undavalli arunkumar
-
వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని.. అందులో ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకున్నా.. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చినా అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. అఫిడవిట్‌ను పరిశీలించి వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఇంటిపేర్లు, అడ్రస్‌లు లేకుండానే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ వర్చువల్‌గా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు.. ఇంటిపేర్లు ఉన్నా.. వారి అడ్రస్‌లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్‌లు చూపించారు.చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో.. ఇవ్వలేదో సరిగా వివరాల్లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకు పైగా కట్టారు. ఆయన అడ్రస్‌కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసును బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు. ‘చందాల వసూలు అంతా అక్రమమేనని ఆర్బీఐ తేల్చిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచురించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరారు. అనంతరం అరుణ్‌కుమార్ పేరు కాజ్‌లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్‌ను పరిశీలించి సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది. -
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'
కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం.. – సుప్రీం కోర్టు సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్‌కు, ఈ తాజా క్వాష్ పిటిషన్‌కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్ క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. రూ.5 వేలు డిపాజిట్‌దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..? ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్‌తో కలిపి ఇంత మొత్తం అయింది. ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...! అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్ స్టేట్ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు. అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు... మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి... తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్‌గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్బీఐ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే.. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్‌ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్లో హెచ్‌యూఎఫ్ విషయంలో వచ్చిన తప్పును సవాల్ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి... ‘‘పిటిషన్ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్ పర్సన్‌గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆర్బీఐ, ఉండవల్లి అరుణ్‌కుమార్, రామోజీరావు, అన్‌క్లయిమ్ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేం... కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్‌కుమార్ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు.. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్‌లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్ (స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. -
‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిందించిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కిల్ డెపలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్ వేశారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూప్‌లోని ఇతర సంస్థలకు మళ్లించారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. -
మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన సవాల్‌కు తాను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మార్గదర్శి అక్రమాలపై పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మార్గదర్శి అక్రమాలను వెనకేసుకొస్తూ చర్చకు సవాల్ విసురుతున్నారని చెప్పారు. తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ చర్చ రామోజీరావు సమక్షంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం చంద్రబాబు ద్వారా జీవీ రెడ్డి ప్రయత్నించాలని సూచించారు. తద్వారా దీనికి జాతీయ స్థాయిలో విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ చర్చలో రామోజీ పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫర్వాలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అవకాశం లేని పక్షంలో.. టీడీపీ ప్రధాన కార్యాలయంలోనైనా ఏర్పాటు చేయాలన్నారు. జనసేన కూడా మార్గదర్శికే అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 14న మార్గదర్శి అక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. -
అందరికీ నీతులు చెప్పే రామోజీ ఎప్పుడో ఈ పని చేయాలి?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ పోరాట యోధుడు. పట్టు వీడకుండా దేశంలోనే అతికొద్ది మంది అత్యంత శక్తివంతులలో ఒకరైన ఈనాడు అధినేత రామోజీరావుపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఎలాగైతే కొంతమేర సాదించగలిగారు. మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో గతంలో రామోజీ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. అది ఆర్బీఐ చట్టంలోని 45 ఎస్ ప్రకారం నేరం. అలా చేసినవారికి జైలు శిక్షతో పాటు, రెట్టింపు జరిమానా విధించాలని నిబందన చెబుతోంది. రామోజీరావు హెచ్యుఎఫ్ పేరుతోనో ,ప్రొప్రైటర్ షిప్ పేరుతోనే 2600 కోట్ల డిపాజిట్లు సెకరించారు. దీనిపై ఎప్పుడో 2007లో ఉండవల్లి కేసు వేశారు. ఇలా డిపాజిట్లు వసూలు చేసి ఇతర చోట్ల పెట్టుబడితే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఈ వ్యవహారాలపై విచారణ జరిపించింది. తత్ఫలితంగా రామోజీ 2600 కోట్లను చెల్లించేసినట్లు ప్రకటించారు. మంచిదే. అయితే అసలు నేరం చేశారా?లేదా అన్న సమస్య అలాగే ఉంది. ఎవరైనా దొంగతనం చేసి, ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తే నేరం కాకుండా పోతుందా?అలాగే రామోజీ చట్టాన్ని పాటించకుండా డిపాజిట్లు సేకరించారా?లేదా? ఆ డిపాజిట్లు ఎవరెవరినుంచి సేకరించారు? వారి వివరాలు ఏమిటో చెప్పాలన్నది ఉండవల్లి డిమాండ్. దీనిపై రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారట. డిపాజిటర్ల వివరాలు ఇస్తే వైఎస్ ప్రభుత్వం కక్ష కడుతుందని అప్పట్లో వాదించారట. ఇంతలో రాష్ట్ర విభజన జరిగింది. తదుపరి హైకోర్టు కూడా కూడా విభజన జరిగి ఏపీకి మారే ముందు రోజున ఎందువల్లో హైకోర్టులో రామోజీ డిపాజిట్ల సేకరణ కేసు కొట్టేశారట. దానిని కనీసం ఉండవల్లికి చెప్పలేదట. ఎలాగో కొంతకాలానికి ఆ సమాచారం అందుకున్న ఉండవల్లి మళ్లీ తన పోరాటం కొనసాగించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ దానిని అనుమతించడం రామోజీకి ఇబ్బందిగా మారింది. ఈ మధ్య లో రామోజీ కోర్టులో ఉండవల్లిపై పరువు నష్టం దావా వేశారట. ఆ దావా గురించి అయినా ఉండవల్లి ఈ కేసు సంగతి తేల్చవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అన్నిటిని కూలంకశంగా అధ్యయనం చేసే ఆయన తన పట్టు బిగించారు. డిల్లీలో తనకు తెలిసిన ఒక లాయర్‌ను వినియోగించడమే కాకుండా, అవసరమైతే తానే స్వయంగా హాజరు కావడం వంటివి చేస్తూ వస్తున్నారు. అలా పదహారేళ్ల క్రితం మొదలైన ఈ కేసు ఇప్పటికి ఒక దశకు చేరిందని అనుకోవాలి. ఇంతకాలం తనకు ఎదురు లేకుండా సాగుతున్న రామోజీకి సడన్ గా ఒక ఎదురు దెబ్బ తగిలినట్లయింది. తను సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్ దారుల వివరాలు, వాటిని వసూలు చేసిన తీరు మొదలైన వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి అందరికి నీతులు చెప్పే రామోజీ ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది. 2007లో డిపాజిట్ల వసూలుపై కేసు వచ్చినా, మరో రూపంలో మళ్లీ డిపాజిట్లు వసూలు చేస్తున్నారని ఇటీవల ఏపీ సీఐడీ అభియోగం మోపింది. అంతేకాదు. సుమారు 600 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి మార్గదర్శిని మార్గంగా ఎంచుకున్నారని సీఐడీ కనిపిట్టినట్లు వార్తలు వస్తున్నాయి.బహుశా ఈ నేపద్యంలోనే అది బయటపడరాదనే కావచ్చు.. మార్గదర్శి చిట్ ఫండ్ రికార్డులను ఇవ్వడానికి కూడా రామోజీ ఇష్టపడడం లేదు. పారదర్శకత గురించి సుద్దులు చెప్పే ఆయన తన వద్దకు వచ్చేసరికి అంతా రహస్యం అని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇందులో రహస్యం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు ఆయన డిపాజిట్ దారుల వివరాలు ఎలా ఇస్తారన్నది ఆసక్తికరమైన విషయంగా ఉంది. ఆ వివరాలు ఇవ్వకుండా రామోజీ ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారేమో చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టులో మాత్రం ఆ వివరాలు ఇస్తామని చెప్పారు. అలా చేస్తే మంచిదే. ఈ సందర్భంలో ఉండవల్లి ఒక మాట చెబుతున్నారు. రామోజీని జైలులో పెట్టాలని ,శిక్షలు వేయాలని కోరుకోవడం లేదని, కాని చట్టం రామోజీకి వర్తిస్తుందా?లేదా? ఆయన తప్పు చేశారా?లేదా? డిపాజిట్ దారుల నుంచి డబ్బు చెక్‌ల రూపంలో తీసుకున్నారా?లేక వేరే రూపాలలో తీసుకున్నారా?ఇలాంటి విషయాలు బయటకు రావాలన్నది తన కోరిక అని అన్నారు. ఇందులో తప్పు తేలితే రామోజీకి ఒక రూపాయి ఫైన్ వేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఇక ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తన వాదనపై అఫిడవిట్ వేయవలసి ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని రామోజీ మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఏపీలో మాత్రం ఆయన పప్పులు ఉడకడం లేదు. చిట్ ఫండ్ డబ్బు మొదలు, పరోక్షంగా రశీదుల రూపంలో డిపాజిట్ల సేకరణ తదితర అవకతవకలపై సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఉండవల్లి చేస్తున్న డిమాండ్ , ఆయన పోరాటంలో హేతుబద్దత కనిపిస్తుంది. ఆయన ఏదో ద్వేషంతో చేయడం లేదు. ఒక కాజ్ గురించి ,రాజ్యాంగం రామోజీకి వర్తిస్తాయా?లేదా? అన్నది తేల్చుకోవడం కోసం ఇంతకాలంగా పోరాడుతున్నారు. వచ్చే నెలల్లో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో కాని, ఇప్పటికైతే రామోజీపై ఉండవల్లి ఎంతో కొంత పైచేయి సాధించగలిగారని చెప్పాలి. .రామోజీరావు కూడా రాజ్యాంగానికి అతీతుడు కాడని కొంతవరకైనా ఉండవల్లి అరుణకుమార్ రుజువు చేయగలిగారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శికి సుప్రీంకోర్టు ప్రశ్న
ఒక చోట ప్రొప్రయిటర్ అన్నారు... మరొక చోట హెచ్యుఎఫ్ అన్నారు. అలా చెప్పటం చట్ట విరుద్ధం కదా? డిపాజిటర్లకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా?. లేకుంటే వాటి వివరాలు బహిర్గతం చేయొచ్చు కదా?.. కోర్టుకు అన్ని వివరాలూ అందజేయండి. – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేని పక్షంలో ఆయా వివరాలు పూర్తిగా కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉందని, రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం వాయిదా కోరుతూ లెటర్‌ను సర్క్యులేట్ చేయగా.. దానిపై మార్గదర్శి అభ్యంతరం చెప్పింది. అభ్యంతరాలతో కూడిన లెటర్‌ను సోమవారం రాత్రే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సర్క్యులేట్ చేసింది. దీన్ని గుర్తుచేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. వాదనలు వినిపించారు. ఈ దశలో జస్టిస్ జేబీ పార్డీవాలా జోక్యం చేసుకుని.. ‘‘కొన్నిసార్లు వాదించినప్పుడు ప్రొప్రయిటరీ అంటున్నారు. మరికొన్ని వాదనల్లో హెచ్యుఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబం) అని పేర్కొంటున్నారు. ఇది సమస్యాత్మకం కదా? అని ప్రశ్నించారు. తదుపరి విచారణ జరిగేటప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. హెచ్‌యూఎఫ్– ప్రొప్రయిటర్ రెండూ ఎలా కుదురుతాయి? హెచ్యుఎఫ్ అంటే వ్యక్తుల సమూహం (అసోసియేషన్ ఆఫ్ ఇన్డివిడ్యుయల్స్) కదా? మరి ప్రొప్రయిటరీ షిప్‌ను కూడా ఇందులో ఇండివిడ్యుయల్ కెపాసిటీలో చూపుతున్నారా? ఇలా చేయటం చట్ట విరుద్ధం కదా? అని జస్టిస్ పార్డీవాలా ప్రశ్నించారు. గత విచారణలో డిపాజిటర్లందరికీ సొమ్ములు వెనక్కి ఇచ్చేశాం అన్నారు కదా? అని కూడా లూత్రానుద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పార్టీ ఇన్ పర్సన్ ఉండవల్లి అరుణ్‌కుమార్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు జోక్యం చేసుకుంటూ... డిపాజిటర్లకు సొమ్ములు తిరిగి ఇచ్చేశాం అన్నారు కానీ, వివరాలు ఎక్కడా వెల్లడించలేదని గుర్తుచేశారు. ఇటు ప్రభుత్వానికి కానీ అటు కోర్టుకు గానీ వివరాలు చెప్పలేదన్నారు. ఆయా వివరాలు అందజేయాల్సిందిగా కోరాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆడిటర్ స్టేట్మెంట్ ప్రకారం తాము వివరాలు ఇచ్చామని లూత్రా తెలిపారు. ఈ దశలో ఉండవల్లి జోక్యం చేసుకుంటూ వారిని వివరాలు అందజేయాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. దీంతో... వివరాలు వెల్లడించడంలో ఏమైనా సీక్రెట్ (రహస్య) దాగుందా? అని లూత్రాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇందులో రహస్యం ఏమీ లేదని లూత్రా చెప్పగా... అయితే, కోర్టులో ఫైల్ చేయాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. ఈ దశలో మార్గదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకొని హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎవౖరెనా వివరాలు కావాలని ముందుకొస్తే అందజేస్తామనిన్నారు. జస్టిస్ సూర్యకాంత్ కల్పించుకుని ‘‘డిపాజిట్లు తిరిగి ఎవరెవరికి ఇచ్చారు? ఎంతెంత ఇచ్చారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని లూత్రా, సింఘ్విలనుద్దేశించి అన్నారు. ‘‘2007 మార్చి చివరి నాటికి డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ.2541 కోట్లు. తిరిగి వెనక్కి ఇచ్చింది రూ.2596 కోట్లు.. తదనంతరం ఖాతాలో బ్యాలెన్స్ రూ.5.43 కోట్లు’’ అని ఆడిటర్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని లూత్రా కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణ సమయానికి ఎవరెవరికి ఎంతెంత చెల్లించారనే వివరాలు సమగ్రంగా కోర్టుకు అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. ఇదీ.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కథ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థకు జనం నుంచి డిపాజిట్లు సేకరించేందుకు అనుమతి లేదు. అయినా సరే... హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన సంస్థగా పేర్కొంటూ జనం నుంచి డిపాజిట్లు సేకరించి వారికి బాండ్లు జారీ చేశారు. ఆ బాండ్లపై హెచ్‌యూఎఫ్ కర్తగా రామోజీరావు సంతకం చేశారు. కానీ ఆ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాల్సి వచ్చినపుడు ఆ చెక్కులపై ప్రొప్రయిటర్ హోదాలో రామోజీరావు సంతకాలు చేశారు. ఇదంతా ఎందుకంటే 1934 నాటి రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్ 45(ఎస్) ప్రకారం... వ్యక్తులెవరూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకుండా నిషేధించారు. దీన్ని తప్పించుకోవటానికి అక్రమంగా హెచ్‌యూఎఫ్ ముసుగులో రామోజీ డిపాజిట్లు సేకరించినట్లు అప్పట్లో నాటి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటానికి దిగారు. అక్రమాలన్నీ నిజమేనని తేలటంతో... రామోజీరావు డిపాజిట్లు సేకరించటం నిలిపేశారు. కేసు విచారణలో ఉండగానే... మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను మూసేశారు. అయితే అక్రమంగా డిపాజిట్లు సేకరించటం నేరం కనక... ఆ నేరాన్ని నిర్ధారించడానికి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. డిపాజిటర్ల వివరాలు ఎందుకు దాస్తున్నారు?: ఉండవల్లి ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై మార్గదర్శిలో తగిన యంత్రాంగం లేదని కూడా ఉండవల్లి కోర్టుకు తెలిపారు. రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై పలు కేసులు ఉన్నాయని, గూగుల్‌లో చూస్తే అన్నీ తెలుస్తాయని పేర్కొన్నారు. ‘‘డిపాజిటర్ల వివరాలు ఎందుకు దాస్తున్నారు? బయటకు వెల్లడించొచ్చు కదా!, ఆయా వివరాలపై అఫిడవిట్ దాఖలు చేయొచ్చు కదా!’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. గత విచారణ సమయంలో డిపాజిటర్ల వివరాలు రిజర్వు బ్యాంకుకు (ఆర్బీఐ) చెప్పాలని సుప్రీంకోర్టు సూచించగా.. ఆయా వివరాలు ఆర్బీఐకు అందజేశామని ఇక సమస్య ఏముందని లూత్రా చెప్పగా.... ఆర్బీఐ కూడా ఈ కేసులో పార్టీగా ఉందన్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. దీంతో వివరాలు వెల్లడించడానికి తమకేమీ ఇబ్బంది లేదని లూత్రా పేర్కొన్నారు. ‘‘రిజాయిండర్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం’’ అని జస్టిస్ సూర్యకాంత్ ఆర్డర్ చదువుతుండగా.. డిపాజిటర్ల వివరాలు వెల్లడించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఆదేశించాలని ఉండవల్లి ఇంకోసారి అభ్యర్థించారు. ‘‘డిపాజిటర్లకు చెల్లింపు వివరాలు అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను, రామోజీరావును ఆదేశిస్తున్నాం’’ అని జస్టిస్ సూర్యకాంత్ ఉత్తర్వులు చదువుతూ చెప్పారు. తదుపరి విచారణ జూలైలో చేపడతామని ధర్మాసనం పేర్కొంది. -
ఏప్రిల్ 11న రాష్ట్ర విభజన కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 11న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఉండవల్లి అరుణ్‌కుమార్ తన పిటిషన్లో అభ్యర్థనను మార్చారు. రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల వ్యవహారాలను త్వరగా తేల్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూరేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై గతేడాది నవంబరు 28న విచారణకు రాగా ఫిబ్రవరి 22న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల14న సుప్రీంకోర్టు ఓసర్క్యులర్ జారీ చేసింది. ఓసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని అందులో స్పష్టంచేసింది. దీంతో బుధవారంనాటి విచారణ జాబితా నుంచి ఈ కేసును రిజిస్ట్రీ తొలగించారు. దీంతో ఉండవల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్ మంగళవారం సాయంత్రం కోర్టు పనివేళల ముగింపు అనంతరం జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను కనీసం పది, పదిహేను రోజులు విచారించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో తన పదవీ విరమణ ఉందని జస్టిస్ జోసెఫ్ గుర్తుచేశారు. అన్ని రోజులు అవసరంలేదని రమేశ్ వివరించారు. దీంతో ఏప్రిల్ 11న విచారణ చేపడతామని, ఆ రోజు జాబితాలో చేర్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ ఆదేశాలు ఉంచింది. -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. వడ్డీతో సహా చెల్లిస్తాం: రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై టీపీసీసీ ఛీప్ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు ఎదుట రేవంత్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ ప్రత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారు. స్వాతంత్య్రం అనంతరం అప్పులతో పత్రిక మూతపడింది. దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు కాంగ్రెస్ ఊపిరిపోసి మళ్లీ ప్రారంభించింది. బీజేపీ దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళినా మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీలో మొదలైంది. అందుకే మూసేసిన కేసులో నోటీసులు ఇచ్చారు. ఇక, సాయంత్రం 5 గంటల వరకే విచారణ ముగించాల్సింది. కానీ, ఈడీ ఆఫీస్‌లో రాహుల్ గాంధీని 12గంటల పాటు కూర్చోబెట్టారు. ఇది ప్రధాని మోదీకి తగునా.. ఓ ఎంపీని, పార్టీ అధ్యక్షుడిని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాలి. తల్లి ఆసుపత్రిలో ఉండగా.. కొడుకును ఇలా విచారణ పేరుతో గంటల కొద్దీ కూర్చోపెట్టడం కరెక్టేనా. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంత బరితెగింపు మంచిది కాదు. భారత దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని దారపోయడానికి సిద్దమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. బీజేపీ నేతలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ఇంతా మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ నేతలు చెప్పినట్లు వింటే.. రేపు అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. 300సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. తక్షణమే కేసును ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ తీరు మారకుంటే.. ఈ నెల 23న ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసును తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారు. అనంతరం, ఉండవల్లి అరుణ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో ఉండవల్లి భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హనీట్రాప్‌లో ఉండవల్లి పడ్డారు. ఉండవల్లి.. సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేది. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో?. ఉండవల్లి.. కేసీఆర్ పంచన చేరి భజన చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లికి ఉన్న గౌరవం పోయింది. బీజేపీపై కేసీఆర్ పోరాడితే..కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడంలేదు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు. రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారు. రెండు పుస్తకాల్లో తెలంగాణ ఏర్పాటునే తప్పుబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను విమర్శించారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలిసి పనిచేయమంటరా?. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్‌తో కలవద్దు. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే.. తెలంగాణ సమాజం ఊరుకోదు’’ అంటూ వ్యాఖ్యాలు చేశారు. ఇది కూడా చదవండి: బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసుల నోటీసులు -
ఏపీ విభజన కేసు విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమ కోహ్లిల ధర్మాసనం ముందు ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయవాదులు ప్రశాంత్‌భూషణ్, రమేశ్ అల్లంకి ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2014లో ఏపీ విభజన పూర్తికాలేదని, విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్, మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు తెలిపారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రతివాదులకు నోటీసులు జారీచేశారని, కానీ ఆ పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ జరగలేదని చెప్పారు. 2019లో ఉండవల్లి ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేసినా ఇప్పటివరకు జాబితాలోకి రాలేదని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తమ ప్రేయర్‌ను సవరిస్తూ పిటిషన్ వేశామన్నారు. 2014లో ఏపీ విభజన జరిగింది.. తప్పోఒప్పో ఏపీ విభజన జరిగిపోయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని కోరామన్నారు. అదే సమయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థికంగా సాయం చేయాలని సవరణ పిటిషన్ వేసినట్లు వివరించారు. తక్షణమే విచారించాలని తాము కోరడం లేదని, ఏదో ఒకరోజు తేదీని నిర్ణయించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సవరణ పిటిషన్ విచారణకు తేదీ కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. -
ఆంధ్ర విలన్ అంటేనే కేసీఆర్ తనకు మంచిదని నమ్ముతున్నారు : ఉండవల్లి
-
సీఎం జగన్ వ్యక్తి కాదు.. వ్యవస్థ
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు విచారకరమని, ముఖ్యమంత్రి కేసులకు భయపడే వ్యక్తి కాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాను ఒకప్పుడు ఆయన ఎదుర్కొన్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం. సీఎం జగన్‌ను ఉండవల్లి నువ్వు అని సంబోధించడం సరికాదు. ( 'చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు' ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. మీకు చెప్పే స్థాయి కాదు.. మీ పై ఉన్న గౌరవంతో మాత్రమే మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పాలన చేయాల్సి ఉంది. తెలంగాణ, ఢిల్లీలో ఉన్న పరిస్థితి వేరు. వారికి బీజేపీయే ప్రత్యర్థి. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంత వాసులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ త్వరితగతిన పూర్తి చేసి పోలవరం విషయంలో ముందుకు వెళ్తా’’ మన్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి? : శివరామ సుబ్రమణ్యం ‘‘సీఎం జగన్ ప్రభుత్వంపై, చేపడుతున్న కార్యక్రమాలపై అవాకులు, చవాకులు విసురుతున్నారు. ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి?. ప్రజలను గందరగోళ పరచడానికి ప్రయత్నిస్తున్నారా?. వైఎస్సార్ హయాంలో కేంద్రం నిధులు రాకపోయినా కాలువ పనులు పూర్తి చేయలేదా?. టీడీపీ హయాంలో టెండర్లలో అవకతవకలు జరిగాయి కదా!. సీఎం జగన్ కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతున్నాం. సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి విజయం సాధించారు. ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తిని కేంద్రంతో లాలూచీపడున్నాడనడం సరికాదు. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంలా చూడమంటారా?. రాష్ట్రంలో మరో మూడు దశాబ్దాల వరకు బీజేపీకి మనుగడ ఉండదు. గతంలో అరుణ్ జైట్లీ, చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని చెప్పింది మీరు కాదా?. చంద్రబాబును కలిశాక మీరు ఏం మాట్లాడుకున్నారు.. మీ మాటల్లో మీకు క్లారిటీ ఉందా? ఎవరు మీతో మాట్లాడిస్తున్నారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
చంద్రబాబు పోలవరాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టాడు
-
ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం సరైందే
-
‘ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పేమీ లేదు’
సాక్షి, తూర్పుగోదావరి: ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు. ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని లోక్‌సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తాలని సీఎం జగన్‌కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి దానవైపేట ప్రకాష్ నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ‘కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్’ గా వ్యవహరిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. -
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
-
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచించిన ‘వైయస్సార్ ఛాయలో’ అనే పుస్తక ఆవిష్కరణ వేడుక అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
అట్లాంటాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
జార్జియా: అట్లాంటాలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బిరియానీ పాట్ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి. సుమారు వందమందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ చిరకాల మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తన అనుభవాలను కొన్నింటిని అక్కడి ప్రవాసాంధ్రులతో పంచుకున్నారు. వంద రోజుల పాటు తాను రాజకీయాలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నందున, వాటి గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వారితో తన అనుబంధాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడతానంటూ ప్రసంగాన్ని ప్రారంభిచారు. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం ఒక పార్టీ అధినేతకు, కార్యకర్తకు ఉన్న సంబంధం మాత్రమేనని అయితే ఆయనకు నాలో కొన్ని అంశాలు నచ్చటం వలన తనను అభిమానించి ఎంపీని చేశారన్నారు. పార్టీలకతీతంగా అందరి హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ అని తెలిపారు. ఆయన మరణవార్తను విని తట్టుకోలేక గుండె ఆగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అలా ప్రాణాలు కోల్పోయిన ఒక కుటుంబం గురించి సవివరంగా చెప్పారు. ఆయన ప్రసంగం విన్నవారందరికీ ఒక్కమారు కన్ను చెమర్చిన మాట వాస్తవం. చివరగా అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఒకమాట చెప్పమని అడిగారు. దీనికి ఉండవల్లి స్పందిస్తూ జగన్ కేవలం మంచి పరిపాలన అందిస్తే సరిపోదు. తన తండ్రి ఇచ్చినటువంటి అద్భుతమైన పాలనను మరిపించగలిగేలా, గొప్పగా పాలన అందించాలి. అది అతని ముందున్న సవాలు. ప్రస్తుత ప్రభుత్వం వేసే అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. తన ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడనే భావిస్తున్నాను. ఎప్పుడూ ఏ సభలకు హాజరవ్వని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకసారి వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు విశాఖపట్నం సభకు రావడం, ఆ సభలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలుపరుస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి నేతల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ అభినందించడాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ అందరి మనసుల్లో ఉన్నారంటే అందుకు ఆయన చేసిన మంచి పనులే కారణమని కొనిడియారారు. విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమాలు మాతృదేశ అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అట్లాంటా వైఎస్ఆర్సీపీ విభాగాన్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం
-
‘అదే జరిగితే రాజమండ్రి మొత్తం కొట్టుకుపోతుంది ’
సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని.. ఇండియా-పాకిస్తాన్లా ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఒక దేశ ప్రధాని ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఐదేళ్ల తర్వాత రాజకీయ బెనిఫిట్స్ కోసమే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రకటనలు చేయ్యొద్దని కోరారు. మంగళవారం ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి ప్రస్తుత రాజకీయ అంశాలు, రాష్ట్ర పరిస్థితులతో పాటు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ఏపీలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని ఆరోపించారు. పోలవరం వద్ద భూమి కుంగిపోతుందని, ఇది మాములు విషయం కాదని, సరిగ్గా కట్టకపోతే రాజమండ్రి మునిగిపోతుందని హెచ్చరించారు. నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే. ఒక ప్రధాని అలా అనడం సరికాదు రాష్ట్ర విభజన మీద చర్చ పెట్టండని మొదటి నుంచి మాట్లాడుతున్నా.ఇండియా - పాకిస్తాన్ లాగా ఆంధ్రా - తెలంగాణాని మార్చారని మోడీ ఆరోపించారు.. ఏపీ-తెలంగాణ ప్రజలు ఇక్కడ స్నేహపూర్వకంగానే ఉన్నారు. ఒక దేశ ప్రధాని దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరైనది కాదు. ఇకనైనా..కొత్తగా ఎన్నికైయ్యే అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు విభజన జరిగిన తీరు మీద మరోసారి చర్చ జరిగేలా చూడండి. తద్వారా మనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు, ఆ సమస్య ఎలా తీరుతుంది అనేది తెలుస్తుంది. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం పోలవరం పూర్తైతే 80% భూమికి నీరు అందుతుంది. పోలవరం విషయంలో మీరు వెళ్తున్న దారి సరికాదని ముందు నుంచే చెబుతూ వచ్చాను.రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజలను తీసుకెళ్లారు. నేను స్వయంగా వస్తా అంటే ఎవరూ స్పందించలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తా. ఇరిగేషన్ మంత్రి జూన్‌లో నీళ్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. మీరు వచ్చే ఏడాది తర్వాత అయిన నీళ్లు ఎలా ఇస్తారో చెప్పండి. లెప్ట్ కెనాల్ పనులు అయ్యాయి, రైడ్ కెనాల్ పనులు పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రి కొట్డుకుపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడుచుకుపొతాయి. ఎన్నికలు అయిపోయాయి, ఎన్ని వేషాలు వేసిన ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎన్నికలు రావాలంటే ఐదేళ్లు పడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి. పోలవరం విషయం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని అక్కడి అధికారులే నాకు చెబుతున్నారు. కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది? ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేసారా? ముంపు ప్రజలకు 30 వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమే. పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబుకు లేదు. వీరి గొడవ ఏంటో అర్థం కావడంలేదు సీఎస్ వర్సెస్ సీఎం వీరి గొడవ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వైఎస్సార్ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టారు.ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్డు వెళ్లారు. కోర్టు మొట్డికాయలు వేస్తే ఎల్వీకి బాధ్యతలు ఇచ్చారు. అసలు చంద్రబాబుకు సుబ్రమణ్యంతో గొడవ ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు మీరు మోడీని లేదా జగన్‌ను, ఇతర నేతలను విమర్శించండి. సీఎస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయలని తపన పడ్డారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నారు. బాబు..కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీవీ ప్యాడ్ల స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నారు. అసలు ఓటేసి తర్వాత మీడియా ముందుకొచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా నా ఓటు నాకే పడిందో లేదో తెలియ తెలియదు అనడం సరైనది కాదు. చంద్రబాబు ఇరిటేషన్‌కి గురవుతున్నారు. కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి చంద్రబాబు. మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుంది. వచ్చే సారి అధికారంలోకి వస్తుంది. ఎందుకు రిజల్ట్ రాకుండా ఆవేశపడుతున్నారో అర్థం కావలేదు. యూపిఏ హయంలలోనే ఈవీఎంలు ప్రారంభమైయ్యాయి.గతంలో ఓడిపోయారు, లాస్ట్ టైం అవే ఈవిఎంలతో గెలిచారు.ఇప్పుడు వాటితోనే ఎన్నికలకు వెళ్తే ఎందుకు అంత ఇదవుతున్నారు? ప్రతి నియోజకవర్గంలో ఐదు స్లిప్పులు లెక్కిస్తారు. అందులో తేడా వస్తే అప్పుడు తప్పుపట్టాలి. ఏమీ లేకుండా వివాద వివాదం క్రియేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. -
ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం దిగజారుస్తోంది
-
విభజన తీరుపై చర్చకు 29న అఖిలపక్ష భేటీ
సాక్షి, విజయవాడ: లోక్‌సభ, అసెంబ్లీల గడువు ముగుస్తున్నా, అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన తీరును మాత్రం ఇప్పటికీ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ప్రశ్నించలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రానున్న ప్రభుత్వాలైనా చర్చించాలని కోరుతూ.. ఈ నెల 29న విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నిపార్టీల అధ్యక్షులకు లేఖలు పంపినట్టు ఉండవల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు చెప్పారు. -
15 శాతం నకిలీ ఓట్లు.. ఇంక ఆ పార్టీల ప్రచారమెందుకు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లుంటే.. అందులో 52 లక్షల 67 వేల 636 బోగస్ ఓట్లు ఉండడం దారుణమని విజయవాడ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో కేవలం 0.5శాతం ఓట్లతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందని, అలాంటిది ఇప్పుడు 15 శాతం నకిలీ ఓట్లు ఉంటే ఇక మిగిలిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాలెందుకు చేసుకోవాలని ఆయన మండిపడ్డారు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా.. దొంగ ఓట్లను పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం సరికాదని హితువు పలికారు. ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల దొంగ ఓట్లను రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ఓట్లు లేని వారు కూడా ఓటు వేస్తుండడం సిగ్గుచేటు. జనచైతన్య వేదిక సర్వే ద్వారా జిల్లాల వారీగా బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల అధికారికి పంపించడంతోపాటు కోర్టులో పిల్ వేశామని ఉండవల్లి అన్నారు. కంప్యూటర్లు లేని యుగంలో అంటే చనిపోయిన, ఇళ్ళు మారిన వారి సమాచారం సరిగా ఉండేది కాదని, కానీ కంప్యూటర్, ఆన్లైన్ యుగంలో కూడా ఇలా జరగడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సిధాంతాల్లేవ్.. విలువల్లేవ్!
-
చల్లవారిగూడెంలో మాజీ ఎంపీ ఉండవల్లి పర్యటన