పు తెచ్చి మురుగు కాల్వలను నిర్మించాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. జీపీకి ప్రభు త్వం ఇచ్చే నిధులు ట్రాక్టర్ కిస్తీకి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలి. నిధుల విడుదలపై దృష్టి సారించాలి. – తూముల శ్వేత, పెన్ పహాడ్ మండల కేంద్ర సర్పంచ్, సూర్యాపేట జిల్లా -
వరదొచ్చి నెల.. బతికేదెలా? రూ.10 వేల తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు
తాండ్ర కృష్ణగోవింద్ ఉవ్వెత్తున ఎగిసిన గోదావరి వరద తీరప్రాంతాలను ముంచెత్తింది. ఉగ్ర గోదావరి ధాటికి వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సహాయక శిబిరాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ బాధితుల్లో సగం మంది సొంతింటికి దూరంగానే ఉన్నారు. ఓ వైపు ఆస్తులు కోల్పోయి, మరోవైపు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు, దాతలు అందించే సాయంతోనే ఇంకా బతుకు బండి నెట్టుకొస్తున్నారు. జూలైలోనే వచ్చింది.. సాధారణంగా గోదావరికి ఆగస్టులో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలై ఆరంభంలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగాయి. గత నెల 11న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో పాత రికార్డులు చెరిపేస్తూ జూలైలోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించడం మొదలెట్టారు. ఆ తర్వాత జూలై 16 వరకు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ 71.35 అడుగులకు చేరింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 25 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించారు. జూలై 17 నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. కానీ వరద విలయంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పక్కా ఇళ్లు సైతం ముగినిపోవడంతో అందులో ఉన్న మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెíషీన్, టీవీలు, పరుపులు, బట్టలు ఇలా సమస్తం పనికి రాకుండా పోయాయి. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో 17 వేలకు పైగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతోనే మిగిలాయి. డబ్బులకు కటకట వరదలు ముగిసినా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో కూలీలకు పనులు దొరకడం లేదు. పాడైన ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకూ డబ్బుల్లేక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వరద సాయంగా ప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, పప్పు, నూనెలతోపాటు దాతలు ఇస్తున్న సరుకులతోనే కుటుంబాలను నెట్టుకొçÜ్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ముంపు ప్రాంత ప్రజలకు ఆకలి బాధలు తప్పేలా లేవు. 1986, 1991లో గోదావరికి భీకరంగా వరదలు వచ్చినా.. ఆ రోజుల్లో అభివృద్ధి, ప్రజల జీవనశైలి సాధారణమే కాబట్టి కట్టుబట్టలతో ప్రాణాలు నిలుపుకున్నా ఆస్తినష్టం పెద్దగా లేదు. కానీ తాజా వరదలు ఇళ్లను, అందులోని సామగ్రిని నాశనం చేయడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఎప్పుడూ మోకాళ్లలోతు మించని వరద ఈసారి ఇంటి పైకప్పులను సైతం ముంచే స్థాయిలో రావడం, స్థానికులకు పీడకలగా మారింది. అందని సాయం వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయంగా సీఎం కేసీఆర్ రూ.10 వేల చొప్పున ప్రకటించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి 17వేలకుపైగా కుటుంబాలను గుర్తించారు. వీరి ఖాతాల్లో ఇటీవల రూ.10 వేలు జమ అవుతున్నాయి. అయితే బా«ధితుల గుర్తింపు సందర్భంగా చేపట్టిన సర్వేలో జరిగిన తప్పులతో ఇప్పటికీ వేలాది మందికి సాయం అందలేదు. దీంతో బా«దితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ ఎస్సీ కోడ్ మారడంతో చాలామందికి ఆర్థిక సాయం అందలేదు. సత్వరమే చర్యలు తీసు కుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈయన కొక్కిరేణి సాంబశివరావు. బూర్గంపాడు నివాసి. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను నిల్చున్న చోట ఓ ఇల్లు ఉండేది. అందులో భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. జూలైలో వచ్చిన వరదలకు ఇల్లు నామరూపాల్లేకుండా పోవడంతో కుటుంబానికి గూడు కరువైంది. బంధువుల ఇళ్లలో భార్యాపిల్లలను ఉంచాడు. కూలిపోయిన ఇంటిని ఎలా నిర్మించుకో వాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈమె పేరు ముదిగొండ చంద్రమ్మ. గోదావరి వరదలు ఊరిని చుట్టేసిన సమయంలో ఆమె ఇల్లు నాలుగు రోజులపాటు వరద నీటిలో నానింది. ఇప్పుడు పనికిరాకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇంట్లో ఉండలేక కూతురు వద్ద తలదాచుకుంటోంది. 1986, 1991లో వచ్చిన వాటి కన్నా మొన్న వచ్చిన వరదలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అంటోంది. డబ్బులు రాలేదు వరదల సమయంలో మా ఇల్లు పూర్తిగా మునిగి పాడైపోయింది. రిపేరు చేయించుకుందామంటే డబ్బుల్లేవు. సర్వేలో అ«ధికారులు మా పేరు రాసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వస్తున్నా. ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదు. – రమణయ్య, భాస్కర్‌నగర్, బూర్గంపాడు మండలం పని మానుకుని వచ్చా.. వరదలకు ఇల్లు కొట్టుకుపోయింది. వర్షాలతో అసలు పనులే దొరకడం లేదు. రెండు రోజుల నుంచే కూలికి పోతున్నా. సీఎం ఇస్తానన్న రూ.ç³ది వేలు మాకు రాలేదు. ఆ డబ్బు వస్తే కష్టకాలంలో కొంత ఆసరా ఉంటది. దాని కోసమే పని వదిలి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాను. –పేట్ల కుమారి, బూర్గంపాడు -
వరుస ఎదురుదెబ్బలు.. తలపట్టుకుంటున్న కమల్‌హాసన్
సాక్షి, చెన్నై: వరుస ఎదురుదెబ్బలు మక్కల్‌నీది మయ్యం వర్గాల్ని డీలా పడేలా చేశాయి. ఆ పార్టీకి ఏకంగా కొన్ని జిల్లాల్లో కార్యదర్శులే కరువయ్యారు. దీంతో ఈ పదవుల భర్తీ కోసం పార్టీ పరంగా ప్రకటన ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ నటుడు కమలహాసన్ మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంక్ ఆ పార్టీలో కొంత మేరకు ఉత్సాహాన్ని నింపాయి. ఆ తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. పార్టీ అధ్యక్షుడు కమల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలోని ముఖ్యులందరూ గుడ్ బై చెప్పడం మొదలెట్టేశారు. అనేకమంది జిల్లాల పార్టీకార్యదర్శులు ఇతరపార్టీల్లోకి వెళ్లి పోయారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కమల్ పార్టీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా కమల్ మళ్లీ అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక రోజు తమకు పట్టం కడుతారనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనేక జిల్లాల్లో పార్టీ కార్యదర్శులుగా వ్యవహరించేందుకు స్థానికంగా ఉండే ముఖ్యులు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే జేబులకు పడ్డ చిల్లుతో సతమతం అవుతున్న నేతలకు తమకు పదవులు వద్దు బాబోయ్ అని దాట వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సేవల్ని అందిస్తున్న కార్యకర్తల్ని ఆ పదవులకు ఎంపిక చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు కోసం దరఖాస్తులు చేసుకోవాలని మక్కల్ నీది మయ్య పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం కాంచీపురం, చెంగల్పట్టు, దిండుగల్, తంజావూరు, తిరువారూర్, తెన్కాశి, విరుదునగర్, తూత్తుకుడి, తదితర 15 జిల్లాలకు కార్యదర్శులు కావాలంటూ.. ప్రకటన ఇచ్చుకో వాల్సిన దుస్థితి ఏర్పడడం గమనార్హం. పార్టీకి సేవల్ని అందించే కార్యకర్తలు, కమల్ మీద నమ్మకం కల్గిన వాళ్లు దరఖాస్తులు చేసుకోవచ్చంటూ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రకటించడం విశేషం. చదవండి: Roja Selvamani: ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ? -
వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం.. తమ క్షేమ సమాచారాన్ని కన్న వాళ్లకు అందించేందుకు సెల్ ఫోన్ల చార్జింగ్ కోసం, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ప్రాణాలకు తెగించి బంకర్ల నుంచి బయటకు వచ్చి సమీపంలోని హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. ఖార్కీవ్ నేషనల్ మెడికల్ వర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఖార్కీవ్లో సుమారు 50 మెట్రో స్టేషన్లు ఉంటే ఒక్కో స్టేషన్లో సుమారు 600 మంది (అన్ని దేశాల వాళ్లు) తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బంకర్లు మొత్తం నిండిపోయాయని వాపోయారు. ధ్వంసమైన భవనాలు.. రోడ్లపై మిసైళ్ల దాడుల నడుమ భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు. గూగుల్ ఫామ్స్‌లో తమ సమాచారం పంపినా ఇప్పటివరకు ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ నెట్వర్క్ సమస్యతో పాటు బిజీ వస్తోందని చెప్పారు. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని, ఎంబసీ అధికారులు మాత్రం బోర్డర్ వరకు వస్తే ఇండియాకి చేరుస్తామని చెబుతున్నారని.. అడుగు బయట పెట్టలేని స్థితిలో బోర్డర్‌కు ఎలా చేరుకోగలమని వాపోతున్నారు. స్థానిక పరిస్థితులను బయట వారికి చేరవేయకూడదంటూ నిత్యం అనౌన్స్మెంట్లు ఇస్తున్నారని, బయటకు ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పకుండా సేఫ్టీ మెజర్స్ పాటించండి అంటూ సూచనలు చేస్తున్నారన్నారు. ఖార్కీవ్ నగరంలో తణుకు, అమలాపురం, కాకినాడ, ఖమ్మం, హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. అమ్మా.. కంగారు పడొద్దు! నేను ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం మేం బంకర్లలో సేఫ్‌గా ఉన్నాం. శుక్రవారం చాలాసేపు బాంబులు పేలాయి. ఉష్ణోగ్రత పడిపోయింది. మేం ఇండియాకి వెళ్లిపోతామంటే వర్సిటీ వాళ్లు అకడమిక్స్ పోతాయని భయపెట్టేశారు. ఇక్కడి విషయాలను ఎవ్వరికీ చెప్పొద్దని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. వీడియోలు.. ఫొటోలు తీయకుండా అడ్డుకుంటున్నారు. అమ్మా.. నాన్నా మీరు కంగారుపడొద్దు. త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుందని చెబుతున్నారు. – తమలం అభిజ్ఞ, తణుకు, పశ్చిమ గోదావరి -
ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం
గూడెంకొత్తవీధి: వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒక రకంగా సాహసాలు చేయాల్సి వస్తోంది. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం పెదవలసకు చెందిన ఉపాధ్యాయులు రోజూ బూదరాళ్ల మీదుగా కొయ్యూరు బాలుర పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ నీరు కల్వర్టు మీదికి రావడంతో అతికష్టం మీద బైక్‌ను ఒడ్డుకు చేర్చి పాఠశాలకు చేరుకున్నారు. ఇవీ చదవండి: Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతూ.. అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
జీమెయిల్ డౌన్ కలకలం : యూజర్లు గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం కలగడం కలకలం రేపింది. జీమెయిల్ సేవల్లో మరోసారి సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, ప్రధానంగా భారతీయ యూజర్లు ఇబ్బందులు పాలయ్యారు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం మానేశాయి. జీమెయిల్ లాగిన్ కాలేకపోవడంతోపాటు, లాగిన్ అయినా, ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్ నిలిచిపోవడం లాంటి సమస్యలను నివేదించారు. భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు జీమెయిల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్, గూగుల్ వాయిస్, గూగుల్ డాక్స్‌తో కూడా సమస్యలు తలెత్తడంతో గూగుల్ స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్‌డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో సాంకేతిక సమస్యకారణంగా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. User reports indicate Gmail is having problems since 1:12 AM EDT. https://t.co/pTPsDoNKxQ RT if you're also having problems #Gmaildown — Downdetector Canada (@downdetectorca) August 20, 2020 Gmail is down for more than an hour. Can't send attachments. Aaaaaaaaaaaahhhhhh#Gmail #gmaildown pic.twitter.com/hQSMNizX3K — Sourav Bhunia (@souravbhunia415) August 20, 2020 How long before its set right @gmail? #GmailDown pic.twitter.com/j1OQ8lz7AZ — Prashanth ಪ್ರಶಾಂತ್ 🇮🇳 (@pvaidyaraj) August 20, 2020 After 1 Hour #Gmail Down all employment person 😤😖😫😭😬 But, Unemployment Persons to cooooooolllll✌️🤞✌️ pic.twitter.com/1tumoosd8B — Karthi Durai (@akkmrc12) August 20, 2020 -
కువైట్‌లో విలవిల.. మూడు నెలలుగా పనుల్లేక
సంతబొమ్మాళి: బతుకు తెరువు కోసం విదేశాల కు వెళ్లిన వారు కరోనా ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి ఎప్పుకోవాలో తెలీక, బాధలు వినేవారు లేక ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోని గెద్దలపాడు, పిట్టవానిపేట, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, వజ్రపుకొత్తురు మండలం దేవునల్తాడ, పోలా కి మండలం గప్పెడుపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్ వెళ్లారు. వెల్డింగ్, రిగ్గర్ పనులు చేసుకుంటూ నాలుగు రా ళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది. కోవిడ్ ప్రభావంతో కువైట్‌లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి. దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు. పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టి నా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే.. మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పినా వారు తమ వల్ల కాదంటూ తెగే సి చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు. వారిది కూడా అదే మాట. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు ఎరుపల్లి లక్షుమయ్య, చింతలబాలకృష్ణ, చెక్క వేణునాథం, రట్టి చిన్నారావు, చెక్క రాజయ్య తదితరులు కోరుతున్నారు. కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం బతుకు తెరువు కోసం కువైట్ వచ్చాను. కరోనా ప్రభావంతో కంపెనీ పనులను ఆపేసింది. దీంతో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తే సింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఎరుపల్లి అప్పయ్య, గెద్దలపాడు, సంతబొమ్మాళి మండలం స్వదేశానికి రప్పించండి నాలుగు డబ్బులు సంపాదించడానికి దేశం కాని దేశం వచ్చాను. డ్యూటీ బాగానే ఉన్నా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయ్యాము. పనులు సాగక షెడ్డులోనే ఉన్నాము. మూడు నెలలుగా జీతాలు లేవు. స్వదేశానికి పంపించాలని బతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడు కుంటున్నాను. – రట్టి చిన్నారావు, పిట్టవానిపేట, సంతబొమ్మాళి మండలం ఇంటి నుంచి డబ్బులు పంపుతున్నాం కువైట్‌లో పనిచేయడానికి మా అబ్బాయి లక్ష్మయ్య వెళ్లాడు. మూడు నెలలుగా అక్కడ పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని, ఇ బ్బంది పడతున్నామని ఫోన్లో చెప్పాడు. దీంతో ఇంటి నుంచి డబ్బులు పంపాను, ఫ్లయిట్ టిక్కెట్ కోసం ఏజెంట్‌కు డబ్బులు ఇస్తే, రెండు వారాల తర్వాత మావల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వమే అదుకోవాలి. – వై.కుంతెమ్మ, బాదితుడు తల్లి, గెద్దలపాడు -
‘అది మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదం’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థికవేత్త రామచంద్ర గుహ అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ ఒక వారం సమయం ఇచ్చి లాక్డౌన్ ప్రకటిస్తే వలస కార్మికుల ఇక్కట్లు తగ్గేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ విభజన సమయంలో భయంకరమైన మత కలహాలు చెలరేగాయని, లక్షలాది మంది వలస వెళ్లారని గుర్తుచేశారు. హింస జరగకపోయినా ఇప్పటి పరిస్థితి మాత్రం దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని పేర్కొన్నారు. దీని దుష్పరిణామాలు సమాజంపై తప్పకుండా ఉంటాయన్నారు. కూలీలు ఇప్పట్లో మళ్లీ పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపబోరని అన్నారు. -
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్‌తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
ఆజం ఖాన్‌కు మరో షాక్
రాంపూర్: వివాదాస్పద సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ. భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా మరో షాక్ తగలింది. రాంపూర్‌లోని ఖాన్‌కు చెందిన లగ్జరీ రిసార్ట్ 'హంసఫర్' గోడనుఅధికారులు కూల్చివేశారు. కబ్జా ఆరోపణలతో బుల్డోజర్లు, జేసీబీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఉత్తరప్రదశ్ నీటిపారుదల శాఖ ఆజం ఖాన్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించారని ఆరోపణలతో అధికారులు ఈ చర్య చేపట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పేద రైతులనుంచి వ్యవసాయ భూమిని, ప్రభుత్వ భూములను స్వాహా చేశాడన్న కేసులో అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. మరోవైపు ఆజం ఖాన్ కొనుగోళ్లకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, చెల్లింపు రశీదులు, ఇతర ఒప్పందాల వివరాలను రెవన్యూ శాఖను కోరామని రాంపూర్ ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అనేక వందల కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై దర్యాప్తు చేయాల్సి వుందన్నారు. -
కష్టాల్లో ఒక స్నేహితుడుండాలి
సంజయ్ దత్‌ను జైల్లో పడేశారు. పెద్ద స్టార్. పైగా టాడా కేసులో ఉన్నాడు. అతడిని ఎవరైనా చంపితే అదొక గొడవ అని ఒంటరి గదిలో ఉంచారు. చీకటి... మాట్లాడే దిక్కు లేదు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. కేసు నడిచింది. ఏకె 56 రైఫిల్ ఉన్నందుకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటికే మూడేళ్లు జైల్లో ఉన్నాడు కనుక ఇంకో మూడేళ్లు ఎరవాడ జైల్లో గడపాలి. ముంబై బ్లాస్ట్స్తో కాని టెర్రిరిస్ట్ చర్యతో కాని సంజయ్ దత్‌కు ఏం సంబంధం లేదనీ కాని ప్రాణభయంతో అనుమతి లేకుండా ఏకె 56 దగ్గర ఉంచుకున్నందుకు మాత్రమే జైలు శిక్ష అని కోర్టు ప్రకటించింది. సంజయ్ దత్ ఎరవాడ జైలుకు చేరుకున్నాడు.ఈసారి నలుగురులో తిరిగేంత స్వేచ్ఛ ఉంది.కొంచెం ఊపిరి సలుపుకునే వీలు ఉంది.కాని అక్కడ సంజయ్‌కు ఏ జ్ఞాపకం వెంటాడింది.తల్లి ఏనాడో మరణించింది. తండ్రి కూడా గతించాడు.తోబుట్టువుల దగ్గర అన్ని రహస్యాలు మాట్లాడలేము.ఇక మిగిలిందల్లా స్నేహితులు.ఆ స్నేహితులే సంజయ్ దత్‌కు జైల్లో పదే పదే గుర్తుకొచ్చారు. దగ్గర కూర్చునే స్నేహితులు, ధైర్యం చెప్పే స్నేహితులు, గట్టిగా హగ్ చేసుకునే స్నేహితులు... మనిషి ఆస్తి ఐశ్వర్యాలు కోల్పోయి ఒంటరి కాడు. స్నేహితులను కోల్పోయినప్పుడే ఒంటరి అవుతాడు.జైల్లో ఉన్నప్పుడు అసలైన శిక్ష స్నేహితులను కలవకపోవడమే.‘సంజు’ సినిమాలో ఒక స్నేహితుడి పాత్ర ఉంటుంది. తెర మీద ఆ పాత్ర పేరు ‘కమలేష్ కన్హయ్యలాల్ కపాసి’. నటుడు వికీ కౌశల్ దానిని పోషించాడు.విక్కీ కౌశల్ గతంలో ‘మసాన్’ సినిమాతో ప్రేక్షకులకు తెలుసు. కాని ‘సంజు’ సినిమాతో ఎక్కువమందికి తెలిసి పెద్ద స్టార్ అయ్యాడు. ‘సంజు’ సినిమాలో ఈ పాత్ర చివరికంటా సంజయ్దత పాత్ర పోషించిన రణబీర్ కపూర్‌కు తోడుగా ఉంటుంది. అమెరికాలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేరినప్పుడు అతనికి బాసటగా నిలుస్తుంది. అతడి కష్టంలో అండగా నిలుస్తుంది. అలాంటి స్నేహితుడు లేకపోతే సంజయ్‌దత్ ఏమైపోయి ఉండేవాడా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు నిజ జీవితంలో ఈ పాత్ర ఎవరా అనే కుతూహలం కలుగుతుంది. అతని పేరు ‘పరేష్ ఘెలాని’. అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్. ఇతనిది సంజయ్ దత్‌ది ఒకే వయసు. సంజయ్ తల్లి నర్గిస్ వైద్యం కోసం ఆమెను అమెరికాలోని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఆమె కోలుకోవడం కోసం ఒక ఫ్యాన్‌గా అక్కడి వస్తాడు. అప్పుడే సంజయ్‌దత్‌కు పరిచయం అవుతాడు. ఆ పరిచయం చాలా మంచి స్నేహంగా మారుతుంది. అప్పటికే సంజయ్‌దత్ డ్రగ్స్‌కు బానిస అయి ఉంటాడు. అతణ్ణి ఆ మత్తు నుంచి బయటపడేయడానికి పరేష్ ఘెలాని చాలా ప్రయత్నించాడు. రిహాబిలేషన్ సెంటర్ నుంచి సంజయ్ పారిపోయి పరేష్ దగ్గరకు చేరుకున్నప్పుడు అతడే తిరిగి సెంటర్‌కు పంపాడు. ఏకే 56 ఉందన్న కారణంగా అరెస్టయినప్పుడు కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సంజయ్ కోసం తిప్పలు పడ్డాడు. అయితే మీడియా ఏకంగా ముంబై పేలుళ్లకు సంజయే సూత్రధారి అన్నంతగా కథనాలు వెలువరించడంతో అమెరికాలో ఎఫ్బిఐ తనను కూడా విచారిస్తుందన్న భయంతో సంజయ్‌కు దూరం అయ్యాడు. ఎరవాడ జైలులో సంజయ్‌కు ఎక్కువగా గుర్తొచ్చిన స్నేహితుడు అతడే. ఇన్నాళ్లకు మళ్లీ ‘సంజు’ సినిమాతో పరేష్ వార్తలలోకి ఎక్కాడు.ఈ సినిమా ఆ ఇద్దరి స్నేహాన్ని మళ్లీ బలపరిచింది.ప్రేక్షకులు ప్రతి మనిషికి ఇలాంటి స్నేహితుడుండాలి అని మెచ్చుకుంటున్నారు.ఆమిర్ ఖాన్ సినిమా చూసి పరేష్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్‌కు ప్రశంసలు కురిపించాడు. అన్నట్టు విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలో ఒక సాధారణ స్టంట్ మేన్ కుమారుడు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ‘సంజు’ సినిమాతో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ సంజు చూశారా? ఇంకా లే....దా! -
మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్
ముంబై : సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ చిక్కుల్లో పడ్డాడు. ఓ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న అతను.. ఓ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపోన్‌గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి హోలీ ప్రత్యేక ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా హోలీ ఆడుతూ పాపోన్ ఓ బాలిక ముఖానికి రంగు పూసి పెదాలపై ముద్దాడాడు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యింది. ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాగా, విమర్శలపై పాపోన్ ఇంతవరకు స్పందించలేదు. అస్సామీ సింగర్ అయిన పాపోన్ బర్ఫీ, సుల్తాన్, దమ్ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్ అయ్యాడు. -
బిల్లులకు నిరీక్షణ
ఊట్కూర్ : మండలంలో మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లైయినా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో నిర్మల్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా ఆర్‌డబ్లూఎస్, ఈజీఎస్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 638 మరుగుదొడ్లు మంజూరు మండలంలో 638 మరుగుదొడ్లు మంజూరు కాగా వాటిలో 508 మరుగుదొడ్లు నిర్మించారు. వివిధ కారణాలతో 130 పెండింగ్‌లో వున్నాయి. ఊట్కూర్‌లో 102, పెద్దపొర్లలో 42, చిన్నపొర్లలో 22, అవుసలోనిపల్లిలో 44, ఎడివెళ్లిలో 20 తదితర గ్రామాలలో లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నిర్మించుకున్న లబ్ధిదారులకు విడతల వారీగా ఉపాధిహామీ పథకం ద్వారా రూ.9 వేలు వారి ఖాతాలో జమచేయాల్సివుంది. 200 మందికి అందని బిల్లులు రెండేళ్లు గడిచినా బిల్లులు రాలేదు. మం డలంలో దాదాపు 200 మంది లబ్ధిదారులకు బిల్లులు రావాల్సివుందని, అధికారులకు అడిగితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి బిల్లులు మంజూరు చేయాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు. నిధులొస్తే ఇస్తాం లబ్ధిదారులు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంతమందికి బిల్లులు రావాల్సి ఉందో ఆన్లైన్లో ఖచ్చితంగా చూపడంలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. బిల్లులు ఇప్పటికీ అందలేదు. విడుదలైతే లబ్ధిదారులు ఎందరో తెలుసుకొని వారి ఖాతాల్లో జమ చేస్తాం. – జయమ్మ, ఏపీఓ, ఊట్కూర్ 18నెలలు గడిచింది మరుగుదొడ్డి నిర్మించి 18 నెలల అవుతుంది. బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా ఉంది. సంబంధత అధికారులూ పట్టించుకోవడంలేదు. మా గ్రామంలో 20మందికి రావాల్సి ఉంది. అధికారులు వెంటనే బిల్లులు మంజూరుచేయాలి. – డీలర్ వెంకటయ్య, పెద్దపొర్ల, , ఊట్కూర్ -
ప‘రేషాన్’!
మన్ననూర్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానంతో లబ్ధిదారులకు సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేష న్ షాపుల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీ సుకొచ్చింది. అయితే సిగ్నల్స్ అందక, లబ్ధిదారులు వేలిముద్రలు పడకపోవడంతో సరుకులు తీసుకెళ్లలేని పరిస్థితి నె లకొంది. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నా రు. ముఖ్యంగా బియ్యం రాకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. అయోమయంలో నిరక్షరాస్యులు కొంత మంది నిరక్షరాస్యులు సరుకుల విషయమై తెలిసిన వారిని అడిగితే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, తీరా మండల అధికారులు సిబ్బంది అందుకు సంబంధించి మాకెలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో డీలర్లు, సేల్స్మెన్లు రేషన్ కార్డు చూసి సరుకులు ఇచ్చేవారని కొత్తగా వచ్చిన పద్ధతితో సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 50శాతం సరుకుల పంపిణీ ఇప్పటివరకు లబ్ధిదారులకు 50శాతం సరుకులు పంపిణీ చేశారు. ఈనెల 26లోగా సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేలి ముద్రలు సరిపోవడం లేదు మిషన్‌లో వేలి ముద్ర సరిపోవడం లేదు. దాంతో బి య్యం, కిరోసిన్ ఇవ్వడం లేదు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. – చందాజీ, లబ్ధిదారుడు, మన్ననూర్ ఆందోళన అవసరం లేదు ఈ–పోస్ విధానంతో సమస్య ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇం దుకు సంబంధించి వీ ఆర్ఓకు అధికారం ఇ చ్చారు. వందలో ఒకరిద్దరికీ సొంత నిర్ణయంతో సరుకులు ఇప్పించే అధికారం ఉం ది. వచ్చేనెల నుంచి ఈ సమస్య రా కుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కృష్ణయ్య, తహసీల్దార్, అమ్రాబాద్ -
తాగునీటి కటకట
నేరడిగొండ : అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. నేరడిగొండ మండలంలోని రాజు గ్రామపంచాయతీ పరిధిలో గల ఇస్పూర్ చిన్నగోండుగూడలో సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 50 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థ అధ్వానంగా మారడంతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కట్లు గ్రామంలో శీతాకాలంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. అయినా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించిన దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన చేతిపంపు పనిచేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన సిడాం రాము రూ.3లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించినా తాగునీటి సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామ సమీపంలో చెలిమె ఏర్పాటు చేసుకొని కలుషిత నీటినే తాగాల్సి దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి విద్యుత్ సమకూర్చినా ఇంటికి విద్యుత్ తీసుకోవడానికి అనువుగా లేకపోవడంతో గ్రామస్తులందరు ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ తీసుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో అధ్వానంగా వీధులు గ్రామంలో పలు వీధులు అధ్వానంగా మారడంతో ఉండడానికి అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. వేసవికాలం వచ్చిందంటే తాగునీటి సమస్య జఠిలమవుతుందని, అధికారులకు విన్నవించినా మా గ్రామానికి ఇప్పటివరకు ఏ అధికారి వచ్చిన దాఖలాలు లేవని వారు వాపోతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి గ్రామంలో తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీరే దిక్కవుతుంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా తాగునీటిని అందించి ఆదుకోవాలి. – సిడాం జయవంత్‌రావు, గ్రామస్తుడు దినమంతా చెలిమెల వద్దే ఉదయం నుంచి సాయంత్రం వ రకు చెలిమెల వద్దే ఉంటున్నాం. గత్యంతరంలేక కలుషితమైన నీటినే తాగుతున్నాం. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలి. – సిడాం కవిత, గ్రామస్తురాలు సమస్య మా దృష్టికి రాలేదు ఇస్పూర్ చిన్నగోండుగూడలో ఉన్న తాగునీటి సమస్య మా దృష్టికి రాలేదు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇతర సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, ఈవోపీఆర్డీ, నేరడిగొండ -
రావత్ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహిత మిత్రుడు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు భారత ఎన్నికల కమిషన్ నుంచి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఆయన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో స్థిరాస్తుల విలువను అతి తక్కువ చేసి చూపించారనే ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించడమే అందుకు కారణం. ఎన్నికల అఫిడవిట్లో తన స్థిరాస్తుల విలువను తక్కువ చేపి చూపినట్లు రావత్‌పై డెహ్రాడూన్‌కు చెందిన ఎస్‌హెచ్ రఘునాథ్ సింగ్ నేగి ఫిర్యాదు అందిందని, ఇందులోని వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో ఆయన స్థిరాస్తుల విలువను అంచనా వేసి ఓ నివేదికను పంపించండంటూ ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు’ చైర్మన్‌కు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. అక్టోబర్ 20వ తేదీనే తనకు ఫిర్యాదు అందినప్పటికీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఎన్నికల కమిషన్ లేఖ రాసినట్లు తెల్సింది. రావత్ తన వయస్సును కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని మాజీ బీజేపీ సభ్యుడైన రఘునాథ్ సింగ్ నేగి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1951 నాటి ఎన్నికల ప్రాతినిథ్య చట్టంలోని 125 (ఏ) సెక్షన్ కింద జరిమానా విధిస్తారు. 2002 వరకు ఆరెస్సెస్‌లో ప్రచారక్‌గా పనిచేసిన రావత్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడని, ఆ కారణంగానే సరైన అర్హతలు లేకుండానే ఆయన్ని ఉత్తరాఖండ్ సీఎంను చేశారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఇంచార్జిగా అమిత్ షా ఉన్నప్పుడు ఆయనకు సహకరించిన నలుగురు నాయకుల్లో రావత్ ఒకరు. 2010లోనే రావత్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా రైతులకు పంపిణీ చేసే జీలుగు విత్తణాల్లో అవినీతికి పాల్పడ్డరంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రావత్ పేరు మొదటిసారి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన అవినీతి ఆరోపణల గురించి గట్టిగా నిలదీసింది. రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటైన దర్యాప్తు కమిటీ ఆయనపై రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో క్లీన్చిట్ ఇచ్చింది. -
కష్టాల్లో ‘పద్మావతి’!
మన చలనచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ చూసి అవి ఆమోదయోగ్యమో కాదో తేల్చడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఉంది. అది గీసే సవాలక్ష ‘లక్ష్మణరేఖల’పైనా, కత్తిరింపులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న తరు ణంలో ఆ పనుల్ని అంతకంటే మూర్ఖంగా, మొరటుగా చేయడానికి దేశంలో ఎక్కడి కక్కడ మూకలు పుట్టుకొస్తున్నాయి. సినిమాల్లో కథలెలా ఉండాలో, సంభాషణలెలా సాగాలో, పాటల్లో ఏం పదాలుండాలో ఇవి నిర్ణయిస్తున్నాయి. వాటిని అమలు చేస్తారా చస్తారా అని బెదిరింపులకు దిగుతున్నాయి. ‘పద్మావతి’ చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యా తులున్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’కి షూటింగ్ మొదలైనప్పటి నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చు కుంటే అక్కడ సైతం సెట్‌కు నిప్పు పెట్టారు. షూటింగ్ ప్రారంభించడానికి చాలా ముందే నిరుడు నవంబర్లోనే భన్సాలీ తన సినిమా ఇతివృత్తం గురించి వచ్చిన కథనాల తర్వాత ఏర్పడ్డ అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. పద్మావతి పాత్రను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకూ, ఆ పాత్రకూ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ ఉండబోవని ఆయన వివరించాడు. చిత్రం పేరు సైతం ముందనుకున్నట్టు ‘రాణి పద్మిని’ అనికాక ‘పద్మా వతి’ అని మార్చాడు. కానీ నిరసనలకు దిగేవారికి ఇదంతా పట్టలేదు. వారి బాణీలో బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తామని ఒకరు... భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే రూ. 5 కోట్ల బహు మతి ఇస్తామని మరొకరు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. కావాలంటే క్షత్రి యుల శౌర్యపరాక్రమాలు చూపుతూ సినిమాలు తీసుకోమని సలహాలిస్తున్నారు. వచ్చే నెల 1న చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటుంటే దాన్ని అడ్డు కోవడానికి ఈ బృందాలు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇంత వివాదానికి కారణమైన చిత్రం ఇతివృత్తానికి ఆధారం చరిత్రలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ఆధారం చేసుకుని పుట్టుకొచ్చిన కాల్పనిక గాథేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. 1250లో బెంగాల్‌లోని బీర్భూం జిల్లాలో పుట్టి 1316లో మరణించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్‌లోని చిత్తోర్ రాజ్యంపై దండెత్తడం, దాని పాలకుడు రాణా రతన్‌సింగ్ ఓటమిపాలవడం, రాజ్యం ఖిల్జీ వశం కావడం చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రకు జవ జీవాలు పోసిందీ... దాని చుట్టూ కమనీయమైన కాల్పనికతను అల్లి మహత్తర కావ్యంగా తీర్చిదిద్దిందీ మాలిక్ మహమ్మద్ జయాసి అనే ఒక ముస్లిం సూఫీ కవి. 1540లో... అంటే యుద్ధం జరిగిన 224 ఏళ్లకు ఆయన ఈ కావ్య రచనకు ఉప క్రమించాడు. మొదటిసారిగా అందులో రాణా రతన్‌సింగ్ భార్య పద్మావతి ప్రస్తా వన వచ్చింది. అంతకుముందు లిఖిత, అలిఖిత చరిత్రలో ఎక్కడా పద్మావతికి సంబంధించిన ఆధారాలు లేవు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్‌ఖుస్రో చిత్తోర్ కోట ముట్టడి గురించిన రాసిన పత్రాల్లో ఎక్కడా పద్మావతి గురించిన ప్రస్తావన లేదు. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకూ దాదాపు అయిదువందల సంవత్సరాల వ్యవధిలో మాలిక్ కావ్యానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో అనేక అనువాదాలొచ్చాయి. అనువదించే కవుల సృజనాత్మక శక్తి మేరకు ఆ కావ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్తగాదు. రామాయణ గాథ ఎన్ని దేశాల్లో ఎన్నెన్ని విధా లుగా ఉన్నదో... అందులోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ఎలా మార్పు చెందాయో వివరిస్తూ సుప్రసిద్ధ కవి ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది?’ పేరుతో చాన్నాళ్లక్రితం పుస్తకం రాశారు. ఇప్పుడు ‘పద్మావతి’ సినిమాపై నిప్పులు చెరుగుతున్న సంఘ్ పరివార్ పెద్దలు, రాజ్పుట్ కులానికి చెందిన కర్ణి సేన సభ్యులు పద్మావతి సృష్టికర్త ఒక ముస్లిం సూఫీ కవి అన్న సంగతిని మరుస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు చేసిన ప్రకటనల సంగతలా ఉంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సైతం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉన్నందున చిత్రం విడుదలను వాయిదా వేయాలని యోగి కేంద్రాన్ని కోరు తున్నారు. గడ్కరి అయితే సినిమాలు నిర్మించేవారు స్వేచ్ఛ నిరపేక్షమైనదేమీ కాదని, దానికి కూడా హద్దులుంటాయని తెలుసుకోవాలని హితవు చెబుతున్నారు. అకారణంగా నోరు పారేసుకోవడానికి, బెదిరింపులకు దిగడానికి ఎలాంటి హద్దులూ ఉండవు కాబోలు! ‘పద్మావతి’పై ఇంత పెద్దయెత్తున వివాదం చెల రేగుతున్న వేళ సుప్రీంకోర్టు వేరే కేసులో చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిర్మించిన ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ విడుదల కాకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ ఏ రకమైన సృజనాత్మక వ్యక్తీకరణలకైనా అడ్డుతగిలే ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు కింది కోర్టులకు సూచించింది. భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనదని, ఆ హక్కులో ఆషామాషీ జోక్యం తగదని పిటిష నర్కు స్పష్టం చేసింది. చట్టపరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో తన భావాలను వ్యక్తపరచవచ్చునని తెలిపింది. సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులు ఇంత స్పష్టంగా చెప్పడం ఇది మొదటిసారేమీ కాదు. అయినా వీధుల్లో ఛోటా నేతల వీరంగం ఆగడం లేదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నాయకులకు జ్ఞానోద యమూ కలగటం లేదు. ఇప్పుడు ‘పద్మావతి’ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. విజ్ఞతతో వ్యవహరించి ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి. -
దా‘రుణ’ స్థితి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ రైతు లాగానే అన్ని పనులూ చేస్తున్నా ఆ అన్నదాతకు వచ్చే రాయితీలు, సంక్షేమ పథకాలు పొందలేక చతికిలపడుతున్నారు. ప్రభుత్వ సాయం మాట పక్కన పెడితే కనీస గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కౌలు రైతులు దాదాపుగా 2లక్షలకు పైబడి ఉన్నట్లు రైతు సంఘాలు చెబుతుంటే అధికారులు మాత్రం యాభై వేల మందే ఉన్నట్లు లెక్కలు చూ పుతున్నారు. అయితే ఇందులో ఇప్పటివరకు లోన్ ఎలిజిబులిటీ (ఎల్ఈసీ) కార్డులు 18వేల మందికి,సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ (సీఓసీ) కార్డులు 12,500 మందితో కలిపి మొత్తం 30,500 మం దికి కార్డులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సుమారు 1.70 లక్షల కౌలుదారులు గుర్తింపు కార్డులకు నోచుకోక రాయితీలు పొందలేకపోతున్నారు. కౌలు రైతుల చట్టం 2011 ప్రకారం ఎలాంటి కార్డులు లేకున్నా భూ యజమాని రుణంతో సంబంధం లేకుండా రు ణం ఇవ్వాలి. కానీ అలాంటి చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కేసి గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే రుణం మంజూరు చేయాలని నిబంధన పెట్టడంతో ఏ ఒక్క కౌలు రైతు రుణం తీసుకోలేకపోతున్నారు. సరిపోని రుణం భూ యజమానుల మాదిరిగానే కౌలు రైతులకు పంట పండించేందుకు అయ్యే ఖర్చు రూ.30వేలు ఉంటుంది. ప్రభుత్వం అలా రుణం మంజూ రు చేయకుండా ఐదుగురు నుంచి ఏడుగురు కౌ లు రైతులు కలిపి ఒక ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి గ్రూప్‌కి రూ.70వేలు చొప్పున ఇస్తున్నారు. దీని ప్రకారం ఒక్కొక్కరికీ రూ.10వేలు మాత్ర మే అందుతోంది. అది దేనికీ సరిపోవడం లేదు. అప్పివ్వని బ్యాంకులు కౌలు రైతులకు రుణం మంజూరు చేయాలని క లెక్టర్ చెప్పినా కో ఆపరేటివ్ బ్యాంకులు తప్పితే మరే ఇతర జాతీయ బ్యాంకులు రుణం ఇవ్వ డం లేదు. రైతులు రుణాలు చెల్లించకుంటే బ్యాంకు అధికారుల పదోన్నతులు, ఇంక్రిమెం ట్ల మీద దాని ప్రభావం పడుతుందని పూర్తిగా రుణాల ఇచ్చేందుకే ఎగనామం పెట్టేశారు. దీం తో అప్పుల కోసం బయట వ్యక్తులను ఆశ్రయిం చడంతో ఇదే అదనుగా రూ.2కి పైగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఓ పక్క కౌలు చెల్లించాలి, మరో పక్క వడ్డీ చెల్లించాలి పంట బాగా పండితే సరే లేకుంటే మరణమే శరణ్యమవుతోంది. ప్రదక్షిణ చేయాల్సిందే నాకు సెంటు భూమి లేదు. ఏటా రెండు మూడు ఎకరాలు కౌలుకి తీసుకుని పండిస్తాను. దాదాపుగా పదేళ్లుగా ఇలాగే చేస్తున్నాను. ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇవ్వలేదు. కార్డు కావాలని ప్రతి రోజు రెవెన్యూ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. కార్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి రుణం తీసుకోలేపోయాను. – లబ్బ జగ్గారావు, కౌలు రైతు, కోమర్తి గ్రామం, నరసన్నపేట మండలం -
హాజరు ఒత్తిడి
తణుకు టౌన్: బయోమెట్రిక్ హాజరు పలు ప్రభుత్వ శాఖల్లోని క్షేత్ర స్థాయి ఉద్యోగులకు సంకటంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఏఎన్ఎంలకు ఈవిధానం అమలు చేయవద్దని ఆశాఖ కమిషనర్ ఆదేశించినా జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పని చేసే ఏఎన్ఎంలు, సూపర్వైజర్లుగా పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్ సెంటర్ల్లో పని చేసే వైద్య సిబ్బందిలో ఎక్కువ మంది ఫీల్డ్ వర్క్ చేసే వారే. వారిలో ఆరోగ్య కార్యకర్తలు, పురుష, మహిళా కార్యకర్తలు ఎక్కువగా వున్నారు. జిల్లాలో మొత్తం 81 పీహెచ్‌సీలు, వాటికి అనుబంధంగా 680 ఆరోగ్య ఉప కేంద్రాల్లో సుమారు 800 మంది ఏఎన్ఎంలు, 200 మంది సూపర్వైజర్లు పని చేస్తున్నారు. వీరంతా వారి పరిధిలోని పిల్లలు, బాలింతలు, గర్భిణిలకు వ్యాక్సిన్లు వేయటం, గర్భిణిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి యోగ క్షేమాలను రికార్డు చేసి పీహెచ్సీ వైద్యాధికారికి నివేదించాలి. అయితే వీటిలో ఎక్కువ రిస్క్, అత్యవసర సేవలు అవసరమైన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలి. ఈ క్రమంలో గర్భిణిలను జిల్లాలోని వివిధ ఏరియా ఆసుపత్రులకుకానీ, ఏలూరు, కాకినాడలలోని జనరల్ ఆసుపత్రులకుగానీ కేసులను రిఫర్ చేసినప్పుడు సంబంధిత ఏఎన్ఎంలు బయోమెట్రిక్ హాజరే వేసుకోవాలా? రోగి కూడా వెళ్లాలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినా సర్వర్లు సరిగా పనిచేయక పోయినా, పంచాయతీ సిబ్బంది సరిగా స్పందించకపోయినా గంటల తరబడి బయోమెట్రిక్ యంత్రాల వద్ద పడిగాపులు కాయవలసి వస్తోందని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పని చేసే గ్రామంలో మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ గ్రామంలో సర్వర్లు పని చేయకపోతే పక్క గ్రామంలో గానీ, పీహెచ్సీలోగానీ బయోమెట్రిక్ హాజరు వేసేవారు. ప్రస్తుత నిబంధనలతో వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. రోగికి అత్యవసర వైద్యం కోసం బయటకు వెళ్తే ఆరోజుకు హాజరు లేనట్లేనని పేర్కొంటున్నారు. రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు వీఆర్వో, సర్వేయర్, డిప్యూటి తహసీల్దార్, తహసిల్దార్‌కు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపునిస్తూ వారం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేసే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నిబంధనలు కఠినం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని మినహాయించాలి బయోమెట్రిక్ హాజరు నుంచి వైద్య ఆరోగ్య శాఖలోని క్షేత్ర స్థాయి ఉద్యోగులను ముఖ్యంగా ఏఎన్ఎం, సూపర్వైజర్లకు మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే వారిపై అనేక పని భారాలు మోపారు. క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులు రోగులకు సేవలందించాలో, బయోమెట్రిక్ హాజరు కోసం వేచి చూడాలో తెలియక సతమతమవుతున్నారు. – కె.జయమణి, జిల్లా అధ్యక్షులు, వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంఘం -
ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత
మెదక్‌రూరల్: బోరుబావులను పూడ్చేందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, యువత, అధికారులు ముందుకు వçస్తున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామ సమీప పొలంలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోర్ వేసిని నీరుపడని గుంతలను వెంటనే పూడ్చివేయాలని సూచించారు. పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని చిత్రియాల్‌లో నిరుపయోగంగా ఉన్న బోరు గుంతలను ఎస్ఐ సందీప్‌రెడ్డి ,గ్రామ పోలీసు ఇన్చార్జి ఇమ్మానియల్ ఆధ్వర్యంలో పోలీసులు పూడ్చివేశారు. బోరు తవ్వినా నీరు పడకపోవడంతో చాలా మంది రైతులు వాటిని అలాగే వదిలేశారు. ఈ సంధర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రమాదకరంగా ఉన్న బోర్లను రైతులు వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదకరంగాఉన్న బోరుబావులను పూడ్చివేయాలని హవేళిఘణాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మంగళవారం ఎస్ఐ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తొగిట, కూచన్‌పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీరు పడని బోరుబావుల పూడ్చివేత చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. అంతకు ముందు హవేళిఘణాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని పూడ్చివేశారు. బైక్ ర్యాలీలో ఎంపీటీసీ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు సాయిలు, రాంచంద్రారెడ్డి, మంగ్యనాయక్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): బోరుబావుల మూసివేతపై ప్రతిఒక్కరూ స్పందించాలని ఎస్ఐ విజయరావు, సర్పంచ్ జంగం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట బస్టాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోఉన్న ప్రమాదకరంగా ఉన్న బోరుబావులను మట్టితో పూడ్చివేశారు. ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోరుబావులను పూడ్చివేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుభాష్‌గౌడ్, ఈఓ నవీన్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
ఇబ్బందులే అసలు పరీక్ష
ఏలూరు సిటీ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాం తంగా ముగిసింది. అడుగడుగునా సమస్యలు, ఇబ్బం దులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా మారాయి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అవగాహన కల్పించకపోవటంతో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్ని ఇబ్బందులో.. జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్‌బాబు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్ఆర్ అటానమస్, సీఆర్ఆర్ ఉమెన్స్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. గోడు చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. -
షేల్ గ్యాస్ తవ్వకాలతో అనర్థాలు
భీమవరం : షేల్ గ్యాస్ తవ్వకాల వల్ల ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రొఫెసర్ కె.బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన షేల్ గ్యాస్ వెలికితీత వ్యతిరేక సభలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. షేల్ గ్యాస్‌ను వెలికితీసేందుకు నాలుగు కిలోమీటర్ల పొడవు ఆ తర్వాత అడ్డంగా పైపులు వేస్తారని దీనికిగాను వివిధ రకాల రసాయనాలతో కూడిన నీటిని పదివేల పౌండ్ల ఒత్తిడితో భూమిలోనికి పంపి షేల్ (నాపరాయి)ని పగులగొడతారన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. షేల్‌గ్యాస్ తవ్వకాలకు అవసరమైన అధునాతన పరిజ్ఞానం ఓఎన్జీసీ వద్ద లేదన్నారు. 3 లక్షల ఎకరాలకు ముప్పు మూడు జిల్లాల్లో సుమారు 70 వేల బావులను తవ్వడానికి రంగం సిద్ధం చేశారని, ఒక్కో బావి వద్ద సుమారు నాలుగు ఎకరాల పంటకు నష్టం తప్పదని, దీంతో సుమారు 3 లక్షల ఎకరాలకుపైగా పంట కోల్పోవాల్సి వస్తుందని బాబూరావు చెప్పారు. షేల్ గ్యాస్ తవ్వకాలకు నీరు ఎక్కువగా ఉపయోగించాల్సి రావడంతో నీటి కొరత ఏర్పడుతుందన్నారు. షేల్‌గ్యాస్ తవ్వకాలకు ఓఎ¯ŒSజీసీ ఇచ్చిన నివేదికలు సక్రమంగా లేవని దీనివల్ల విపరీతమైన భూతాపం పెరిగిపోయే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు ఇచ్చే కమిటీలు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారాయని, కమిటీలపై ప్రజాప్రతినిధులు పెత్తనంతో ప్రమాదకరమైన వాటికి కూ డా అనుమతులు వస్తున్నాయని బాబూరావు విమర్శిం చారు. మూడు జిల్లాల్లో షేల్‌గ్యాస్ ఆరు లక్షల చదరపు ఘనపుటడుగులు మాత్ర మే ఉందని గుర్తించారని ఇది చాలా తక్కువన్నారు. పంటల దిగుబడిపై ప్రభావం షేల్ గ్యాస్ వెలికితీసే క్రమంలో వెలువడే విషవాయువుల కారణంగా డ్రిల్లింగ్ ప్రాంతంలోని 20 కిలోమీటర్ల వరకు పం టల దిగుబడి ఘోరంగా పడిపోతుందని ప్రొఫెసర్ జి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ చర్యల ను ప్రతి ఒక్కరూ అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాలు కూడా షేల్గ్యాస్ను వ్యతిరేకించాయని స్పష్టం చేశారు. ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి మర్ల విజయకుమార్, సీపీఐ రాష్ట్ర సహాయ కా ర్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నార్ల వెం కటేశ్వరరావు, నెక్కంటి సుబ్బారావు, ఎ ం.సీతారామ్‌ప్రసాద్, చెల్లబోయిన రం గారావు, లంక కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రాణసంకటం
డబ్బుల్లేక జనం విలవిల రోగులు, వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దయనీయం జనంతో కిక్కిరిసిపోతున్న బ్యాంకులు చాలాచోట్ల ‘సర్దుబాటు’తో సరి మెరుగు కాని ఏటీఎంల పరిస్థితి అనంతపురం నగరానికి చెందిన ఈ పెద్దాయన పేరు వెంకటేశులు. ఉద్యోగ విరమణ చేసి ఐదారేళ్లయ్యింది. ఇటీవల ప్రమాదంలో కాలు దెబ్బతినడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెన్షన్ డబ్బుతోనే సంసారం గడవాలి. ఇప్పుడు చికిత్సకు కూడా డబ్బు అవసరమైంది. ఆయనొస్తే కానీ విత్‌డ్రా చేసుకోలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడి వెంకటేశులును స్థానిక సాయినగర్ ఎస్బీఐకి తీసుకొచ్చారు.కొంత నగదు డ్రా చేసుకుని వెళ్లారు. ఏటీఎంలు పనిచేసి ఉంటే తమకీ పరిస్థితి వచ్చేది కాదని వారు వాపోయారు. ప్రజల కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఎప్పటిలాగే సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. చాలా వరకు ఏటీఎంలు పనిచేయలేదు. పనిచేసిన వాటి వద్ద చాంతాడంత క్యూలు కన్పించాయి. పెద్ద నోట్లు రద్దు చేసి సోమవారం నాటికి 27 రోజులైనా సమస్య ఏమాత్రమూ తీరలేదు. ఇంకెన్నాళ్లు కొనసాగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఇంట్లో మంచానపడ్డ వారు, వివిధ జబ్బులతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వికలాంగులు, అంధులు, వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ పింఛన్ సొమ్ము కోసం ప్రాణాలకు తెగించి..బ్యాంకుల వద్దకు రావాల్సి వస్తోంది. పేదలు, రైతులు, మహిళలు, గర్భిణులు, బాలింతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సివస్తోంది. నగదు కొరతతో సర్దుబాట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీవ్రంగా ఉంది. సరఫరా అవుతున్న అరకొర నగదు ఒకట్రెండు రోజుల్లోనే ఖాళీ అవుతోంది. దీంతో ఎక్కడా ఒకేసారి రూ.24 వేలు విత్‌డ్రా ఇచ్చే పరిస్థితి లేదు. రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలతో సర్దుబాటు చేసి పంపుతున్నారు. చిన్న డినామినేషన్ నోట్లు తక్కువగా ఉండటంతో 80 శాతం వరకు రూ.2 వేల నోట్లతో సరిపెడుతున్నారు. రోజుకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఉంటే కాని అందరికీ న్యాయం చేయలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు మాత్రమే దినసరి లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. ఎస్బీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. ఆంధ్రా, సిండికేట్, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్, ఎస్బీహెచ్ లాంటి ప్రధాన బ్యాంకుల్లో సైతం నగదు కొరత కొనసాగుతోంది. వీటికి సంబంధించి సోమవారం కూడా దాదాపు 30 శాఖల్లో 'నోక్యాష్', 'క్యాష్ నిల్' బోర్డులు తగిలించారు. యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా లాంటి కొన్ని ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో పరిస్థితి బాగానే ఉన్నా, ఇండస్ఇండ్, ఇండియన్, బ్యాంకు ఆఫ్ ఇండియా, దేనా, పంజాబ్నేషనల్ బ్యాంకు, విజయా, కరూర్ వైశ్యా, కొటక్ మహింద్రా బ్యాంకుల్లో నగదు కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరవధికంగా మూతబడ్డ ఏటీఎంలు సోమవారం కూడా అనంతపురం నగరంలో ఏటీఎంలు పనిచేయలేదు. కౌంటర్ల ద్వారా నగదు ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకర్లు సాహసించడం లేదు. సాయంత్రం, రాత్రి వేళల్లో 10 నుంచి 15 ఏటీఎంలలో కొంత నగదు పెడుతుండగా, అది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలు 212 ఉండగా, నాలుగైదు మాత్రమే పనిచేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 556 ఏటీఎంలకు గానూ సోమవారం 20కి మించి పనిచేయలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నగదు రహితంపై అవగాహన నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు, అధికారులు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే..వీటికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. ఉన్నఫళంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, స్మార్ట్ఫోన్ల వాడకం ఇబ్బందే అని ప్రజలు అంటున్నారు. స్వైప్‌మిషన్లు, రకరకాల యాప్‌లు ఉపయోగించి బ్యాంకింగ్ సేవలు పొందడానికి చదువుకున్నవారు, అధికారులు, బ్యాంకర్లే అవస్థలు పడుతుండటంతో ఇక రైతులు, పేదలు, సామాన్య వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.