Tummala Nageshwara Rao
-
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుర్చీల కొట్లాట: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుర్చీల కొట్లాట జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు.మంత్రి తుమ్మల మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుర్చీల కొట్లాట జరుగుతోంది. మీ కుర్చీల కొట్లాట మధ్యలోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు. బీజేపీ అధ్యక్షుడిగా ఈటల అయినా మరెవరినైనా పెట్టుకోండి అంతేకానీ మీ గురించి మాకెందుకు?. నన్న విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతాను. గత ప్రభుత్వంలో కూడా నేను ఉన్నాను. మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు అనేది నాకు తెలుసు.మూసీ ప్రక్షాళన చెయ్యడానికే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పెట్టారు కదా?. మూసీ ప్రక్షాళన చెయ్యకుండా.. మూసీ అభివృద్ధి ఎలా చేస్తా అనుకున్నారు?. బీఆర్ఎస్ నేతలకు కుర్చీ ఉంటే ఒకలా?.. కుర్చీ పోతే మరోలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడం కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన డీపీఆర్‌ను నేను ఇంకా చూడలేదు. దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ మంచి చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదా?. 28 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసాం.. కొందరివి ఆగిపోతే హరీష్ రావు పెడబొబ్బలు పెడుతున్నారు. జగదీష్ రెడ్డి ఖబడ్దార్.. మూసీ నది పరిహావాక ప్రాంతంలో తిరిగితే బడితె పూజే. నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధులను.. మూసీ పరివాహక ప్రాంత రైతులు చెట్లకు కట్టేయండి. ప్రభుత్వం మూసీ నదిని బాగుచేస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు అడ్డు పడుతున్నారు. డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.మూసీ కింద నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల భూమి సాగుచేస్తున్నారు. కానీ, మురికి నీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ హాయాంలో మూసీ అభివృద్ధికి చేసింది ఏంటి?. బఫర్ జోన్లో ఇళ్ళు లేని వారి వీడియోలు తీసి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. హైదరాబాద్ పరిధిలో వరదలకు కబ్జాలే కారణం. కబ్జాలకు బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తోంది. హరీష్‌రావు అగ్గిపెట్టె పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన ఎవరిని బలి తీసుకుంటాడో అని భయపడుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్‌లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
కాంగ్రెస్ సై! ఖమ్మం స్థానంపై ప్రత్యేక దృష్టి..
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన వరుస భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం హాజరు కానున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సత్తా చాటేలా.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. హడావుడి ముగియగానే పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలోనూ సత్తా చాటాలని యోచిస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేడర్‌ను సమాయత్తం చేసేలా సన్నాహక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నేపథ్యాన నేతలు, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌కు అండగా.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచిన సమయంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని గెలుపు సాధించింది. ప్రతీ ఎన్నికల్లోనూ ఒకటి, రెండు సీట్లు మినహా.. కాంగ్రెస్, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలే విజయం సాధిస్తూ వచ్చాయి. అదే తరహాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్నప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రేణుకా చౌదరి.. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేలా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెంలో పొత్తుతో సీపీఐ విజయం సాధించడంతో.. లోక్‌సభ స్థానంలోనూ గెలుపు ఇక నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ భావిస్తోంది. సన్నద్ధం! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలను రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయనతో పాటు మంత్రులు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ ఇచ్చిన హామీలు, అమలవుతున్న తీరు.. మిగతా హామీలు ఎప్పటి నుంచి అమలవుతాయనే అంశాలపై ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను కేడర్‌కు అవగాహన కల్పిస్తారు. అంతేకాక నియోజకవర్గాల వారీగా బలాబలాలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేకం.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలోనే బలీయమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికలతో మరింత పట్టు సాధించినట్లయింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరగా పార్టీకి సంస్థాగతంగా ఉన్న పట్టుకు వారి బలం కూడా తోడు కావడంతో తిరుగులేని విజయాన్ని కై వసం చేసుకుంది. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క ప్రభావం చూపించడంతో కాంగ్రెస్‌కు తిరుగులేకుండా పోయింది. ఇదే ఊపును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ముగ్గురు మంత్రులపై పడింది. ఇవి చదవండి: అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. -
ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యాంటీలు అమలు అవుతాయి: మంత్రి ఉత్తమ్
నల్లగొండ: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగనున్న ప్రజాపాలన కార్యక్రమ సన్నాహకాల్లో భాగంగా నల్లగొండలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో మంగళవారం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామ, వార్డు సభల సందర్భంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. దరఖాస్తులు నింపేందుకు.. స్వీకరణకు హెల్ప్ డెస్క్‌లు, ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే బృందాల సంఖ్య పెంచాలన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలు పెడతామన్నారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారంటీల అమలు అవుతాయని చెప్పారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో జిల్లాకు అన్యాయం జరిగిందని పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందలేదన్నారు. ఈ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుందన్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కఠినంగా శిక్షిస్తామన్నారు. రేషన్ సరఫరాను ప్రక్షాళన చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలను పేదలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ప్రజాపాలన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, మంచినీటి సౌకర్యం, కుర్చీలు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో 151 బృందాలను ఏర్పాటు చేశామని, సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సీహెచ్.ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలో 58 టీమ్‌లు ఏర్పాటు చేసామని, దరఖాస్తుల స్వీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జెండగే మాట్లాడుతూ జిల్లాలో పక్కా ఏర్పాట్లతో ప్రజా పాలన విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని, మొత్తం 51 టీమ్‌లతో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, నలమాద పద్మావతి, నల్లగొండ ఎస్పీ అపూర్వరావు, యాదాద్రి డీసీపీ రాజేష్‌చంద్ర, సూర్యాపేట ఏఎస్పీ నాగేశ్వర్రావు, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, భాస్కర్‌రావు, వెంకట్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తుమ్మల.. 30 లేఖల సంగతి మర్చిపోతే ఎలా?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొద్ది రోజుల క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఖమ్మంలో తన గెలుపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కూడా మలుపు అవుతుందని ఆయన అంటున్నారు. ఖమ్మం సరిహద్దు గ్రామాల నుంచి, ఖమ్మం నుంచి వచ్చిన టీడీపీ అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కూడా ఆయన టీడీపీ ఖమ్మం ఆఫీస్‌కు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించి తన రాజకీయ ప్రస్తానం గురించి మాట్లాడారు. తనకు ఎన్టీ రామారావే మంత్రి పదవి ఇచ్చారని, కేసీఆర్‌కు కూడా తానే చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఇప్పించానని ఆయన అన్నారు. కేసీఆర్ తనకు పదవి ఇచ్చేదేమిటి? అని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తన సేవల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన మెడలో వేసుకున్న పచ్చ కండువాను చూపుతూ, దీనివల్లే తాను పైకి వచ్చానని చెప్పారు. ఈ విషయాలు ఎన్ని చెప్పినా ఫర్వాలేదు. కానీ, ఆయన గెలిస్తే ఏపీ రాజకీయాలపై ఎందుకు ప్రభావం పడుతుంది? అక్కడ ఎందుకు మలుపు వస్తుంది? అన్నదాని గురించి వివరించి ఉంటే బాగుండేది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీచేయకుండా దూరంగా ఉంది. దీంతో, ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం కోసమే అలా చేశారని ఆయన రహస్యం చెప్పేశారు. దానిని నిజం చేస్తూ తుమ్మల మరికొందరు ప్రకటనలు చేయడం, టీడీపీ జెండాలు కూడా మెడలో వేసుకుని సభలలో పాల్గొనడం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, చంద్రబాబుకు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీవారు మద్దతు ఇస్తే స్వాగతిస్తామని అన్నారు. అలాగే చంద్రబాబును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్నిసార్లు పొగుడుతూ తన స్వామి భక్తి చూపుతున్నారు. కోదాడలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కూడా టీడీపీ జెండాలు కనిపించాయి. ఇలా ఆయా చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీడీపీవారు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన ఓపెన్‌గానే కాంగ్రెస్‌కు సపోర్టు ఇచ్చి ఉండవచ్చు. గతసారి కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేశారు. రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయినా జనం ఆదరించకపోవడంతో ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను గాలికి వదలివేశారు. 2023 తెలంగాణ ఎన్నికలలో కొత్త స్ట్రాటజీతో ఆయన ఎన్నికలలో పోటీచేయకుండా కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారు. నేరుగా కాంగ్రెస్‌కు అండగా ఉన్నానని చెబితే బీజేపీ ఎక్కడ కన్నెర్ర చేస్తుందో అన్న భయం కావచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ చక్రం తిప్పి, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఆయన ఆలోచన అని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు తన మిత్రుడో, లేక వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నట్లు ఆయన దత్తపుత్రుడో కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంటే అటు బీజేపీతో కూడా రాయబారం జరపడానికి ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఈ విన్యాసాలు ఎన్ని చేసినా ఆయన ఇష్టం. కానీ, తుమ్మల చేసిన ప్రకటనను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక, ఏపీలో టీడీపీకి ఉపయోగపడతామని చెబుతున్నట్లు అనుకోవాలా?. రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల టీడీపీలో ఓటమి చెంది రాజకీయంగా వెనుకబడితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను దగ్గరకు తీసి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు అభ్యర్ధిని చేసి గెలిపించారు. కానీ, సాధారణ ఎన్నికలలో తుమ్మల ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన హవా తగ్గింది. దాంతో ఆయన అసంతృప్తి చెంది కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. పదవులపై ఆసక్తి లేదంటూనే ఆయన తనను ఆదరించిన టీఆర్ఎస్ను కాదని ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో ఒకటి తప్ప అన్ని స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది. దానిని కూడా దృష్టిలో ఉంచుకునే తుమ్మల కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 2018 ఎన్నికల సమయంలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసినప్పుడు కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించిన వీడియో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణను పచ్చని బంగారు రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని అని గంభీరంగా ప్రసంగించారు. ఇప్పుడు అదే తుమ్మల.. కేసీఆర్ పాలన అంత దరిద్రపు పాలన చూడలేదని అంటున్నారు. అంతేకాదు.. 2018లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీల కూటమిని మాయ కూటమిగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్దికి, ప్రత్యేకించి ఖమ్మం అభివృద్దిని అడ్డుకుంటున్న పార్టీగా తెలుగుదేశంను, అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడును విమర్శిస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలను అన్యాయంగా లాక్కున్న పార్టీ టీడీపీ అని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆ రోజున ఆరోపించారు. ఈ రోజేమో టీడీపీ వల్లే తాను అది సాధించాను.. ఇది సాధించాను అంటూ స్పీచ్ ఇస్తున్నారు. అదేదో చెప్పుకుంటే సరే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా తన గెలుపు ఏపీ రాజకీయాలకు మలుపు అవుతుందని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం?. ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తామంతా కలిసి ఇబ్బంది పెడతామని చెబుతున్నారా?. గతంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కుట్ర చేసి ఆయనను పదవీచర్యుతుడిని చేసి చంద్రబాబుతో కలిసి అందలం ఎక్కిన అనుభవాన్ని గుర్తు చేసుకుని అలా ఏపీలో మళ్లీ చేయాలని ఆలోచిస్తున్నారా?. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, రాదో తెలియక ముందే తుమ్మల వంటి సీనియర్లు ఇలా మాట్లాడితే ఎలా విశ్లేషించాలి?. కాంగ్రెస్‌లో చేరిన మాజీ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగానే చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తూ, భవిష్యత్తు ఏపీ ఎన్నికల్లో ఆయనకు సహకరించాలని, అక్కడి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాగానే, బాధ్యతలు కొన్ని అప్పగించి చివరికి ఆయన తన కొంప తానే ముంచుకున్నారు. కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ అంటేనే తుమ్మలకు పడేది కాదు. వారితో ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ పోరాటాలు చేశారు. చివరికి తానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన తన సొంత రాజకీయం కోసం ఏమైనా చేసుకోవచ్చు. కానీ, ఇతర రాష్ట్రాల రాజకీయాలలో కూడా వేలుపెడతామని చెబితే ఆయనకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పైగా చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిన సంగతి ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల అంతిమంగా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందో, లాభం జరుగుతుందో కానీ.. ఇప్పటికైతే తుమ్మల చేసిన ప్రకటన ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్రమత్తం అవ్వవలసిన అవసరం తెలియచేసింది. ఎన్టీ రామారావు మాదిరి సీఎం వైఎస్ జగన్ అమాయకపు రాజకీయ నేత కాదు. ఆయన ఇప్పటికే అనేక డక్కా, మక్కీలు తిన్న నేత. చంద్రబాబు వేసిన అనేక కుట్రలను చేధించిన నాయకుడు. తిరుగులేని ఆధిక్యంతో 151 సీట్లను గెలిచి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చిన శూరుడు. చంద్రబాబో, తుమ్మలో, మరొకరో వేసే ఎత్తుగడలను సీఎం జగన్ తేలికగానే తిప్పికొట్టగలరని వేరే చెప్పనవసరం లేదు. - కొమ్మినేని శ్రీనివాసరావు -
హాట్ సీట్.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్!
వారిద్దరూ పాత ప్రత్యర్థులే. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఒకరు ప్రస్తుత మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఇప్పుడిద్దరూ ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. లోకల్‌గా ఓటర్లను ప్రభావితం చేయగల తమ సామాజికవర్గం మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి తను మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లి బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఏకంగా టీడీపీ ఆఫీస్‌కు వెళ్ళి పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మాటలతూటాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 18 వేల ఓట్లు ఉండగా...ఇందులో 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా...ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారుతున్నాయి. అటు గులాబీ పార్టీ..ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ కమలం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడంతో...బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు చేజారకుండా ఇద్దరు అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంగటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంటి చికిత్సకోసం లభించిన తాత్కాలిక బెయిల్ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినా...ఖమ్మంలోని కమ్మ నేతలు మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు తన పాత పార్టీ బాస్, తమ కుల నేత చంద్రబాబుకు బెయిల్ వచ్చినందుకు ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి టిడిపి జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన జిల్లాలోని టిడిపి కార్యాలయానికి ఎప్పుడూ రాలేదు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి తుమ్మలను ఆహ్వానించడంతో ఆయన అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ కార్యాలయమే అని చెప్పారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా..టీడీపీ శ్రేణుల సంతోషంలో భాగస్వామిని కావాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కేరింతలతో రానున్న 30 రోజులూ తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అటు బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సైతం చంద్రబాబు బెయిల్‌పై విడుదలైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీదున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చారని ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాను ఖండించినట్లు చెప్పుకున్నారు. రెండు సార్లు విజయం సాధించి..మూడోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పువ్వాడ అజయ్ తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పడం మానేసి.. చంద్రబాబు భజన చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పదేళ్ళ నాడు ఆరు వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఆజయ్‌కుమార్ మీద ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎలాగైనా ఆయన మీద గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అదవిధంగా తుమ్మలను మరోసారి ఓడించి..హ్యాట్రిక్ సాధిస్తానని పువ్వాడ చెబుతున్నారు. రెండు బలమైన పార్టీలు..ఇద్దరు పాత ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటుండటంతో ఖమ్మం నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది. ఇద్దరూ తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...తమ సామాజికవర్గమైన కమ్మవారి మద్దతు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఖమ్మం ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. -
తుమ్మల.. నీ వల్ల తెలంగాణ రాలేదు: మంత్రి పువ్వాడ ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఇప్పటికే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితులు ఉండేవని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి పువ్వాడ అజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌పై తుమ్మల వ్యాఖ్యలు సరికాదు. తుమ్మల నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం. గత ఎన్నికల్లో నా చేతిలో ఓడిపోయిన తర్వాత రాజకీయ అవకాశం కల్పించకపోతే ఈనాటికి తుమ్మల రిటైర్ అయ్యేవారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు తుమ్మల. నువ్వు లేకపోతే తెలంగాణ రాలేదా?. నీ వల్ల తెలంగాణ రాలేదు ఈ విషయం గుర్తు పెట్టకో. జై తెలంగాణ అన్న వారిని జైలులో పెట్టించావు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వేమైనా సీఎంవా తుమ్మల? ఇదే సమయంలో, తుమ్మల మాటలు నమ్మశక్యంగా లేవు. టికెట్లు ఇప్పించడానికి నువ్వేమైనా పార్టీ అధినేతవా లేక ముఖ్యమంత్రివా?. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ అర్ధ రహితం. కందాలకు కేటీఆర్ డబ్బులు ఇప్పించారన్న మాటలు హాస్యాస్పదం. మమతా ఆసుపత్రి మా కష్టార్జితం. కేటీఆర్, అజయ్‌లు గుండెలు కోసుకునేతం మిత్రులం. నీ ఆస్తులు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు. నువ్వే పార్టీలు ఫిరాయించావు. ముందు టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్‌లో చేరావు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి భక్త రామదాసును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తుమ్మల మనసాక్షికి తెలుసు.. మరోవైపు.. నామా నాగేశ్వర రావు కూడా తుమ్మలకు కౌంటరిచ్చారు. శనివారం నామా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా ఆశీర్వాద సభను ప్రజలు దీవించారు. తుమ్మల గురించి ముఖ్యమంత్రి వందకు వంద శాతం నిజం చెప్పారు. తుమ్మల మనసాక్షికి అది తెలుసు. కేసీఆర్ నన్ను పిలిచి మరీ ఎంపీని చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. అందుకే నాకు ఎంపీ సీటు ఇచ్చారు. ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. అది కూడా నీ అకౌంట్లో వేసుకోవాలని చూస్తున్నావా తుమ్మల. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నా గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు. మా నాయకులు అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నావ్. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకో’ అని అన్నారు. చర్చకు సిద్దమా.. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సత్యాలే చెప్పారు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నాపై ఆరోపణలు చేసే ముందు రుజువులు చూపించంది. అప్పుడు పాలేరు నుండి పోటీలో తప్పుకుంటాను. దీని కోసం ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో నో టికెట్.. పార్టీ మార్పుపై విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
నమ్మితే అమ్మేస్తరు: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మహబూబాబాద్: ఇరవై నాలుగేళ్ల కింద తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదు ర్కొన్నామని.. కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు పొత్తు పెట్టుకుని మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. చావునోట్లోతలపెట్టి పోరాడితే, దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం తలొంచి తెలంగాణ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి సృష్టిస్తే తెలంగాణ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని, వారిని నమ్మితే అమ్మేస్తారని ఆరోపించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. అంతా ఆగమాగం అవుతుందని, రైతుబంధుకు రాంరాం చెప్పి, ధరణిని దళారుల చేతిలో పెడతారని పేర్కొన్నారు. గత పదేళ్ల అభివృద్ధిని చూసి, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా జీళ్లచెరువులో పాలేరు నియోజకవర్గ సభ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, వరంగల్ నగరం భట్టుపల్లిలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘24 గంటల కరెంటు అవసరం లేదని, మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రైతు బంధు వృధా అని మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రైతుబంధు దుబారానా? రైతుబంధు వద్దా? మూడు గంటలు కరెంటు ఇస్తే ఎన్ని ఎకరాలు పారుతుంది? రైతులు మళ్లీ టార్చిలైట్లు పట్టుకుని పొలం దగ్గర పడుకోవాలా? రైతుబీమా వేస్ట్, కరెంట్ 24 గంటలు ఇవ్వొద్దు.. మనం మాత్రం హైదరాబాద్‌లో ఏసీలలో ఉండాలి. ఇది కాంగ్రెస్ వాళ్ల నీతి. ప్రజలకు రైతుబంధు ఇవ్వొద్దు. మనమే పంచుకు తినాలన్నట్టు వాళ్ల తీరు ఉంది. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అన్నట్టే. కరెంట్ కాటగలుస్తది. ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టని వారికి ఓట్లేస్తే మన పరిస్థితి వైకుంఠపాళి ఆటలో పెద్ద పాము మింగినట్టే. మళ్లీ కథ మొదటికి వస్తది. ఏ గతి కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాలి. ధరణిని రద్దు చేసి మళ్లీ దళారులను తేవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపాలి. దేశం హర్షించేలా తెలంగాణ పథకాలు ఒక రైతుగా నాకు వ్యవసాయం బాధలు తెలుసు కాబట్టే రైతుల సమస్యలు తొలగించే పనులు చేస్తున్నా. దేశ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పాలించే కర్ణాటకలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నాలు చేస్తున్నారు. అదే రాష్ట్రంలో రైతులు బాగుండటం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండించే పంజాబ్ తర్వాత నంబర్ 2 స్థానానికి వెళ్లింది. నిండుగా పంటలు పండి తండాలు, గిరిజన గూడేలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మితో కళకళలాడుతున్నాయి. ప్రజల సొత్తు ప్రజలకే పంచుతాం నీతి నిజాయతీతో, చిత్తశుద్ధితో ప్రజల కోసం కులమత భేదాలు చూపకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గతంలో రూ.70, రూ.200గా ఉన్న పెన్షన్లను రూ.2 వేలకు పెంచుకున్నాం. మళ్లీ గెలిచాక రూ.3 వేలు చేసి.. తర్వాత దశలవారీగా రూ.5వేలకు తీసుకెళ్తాం. తెలంగాణ సంపద పెరిగినకొద్దీ, ఆర్థికంగా బలోపేతం అవుతున్న కొద్దీ.. ప్రజల సొత్తును ప్రజలకే పంచుతాం. రైతుబంధు సొమ్మును పెంచుతాం. రైతుబీమా తరహాలోనే 93 లక్షల పేద కుటుంబాలకు కేసీఆర్ బీమాను అమలు చేస్తాం. వచ్చే మార్చి నుంచి రేషన్‌పై సన్నబియ్యం సరఫరా చేస్తాం. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తాం. ప్రజలపై భారం పడకూడదని రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించాలని నిర్ణయించాం. ఎన్నికల తర్వాత సాదాబైనామాల రిజిస్ట్రేన్లకు అనుమతి ఇస్తాం. ఇవన్నీ జరగాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి? వచ్చాక ఏమిటన్న చర్చ ప్రతీ ఇంటిలో జరగాలి. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూడాలి. గిరిజనులంటే కాంగ్రెస్‌కు చులకన బెల్లయ్యనాయక్‌కు టికెట్ రావాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్లు పోరాటం చేస్తే.. ‘వాళ్లదేముందయ్యా.. రూ.వెయ్యి చేతిలో పెట్టి, ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓట్లు వేస్తారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద? ఇంత అహంకారంతో మాట్లాడే పార్టీ. రేపు ఎవరికి న్యాయం చేస్తుంది?’’అని కేసీఆర్ నిలదీశారు. ఈ సభల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నరేందర్, రెడ్యానాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, శంకర్‌నాయక్, ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. రైతుబంధును యూఎన్ఓ కూడా మెచ్చుకుంది తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రానికి వచ్చి చూసి వెళ్తున్నారు. రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు రైతులను పట్టించుకున్న వారే లేరు. ఈ పథకాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. శభాష్ చంద్రశేఖర్ బాగా చేశారంటూ కితాబిచ్చారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) కూడా రైతు బంధు వంటి ప్రపంచంలో ఎక్కడా లేదు. తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని కితాబిచ్చింది. మిత్రుడని చేరదీస్తే మోసం చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మిత్రుడని చేరదీస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఇంట్లో కూర్చున్న వ్యక్తిని మంత్రిని చేశాం. కానీ మోసం చేశారు. కొందరు అనేక రకాలుగా పార్టీలు మారుతారు. వారి పదవుల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారి.. మాట మార్చేవారు మన మధ్యలో ఉన్నారు. అందుకే ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల కోసం ఏం ఆలోచించింది అని ఆలోచించి ఓటు వేయాలి. -
తుమ్మల ఫైర్.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మంత్రి అజయ్ కుమార్‌ను కాశీం రజ్వీతో పోల్చారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచి పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు.. -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయలు బిగ్ షాకిచ్చారు. దీంతో, అక్కడి రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్.. మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచజ్ఞానం ఉందనుకున్నాను. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై వారెంటీ లేదు.. గ్యారెంటీ లేదు.. ముసలి నక్కా అని మాట్లాడం అదేం భాష. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి.. కానీ, ఇదేం పద్దతి. నీ కంటే ఎక్కువ భాష మాట్లాడగలను. సభ్యతా, సంస్కారం అడ్డు వస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు.. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు 75-80 సీట్లు ఇవ్వబోతున్నారు. మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించాం.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాటిని అమలు చేస్తాం. గ్యారెంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్ర చేస్తున్నారు. మేము ప్రకటించాం.. బాగాలేకపోతే లేదని చెప్పండి. మీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం కాదు.. ప్రజల కోసం గ్యారెంటీలు పెట్టాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్‌కు వేస్తారు.. మీ బెదిరింపులకు కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ప్రజలకు బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్.. -
కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన నేతలు.. పొంగులేటి పోటీ ఎక్కడ?
సాక్షి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సీట్లు కేటాయింపుల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్‌స్వీప్ కొట్టాలనే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్‌లో తుమ్మల నాగేశ్వర రావు చేరిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం లేదా కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైన నేపథ్యంలో సీట్లు సర్దుబాటు విషయంలో హస్తం పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, తుమ్మల పాలేరు నుంచి మాత్రమే బరిలో ఉంటానని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపించారు. దీంతో, పాలేరులో తుమ్మలకు గ్రీన్‌సిగ్నల్ వస్తే పొంగులేటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పొంగులేటిని ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సీనియర్ల ధీమా ఇదే.. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కాంగ్రెస్‌లో చేరితే కొత్తగూడెం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు హస్తం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు.. పొంగులేటిని ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే అవకాశాలను కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక, ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆలోచన అని సీనియర్లు చెబుతున్నారు. తద్వారా ఖమ్మం జిల్లాలో 10 సీట్లను గెలుచుకోవచ్చనే ధీమాతో హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వేములవాడలో నో టికెట్.. చెన్నమనని పొలిటికల్ కౌంటర్ ఇదే.. -
మంత్రి హరీష్, తుమ్మల కీలక వ్యాఖ్యలు..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావుతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సభ చారిత్రాత్మకమైనది. ఆనాడు తెలంగాణ సభ సింహగర్జనను కరీంనగర్లో ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. ఈ సభలో సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన జిల్లా ఉమ్మడి ఖమ్మం. జాతీయ రాజకీయాలకు ఖమ్మం వేదిక కానుంది. సభ కోసం 100 ఎకరాలు కేటాయించాము. పార్కింగ్ కోసం 20 ప్రాంతాలను ఏర్పాటు చేశాము. పార్కింగ్ బాధ్యతలను ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించాము. నియోజకవర్గాలుగా ఇంచార్జీలను ఏర్పాటు చేశాము. ఆరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. వాహనాలు కాకుండా కాలి నడకన వేలాదిగా తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేదికపై ఉంటారు అని తెలిపారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ చారిత్రాత్మకమైనది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వచ్చాక ఖమ్మం అభివృద్ధి ఏంటో చూడాలి. సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఖమ్మంలో ఉండి అభివృద్ధికి నిధులు ఇచ్చి.. ఖమ్మం స్వరూపం మార్చారు. దేశ ప్రజల ఆకాంక్షే బీఆర్ఎస్ ఖమ్మం సభ అని తెలిపారు. -
Telangana: బీజేపీ మెయిన్ టార్గెట్ ఆ ఆరుగురే..!
తెలంగాణలో జెండా పాతేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాషాయ దళం భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మునుగోడు పోయింది సరే, 2023 ఎన్నిక కోసం ఎలా సమాయత్తం కావాలి? ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు వచ్చిన ఆదేశాలేంటి? తెలంగాణలో దూకుడు మీదున్న కమలదళానికి మునుగోడ్ బ్రేక్ వేసింది. కారు, కమలం పార్టీల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగినా.. చివరికి విజయం టీఆర్ఎస్కే దక్కింది. దీంతో కాషాయ పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా కీలక నేతలకు బ్రీఫింగ్ ఇచ్చారు. పటిష్టమైన క్యాడర్ లేని నల్లగొండ జిల్లాలో కొంత పట్టుసాధించినట్లు భావిస్తున్న బీజేపీ నేతలు...ఉప ఎన్నిక తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో.. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు కాషాయ కండువాలు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ లిస్టులో ఉన్న ప్రధానంగా మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ పాగా వేయడానికి అవసరమైన అస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. వారితో పాటు ఇతర జిల్లాల్లోనూ బడా నేతలపై కన్నేశారు. 1. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం నుంచి గతంలో వైఎస్సార్సిపి ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పేరుకే పార్టీలో ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతారు. జిల్లాలో మంచి పేరు ఉండడంతో పాటు ఆర్థికంగా పుష్కలమైన వనరులున్నాయని ఈయనకు పేరుంది. ఇటీవల ఆయన కూతురి వివాహం సందర్భంగా జిల్లా అంతటా చేసిన ఆర్భాటం ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కమలం పాగా వేయాలంటే పొంగులేటి సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది. 2. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల పేరు కమలం పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. గతంలో కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జిల్లాలో మారిన సమీకరణాలు ఇబ్బందికరంగా మారడం తుమ్మలను నిరుత్సాహపరిచాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మంత్రి పదవి వస్తుందనుకున్న తుమ్మలకు.. నిరాశే మిగిలింది. సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు కూడా తుమ్మల రాలేదు. తుమ్మలను చేర్చుకోగలిగితే.. జిల్లాలో పార్టీ సూపర్‌హిట్ అన్న ఆలోచనలో ఉన్నారు. 3. జలగం వెంకటరావు ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. అమెరికాలో చదువుకుని వచ్చి సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో కొత్తగూడెం నుంచి రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మారిన సమీకరణాలతో టీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందన్న భావనలో జలగం వర్గం ఉంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తుమ్మలకు సన్నిహితుడిగా ఉంటోన్న జలగం.. తాజాగా సత్తుపల్లి మీటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి సీనియర్ నాయకులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. 4. జూపల్లి కృష్ణారావు తుమ్మల లాగే టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి 5 సార్లు గెలిచిన జూపల్లి.. గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారులో మంత్రిగా ఉన్నారు. 2014-18 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరైన జూపల్లి.. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓడారు. కొంత కాలంగా టీఆర్ఎస్ పట్ల జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు. 5. పట్నం మహేందర్ రెడ్డి నాలుగు సార్లు తాండూరు నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం.. 2018లో అనూహ్యంగా పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిపోవడం పట్నంకు రుచించని వ్యవహారంలా మారింది. అందుకే పట్నం మహేందర్‌రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన. 6. బాల్కొండ సునీల్ రెడ్డి బాల్కొండ టీఆర్ఎస్లో చాలా కాలం పని చేసి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ముత్యాల సునీల్‌కుమార్ రెడ్డి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాడు. నియోజకవర్గంపై కొంత పట్టున్న సునీల్‌రెడ్డి.. అవకాశం దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్‌లో సునీల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. మరింత బలోపేతం అవుతామని భావిస్తున్నారు. మొదటి ఫేజులో కొందరిని చేర్చుకోగలిగితే.. ఆటోమెటిక్‌గా మరింత మంది చేరుతారన్న భావనలో ఉన్నారు కమలనాథులు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో టెన్షన్ వాతావరణం
-
తుమ్మల అనుచరుడి దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, ఖమ్మం /ఖమ్మం రూరల్: వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబురాల వేళ ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి. తెల్దారుపల్లి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. రాజకీయ కక్షతో వీరభద్రం, ఆయన సోదరులే ఈ హత్య చేయించారని కృష్ణయ్య కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. తన తండ్రి హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, మరో ఆరుగురు కారకులని పేర్కొంటూ కృష్ణయ్య కుమారుడు నవీన్ ఖమ్మం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ హత్యోదంతంతో కోపోద్రిక్తులైన కృష్ణయ్య బంధువులు, కుటుంబీకులు, అనుచరులు..వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు, అనుమానితుల ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి దాడి కృష్ణయ్యకు భార్య (ఎంపీటీసీ) మంగతాయారుతో పాటు కుమార్తె రజిత, కుమారుడు నవీన్ ఉన్నారు. కుమారుడు గ్రానైట్ వ్యాపారం చేస్తుండగా, కృష్ణయ్య ఇటీవల వరకు సీపీఎంలోనే కొనసాగారు. కోటేశ్వరరావుతో విభేదాలు రావడంతో సీపీఎంను వీడి టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల అనుచరుడిగా, టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సమితి సభ్యుడిగా కొనసాగుతున్నారు. సోమవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పొన్నెకల్‌లోని రైతువేదికలో జాతీయ జెండా ఎగురవేసి, మండలంలోని గుర్రాలపాడులో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. వాహనాన్ని తెల్దారుపల్లికే చెందిన ముత్తేశం నడుపుతుండగా కృష్ణయ్య వెనుకాల కూర్చున్నారు. గ్రామం సమీపిస్తుండగా వెనుక నుండి ఆటోలో వచ్చిన దుండగులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న చిన్న కాల్వలో పడిపోగానే తల్వార్లతో తలను, చేతులను ఇష్టారాజ్యంగా నరికారు. దీంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దుండగులు ఆటోలో తెల్దారుపల్లి గ్రామంలోకి వెళ్లారు. గ్రామస్తులే చంపారన్న ప్రత్యక్ష సాక్షి భయంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రత్యక్ష సాక్షి ముత్తేశం కాసేపటికి ఘటనాస్థలానికి వచ్చాడు. అక్కడే మీడియా, పోలీసులతో వేర్వేరుగా మాట్లాడాడు. గ్రామానికే చెందిన బోడపట్ల శ్రీను (తండ్రి చిన్న ఎల్లయ్య), గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడినట్లు చెప్పాడు. డాగ్‌స్క్వాడ్‌తో వచ్చిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా జాగిలం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ఇంటి వద్ద ఆగింది. దీంతో కృష్ణయ్య అనుచరులు, కుటుంబీకులు, బంధువులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు అప్పటికే ఇంటి నుండి వెళ్లిపోయారు. గ్రామంలో సీపీఎం దిమ్మెలను ధ్వంసం చేయడంతో పాటు వీరభద్రం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను కృష్ణయ్య అనుచరులు చించేశారు. గ్రామంలో 144 సెక్షన్ కృష్ణయ్య హత్య జరిగిన 20 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. కృష్ణయ్య హత్య దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు అభివృద్ధికి అవరోధం కల్పిస్తాయని పేర్కొన్నారు. నిందితులెంతటి వారైనా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ్మినేని వీరభద్రమే హత్య చేయించారు.. గ్రామంలో సీపీఎంకు ఆదరణ తగ్గడం, కృష్ణయ్యకు మంచి పేరు వస్తుండటంతో తట్టుకోలేక తమ్మినేని వీరభద్రమే తన భర్త కృష్ణయ్యను హత్య చేయించినట్లు మంగతాయారు విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి హత్యకు వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావే కారణమని, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నంచడంతో హత్యకు పాల్పడ్డారని కృష్ణయ్య కుమార్తె రజిత ఆరోపించారు. -
ఏ గట్టునుంటారో ప్రజలే తేల్చుకోవాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, కొత్తగూడెం: కరెంట్ అడిగిన పాపానికి కాల్చి చంపిన టీడీపీ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచిన కాంగ్రెస్ పార్టీలు ఒకవైపు.. అన్ని వర్గాల ప్రజల చెంతకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన కేసీఆర్ మరోవైపు ఉన్నారని, ఈ రెండు పక్షాల మధ్య ఏ గట్టున ఉంటారో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో.. ఈ నాలుగున్నర టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనపడుతోందని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు, ఆ పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటే రాజకీయంగా ఎదగవచ్చు అనుకోవడం పొరపాటన్నారు. కూటమిది పగటి కలలు మహాకూటమి నేతలు ఏదో సాధిస్తామని పగటి కలలు కంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, వారి సీట్లు పంపకం జరిగే లోపు తమ పార్టీ స్వీట్లు పంచుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కృషి చేశారన్నారు. పాలేరు ప్రజలకు భక్తరామదాసు ద్వారా సాగు నీటిని అందించకుండా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేని చంద్రబాబు.. ‘పిల్ల కాంగ్రెస్’ లా అవతారమెత్తి కాంగ్రెస్ పార్టీతో అనైతిక పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మన వేలితో మన కంటినే పొడిచేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. మిగిలిన ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు కోర్టులకు వెళ్తుండగా, నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కేసులు వేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. పెట్టుబడి ఎకరాకు రూ.10 వేలు మళ్లీ అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మరో 50 ఏళ్లు అభివృద్ధి వెనక్కు వెళుతుందని అన్నారు. చంద్రబాబు కుట్ర బుద్ధితో జిల్లాలోని ఆరు మండలాలను కలుపుకున్నారని, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను కూడా కలుపుకోవాలని చూస్తే కాపాడుకున్నామని చెప్పారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజారంజక పాలన అందించిన కేసీఆర్‌కు ప్రజలు మరోసారి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. భట్టికి చెక్ పెట్టాలి మధిరలో టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించడం ద్వారా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కకు చెక్ పెట్టాలని కేటీఆర్ కోరారు. నాలుగున్నరేళ్లలో భట్టి విక్రమార్క మధిర ప్రజల కోసం ఫలానా పని చేయమని ప్రభుత్వాన్ని అడిగిందే లేదని, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న తన దృష్టికి ఏ ఒక్క సమస్యను తేలేదని చెప్పారు. కుటుంబ పాలన అని పదేపదే చెబుతున్న భట్టి.. తన కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేశారో.. ఇప్పుడు ఆయన విజయానికి కుటుంబ సభ్యులందరూ ఏవిధంగా తిరుగుతున్నారో జిల్లా, రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదన్నారు. సత్తుపల్లిలో పిడమర్తి రవిని గెలిపించడం ద్వారా నియోజకవర్గం మరింత సస్యశ్యామలం కావడానికి దోహదపడాలన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే ముగ్గురు ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత కేసీఆర్ తమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. -
కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం జనరంజకంగా పాలిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వారి వ్యవహారం చివరకు ఆ పార్టీకే నష్టం చేస్తుందన్నారు. సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరిగేలా పాలక పక్షానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మేలుచేసేలా భూప్రక్షాళన జరుగుతుంటే ప్రతిపక్షాలు విమర్శించటం విడ్డూరంగా ఉందని, రైతులకు నీళ్లిస్తుంటే తప్పుడు ఆరోపణలు చేయటం వారి ఓర్వలేనితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ సంస్థలను తాము పునరుద్ధరిస్తున్నామని చెబుతూ రామగుండంలో ఎఫ్‌సీఐని తిరిగి ప్రారంభిస్తున్నట్టు తుమ్మల గుర్తు చేశారు. -
పని చేయకపోతే కాళ్లు పట్టుకుంటాం
♦ సీఎం దయతోనే 21 ఇన్‌క్లైన్ పునరుద్ధరణ ♦ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇల్లెందుఅర్బన్(కొత్తగూడెం) : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఓటు వేసి గెలిపించ ండి..మా గల్లా పట్టుకోండి .. పని చేయలేకపోతే కార్మికుల కాళ్లు పట్టుకుంటామే తప్ప ఎవరికి తలవంచే పరిస్థితి ఉత్పన్నం కాదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో 21 ఇన్‌క్లైన్, జేకేఓసీలో ఏర్పాటు చేసిన పిట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడానికి కేసీఆర్ కొత్తచట్టాన్ని కూడా రూపొందించడానికి వెనుకాడరని, కార్మికులు అధైర్యపడ్డవద్దన్నారు. కార్మికులకు లాభాల వాటా 16 శాతంను 23 శాతం పెంచిన సీఎం తమ సహకారంతో మరింత పెంచేందుకు కృషి చేస్తారన్నారు. ఇల్లెందు ఏరియా 21 ఇన్‌క్లైన్ మూతపడే దశలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, కార్మిక నేతలు తమ దృష్టికి వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్‌కు ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయగా తను వెంటనే స్పందించి గని జీవితకాలం పెంచారన్నారు. టీబీజీకేఎస్‌తోనే సింగరేణి సంస్థ పరిరక్షించ బడుతుందని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోనే సింగరేణి సంస్థ పరిరక్షించబడుతుందన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు గెలవడం వల్ల కార్మికులకు ఒరిగేదేమిలేదన్నారు. టీబీజీకేఎస్‌ను గెలిపించుకుని సింగరేణి పుట్టినిల్లయిన బొగ్గుట్టను కాపాడుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. ఈ పిట్‌మీటింగ్‌లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీబీజీకేఎస్ నేతలు లింగాల జగన్నాథం, గడ్డం వెంకటేశ్వర్లు, రంగనాథ్ సుదర్శన్, కనగాల పేరయ్య, పీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు
తిరుమల: తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావులు ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పట్టువస్త్రాలను మంత్రులకు కప్పారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. (చదవండి: కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మంత్రి!) -
పన్నులు పెంచాల్సిందే!
పట్టణాభివృద్ధిపై తుమ్మల కమిటీ సిఫారసులు ఆస్తుల బదలాయింపు రుసుమును 1.2% నుంచి 2.5%కి పెంచాలి వారంట్ టాక్స్‌ను 0.12% నుంచి 5 శాతానికి పెంచాలి ఆస్తిపన్ను గణనలో లోపాలను సరిదిద్దాలి ఆక్రమణల క్రమబద్ధీకరణను మళ్లీ చేపట్టాలి 6 స్మార్ట్ సిటీలు, 7 శాటిలైట్ సిటీలు నిర్మించాలి మున్సిపాలిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: నిధులు లేక నీరసించిన మున్సిపాలిటీలన్నీ ఆదాయం పెంచుకోవడానికి పన్నుల మోత మోగించాల్సిందేనని తుమ్మల ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పన్ను వసూళ్లను పకడ్బందీగా చేపట్టాలని... ఆస్తి పన్ను గణనలో లోపాలను సరిదిద్ది, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించింది. కాలం చెల్లిన పురపాలన, పట్టణాభిృద్ధి చట్టాలకు స్వస్తిపలికి కొత్త చట్టాలను రూపొందించుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆరు స్మార్ట్ సిటీలు, ఏడు శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. నగర, పురపాలక సంస్థల్లోని ఖాళీల భర్తీని తక్షణమే చేపట్టాలని ఉప సంఘం పేర్కొంది. ఆదాయం పెంపు, ఇతర ఆర్థిక అంశాలు స్వల్పకాలిక ప్రణాళికలు.. ్హ ప్రస్తుతం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఆస్తి విలువలో 4 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీని రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేస్తోంది. ఇందులో పురపాలికలకు రావాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీని 1.5 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలి. ఈ భారం ప్రజలపై పడకుండా స్టాంపు డ్యూటీని 4 నుంచి 3 శాతానికి తగ్గించాలి. ఆస్తిపన్ను పెంపుపై కోర్టు కేసులకు అయ్యే ఖర్చుల కోసం వసూలు చేసే వారంట్ ట్యాక్స్‌ను 0.12 నుంచి 5 శాతానికి పెంచాలి. ఆస్తి పన్నుల గణనలో లోటుపాట్లు, అసలు కొన్ని భవనాలకు గణనే జరగకపోవడం వంటి వాటిని సరిదిద్దాలి. ్హ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్ధీకరణ) ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునే అధికారాన్ని పురపాలికల పాలకవర్గాలకు అప్పగించాలి. ్హ సాంకేతిక అనుమతుల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం వసూలు చేస్తున్న 3 శాతం స్క్రూటినీ చార్జీలను రద్దుచేయాలి. ్హ మున్సిపాలిటీల్లో మొత్తం 3,887 పోస్టులుండగా.. 2,155 ఖాళీగా ఉన్నాయి. తక్షణమే 1,329 ఖాళీలను భర్తీ చేయాలి. మిగతా పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. కొత్త నగర పంచాయతీల్లో 260 కొత్త పోస్టులను మంజూరు చేయాలి. తక్షణమే 100 పోస్టులు భర్తీ చేయాలి. మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలు ్హ రాష్ట్ర పురపాలక, పట్టౄభివద్ధి శాఖ పరిధిలో మూడు విభాగాలు, ఏడు సంస్థలు పనిచేస్తున్నాయి. సీడీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర చోట్లలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలు/సంస్థలకు బదిలీ చేసేందుకున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏృీకత సర్వీసు రూల్స్‌ను తీసుకురావాలి. ్హ ఆస్తిపన్నుల గణనలో లోపాలను నిర్మూలించేందుకు ఉపగ్రహ (జీఐఎస్) పరిజ్ఞానం ఆధారంగా గణన చేపట్టాలి. ఇందుకు రూ. 5.04 కోట్లు కేటాయించాలి. కేబుల్ ఆపరేటర్ల నుంచి వసూలు చేసే వినోద పన్ను మొత్తాన్ని వాణిజ్య పన్నుల శాఖ క్రమం తప్పకుండా మున్సిపాలిటీలకు చెల్లించాలి. -
తప్పుచేస్తే వేటు తప్పదు
ఖమ్మం జెడ్పీసెంటర్ :‘పేదలు సంతోషంగా ఉండాలి, అప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది.. గ్రామ స్థాయి ఉద్యోగుల నుంచి జిల్లా అధికార యంత్రాంగం వరకు పట్టుదలతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి’ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. వచ్చే నాలుగున్నర ఏళ్లలో చేపట్టే అభివృద్ధి పనులు, జిల్లా స్థాయి అధికారులతో వివిధ శాఖల పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదేళ్లుగా పాలన స్తంభించిందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన భాధ్యత అధికారులదేనని చెప్పారు. ఇప్పటివరకు సాగిన పాలన వేరని, నెల రోజుల్లో పాలన గాడిలో పడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన పట్టాలకు ఇంతవరకు భూమి పంపిణీ చేయలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉద్యోగులపై పర్యవేక్షణ సక్రమంగా లేదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సరిగా పని చేయకపోవడం వల్లే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇకనుంచి పాలన పటిష్టంగా ఉండాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందించాలని, అనర్హులకు ఇవ్వడం నేరమని చెప్పారు. కొందరు అధికారులు చేసిన తప్పులతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తే ఉండదని, అధికారులు కీలకంగా వ్యవహరించి రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్‌గా మార్చాలని కోరారు. మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. చెరువుల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని, అవసరమైతే చెరువు కట్టలపైనే పడుకోవాలని చెప్పారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, ఈలోగా పాలన గాడిలో పడాలని అన్నారు. గుండాల రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసినా, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు. జిల్లా అభివృద్ధికి గుండాల ఆదర్శంగా ఉండేలా అధికారులు పని చేయాలన్నారు. 30 ఏళ్లుగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నా ఒక్కటి కూడా చెట్టుగా ఎదగలేదని, అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుం డా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఉన్నాయని, అయితే వైద్యులు మాత్రం అందుబాటులో ఉండడం లేదని, ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జేసీ సురేంద్రమోహన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు బాణోతు మదన్‌లాల్, కోరం కనకయ్య, అటవీ సంరక్షణ అధికారి ఆనందమోహన్, ఆర్అండ్బీ ఎస్ఈ పింగళి సతీష్‌కుమార్, నీటిపారుల శాఖ అధికారి సుధాకర్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, డీఎంసీఎస్ సాంబశివరావు, డీఆర్వో శివశ్రీనివాస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ భానుప్రకాష్, డీఎఫ్ఓలు ప్రసాద్, సతీష్ పాల్గొన్నారు. -
ఖమ్మం గుమ్మంలో ‘తుమ్మల’
రాజకీయ వ్యూహకర్తగా పేరు.. మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చాణుక్యడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో జిల్లా రాజకీయాల్లో అ నూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీడీపీ నేతగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ఏకచత్రాధిపత్యాన్ని సాగించిన తుమ్మల భుజస్కంధాలపై ఖమ్మం జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. దశాబ్దకాలం తర్వాత మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల కమ్యూనిస్టుల కంచుకోటగా, కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉన్న జిల్లాలో లక్ష్య సాధనలో రాజకీయంగా ముందు ఎవరివైపు గురి పెడతారనే అంశం చర్చనీయాం శమైంది. టీడీపీలో ఉన్నప్పుడు తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరుల వ్యూహాలకు భిన్నంగా టీడీపీ శ్రేణులను గులాబీదళం వైపు మరల్చుకోవడానికి ప్రధాన దృష్టి సారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వంటి నేతల సొంత జిల్లా కావ డం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుకా చౌదరి ప్రభావం జిల్లాపై ఉన్న నేపథ్యంలో జిల్లాలోని కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, నిరాశను తనవైపు ఏ మేర కు తిప్పుకోగలుగుతారన్న భావన వ్యక్తమవుతోంది. టీడీపీ లక్ష్యంగా.. తెలంగాణలో తెలుగుదేశంను తుడిచి పెట్టడమే లక్ష్యంగా తుమ్మల పావులు కదిపే అవకాశం ఉం దని... కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల్లో ఇమడలేని నేతలపై తుమ్మల ఇప్పటికే దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జి ల్లాకు మంత్రిపదవి లేకపోవడంతో టీఆర్ఎస్లో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో పార్లమెంట్ సెక్రటరీ జలగం వెంకట్రావును, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పార్టీకి ఇద్దరు శాసనసభ్యులను సమన్వయం చేసుకుం టూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. -
ముహూర్తం ఖరారు
జలగంకు సహాయ మంత్రి హోదాతో పార్లమెంటరీ సెక్రటరీ పదవి కేబినెట్లో కీలకం కానున్న ఖమ్మం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు మంత్రివర్గంలో టీఆర్ఎస్ నేత తుమ్మలకు చాన్స్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆరు నెలల పాటు ఎదురుచూసిన జిల్లా ప్రజల కల ఎట్టకేలకు సాకారం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో మంత్రివర్గంలో జిల్లాకు స్థానం లభించడం ఖాయమైంది. అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి నోచుకోని జిల్లాల్లో ఒకటైన ఖమ్మానికి ఆలోటు తీరనుంది. జిల్లానుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో అవకాశం దక్కడం దాదాపు ఖాయమైంది. అలాగే టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకట్రావుకు సైతం సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాకు మంత్రి వర్గంలో స్థానం లేకపోవడంతో పాలనా పరంగా, పార్టీ పరంగా కొంత నిస్తేజం అలుముకుంది. అయితే ఈ మూడు నెలల్లోనే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలో అగ్రనేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో గత సెప్టెంబర్‌లో తన అనుచరులతో టీఆర్ఎస్లోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది. కేసీఆర్ అదృష్ట సంఖ్యలుగా భావించే 6, 15, 24 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు ప్రతినెలా ఎదురుచూశాయి. మంత్రివర్గంలో ఒక్కరికే ప్రాతినిధ్యం లభిస్తుందని మొదటి నుంచి అనుకుంటున్నా అనూహ్యంగా సహాయ మంత్రి హోదా కలిగిన మరో పదవిని సైతం కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావుకు కేటాయిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రస్థాయిలో పరిమితంగా భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ మన జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నేత, గార్ల నివాసి పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించి జిల్లాకు తాను ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారని టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఇద్దరికి సహాయ మంత్రి హోదా కలిగిన కేబినెట్ కార్యదర్శి పదవులను అప్పగించారు. ఆ తర్వాత అలాంటి సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వంలోనూ కొనసాగలేదు. మళ్లీ కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీ పదవులను అప్పగించడంతో 36 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి సహాయ మంత్రుల హోదా కలిగిన ఈ పదవులు రానున్నాయి. ఇందులో ఒకటి జలగం వెంకట్రావును వరిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 16న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆనందంతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ మంత్రి వర్గంలో కీలకశాఖ వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు హోం, ఆర్అండ్బీ, విద్యుత్ వంటి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆనంద పడుతున్నాయి. 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల 1985లో తొలిసారిగా సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో చిన్ననీటి పారుదలశాఖా మంత్రిగా తొలి బాధ్యతలు నెరవేర్చారు. కొంతకాలం వరంగల్ రీజియన్ ఆర్టీసీ చైర్మన్‌గా సైతం పనిచేశారు. 1989లో ఓటమి చవిచూసిన తుమ్మల 94, 99లో తిరిగి సత్తుపల్లి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోనూ కీలకమైన భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహించారు. 2009లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన తుమ్మల అప్పుడు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావుపై విజయం సాధించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తుమ్మల మళ్లీ మంత్రి అవుతున్నారు. తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం లభించడం, జలగం వెంకట్రావుకు సహాయమంత్రి హోదా కలిగిన పదవి లభిస్తుండటంతో జిల్లా రాజకీయాలు మరింత వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనపడుతోంది. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన జలగం వెంకట్రావు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీమంత్రి తుమ్మలపై విజయం సాధించారు. అనంతరం 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఖమ్మం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతర పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య మూడుకు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు రాజకీయంగా అధికార పార్టీలో నెలకొన్న కొంత స్తబ్ధత మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలగనుంది. అలాగే పాలనా వ్యవహారాల్లోనూ జిల్లాకు అధికార పార్టీ ముద్ర పెద్దగా కనిపించకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో కష్టించి పనిచేసిన వారిలో, టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడు కేబినెట్లో చోటు లభించడం ఖాయం కావడంతో అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
టీడీపీ శ్రేణులకు ‘గులాబీ’ వల
సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీని బలహీనపరిచేందుకు, టీఆర్ఎస్ను బలోపేతం ‘గులాబీ’ దళ నేత తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కేంద్రీకరించారు. టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు తీసుకొచ్చేందుకు తుమ్మల వర్గీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ వైపు చూస్తున్న ముఖ్య నాయకులందరికీ తుమ్మల నాగేశ్వరరావు నేరుగా అందుబాటులో ఉండేలా ఆయన వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, నగర పంచాయతీ చైర్పర్సన్ తదితరులు తుమ్మలతోపాటు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అత్యంత సన్నిహితులైన గంగారం సొసైటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, యాగంటి శ్రీనివాసరావు తుమ్మలకు సంఘీభావంగా టీఆర్ఎస్లో చేరటం చర్చనీయాంశమైంది. కలిసి పనిచేశాం.. కలిసే నడుద్దాం.. ‘ఒకటి కాదు.. రెండు కాదు.. 30 ఏళ్లపాటు రాజకీయంగా కలిసి పనిచేశాం. తుమ్మలతోనే ఉన్నాం. ఆయననే నమ్ముకున్నాం. ఇప్పుడు కూడా ఆయనతోనే నడుదా. ఒక్కటిగా ఉం దాం’- టీడీపీ శ్రేణులను బయటకు రప్పించేం దుకు తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు జపిస్తున్న మంత్రమిది. టీడీపీలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కింది నుంచి పై వరకు మొత్తం శ్రేణులను ‘కారు’ ఎక్కించేం దుకు తుమ్మల వర్గీయులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన వెంటనే సత్తుపల్లి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు బిగించేలా ఆయన వర్గీయులు కసరత్తు సాగిస్తున్నారు. ఈ దిశగా అందివస్తున్న ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సత్తుపల్లి నగర పంచాయతీలో మిగిలిన పదిమంది కౌన్సిలర్లలో అత్యధికులను తమవైపు తిప్పుకునేందుకు ‘ఏర్పాట్లు’ పూర్తిచేసినట్టు సమాచారం. సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఇంతకాలం అండగా నిలిచిన బలమైన సామాజికవర్గానికి చెందిన మెజార్టీ నాయకులు ఇప్పటికే ‘గులాబి’ గూటికి చేరారు. మిగిలిన కొద్దిమందిని కూడా రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. వలసలను అడ్డుకునేందుకు సండ్ర ప్రతివ్యూహం టీడీపీ వలసలను నిలువరించేందుకు ఆ పార్టీ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే గెలవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఏర్పడింది. ఆయనను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడంతో ద్వారా పార్టీ అధినేత ప్రాధాన్యమిచ్చారు. గ్రామాలు, మండలాలవారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ‘మీకు పూర్తిస్థాయిలో నేను అండగా ఉంటా. అందుబాటులో ఉంటా. పార్టీ వీడాల్సిన పనిలేదు’ అంటూ భరోసా ఇస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లినప్పటికీ కార్యకర్తలు మాత్రం తనతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా, ఒకప్పుడు తనకు సన్నిహితుడైన తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఇలా ఒకవైపు తుమ్మల, మరోవైపు సండ్ర.. వ్యూహ, ప్రతివ్యూహాలతో సత్తుపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. -
తుమ్మలకు ‘పవర్’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లా నుంచి కేబినెట్లో స్థానం ఎవరికి, ఎప్పుడు దక్కుతుంది? ఏ శాఖ కేటాయిస్తారనే ఉత్కంఠ త్వరలోనే వీడనుంది. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో స్థానం ఖరారైంది. ఈ మేరకు తనను కలిసిన జిల్లా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈనెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు, బహిరంగసభ ఉన్నందున 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణ చేస్తానని, అందులో తుమ్మలకు స్థానం ఖాయమని ఆయన చెప్పినట్టు సమాచారం. తుమ్మలకు ఏ శాఖను కేటాయించాలన్నది కూడా దాదాపు కొలిక్కి వచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో తుమ్మల నిర్వహించిన విద్యుత్‌శాఖనే ఆయనకు కేటాయించనున్నారు. దీనితో పాటు ఆర్అండ్బీ లేదా పంచాయతీరాజ్ శాఖల్లో ఒక దానిని తుమ్మలకు కేటాయించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కేసీఆర్, తుమ్మల ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు కేసీఆర్ రవాణాశాఖ నిర్వహించగా, తుమ్మల ఇంధనశాఖతో పాటు ఆర్అండ్బీ శాఖలను నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ పరిస్థితి, జిల్లాలో నెలకొల్పనున్న కొత్త విద్యుత్ ప్రాజెక్టులు తదితర అంశాలకు సంబంధించి అనుభవమున్న వ్యక్తిగా తుమ్మలకు ఇంధనశాఖ కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో వేదిక ముందు కూర్చున్న తుమ్మలను స్వయంగా కేసీఆరే వేదికపైకి ఆహ్వానించి కుర్చీ వేయించి మరీ కూర్చోబెట్టడం గమనార్హం. తుమ్మల గారూ రండీ.... పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర పార్టీ నేతలతో పాటు వేదిక ముందున్న సీట్లలో రెండో వరుసలో కూర్చున్నారు. సమావేశం ప్రారంభం కాగానే పార్టీ సెక్రటరీ జనరల్ కేకేతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు రామచంద్రునాయక్, రమణాచారి తదితరులు వేదికపై కూర్చున్నారు. సీఎం కేసీఆర్ కూడా వేదికపై ఆసీనులైన తర్వాత తుమ్మలను చూసి.. వెంటనే వేదికపై మరో కుర్చీ వేయాలని సూచించారు. ‘తుమ్మల గారూ వేదిక పైకి రండి’ అని స్వయంగా ఆహ్వానించారు. తన ప్రసంగంలో భాగంగా తుమ్మలను పార్టీ నేతలకు పరిచయం చేశారు. పార్టీ పరంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ పార్టీ నాయకులు, మంత్రులను వేదిక ముందు కూర్చోబెట్టి, ప్రత్యేకంగా తుమ్మలను వేదికపైకి ఆహ్వానించడం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ‘పవర్’ ఆయన చేతికే జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు తుమ్మలకే అప్పగిస్తున్నానని నాగేశ్వరరావు పార్టీలో చేరే రోజే బహిరంగంగా చెప్పిన కేసీఆర్ ఆ విషయంలో మరింత స్పష్టతనిస్తున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలకు జనసమీకరణ బాధ్యతలను అన్ని జిల్లాలకు చెందిన మంత్రులకు అప్పగిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్.. మంత్రివర్గంలో స్థానం లేని జిల్లా బాధ్యతలను తుమ్మలకు ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు తన నివాసంలో పార్టీ నేతలతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలోనూ తుమ్మలకు ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా, ప్లీనరీలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘ఒకప్పుడు చాలా బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయింది. ఆదిలాబాద్ కన్నా ఇప్పుడు ఖమ్మంలో పార్టీ బలంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏడు స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. ఇప్పుడు ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్ జిల్లా అని రాసుకోవచ్చు.’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మొదటి నుంచి (2001 నుంచి) పార్టీకి అండగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని, ఇందుకు కర్నె ప్రభాకర్ లాంటి వ్యక్తులకు లభించిన పదవులే నిదర్శనమని చెప్పిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు లేని చోట్ల గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారే ఇన్చార్జులుగా వ్యవహరిస్తారని కూడా చెప్పినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని కూడా కేసీఆర్ చెప్పడంతో జిల్లా పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ చెప్పిన దాన్ని బట్టి జిల్లాకు అన్ని స్థాయిల్లో కలిసి 400 వరకు నామినేటెడ్ పోస్టులు వస్తాయనే ఆశలో పార్టీ నేతలున్నారు. ఏజెన్సీలో నాన్ట్రైబ్స్కు రుణమాఫీ ఎలా? ఈ సమావేశం అనంతరం జిల్లా నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన నేతలు తుమ్మలతో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి కొంతసేపు ఇష్టాగోష్టి మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ జరిగింది. రుణమాఫీకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు రుణమాఫీ వర్తింపచేయడం సాధ్యం కావడం లేదని, దీనిని పరిష్కరించాలని కేసీఆర్‌ను జిల్లా నేతలు కోరడంతో ఆయన స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ ఇలంబరితిని ఫోన్లో సంప్రదించారు. ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, బోగస్ రుణాలను చెల్లించవద్దని ఈ సందర్భంగా కలెక్టర్‌కు సీఎం చెప్పినట్టు సమాచారం.