Udhayanidhi stalin
-
అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం
తమిళసినిమా: అధిష్టానం ఆదేశిస్తే రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధం అని యువ నటుడు, డీఎంకే అధినేత కరుణానిధి మనుమడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం ‘నిమిర్’ రేపు తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆయన విలేరులతో మాట్లాడుతూ ఈ ఏడాది రాజకీయాల్లోకి వస్తున్న సినీతారలకు శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడుతూ ఇప్పటికే డీఎంకేలోని ఓ విభాగంలో ఉన్నానన్నారు. సినిమాల్లోకి రాకముందు పార్టీలో చురుకుగా పని చేశానన్నారు. స్టానిక థౌజండ్‌లైట్స్ అసెంబ్లీ స్థానానికి నాన్న (స్టాలిన్) పోటీ చేసినప్పుడు అక్కడ ప్రచారం చేశానన్నారు. ప్రజల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తున్నానన్నారు. రజనీకాంత్, కమలహాసన్, విశాల్ రాజకీయ రంగ ప్రవేశంపై తానేమీ మాట్లాడదలచుకోలేదని చెప్పారు. -
ఆయన్ను మరో అవకాశం అడిగా..
సాక్షి, చెన్నై: ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించడానికి మరో అవకాశం అడిగానని నటుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం నిమిర్. ఈ చిత్రంలో నమితా ప్రమోద్, పార్వతీనాయర్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ప్రకాష్‌రాజ్, సముద్రఖని, ఎంఎస్.భాస్కర్. కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించారు. మూన్‌షాట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సంతోష్కురువిల్లా నిర్మించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. గురువారం సాయంత్రం ఆడియో ఆవిష్కరణ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉదయనిధిస్టాలిన్ మాట్లాడుతూ.. నిమిర్ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్ చెప్పినట్లు నటించానన్నారు. ఇందులో సముద్రఖనితో మూడు రోజుల పాటు ఫైట్ సన్నివేశాల్లో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. నిమిర్ చిత్ర తొలి కాపీ చూసిన తరువాత మరో చిత్రంలో ఒక పాత్ర ఉన్నా పిలవండి వచ్చి నటిస్తానని దర్శకుడు ప్రియదర్శన్‌ను అడిగానని ఉదయనిధిస్టాలిన్ అన్నారు. నిర్మాత సంతోష్ కురువిల్లా మాట్లాడుతూ.. ప్రియదర్శన్ దర్శకత్వంలో చిత్రం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. తాను చెన్నైలో కార్యాలయం లేకుండానే నిమిర్ చిత్రాన్ని పూర్తి చేశానని తెలిపారు. అంతగా రెడ్‌జెయింట్, ఫోర్ఫ్రేమ్స్ సంస్థలు సహకరించాయని చెప్పారు. ఇకపై ఇక్కడ కార్యాలయాన్ని నెలకొల్సి పలు చిత్రాలు నిర్మిస్తానని అన్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో రెండు నిమిషాల పాత్ర ఉన్నా నటించడానికి తాను సిద్ధం అని నటి పార్వతీనాయర్ అన్నారు. -
ఆ హీరోతో రొమాన్స్‌కు ఓకే చెప్పేసిందట..
సాక్షి, చెన్నై: హీరో ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు ఓకే చెప్పేసిందట మిల్కీబ్యూటీ తమన్నా. ఈ మధ్య ఆ సుందరి కొత్త కాంబినేషన్లో నటించడానికిఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. నటుడు శింబుతో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్, విజయ్‌సేతుపతితో ధర్మదురై, విక్రమ్‌తో స్కెచ్, విశాల్‌తో కత్తిసండై ఇలా అన్నీ కొత్త కాంబినేషన్స్‌లోనే నటించింది. ఈ అమ్మడికి టాలీవుడ్, బాలీవుడ్‌లలో చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నా, కోలీవుడ్‌లో స్కెచ్ చిత్రం తరువాత నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ తరుణంలో మరో అవకాశం తమన్నాను వెతుక్కుంటూ వచ్చింది. తమన్నా ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక తమిళంలో విక్రమ్‌కు జంటగా నటిస్తున్న స్కెచ్ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఉదయనిధిస్టాలిన్‌కు జతగా నటించడానికి ఓకే చెప్పేసింది. యువ నటుడు ఉదయనిధిస్టాలిన్ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించిన నిమిర్ చిత్రం జనవరి చివర్లో విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా శీనూరామసామి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇంకా కన్నన్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపేశారు. ఇందులోనే ఆయనతో మిల్కీబ్యూటీ నటించనుంది. దీనికి కన్నే కలై మానే అనే టైటిల్‌ను నిర్ణయించారు. తెలుగు రీమేక్ క్వీన్ చిత్రానికి బల్క్ కాల్షీట్స్ ఇచ్చిన తమన్నా, మరో పక్క బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. ఇందులో తమన్న పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నాయి చిత్ర వర్గాలు. -
నన్నలా కోరుకోవడం లేదు!
తమిళ సినిమా: ప్రేక్షకులు తననలా కోరుకోవడం లేదని నటి శ్రద్ధా శ్రీనాథ్ అంటోంది. మొదట న్యాయవాది వృత్తిని చేపట్టి ఆపై మోడల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ కోహినూర్ అనే మలయాళ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసింది. అయితే మాతృభాషలో నటించిన యూటర్న్ చిత్రం శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌ను ఒక్కసారిగా పెద్ద మలుపు తిప్పేసింది. అక్కడ సంచలన విజయం సాధించిన ఆ చిత్రం ఇప్పుడు నయనతార హీరోయిన్గా కోలీవుడ్‌లోనూ, సమంత నాయకిగా టాలీవుడ్‌లోనూ రీమేక్ కానుంది. ఆ మధ్య ఏస్ డైరెక్టర్ మణిరత్నం దృష్టిలో పడి కాట్రువెలియిడై చిత్రంలో నటించేసిన ఈ అమ్మడికిప్పుడు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. కన్నడంలో బిజీగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ ఇప్పుడు తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. కాట్రువెలియిడై చిత్రం తరువాత కోలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నా హీరోలతో నాలుగు రొమాన్స్ సీన్స్, నాలుగు డ్యూయెట్లు పాడే పాత్రల్లో నటించడం తనకిష్టం లేదంటోంది శ్రద్ధా. అభిమానులకు తనను అలా చూడటానికి ఇష్టపడరని తెలిపింది. అలాగని చిత్రంలో ప్రతి ఫేమ్‌లోనూ తాను కనిపించాలని ఆశించనని, నటనకు అవకాశం ఉన్న పాత్రలైతేనే అంగీకరిస్తానని అంది. ఇలాంటి పాత్రనే ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించనున్నట్లు చెప్పింది. దీనికి పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నారని తెలిపింది. ప్రస్తుతం ఈయన విశాల్, సమంత జంటగా నటిస్తున్న ఇరుంబు తెరై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ఆ కాంబినేషన్‌ను కలిపింది నేనే
తమిళసినిమా: ఉదయనిధిస్టాలిన్, సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్ కాంబినేషన్‌ను తొలుత కలిపింది తానేనని దర్శకుడు గౌరవ్ నారాయణన్ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇప్పడై వెల్లుమ్. ఉదయనిధిస్టాలిన్, మంజిమామోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, డానియేల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీ.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు గౌరవ్ నారాయణన్ మాట్లాడుతూ ఈ చిత్ర హీరో ఉదయనిధి స్టాలిన్, హాస్య నటుడు సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్ల కాంబినేషన్‌ను తొలిసారిగా కలిపింది తానేనని చెప్పారు. ఇప్పడై వెల్లుమ్ చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే ఉదయనిధిస్టాలిన్ తన వద్దకు వచ్చి సార్ తాను రేపటి నుంచి వేరే షూటింగ్లో పాల్గొంటున్నాను అని చెప్పారన్నారు. తీరా చూస్తే సవరణన్ ఇరుక్కభయమేన్ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్, సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్లు కలిసి పని చేశారన్నారు. ఆ తరువాత మరి కొన్ని రోజులకు వేరే చిత్రం చేస్తున్నానని ఉదయనిధి స్టాలిన్ చెప్పారన్నారు. ఆ చిత్రమే పొదువాగ ఎన్ మనసు తంగం అని చెప్పారు. ఈ చిత్రంలోనూ అదే కాంబినేషన్ అన్నారు. ఆ తరువాత తమ చిత్రం చేస్తున్నా, ఉదయనిధి స్టాలిన్ ఆ రెండు చిత్రాల గురించే మాట్లాడడంతో తాను ఈ చిత్ర నిర్మాతకు నెల రోజులు గ్యాప్ ఇచ్చి షూటింగ్ చేస్తానని చెప్పానన్నారు. అప్పటికి ఉదయనిధి స్టాలిన్ ఆ చిత్రాల మూడ్‌లోంచి బయట పడతారని భావించానన్నారు. అలా ఈ చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. -
సురేశ్ నన్ను కొట్టేశారు!
తమిళసినిమా: నటుడు ఆర్కే.సురేశ్ తనను కొట్టేశారని అంటున్నారు మరో నటుడు ఉదయనిధిస్టాలిన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇప్పడై వెల్లుమ్. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరవ్ నారాయణన్ దర్శకుడు. నటి మంజిమామోహన్ కథా నాయకిగా నటిస్తున్న ఇందులో ఆర్కే.సురేశ్, డేనియల్బాలాజి, రాధిక ము ఖ్యపాత్రలను పొషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీ తాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక ట్రిపుల్‌కేన్‌లోని కలైవానర్ ఆవరణలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో నటుడు శివకార్తికేయన్ ముఖ్యఅతిథిగా పా ల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అ నంతరం చిత్ర కథానా యకుడు ఉదయనిధిస్టాలిన్ మాట్లాడుతూ ఇప్పడై వెల్లుమ్ చిత్రం లో నటించడం మంచి అనుభవం అన్నారు. అయితే చిత్ర ఫైట్ సన్నివేశాల్లో నటుడు డేని యల్ బాలాజీతో నటించినప్పుడు ఎలాంటి సమస్య లేదుగానీ, నటుడు ఆర్కే.సురేశ్‌తో ఫైట్ చేసినప్పుడే దెబ్బలు తిన్నానని చెప్పా రు. ఆయన ఫైట్ సన్నివేశంలో నిజంగానే నన్ను కొట్టేశారని, ఈ విషయాన్ని ఫైట్ మాస్టర్‌కు చెప్పి నొప్పిపుడుతోందని ఏడ్చేశానని పేర్కొన్నారు. అయితే చిత్రంలో పోరాట సన్నివేశాలు సహజంగా రావాలని దెబ్బలు తింటూనే నటించేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిత్రంలోని పాటలకు నృత్యకళాకారులు నర్తించి ఆనందపరిచారు. ఇక చిత్ర కథానాయకి మంజామా మోహన్ కూ డా ఆడేసి ఆహూతులను అలరించారు. అదే విధంగా శివకార్తికేయన్ ఉదయనిధితో కలిసి స్టెప్స్ వేయడంతో ఆ ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారు మోగిపోయింది. -
మరోసారి పల్లెటూరి యువతిగా..
పల్లెటూరి యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించిన పార్వతీ మీనన్ తాజాగా ఉదయనిధి స్టాలిన్‌తో నటిస్తున్న చిత్రంలో కూడా గ్రామీణ యువతిగా కనిపించనుందట. ఇందులో పార్వతీమీనన్ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారట. ఉదయనిధి స్టాలిన్‌తో హీరోయన్ పార్వతీ మీనన్ రొమాన్స్ చేయనుంది. అప్పుడప్పుడు కోలీవుడ్‌లో మెరిసిపోతున్న మాలీవుడ్ అమ్మడు పార్వతీమీనన్. అప్పుడెప్పుడో పూ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఆ తరువాత ధనుష్‌తో మరియాన్ చిత్రంలో చాలా సన్నిహితంగా నటించి వార్తల్లోకెక్కింది. పూ చిత్రంలో పల్లెటూరి యువతిగా మొదటిసారి నటించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బెంగళూర్ నాట్కళ్, కమలహాసన్‌తో ఉత్తమ విలన్ చిత్రాల్లో మెరిసింది. తొలి చిత్రంలోనే మంచి నటిగా నిరూపించుకుంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ భామ నటించిన తమిళ చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. తనకి వచ్చిన అవకాశాలను అంగీకరించడం లేదట. మాతృభాషలో బాగానే అవకాశాలు వస్తున్నాయట. కాగా మరోసారి తమిళ సినీ అభిమానులను పలకరించడానికి పార్వతీమీనన్ రెడీ అవుతోంది. వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన తాజా చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. అంతకుముందే ఆయన తన తరువాత చిత్రానికి రెడీ అయిపోయారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలేకేరళలోని షూకుట్రాళంలో ప్రారంభమైంది. సినిమా పేరును ఇంకా నిర్ణయించలేదు. ఈ చిత్రంలో హీరోయిన్గా పార్వతీమీనన్ నటించనుంది. -
ఆయన చాలా నేర్పించారు
నటి నివేదా పేతురాజ్ ఇప్పుడు ఒకరకమైన టెన్షన్లో ఉంది. కారణం కోలీవుడ్‌లో తను నటిం చిన రెండో చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఉదయనిధిస్టాలిన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తిబన్ ప్రధాన పాత్రను పోషించారు. ఇందులో నటించిన అనుభవం గురించి ఈ అమ్మడు తెలుపు తూ,ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. అయితే ఇందులో నటుడు పార్తిబన్‌కు కూతురుగా నటించానని చెప్పింది. ఆయ న నటన గురించి నాకు చాలా నేర్పించారని తెలిపింది. పార్తిబన్ తనకు తండ్రిగా నటిస్తున్నారని దర్శకుడు చెప్పతగానే సంతోషం కలిగినా, కాస్త భయం అనిపించిందని అంది. కారణం ఆయన చాలా సీనియర్ దర్శకుడు కావడమేనంది. ఈ చిత్రంలో తాను ఏ మాత్రం బాగా చేశానని అభినందనలు లభిస్తే ఆ క్రెడిట్ అంతా పార్తిబన్కే దక్కుతుందని అంతలా తనకు ఆయన ధైర్యం చెప్పారని నివేదా పేతురాజ్ పేర్కొంది. ఈ బ్యూటీ తాజాగా జయంరవికి జంటగా టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తోందన్నది గమనార్హం. -
ఉదయనిధి కొత్త చిత్రం ప్రారంభం
నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ నూతన చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మనిదన్ చిత్ర విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఉదయనిధి స్టాలిన్ వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్ర విజయంతో యమ ఖుషీలో ఉన్న దర్శకుడు ఎళిల్ల కాంబింనేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ తన రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటి రెజీనా, శ్రుష్టిడాంగే హీరోయిన్లుగా నటించనున్నారు. సూరి హాస్య పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్‌ను కారైక్కల్, దాని చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించి క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఇది పూర్తిగా వినోదభరిత చిత్రంగా ఉంటుందని చెప్పారు. -
మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది
మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని అంటున్నారు అందాల భామ హన్సిక. తమిళ చిత్రాలకే ప్రాముఖ్యత అంటున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మనిదన్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో ఆ సంతోషాన్ని అనుభవిస్తూ తాజాగా భోగన్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేస్తున్నారు. ఇది ఆమె జయంరవితో నటిస్తున్న మూడో చిత్రం అన్నది గమనార్హం. ముందుగా ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించారు. తరువాత రోమియో జూలియట్ చిత్రంలో జత చేరారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా భోగన్ చిత్రంలో మరో సారి కలిసి నటిస్తున్నారు. విశేషం జయంరవితో నటించిన తొలి చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. ఈ భోగన్ చిత్రానికి ఆయన నిర్మాత. రోమియో జూలియెట్ చిత్రం దర్శకుడు లక్ష్మణ్‌నే భోగన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని వివరాల గురించి హన్సికతో చిన్న భేటీ.. ప్ర: మనిదన్ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తునట్లున్నారు? జ: మనిదన్ నాకు చాలా నచ్చిన చిత్రం. అందులో గ్రామీణ యువతిగా నటించాను. ఇంతకు ముందు అరణ్మణై చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించినా, మనిదన్ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా అమరింది. నా గత చిత్రాల పాత్రలకు మనిదన్ చిత్రంలోని పాత్ర పూర్తిగా భిన్నం. అందుకే చాలా ఆస్వాదిస్తూ నటించాను. అందుకు మంచి పేరు వచ్చింది. ప్ర: ఉదయనిధి స్టాలిన్‌తో రెండో సారి నటించడం గురించి? జ: అవును.అయన తొలి చిత్రం ఒరు కల్లు ఒరు కన్నాడి చిత్ర నాయకిని నేనే. ఇంకో విషయం ఏమిటంటే మేమిద్దరం కలిసి మరో చిత్రంలో నటించాల్సింది. అది పూర్తిగా అమెరికాలో జరిగే కథ. దానికి అహ్మద్‌నే దర్శకత్వం వహించాల్సి ఉంది.అందులో నాది చాలా గ్లామరస్ పాత్ర. అయితే ఆ చిత్రం ప్రారంభం కాలేదు. అందుకే మనిదన్ చిత్రంలో నటించమని అడిగారు. తొలి చిత్రంలో నటించినప్పుడు ఉదయనిధి కొత్తనిపించారు. ఇప్పుడు నటనలో ఆరితేరారు. మంచి స్నేహితుడు. ప్ర: సరే తాజా చిత్రం బోగన్ గురించి? జ: నేను ఇంతకు ముందు జయంరవితో కలిసి నటించిన రోమియో జూలియెట్ చిత్రం మంచి హిట్. మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని దర్శకుడు లక్ష్మణ్ అన్నారు. అందుకే మళ్లీ బోగన్ చిత్రంలో కలిసి నటిస్తున్నాం. ప్ర: బోగన్ చిత్రం కథేంటి? జ: కథ గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్ర: హిందీ చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా? జ: నాకు తమిళ చిత్రాలలో నటించడానికే సమయం సరిపోతోంది. అందుకే తమిళ చిత్రాలకే ప్రాముఖ్యత నిస్తున్నాను. ప్ర: ఇన్ని చిత్రాల్లో నటించినా ఇంకా తమిళ భాష నేర్చుకోలేక పోయారుగా? జ: ఎవరు చెప్పారు? తమిళంలో ఏమి మా ట్లాడినా నాకు అర్థం అవుతుంది. కొంత వర కూ మాట్లాడగలను. త్వరలోనే తమిళ భాష ను పూర్తిగా మాట్లాడగలను. అందుకే తమిళ చిత్రాల్లోనే నటించాలని ఆశపడుతున్నాను. -
రాజకీయాల్లోకి యువ సినీ హీరో?
పలు సినిమాలతో తమిళనాట మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న యువ హీరో ఉధయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, స్టాలిన్ కొడుకుగా రాష్ట్రంలో ఆయనకు క్రేజ్ ఉంది. ఉదయ్ పొలిటికల్ ఎంట్రీ నిజమేనని డీఎంకే వర్గాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ఇటీవల 'మనిధన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఉధయనిధి క్రియాశీలక రాజకీయాల్లోకి దిగితే చిత్ర పరిశ్రమలో డీఎంకే వాదిగా ముద్రపడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే రాజకీయాల ఊసెత్తకుండా ఇన్నాళ్లూ జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆ మధ్య స్టాలిన్ కూడా తనకు వారసులుగా తన కొడుకు గానీ, కూతురుగానీ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎంకే వర్గాలు మాత్రం ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం ఖాయం అంటున్నారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీనేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తలకిందులైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రాజకీయ వాతావరణానికి దూరంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ శాసనసభ్యుడిగా ధ్రువపత్రాన్ని అందుకోవడానికి వెళ్లినప్పుడు వెంటే వెళ్లారు. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి స్టాలిన్ తంజావూరు వెళ్లినప్పుడు ఆయనతో ఉదయనిధి కూడా వెళ్లారు. ఇదంతా చూస్తుంటే ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగప్రవేశం ఖాయం అనే స్వరం సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. -
మల్టీ స్టారర్ చిత్రానికి ముహూర్తం
ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమ భిన్న చిత్రాల మయంగా మారింది. ఒక పక్క హారర్ చిత్రాల దాడి కొనసాగుతోంది. మరో పక్క 2.ఓ లాంటి బ్రహ్మాండ చిత్రాల రూపకల్పన, ఇంకో పక్క హీరోల ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయంతో మంచి కమర్షియల్ చిత్రాల నిర్మాణాలు తెరకెక్కుతున్నాయి.అలాంటి వాటికి మధ్య తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రం ఆరంభం కానుంది. అదే యువ నటులు ఉదయనిధిస్టాలిన్, విష్ణువిశాల్ కలసి నటించనున్న చిత్రం.సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మన్మదన్ అండు,7ఆమ్ అరివు,ఒరుకల్ ఒరు కన్నాడి వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉదయనిధిస్టాలిన్ రెడ్‌జెయింట్ సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రం ఇది. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మలయాళ కుట్టి మంజిమా మోహన్ నటిస్తోంది. ఈమె ఇప్పటికే శింబుతో అచ్చం ఎంబది మడమయడా చిత్రంలో నటించిందన్నది గమనార్హం. విష్ణువిశాల్‌తో మేఘా ఆకాశ్ రొమాన్స్ చేయనుంది. ఈ అమ్మడు ఇప్పటికే బాలాజీ ధరణీ ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఒరు పక్క కథై చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది.దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, మది చాయాగ్రహణం, కాశీవిశ్వనాథన్ కూర్పు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మంచి కథ లభిస్తే ఉదయనిధిస్టాలిన్‌తో చేయాలన్న ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరుతోందని దర్శకుడు సుశీంద్రన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
హన్సిక.. ఉదయనిధి.. ఓ సెల్ఫీ!
బబ్లీ బ్యూటీ హన్సిక.. సెల్ఫీలతో బిజీబిజీగా గడిపేస్తోంది. ఒకపక్క షూటింగులో పాల్గొంటూనే కాస్త విరామం దొరికినప్పుడల్లా ఓ సెల్ఫీ తీసేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఒకవైపు ట్విట్టర్, మరోవైపు ఇన్స్టాగ్రామ్ రెండింటిలోనూ హన్సిక తన సెల్ఫీలు పోస్ట్ చేస్తోంది. నేరుగా సెట్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నానంటూ హీరో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి తాను దిగిన ఫొటోలను ట్వీట్ చేసింది. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ తమ తమ ఫోన్లతో ఫొటోలు తీసుకుంటుండగా.. అవతలి నుంచి మూడో వ్యక్తి కూడా ఒకరు వీళ్లిద్దరినీ ఫొటో తీశారు. ఇప్పుడా సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోనే హన్సిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Reporting live from sets !!! Behind the scenes #candid @Udhaystalin -
శీనుగాడి లవ్‌స్టోరి మూవీ స్టిల్స్
-
ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను
ఇకపై హీరోగానే కాకుండా సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ లాంటి హీరోల చిత్రాలలో హాస్యపాత్రలూ చేస్తానని ప్రముఖ కమెడియన్ సంతానం వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం ఇనియే ఇప్పుడిదాన్. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. నటి ఆస్కా జవేరి, అఖిల్ హీరోయిన్లుగా నటించారు. దర్శక ధ్వయం మురుగన్, ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి సంతానం మాట్లాడుతూ ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాన్ని తొలిసారిగా తానే నిర్మించి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలు నిర్మించడం సులభమేనని, విడుదల చేయడమే కష్టమవుతోందని అన్నారు. చిత్ర టైటిల్ నమోదు చేయడం నుంచి థియేటర్ల వద్దకు తీసుకురావడం వరకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రం కథ సహజత్వానికి దగ్గర ఉంటుందన్నారు. కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. కమెడియన్‌గానే తనకు గుర్తింపు వచ్చిందని, కాబట్టి కేవలం హీరో పాత్రలే వేస్తానని చెప్పనని, తనకు సౌలభ్యంగా ఉండే నటులు సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ చిత్రాలలో హాస్య పాత్రలు చేస్తానని చెప్పారు. డాన్స్ నేర్చుకున్నా : తాను హీరోగా నటించడానికి సిద్ధమైన తర్వాత ఆర్య సలహాతో బరువు తగ్గానన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాల్సిన విషయం గురించి శింబు సూచనలు పాటించానని తెలిపారు. ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో తాను చూసిన కొన్ని సంఘటనలు, స్నేహితుల ప్రేమ విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రం కోసం కష్టపడి డాన్స్ నేర్చుకున్నానని, పాటలు జనరంజకంగా వచ్చాయని సంతా నం అన్నారు. -
గెటప్ మార్చిన ఉదయనిధి
వేషం మారెను, భాషను మార్చెను అసలు మనిషే మారెను అన్న పాట చందానా గెత్తు చిత్రం కోసం నటుడు ఉదయనిధి స్టాలిన్ గెటప్ మార్చారు. ఒరుకల్ ఒరు కన్నాడి, ఇదు కదిర్వేలన్ కాదల్, నన్భేండా చిత్రాల తరువాత ఉదయనిధి స్టాలిన్ నటించి నిర్మిస్తున్న చిత్రం గెత్తు. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ తిరుకుమరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కరుణాకరన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముందు చిత్రాల్లో లవర్ బాయ్‌గా కనిపించిన ఉదయనిధి స్టాలిన్ ఈ తాజా చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపించనున్నారట. అలాగని పూర్తి మాస్‌గా కనిపించరని సమాచారం. అమాయకంగా యువకుడి ఉదయనిధి కనిపిస్తే అందుకు పూర్తి వ్యతిరేకంగా సత్యరాజ్ పాత్ర ఉంటుందట. అలా ఒక రౌడీతో తల పడ్డ సత్యరాజ్ కథ కుటుంబానికి తెలియడంతో ఆ తరువాత హీరో ఉదయనిధి స్టాలిన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చిత్రం కథ అని తెలిసింది. ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తి అయిన గెత్తును ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
శీనుగాడి ప్రేమలో..!
తెలుగు తెరపై నయనతార కనిపించి సరిగ్గా ఏడాది అయ్యింది. ఈ మలయాళ మందారం నటించిన ‘అనామిక’ గత ఏడాది విడుదలైంది. ఆ చిత్రం తర్వాత నయనతార తెలుగులో సినిమాలు అంగీకరించలేదు. ప్రస్తుతం తమిళంలో నాలుగైదు చిత్రాలు చేస్తున్నారామె. అయినప్పటికీ ఇప్పుడు తెలుగు తెరపై కనిపించనున్నారు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన ఆమె కథానాయికగా నటించిన ‘ఇదు కదిరవేలన్ కాదల్’ చిత్రం తెలుగులోకి అనువాదమైంది. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్ ప్రభాకరన్ దర్శకుడు. ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాలను ఆదరించే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం అలరిస్తుంది. నయనతార అభిమానులకు ఈ చిత్రం ఓ పండగలా ఉంటుంది. సంతానం కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జయరాజ్, సమర్పణ: రెడ్ జైంట్. -
శీనుగాడు ప్రేమలో పడ్డాడు..!
శీనుగాడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కూడా మనోడి హుషారు చూసి ప్రేమలో పడిపోయింది. మరి అక్కడే పెద్ద ట్విస్ట్. అది తెలుసుకోవాలంటే ‘శీనుగాడి లవ్‌స్టోరీ’ని లుక్కేయాల్సిందే. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ‘ఇదు కదిర్వేలన్ కాదల్’ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా భీమవారం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తమిళంలో ఈ చిత్రం ఘన విజయం సాధించిందని, నయనతార పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనీ నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సి. కల్యాణ్, కె.వి.వి. సత్యనారాయణ, కె. అచ్చిరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, సురేశ్ కొండేటి, బీఏ రాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘శీనుగాడి లవ్‌స్టోరీ’ మూవీ స్టిల్స్
-
రొమాంటిక్‌గా ‘ఇదయం మురళి’
ఇదయం మురళి చిత్రం హ్యాపీగా షూటింగ్ సాగుతోందని ఆ చిత్ర హీరోయిన్ హన్సిక అంటున్నారు. అంతేకాదు. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్ర సక్సస్ ఈ తాజా చిత్రంతో రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని ఈ చుట్టబుగ్గల చిన్నది వ్యక్తం చేస్తోంది. కోలీవుడ్‌లో మంచి రైజింగ్‌లో ఉన్న హీరోయిన్ హన్సిక. అరణ్మణై, ఆంబళ చిత్ర విజయాలతో యమ ఖుషీగా ఉన్న హన్సిక ఈ మధ్య తన ఫొటోలతో మార్ఫింగ్ చేసిన బాత్రూమ్ సన్నివేశాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడంతో కాస్త అప్సెట్ అయ్యారు. ఇదయం మురళి చిత్ర షూటింగ్ ఆ బాధను తొలగించి సంతోషాన్ని నింపుతోందని హన్సిక అన్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా పరిచయం అయిన ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఆయనతో జోడి కట్టి సక్సస్‌ను అందుకున్న భామ తాజాగా మరోసారి ఆయనతో నటిస్తున్న చిత్రం ఇదయం మురళి. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు జీవా, త్రిష జంటగా ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారన్నది గమనార్హం. ఇదయం మురళి చిత్రం రొమాంటిక్ చిత్రం అని అన్నారు. ఈ బ్యూటీ నటించిన వాలు, రోమియో జూలియట్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం హన్సిక విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. -
వేగం పెంచిన ఉదయనిధి
యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్ తన చిత్రాల వేగాన్ని పెంచారు. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంతో కథా నాయకుడిగా తెరంగేట్రం చేసిన ఈయన ఆ చిత్రం విజయం సాధించినా ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రం చేయడానికి రెండేళ్లకు పైగా సమయం తీసుకున్నారు. ఆ తరువాత నన్బేండా చిత్రం చేశారు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఒక పక్క ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తూనే, మరో పక్క తదుపరి చిత్రాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సారి నెల గ్యాప్‌లో రెండు చిత్రాలు సెట్‌పైకి వెళ్లనుండడం విశేషం. అందులో ఒకటి ఎండ్రెండ్రుం పున్నగై చిత్ర దర్శకుడు అహ్మద్‌తో చేయనున్నారు. ఈ చిత్రానికి ఇదయం మురళి అనే పేరును నిర్ణయించారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ లవర్ బాయ్‌గా కనిపించనున్నారట. అయితే ఒక్క ప్రేమ కాదు స్నేహం గురించి కూడా ఇదయం మురళి చిత్రంలో చెప్పనున్నట్లు దర్శకుడు అహ్మద్ అంటున్నారు. ఉదయనిధి ఈ చిత్రంలో మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. ఆయనింతకుముందెప్పుడూ చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో ధరించనున్నారట. కథ, కథనం చాలా ఫ్రెష్‌గా ఉంటాయని దర్శకుడంటున్నారు. ఈ చిత్రంలో నాయకి ఎవరన్నది బయటపెట్టకపోయినా చిత్ర షూటింగ్ మాత్రం మార్చి నెలలో ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ తిరుకుమరన్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఐ ఫేమ్ అమీజాక్సన్ నటించనున్నారు. కీలక పాత్రలో సత్యరాజ్ నటించనున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనుంది. -
స్నేహానికి గౌరవాన్నిచ్చే నన్భేండా
సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. మరి ప్రేమా? ఈ రెండింటినీ చర్చించే చిత్రమే నన్భేండా. నటుడు ఉదయనిధి స్టాలిన్ నాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు ఇదు కదిర్వేలన్ కాదల్ చిత్రం ఉదయనిధితో రొమాన్స్ చేసిన నయనతార ఈ చిత్రంలోనూ ఆయనతో జత కట్టారు. ఎం.రాజేష్ శిష్యుడు ఏ.రాజేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడితో చిన్న భేటీ... ప్ర: నన్భేండా చిత్ర కథేంటి? జ: జీవితంలో స్నేహం మాత్రం చాలా ముఖ్యమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహం గౌరవాన్ని పెంచే చిత్రమే నన్భేండా. ఇదిచక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేమ ముఖ్యమా? స్నేహం ముఖ్యమా? అన్న విషయం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదు. రెండింటిలోనూ రెండు ఉంటాయి. రెండూ ముఖ్యమే అని చెప్పే చిత్రం నన్భేండా. ప్ర: ఉదయనిధి స్టాలిన్, నయనతారల నటన గురించి? జ: ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రం తరువాత ఉదయనిధి స్టాలిన్, నయనతారలు మరోసారి కలసి నటిస్తున్న చిత్రం నన్భేండా. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ ఎంతగా వర్కౌట్ అయ్యిందంటే చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది. చిత్రం ఆద్యంతం నటనలో విజృంభించారు. షాయాజి షిండే, శ్రీరంజనిల కొడుకుగా జీవితం గురించి ఎలాంటి చింతా పడని పాత్రలో ఉదయనిధి స్టాలిన్ నటించారు. ఆయన మాత్రమే నప్పే పాత్ర అది. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల బుద్ధి శాలి. ఇక నయనతార పూర్తి నిడివిగల పాత్రలో నటించారు. ఒక బ్యాంకులో పనిచేసే యువతి పాత్ర. ఆమె తల్లిదండ్రులు చిత్రంలో చూపించకపోయినా ఫొటోల్లో కనిపిస్తుంటారు. వారెవరన్నది సస్పెన్స్. ప్ర: మరి సంతానం మాటేమిటి? జ: ఉదయనిధి స్టాలిన్ పాత్రకు పూర్తి విరుద్దమైన పాత్రలో సంతానాన్ని చూస్తారు. వినోదాన్ని పండించడంలో విరగదీశారు. ఏ విషయాన్నైనా శాస్త్రవేత్త మాదిరి పూర్తిగా పరిశోధించి పరిష్కరించే వ్యక్తిత్వం. తను సీరియస్‌గా చేసే విషయాలన్నీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ప్ర: చిత్రంలో నటి తమన్న కూడా ఉన్నారట? జ: అది సస్పెన్స్ పాత్ర. అయితే చాలా ముఖ్యమైన పా త్ర. తమన్నతో పాటు షెరిన్, శుసన్తదితరులుముఖ్యపాత్రలు పోషించారు. షెరిన్ ప్రతినాయకి పాత్ర లో నటించారు. కొంచెం గ్యాప్ తరువాత వస్తున్న ఆమెకీ పాత్ర పేరు తెచ్చిపెడుతుంది. కరుణాకరన్, నాన్ కడవుల్ రాజేంద్రన్, మొదలగు వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. ప్ర: హరీష్జయకుమార్ సంగీతం గురించి? జ: ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరు హరీష్‌జయరాజ్. ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలామంది సం గీతాన్ని అందించారు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు విజువల్‌గాను కనువిందు చేస్తాయి. ప్ర: చిత్రంలో పంచ్ డైలాగ్స్ ఉంటాయట? జ: ఉదయనిధిస్టాలిన్, సంతానం నటిస్తున్నారంటే ఆ చిత్రం గురించి అభిమానులు చాలా ఊహించుకుంటారు. అందువలన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక్కో పంచ్ డైలాగ్స్ పేలేలా రూపొందించాం. చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నాం. -
వివాదాల్లో నటి కాజల్ అగర్వాల్
వివాదాల్లో హీరోయిన్లు అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. మొదట నటించడానికి సమ్మతించడం ఆ తరువాత కాల్షీట్స్ లేవంటూ నిర్మాతల్ని సమస్యల్లోకి నెట్టడంలాంటి చర్యల్లో నాయికలు చర్చనీయాంశంగా మారుతున్నారు. వీళ్ల వెర్షన్ మరోలా ఉంటుంది. తామిచ్చిన కాల్షీట్స్ సద్వినియోగ పరుచుకోకుండా ఇతర చిత్రాల్లో నటించనీయకుండా కొందరు నిర్మాతలు తమను నష్టపరుస్తున్నారన్నది నాయికల వాదన. ప్రస్తుతం ఇలాంటి వివాదాల్లోనే నటి కాజల్ అగర్వాల్, కన్నడ నటి హరిప్రియ చిక్కుకున్నారు. వీరిద్దరిపై నిర్మాతల మండలికి ఫిర్యాదులు చేరాయి. వివరాల్లోకెళితే నటి కాజల్ అగర్వాల్ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బేండా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అందుకు పారితోషికం కోటిన్నరగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అదేవిధంగా అడ్వాన్స్‌గా 40 లక్షలు పుచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద నన్బేండా చిత్రంలో కాజల్ నటించలేదు. ఆమెకు బదులు నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో తానిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్ కాజల్ అగర్వాల్‌ను అడిగారు. అందుకామె అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదు పొమ్మంది. అందుకామె చెబుతున్న రీజన్ తాను కేటాయించిన కాల్షీట్స్ను సద్వినియోగం చేసుకోకుండా చివరి క్షణంలో షూటింగ్ షెడ్యూల్ మార్చుకోవడం వల్ల తన కాల్షీట్స్ వృథా అయ్యాయని, తద్వారా తెలుగులో ఒక ప్రముఖ నటుడితో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందన్నది. దీంతో ఉదయనిధి స్టాలిన్ కాజల్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మండలిలో చర్చ జరుగుతుండగా కాజల్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని కాజల్ వర్గం తేల్చి చెప్పేసినట్లు సమాచారం. అదేవిధంగా తమిళంలో మురన్, వల్లకోట్టై తదితర చిత్రాల్లో నటించిన కన్నడ నటి హరిప్రియ ఒక కన్నడ చిత్రంలో నటించడానికి రెండు కోట్లు తీసుకుందట. అయితే ఆ చిత్రంలో ఆమెకు బదులు వేరే నటిని ఎంపిక చేసినట్లు తెలిసింది. దీంతో ఆ నిర్మాత నుంచి తీసుకున్న రెండు కోట్లు తిరిగి ఇవ్వడానికి నటి హరిప్రియ నిరాకరించారట. ఇప్పుడా నిర్మాత కన్నడ నిర్మాతల మండలిలో హరిప్రియపై ఫిర్యాదు చేశారు. అయితే ఈమె కూడా తీసుకున్న రెండు కోట్లు తిరిగిచ్చేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. చిత్రంలో ఒక్క రోజు నటించి ఆ తరువాత నటించకపోతే తీసుకున్న మొత్తం తిరిగి నిర్మాతకు చెల్లించాలనే నిబంధన సంఘంలో ఉందట. కానీ ఈ ఇద్దరు భామలు ఒక రోజు కూడా నటించకుండా ఆ చిత్రాల్లో నటించలేదు. కాబట్టి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సిందే లేని పక్షంలో తగిన చర్యలుంటాయని సీనియర్ నిర్మాత ఒకరు అన్నారు. కాబట్టి నటి కాజల్ అగర్వాల్, హరిప్రియల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
ఉదయ నిధితో సై
నటి ఎమిజాక్సన్ యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ తో రొమాన్స్‌కు సై అన్నట్టు తాజా సమాచారం. ఈ లండన్ బ్యూటీకిప్పు డు కోలీవుడ్‌లో అవకాశాలు క్యూ కట్టడం విశేషం. మదరాసుపట్టణంతో తమిళ చిత్ర రం గంలో ప్రవేశించిన ఈ అమ్మడు ఆ తరువాత విక్రమ్‌తో తాండవం చిత్రంలో జోడీకట్టింది. మధ్యలో ఏక్ దివానా తా (నీదానే ఎన్ పొన్ వసంతం చిత్రానికి రీమేక్)తో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ ఆ చిత్రం ఢమాల్ అవడంతో మళ్లీ కోలీవుడ్‌కు వచ్చింది. తమిళ పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను అందలం ఎక్కించేస్తోంది. తాండవం తరువాత మరో సారి విక్రమ్‌తో ఐ చిత్రంలో నటించింది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఎమి జాక్సన్ ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషపడిపోయింది. ఈ చిత్రం విడుదల కాకుండానే అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సూర్యకు జంటగా మాస్ చిత్రంలో నటిస్తున్న ఎమికి ఉదయనిధి స్టాలిన్ ఆఫర్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎమిజాక్సన్తో డ్యూయెట్లు పాడనున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రానికి కెత్తు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ ముద్దుగుమ్మ కూడా కొన్ని సెకండ్ గ్రేడ్ హీరోల చిత్రాలను కూడా కాదని ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేయడానికి సై అందట. ఇందుకు మరో కారణం కూడా ఉందట. ఈ పరదేశీ బ్యూటీ అడిగిన పారితోషికం చెల్లించడానికి ఉదయనిధి స్టాలిన్ వెంటనే ఓకే అనడంతో ఎమిజాక్సన్ ఆయనతో నటించడానికి ఎస్ అన్నారని కోలీవుడ్ టాక్. -
ఆ డబ్బు చెల్లించేది లేదు!
తమిళ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌పై తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని నటి కాజల్ అగర్వాల్ అంటున్నారు. ‘నన్బేన్డా’ చిత్రంలో నటిస్తానని చెప్పి కాజల్ తీసుకున్న 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదని ఉదయనిధి స్టాలిన్ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి నటి కాజల్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఆ సినిమాకు నేనిచ్చిన కాల్షీట్స్ని వాళ్లు ఉపయోగించలేదు. అదే సమయంలో నేను తెలుగులో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం వదులుకున్నాను. అందుకే నష్టపరిహారంగా ఆ 40 లక్షలు నేను చెల్లించను’’ అని కాజల్ చెప్పారు. ఉదయనిధి ఫిర్యాదుకు సంబంధించిన లేఖ అందగానే, తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఆయనపై ఫిర్యాదు చేస్తానని కాజల్ పేర్కొన్నారు.