varadapuram suri
-
సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు బీజేపీకి ఇచ్చినా లేక టీడీపీ వద్దే ఉంచుకున్నా తానే బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోను గుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలిచానని, తనకే టికెట్ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు. పైగా శ్రీరామ్, సూరి మధ్య ముందు నుంచీ సఖ్యత లేదు. టికెట్ విషయంలో పంతం నెగ్గించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. బల ప్రదర్శనకు కూడా సిద్ధ మయ్యారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గీ యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా బరి లో ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో కూ టమి భిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. యువగళంతో శ్రీరాంలో ఆశ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరదాపురం సూరి తన కాంట్రాక్టుల కారణంగా బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ తరఫున ధర్మవరం ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వచ్చారు. తొలి మూడేళ్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కేడర్‌ను బలోపేతం చేయడంలోనూ పరిటాల శ్రీరామ్ పూర్తిగా విఫలమైనట్లు చెబుతున్నారు. అయితే యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ బత్తలపల్లిలో శ్రీరామ్ చేయి పైకెత్తి గెలిపించాలని కోరడంతో ఆయనలో టికెట్ ఆశ మొదలైంది. అంతేకాకుండా రాప్తాడులో ఓడిపోయిన బాధతో ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావించారు. మరోవైపు వరదాపురం సూరి చంద్ర బాబుతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు వదలకపోవడంతో ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: జనసేన నేతలకు పవన్ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే.. -
ధర్మవరం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్ మొదలైంది. ఇద్దరిలో ఒకరు గత ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయాడు. తర్వాత బీజేపీలో చేరాడు. ఇప్పుడు పార్టీ ఏదైనా మళ్ళీ అక్కడే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంకోనేత మాజీ మంత్రి కుమారుడు. ఇప్పుడు ఇద్దరూ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. తమ రాజకీయ ఉనికి కోసం శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు కూడా వెనకాడటంలేదు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? పరిటాల శ్రీరాం, గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలియాస్ వరదాపురం సూరీ... ఈ ఇద్దరూ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎవరి మార్గంలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వరదాపురం సూరి 2014లో ధర్మవరం నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల భయంతో టీడీపీ జెండా పీకేసీ..కమలం గూటికి చేరాడు. దీంతో ధర్మవరం ఇన్చార్జ్ బాధ్యతలను పరిటాల కుటుంబ వారసుడు శ్రీరాంకు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్ళుగా ధర్మవరంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిటాల శ్రీరాం వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ధర్మవరంపై కన్నేశారు వరదాపురం సూరీ. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన అవసరం అయితే మళ్ళీ టీడీపీలో చేరి పోటీ చేస్తానని చెబుతున్నారు. ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీకి వంద కోట్లు ఫండ్ ఇచ్చేందుకైనా సిద్ధమంటూ వరదాపురం సూరీ కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మవరం టిక్కెట్ వరదాపురం సూరీకి ఖరారు అయిందని ఆయన వర్గీయులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సూరీ వర్గీయుల వైఖరిపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పారిపోయిన వరదాపురం సూరీ మళ్లీ టిక్కెట్ కోరటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ టిక్కెట్ వందకోట్లకు కొంటానంటూ సూరీ, ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారాన్ని పరిటాల శ్రీరాం ఖండిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెనుకొండ వద్ద జరిగిన చంద్రబాబునాయుడు రా. కదలిరా సభకు జనాన్ని సమీకరించడానికి పరిటాల శ్రీరాం- వరదాపురం సూరీ పోటీపడ్డారు. పైగా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. వరదాపురం సూరీ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై పరిటాల వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వరదాపురం సూరీ వర్గీయులు కూడా ప్రతిదాడులు చేశారు. దీంతో దాదాపు పది వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య దాదులు ప్రతిదాడులతో బత్తలపల్లి ప్రాంతం రణరంగమైంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదాపురం సూరి, పరిటాల శ్రీరాం వర్గాల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని సాధారణ ప్రజలు భయపడే పరిస్థితి కొనసాగుతోంది. టీడీపీ నేతల తీరుపై సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పరిటాల శ్రీరాం- వరదాపురం సూరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.61 కోట్ల జరిమానా
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీలను బినామీల పేరిట లీజుకు పొందారు. అక్రమంగా ఖనిజ రవాణా చేస్తున్న ఆయన ఇన్నేళ్లు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి క్వారీల వైపు రాకుండా తన చీకటి వ్యాపారాన్ని సాగించారు. ఇటీవలే గనులశాఖ అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌ను తనిఖీ చేసి రోడ్డు మెటల్ నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించి రూ.1.60 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. తాజాగా మాజీ ఎమ్మెల్యే బినామీ పేరిట ఉన్న రోడ్డు మెటల్ క్వారీని గనుల శాఖ అధికారుల బృందం తనిఖీ చేసి.. అక్రమ తవ్వకాలను గుర్తించింది. అనంతపురం టౌన్: క్వారీల మాటున ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమ ఖనిజ రవాణా దందాలో కొండలను సైతం పిండి చేసేశారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రోడ్డు మెటల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో 4.6 హెక్టార్ల రోడ్డు మెటల్ కొండకు ఆ మాజీ ఎమ్మెల్యే బినామీగా పేరున్న కె.సాంబశివుడు లీజు పొందారు. లీజు పొందిన ప్రాంతంలో రోడ్డు మెటల్ తవ్వకాలను చేపట్టి.. మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలించారు. లీజు పొందిన ప్రాంతంలో ఖనిజ నిల్వలు తగ్గిపోవడంతో పక్కనే ఉన్న మరో 1.5హెక్టార్లలో లీజు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి భారీగా రోడ్డు మెటల్ తరలించారు. ఏడాది కాలంగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా రోడ్డు మెటల్‌ను తన క్రషర్కు తరలించి భారీగా సోమ్ము చేసుకున్నట్లు గనులశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. రూ.61.35 కోట్ల జరిమానా.. మాజీ ఎమ్మెల్యే బినామీ సాంబశివుడు క్వారీలో అక్రమ తవ్వకాలు చేసి రోడ్డు మెటల్ తరలించారు. దీంతో గనులశాఖ అధికారులు లీజు తీసుకున్న ప్రాంతానికి వెళ్లి కొలతలు తీశారు. లీజు ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో 1.5 హెక్టార్లలో అంటే 3.75 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించి క్వారీ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందనా లేకపోవడంతో రూ.61.35 కోట్ల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేయడంతో పాటు రోడ్డు మెటల్ క్వారీని సీజ్ చేశారు. సీజ్ చేసినా ఆగని ఖనిజ రవాణా జరిమానా చెల్లించే వరకు ఖనిజం తవ్వకాలు చేపట్టరాదని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, క్వారీని సీజ్ చేసినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. క్వారీలో రాత్రి పూట అక్రమ తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత గనుల శాఖ అధికారులు క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనుగా భావించిన క్వారీ నిర్వాహకులు తవ్వకాలు చేపట్టి ఖనిజాన్ని తరలిస్తున్నారు. గనులశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి తవ్వకాలు క్వారీ లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించాం. దాదాపు 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మెటల్ తరలించారు. దీంతో క్వారీ నిర్వాహకుడు సాంబశివుడికి రూ.61.35 కోట్ల జరిమానా విధించి క్వారీని సీజ్ చేశాం. సీజ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్న విషయం మాకు తెలియదు. మరోమారు క్వారీని పరిశీలిస్తాం. అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసుకు సిఫార్సు చేస్తాం. – నాగయ్య, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు భారీ జరిమానా
అనంతపురం టౌన్: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి)కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహణలో భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం భూగర్భ గనుల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. దీంతో ఏకంగా రూ.1.60 కోట్ల జరిమానా విధించారు. వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్ సంస్థ పేరిట అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపంలో సర్వేనంబర్ 40–4, 53లో స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న క్వారీ నుంచి రోడ్డు మెటల్‌ను క్రషర్‌లోకి తరలించి 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, 6 ఎంఎం..ఇలా వివిధ రకాల మెటల్(కంకర)తో పాటు డస్ట్‌గా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే క్వారీలో నుంచి తరలించిన స్టాక్‌కు.. క్రషర్‌లోని స్టాక్‌కు భారీ వ్యత్యాసం ఉన్న విషయం ఇటీవల గనులశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. 24 వేల క్యూబిక్ మీటర్లకు లెక్కలేదు! చియ్యేడు గ్రామ సమీపంలోని క్వారీ నుంచి తరలించిన రోడ్డు మెటల్.. క్రషర్లో ఉన్న రోడ్డు మెటల్ స్టాక్ వివరాల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు క్వారీలో కొలతలు తీశారు. 24,370 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన రోడ్డు మెటల్ వివరాలను క్రషర్ యూనిట్ నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఎలాంటి సీనరేజీ చెల్లించకుండానే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ఆ మెటల్ ఎక్కడికి తరలించారో తెలపాలంటూ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై యాజమాన్యం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో అధికారులు అక్రమంగా తరలించిన రోడ్డు మెటల్‌కు ఎంత మొత్తం అవుతుందో లెక్కగట్టి ఐదు రెట్లు జరిమానా విధించారు. మొత్తం రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో క్రషర్ యూనిట్‌ను సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి నితిన్‌సాయి కన్స్ట్రక్షన్కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్లో రోడ్డు మెటల్‌కు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. క్వారీ నుంచి వచ్చిన మెటల్‌కు, క్రషర్లో ఉన్న స్టాక్‌కు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపాం. క్వారీల్లో అక్రమ తవ్వకాలు, క్రషింగ్ చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిని ఉపేక్షించం. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగయ్య, గనుల శాఖ డీడీ, అనంతపురం -
లోకేశ్ తీరుతో టీడీపీలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పరిటాల ఫ్యామిలీ పాలిటిక్స్!
నారా లోకేశం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇప్పటివరకు తాను పర్యటించిన చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు లోకేశం. చాక్లెట్ల మాదిరి టిక్కెట్లు పంచిపెట్టడాన్ని కొందరు ఆశావహులు తప్పుపడుతున్నారట. చంద్రబాబు ఆదేశాలతో ప్రకటిస్తున్నారా? లేక సొంతంగా ఇచ్చేస్తున్నారా అని సందేహపడుతున్నారని టాక్. నారా లోకేశం కామెడీపై ఓ లుక్కేద్దాం.. తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పాదయాత్ర ఆ పార్టీ నాయకుల్లోనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేసినట్లుగా.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తనకు కావాల్సినవారి పేర్లు ప్రకటిస్తూ.. వారిని ఆశీర్వదించాలని కేడర్‌ను కోరుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు లోకేశ్ తీరుతో గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా పరిటాల శ్రీరాం పేరును నారా లోకేష్ ఖరారు చేశారు. శ్రీరాం చేతిని పట్టుకుని పైకెత్తి మరీ ఆశీర్వదించాలంటూ కోరారు. 2014లో ధర్మవరం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వరదాపురం సూరి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్‌కు.. ఇక, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు వరదాపురం సూరి. త్వరలోనే వరదాపురం సూరి టీడీపీలో తిరిగి ప్రవేశించబోతున్నారని.. ఆయనకు ధర్మవరం టిక్కెట్ కూడా ఖరారు అయిందని టీడీపీ వర్గాల్లోనే కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంతలో పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేష్ ఏకంగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంను అభ్యర్థిగా ప్రకటించేశారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరాం.. వైఎస్ఆర్సీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘెరంగా ఓటమి చెందారు. వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన ధర్మవరంలోకి అడుగుపెట్టారు పరిటాల శ్రీరాం. తన తల్లి పరిటాల సునీతకు తిరిగి రాప్తాడు అప్పగించి ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా శ్రీరాం కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరాం పోటీ చేస్తున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. లోకేశ్ ప్రకటనతో టీడీపీలో చర్చ.. లోకేశ్ ప్రకటన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే మాకు అలాగే ఇవ్వాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి, దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేవలం తాడిపత్రికే పరిమితం కావాలని జేసీ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఖరారు కావటంతో తమ గళం వినిపించేందుకు జేసీ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వటం పట్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత పెంచుతూ పోతుంటే.. చంద్రబాబునాయుడు మాత్రం సొంత సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో, మొత్తం మీద చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లాభం కలిగించకపోగా.. పార్టీ నాయకుల్లోనే విభేదాలు పెంచుతోంది. అసలు లోకేశ్ ప్రకటిస్తున్న టిక్కెట్లు నిజమేనా.. లేక ఉత్తిత్తి టిక్కెట్లా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘నువ్వు అవినీతి, అక్రమాల్లో పీకల్లోతు కూరుకుపోయావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. పూటకో మాట మాట్లాడతావు. ఏ ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వో ఔట్ డేటెడ్ పొలిటీషియన్. వ్యక్తిత్వం లేని నీలాంటి వ్యక్తుల ప్రవర్తన జుగుప్స కల్గిస్తోంది. మరోసారి నాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోను’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం బీజేపీ నేత వరదాపురం సూరిని హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఆధారాలతో సహా వివరించారు. మార్కెట్ రేటుకు కొన్నాను 2015లో సూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని భూములను కొనుగోలు చేసిందన్నారు. అయితే సదరు కంపెనీ ప్రతినిధులను సూరి రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేని వారు కంపెనీ ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయారన్నారు. ఈ విషయంపై అప్పట్లో అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని, వాటిని మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఆ భూములను సదరు ప్రైవేట్ కంపెనీ వేరొక కంపెనీకి విక్రయిస్తే తాను ఆ కంపెనీ నుంచి మార్కెట్ ధరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు. తన తాత సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే తాము భూస్వాములమని, సూరి లాగా పేదల రక్తాన్ని పీల్చి ఉన్నత స్థాయికి ఎదగలేదన్నారు. తమకు డీజీపీ బంధువని సూరి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, తనకు డీజీపీ ఏ విధంగా బంధువో తెలియజేయాలన్నారు. తాను ఆయనలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయనన్నారు. ఇదే సూరి టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా జేవీ రాముడు ఉన్నప్పుడు ఆయన తనకు మామ అవుతారని పోలీసులపై స్వైర విహారం చేసిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన దాడి ఘటనలో నిందితులుగా ఉన్న తన అభిమానులపై కూడా చట్ట ప్రకారం కేసు కట్టించి రిమాండ్‌కు పంపామన్నారు. పోలీసులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. తాను ధర్మవరం పట్టణంలో 20 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలోనూ రైతులకు న్యాయం చేశానన్నారు. టీడీపీ హయాంలో రైతుల పొట్టగొట్టి ఎకరానికి రూ.5 లక్షలు ఇచ్చి భూసేకరణ చేసి వారికి అన్యాయం చేశారని, తాము రేగాటిపల్లి పొలాలను ఎకరాకు రూ.25 లక్షల పరిహారం అందించి భూసేకరణ జరిపి పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. వరదాపురం సూరి చేసిన అవినీతి, అక్రమాలు, నిబంధనలకు పాతరేసి ఏ బ్యాంకులలో ఎన్ని రూ.కోట్ల రుణం తీసుకున్నారో త్వరలోనే బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిపై మాట్లాడేందుకు నైతికత ఉందా? ధర్మవరం నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,387 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని సూరి అబద్ధాలు చెప్పారని, వాటి తాలూకు ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా.. అని ప్రశ్నించారు. సూరి లాంటి నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత ఉందా..? అని ప్రశ్నించారు. చదవండి: (విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం) -
Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ
సాక్షి, పుట్టపర్తి: భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీ పరిధిలోని చండ్రాయునిపల్లి గ్రామంలో 155 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కొనుగోలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. గ్రామం చుట్టూ వరదాపురం సూరి భూములు కొనుగోలు చేయడం వల్ల చండ్రాయునిపల్లి గ్రామ వాసులు దారిలేక ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఆక్రమణలపై ఆర్డీఓ, తహసీల్దార్లకు గ్రామస్తులు పలుసార్లు మొరపెట్టుకున్నారు. చివరకు డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయగా, సూరి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని, వాటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. కారుచౌకగా రూ.130 కోట్ల భూమిని కొట్టేసిన వైనం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వంద గజాల సమీపంలోనే రూ.130 కోట్ల విలువైన భూమిని వరదాపురం సూరి అక్రమంగా కొనుగోలు చేశారు. అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంటు సృష్టించి కారుచౌకగా తన కుమారుడు గోనుగుంట్ల నితిన్ సాయితో పాటు అతని అనుచరుడి పేరుతో కొనుగోలు చేశారు. దీనిపై కూడా బాధితులు జిల్లా రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సూరి భూ కుంభకోణాలపై పలువురు కలెక్టర్‌కు, ఎస్పీకి, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) రంగంలోకి దిగింది. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) సూరి కొనుగోలు చేసిన భూములు, అప్పట్లో జరిపిన లావాదేవీలు, ఆ సొమ్ములు ఎక్కడనుంచి వచ్చాయి తదితర వాటిని ఆరా తీస్తున్నారు. వరదాపురం సూరితో పాటు ఇందులో ఇంకా ఎవరైనా పాత్రధారులు ఉన్నారా... అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూముల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు అధికారుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు సివిల్ పోలీసులు కూడా తమకు అందిన ఫిర్యాదుల మేరకు వరదాపురం సూరి అక్రమాలపై దర్యాప్తు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి అనంతపురం జిల్లా పోలీసులే దర్యాప్తు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో భూఆక్రమణలపై ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ కూడా చేశారు. ఫిర్యాదుల మేరకే దర్యాప్తు వరదాపురం సూరి భూ ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకే దర్యాప్తు చేస్తున్నాం. ఏసీబీ దర్యాప్తు మొదలైంది. ఏసీబీ తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై కూడా పూర్తిస్తాయిలో విచారణ చేస్తాం. అక్రమాలున్నట్టు తేలితే ఎంత పెద్ద వారున్నా చర్యలు తీసుకుంటాం. – డా.ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం -
బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం (సత్యసాయి జిల్లా): ‘‘రాజకీయ నాయకుడంటే విలువలు ఉండాలి. కష్టమైనా.. నష్టమైనా కార్యకర్తలకు అండగా ఉండాలి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి. నీలా ఓడిపోయిన రెండు నెలలకే పార్టీ మారి కార్యకర్తలను గాలికి వదిలేయడం నాకు రాదు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులిచ్చి కుటుంబ సభ్యులను తిట్టిస్తే ఇకపై సహించేది లేదు’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాడిమర్రి మండలంలో ఆటోపై విద్యుత్ తీగ పడి చెలరేగిన మంటల్లో ఐదుగురు మృతి చెందగా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్నారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. ఫ్యాక్షన్ వద్దనుకునే... ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంచాలనే తన తల్లిదండ్రులు తనను విదేశాల్లో చదివించారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇష్టం లేకపోయినా 2006లో రాజకీయాల్లోకి వచ్చానని, అందువల్లే ఫ్యాక్షన్ వద్దనుకుని అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నానన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు .. సంగాలలో పార్వతమ్మ అనే మహిళను కొట్టంలోకి వేసి సూరి నిప్పంటించాడనీ, రామలింగారెడ్డి అనే వ్యక్తిని జీపుకు కట్టేసి చంపాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. అక్కడి నుంచి అనంతపురం వెళ్లి అక్కడ పరిటాల రవితో సన్నిహితంగా ఉంటూ డబ్బులు సంపాదించాడన్నారు. అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం సూరి నైజమన్నారు. సూరి అనంతపురంలో భూకబ్జాలు చేయగా.. అప్పటి ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోయాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు తన మనుషులతో పోలీసులపైనే దాడి చేయించాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు అరాచకమే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. చదవండి: (ఈజ్ ఆఫ్ సెల్లింగ్‌లో బీజేపీ టాప్) ఇక సహించబోం.. జీతానికి, కులానికి ఒకరిని పెట్టుకుని నోటికి ఎంత పడితే అంత తిట్టిస్తే ఇక సహించబోమని కేతిరెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను తిడుతుంటే ఎవరైనా రెచ్చిపోతారన్నారు. కేతిరెడ్డిపై మాట్లాడితే క్రేజ్ వస్తుందని సూరి సోషల్ మీడియా వేదికగా తన అనుచరులతో బూతులు తిట్టిస్తున్నాడన్నారు. తాను 20, 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాననీ, సూరి టీడీపీ టికెట్ కోసం అడ్డదారులు తొక్కుతున్నాడన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పులు చూపించాలి గానీ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడితే సహించబోమన్నారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. ఆర్అండ్బీ రోడ్డు కబ్జా చేశావు అంటున్నావే ఎక్కడో చూపించు అని కేతిరెడ్డి... ప్రశ్నించారు. వ్యాపారులు ఆర్అండ్బీ స్థలంలో సొంత ఖర్చుతో రోడ్డు వేసుకుంటుంటే నేను కబ్జా చేసినట్టా? కరెంటు వైరు తెగి ప్రమాదం జరిగితే కాంట్రాక్టర్‌తో కమీషన్ తీసుకున్నాడని నీచంగా మాట్లాడుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. సోలార్ కంపెనీ నీకు భయపడి వెనక్కి పోలేదా? అని ప్రశ్నించారు. కర్ణాటక బ్యాంకుల్లో లోన్లు ఎలా తెచ్చుకుంటున్నావో చెప్పాలా అని సూరిని కేతిరెడ్డి ప్రశ్నించారు. 151 ఎకరాలు భూకబ్జా చేశావని కలెక్టర్ నాగలక్ష్మి నిర్ధారించారన్నారు. చేనేతలకు డబ్బులు ఎగ్గొట్టిన కళానికేతన్ వాళ్లతో ఎంత డబ్బు వసూలు చేశావో అందరికీ తెలుసన్నారు. -
వరదాపురం X పరిటాల.. ఢీ అంటే ఢీ! కొనసాగుతున్న మాటల యుద్ధం
ధర్మవరం టౌన్ (సత్యసాయి జిల్లా): నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. వారి అనుచరులు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ వారి హయాంలో చేసిన ‘ఘన కార్యాలను’ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ధర్మవరంలో 300 మంది అమాయకులను అంతం చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదని సూరి వర్గం ఆరోపిస్తుండగా... ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజలకే పార్టీ మారి కార్యకర్తలను నట్టేట ముంచిన చరిత్ర వరదాపురం సూరిదని పరిటాల వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ ఇద్దరి నాయకులు తమ అనుచరులతో చేనేత వ్యాపారులు, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది. ఓటమితో పార్టీ మారిన సూరి.. 2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలు అతనే నడిస్తున్నాడు. దీంతో ధర్మవరం టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నేసేపేట కేంద్రంగా బెదిరింపుల పర్వం.. ధర్మవరంలోని నేసేపేటలో తటస్తులైన వ్యాపారులు ఎందరో ఉన్నారు. వారిపై ఇటు సూరి వర్గం, అటు పరిటాల శ్రీరామ్ వర్గం బెదిరింపులకు దిగుతున్నాయి. తమ నాయకుడు త్వరలోనే టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని, వచ్చి కలవాలని చేనేత వ్యాపారులను సూరివర్గం ఒత్తిడి తెస్తోంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటిస్తారని, తమ నాయకున్ని వచ్చి కలవాలని చెబుతున్నారు. దీంతో ఏ పార్టీకి సంబంధం లేని వ్యాపారులు ఎవరిదగ్గరకు వెళితే ఏం అడుగుతారో..ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. టీడీపీ హయాంలో భారీ దందా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర అనుచరులు పరిటాల పేరు చెప్పి నేసేపేటలో ఎందరో వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన సందర్భాలున్నాయి. ఇటు వరదాపురం సూరి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ చేనేత వ్యాపారులను బెదిరించి సెటిల్మెంట్లు చేసి భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఇద్దరు నేతలూ తమను కలవాలని అనుచరులతో ఒత్తిడి చేయిస్తుండటంతో నేసేపేటలోని వ్యాపారులు, సామాన్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిటాల కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు.. ధర్మవరంలో టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వరదాపురం సూరి అనుచరులు పరిటాల కుటుంబం చేసిన ఆగడాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సూరి అనుచరుడు పెద్దిరెడ్డి అరవిందరెడ్డి పరిటాల కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవీంద్ర హయాంలో ధర్మవరంలో నరమేధం సృష్టించారని, దాదాపు 300 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఇప్పటికీ ఆ 300 మంది ఆచూకీ తెలియదన్నారు. కుటుంబ పాలనతో రాప్తాడులో టీడీపీని భూస్థాపితం చేసి ధర్మవరం వచ్చారని, అటువంటి వారికి టీడీపీ టిక్కెట్ కచ్చితంగా రాదన్నారు. సూరిపై ఎదురు దాడి.. పరిటాల అనుచరులు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడి చేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసి స్వార్ధం కోసం బీజేపీలోకి చేరిన వరదాపురం సూరికి విలువల్లేవని ఆరోపించారు. రోజూ టీడీపీలోకి వస్తామని చెబుతూ టీడీపీ కార్యకర్తలను, పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీలోకి రావాలంటే పరిటాల శ్రీరామ్ కండువా కప్పాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నీచ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న సూరి మాటలు నమ్మవద్దన్నారు. ఆ చీకటి రోజులు రావొద్దని కోరుకుంటున్న జనం.. టీడీపీ ప్రభుత్వ పాలనను తలచుకుని జనం భయాందోళనలు చెందుతున్నారు. పట్టణానికి చెందిన నిమ్మల కుంట వెంకటేశ్ అనే వ్యక్తికి సంబంధించిన భూములను లాక్కునేందుకు పరిటాల అనుచరులు ఏకంగా అతన్ని కిడ్నాప్ చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గుడ్‌విల్ ఇవ్వలేదన్న కారణంతో గుట్టకిందపల్లి వద్ద జరుగుతున్న పనులను అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి నిలిపి వేయడయంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు, సూరి అనుచరులు రాళ్ల దాడిచేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక తన మాట వినడం లేదన్న కారణంతో వరదాపురం సూరి అనుచరుడు ఏకంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్‌ను చెంపదెబ్బకొట్టడాన్ని తలచుకుని ఆ చీకటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా∙వీరిద్దరి మాటల యుద్ధం, బెదిరింపుల పర్వం కారణంగా ప్రశాంతంగా ఉండే ధర్మవరంలో అశాంతి రాజుకుంటోంది. -
Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి
టికెట్ నాదే... అంతా నేనే. ఎవరొచ్చినా మన తర్వాతే. టీడీపీలో ప్రతి నాయకుడూ అనుచర వర్గానికీ, కార్యకర్తలకు చెబుతున్న మాటలివి. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని తమ్ముళ్లు తలోదారి పట్టారు. ఫలితంగా శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులంతా వర్గపోరు రాజేస్తుండగా... కార్యకర్తలు జెండా పక్కనపెట్టి మిన్నకుండిపోయారు. సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీని కాపాడే నాయకుడు కరువయ్యారు. నేతల నడుమ వర్గపోరుతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భారీ స్థాయిలో మహానాడు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపామని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం కార్యకర్తలంతా నిస్తేజంలో ఉండిపోయారు. సొంతపార్టీలోనే వేరు కుంపట్లు రాజుకుంటుండగా కార్యకర్తలు ఏ కుంపటి దగ్గర చలికాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. పల్లెకు పొగ పెట్టిన సైకం.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంత పార్టీకే చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పల్లె రఘునాథరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి గట్టిగా పోరాడుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోతాడని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా తన అనుచరుడు సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్వహించిన సర్వేలోనూ పల్లె బాగా వెనుకబడ్డారని తేలింది. దీంతో పాటు పల్లె రఘునాథరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేక ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు సైతం ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో సొంతపార్టీలోనే పల్లె ఒంటరిగా మిగిలిపోయారు. చివరకు సీఎంను విమర్శిస్తేనైనా చంద్రబాబు మెప్పు పొందచ్చునేమోనన్న ఆశతో ఆయన తన స్థాయిని మించి విమర్శలు చేస్తుండగా... నియోజకవర్గ ప్రజలు ఈయనపై సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (టీడీపీలో మహిళలకు గౌరవం లేదు) ధర్మవరంలో సూరికి సెగ.. భూదందాల్లో ఆరితేరిన వరదాపురం సూరికి ధర్మవరంలో నిరసన సెగ తగలుతోంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూరి బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు పచ్చజెండా కప్పుకోవాలని చూస్తుండగా... సూరీని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరారు. కండువా కప్పుకోవాలంటే ‘నేనే కండువా వెయ్యాలి, ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు’ అని శ్రీరామ్ విమర్శించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకుడెవరో కార్యకర్తలకు అర్థం కాక ఇప్పటికే మెజార్టీ కేడర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది. మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కదిరిలో కందికుంటకు చెక్.. చెక్‌బౌన్స్ కేసులో శిక్ష పడిన మాజీ ఎమ్మెల్యే కందికుంట పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కదిరిలో టీడీపీ కేడర్ అత్తర్ చాంద్‌బాషా, కందికుంట వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. చాంద్‌బాషా 2014లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఇదే సమయంలో కందికుంటపై కేసులు నమోదయ్యాయి. దీంతో కందికుంట పక్కన పెట్టిన టీడీపీ కేడర్... అత్తార్ వైపు కూడా నడవలేక పోతోంది. గెలిపించిన పార్టీని మోసం చేసి టీడీపీలోకి వెళ్లారని సొంత సామాజికవర్గమే అత్తార్‌పై గుర్రుగా ఉండగా.. కదిరి తెలుగు తమ్ముళ్లు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీకేకు దీటుగా సబిత .. పెనుకొండలో బీకే పార్థసారధి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు సరిగా చేయడం లేదని ఇప్పటికే ఆయనపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మాజీమంత్రి రామచంద్రారెడ్డి కూతురు సబిత ఇక్కడ టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వర్గాన్ని కూడగడుతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు బీకేకు తలనొప్పిగా మారాయి. అసలు బీకేకు టికెట్ వస్తుందో రాదోనన్న పరిస్థితి నెలకొంది. చదవండి: (చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు) మడకశిరలో ఎవరికి వారే.. మడకశిరలో వింతపరిస్థితి. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిన ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉప్పూ నిప్పులా మారారు. దీంతో కార్యకర్తలూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఏ కార్యక్రమమైనా వేర్వేరుగా జరుపుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఒక వర్గానికి టికెట్ ఇస్తే మరో వర్గం ఓట్లు వేసే పరిస్థితి లేదు. అధిష్టానం ఇరువురినీ పిలిపించి రాజీ చేసినా తెల్లారేసరికి మళ్లీ గ్రూపులుగా విడిపోయారు. ఇలా వర్గపోరుతో కేడర్ మడకశిరలో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలూ ప్రభుత్వ పథకాలపై ఆకర్షితులవుతుండగా.. వారిని కాపాడుకోవడం తలకుమించిన భారమైంది. బాలయ్యను మర్చిపోయిన ‘పురం’వాసులు.. రెండున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణను గెలిపించినా ఏడాదికి ఒకసారి కూడా ఆయన హిందూపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు వర్గం, పార్టీ అనేది లేకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురంలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో నియోజకవర్గ జనం ఎమ్మెల్యే బాలకృష్ణను పూర్తిగా మర్చిపోయారు. ఈ సారి అందుబాటులో ఉండేవారికి ఓటేస్తే బావుంటుందన్న ఆలోచన ఉన్నారు. ఇదే జరిగితే ఈసారి హిందూపురంలోనూ టీడీపీకి గల్లంతు ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. -
Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!
ఆయనో ‘భూ’చోడు. ఫోర్జరీలు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. వాటి ఆధారంగా భూదందాలకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అక్రమాలు అధికారిక విచారణల్లోనూ వెల్లడయ్యాయి. అయినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఆయన పట్ల అధికారులు ఎందుకింత ప్రేమ కనబరుస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయం. సాక్షి, పుట్టపర్తి: అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలో నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న 6.35 ఎకరాల భూమిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి కాజేశారు. సుమారు రూ.129 కోట్ల విలువ చేసే ఈ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అత్యంత చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ మినహా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా రిజిస్ట్రేషన్ అధికారులు తాత్సారం చేస్తుండగా...కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కూడా నివేదిక సమర్పణలో జాప్యం చేస్తోంది. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప అనే వ్యక్తి 1929లో అప్పటికే పింఛన్ తీసుకుంటున్న గుండూరావు నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలోని సర్వే నంబర్ 301లో 7.77 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నారాయణప్ప పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు విడుదల చేశారు. ఆయన 1935లో బ్యాంకులో మార్ట్గేజ్ చేసి రుణం కూడా పొందారు. రాళ్లపల్లి నారాయణప్ప నుంచి తర్వాత నాలుగు తరాల వారికి భూమి మారుతూ వచ్చింది. అయితే, దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అని పేర్కొంటూ నవంబర్ 19, 1985 తారీఖుతో అన్ రిజిస్టర్డ్ వీలునామా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా 2018లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 301–3 సర్వే నంబరులో 6.35 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. చదవండి: (శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!) అనంతరం డిసెంబర్ 23, 2021లో మాలతేష్ నుంచి 6.35 ఎకరాలను వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, ధర్మవరానికి చెందిన యంగలశెట్టిరాజు (సూరి అనుచరుడు) కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవానికి గుండూరావు 1929 నాటికే ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే ఆయనకు 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయసు 116 ఏళ్లు! అంతటి వయస్సు ఉన్న వ్యక్తి అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారో అర్థం కాని విషయం. ఈ అన్ రిజిస్టర్డ్ వీలునామా ఫోర్జరీ అని ఆర్డీఓ కోర్టు సైతం నిర్ధారించింది. అయినప్పటికీ వరదాపురం సూరి తన గ్రామానికే చెందిన సబ్రిజి్రస్టార్ను లోబర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌తో సరి.. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఫోర్టరీ డాక్యుమెంట్లతో రిజి్రస్టేషన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నితిన్ సాయి, యంగలశెట్టి రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ..జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటిదాకా నితిన్ సాయి, యంగలశెట్టి రాజా, అక్రమాల సూత్రధారి అయిన వరదాపురం సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయకుండా భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారా? లేదా తప్పుదోవ పట్టించే ఎత్తుగడ వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నివేదిక సమర్పించడంలోనూ జాప్యమే.. సూరి చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఆధ్వర్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి సబ్ కలెక్టర్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సభ్యులుగా కలెక్టర్ నాగలక్ష్మి అప్పట్లోనే విచారణ కమిటీని నియమించారు. ఇందులో ఒక సభ్యుడు నివేదిక సమర్పించినా, మరొక సభ్యుడు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇంతటి భారీ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. మరొక అధికారి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ‘భూచోళ్ల’పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చేయడానికే అధికారులందరూ కలిసి కొత్త నాటకాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరాం అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం అనైతికమని పలువురు ఫిర్యాదు చేశారు. రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా రిజి్రస్టార్‌కు ఉత్తర్వులు జారీ చేశాం. – మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
భూ బకాసురుడు 'వరదాపురం'
సాక్షి, అనంతపురం: ఆయనో మాజీ ప్రజాప్రతినిధి. వందల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టాడు. అమాయక రైతు లను బెదిరించి కనిపించిన పొలాన్నల్లా లాక్కున్నాడు. అంతేకాదు.. అసైన్డ్ భూముల చట్టానికి తూట్లు పొడిచి అధికారం లో ఉండగా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడు. వాగులు, వంకలను కలిపేసుకున్నాడు. చుట్టు పక్కల పొలాలకు దారి వదలకుండా రైతులను వేధిస్తున్నాడు. ఎవరైనా సరే తనకు మాత్రమే విక్రయించాలని లేదంటే గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాడు. ఈ అరాచకాలను భరించలేక ఏకం గా ఒక గ్రామమే ఖాళీ కావటాన్ని బట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో వేరే చెప్పాలా? అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ భూ దందాలు, దౌర్జన్యాలివీ.. టీడీపీ అధికారంలో ఉండగా.. ముదిగుబ్బ మండలం ముక్తాపురం రెవెన్యూ పరిధిలో చిన్న, సన్నకారు రైతులే అధికం. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న సూరి గ్రామంలో పొలాల ఆక్రమణల పర్వాన్ని ప్రారంభించాడు. నితిన్‌సాయి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 332.45 ఎకరాలను రైతుల నుంచి కారుచౌకగా కాజేశాడు. ఇందులో 155.88 ఎకరాలు ప్రభుత్వ, అనాదీన, చుక్కల భూములే కావడం గమనార్హం. నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను వరదాపురం బలవంతంగా సొంతం చేసుకున్నాడు. సూరి కుమారుడు నితిన్‌సాయి, సతీమణి నిర్మలాదేవి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. చండ్రాయునిపల్లి ఖాళీ ముక్తాపురం రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా సూరి వేధించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే రైతుల పొలాల్లో నీళ్ల మోటార్లు, స్టార్టర్ పెట్టెలు రాత్రికి రాత్రే మాయమయ్యేవి. దీంతో దిక్కుతోచక అయినకాడికి అమ్ముకుని వలస వెళ్లిపోయారు. ఇలా చండ్రాయునిపల్లి అనే గ్రామం మొత్తం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలు, కూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అసైన్మెంట్ చట్టానికి తూట్లు 1977 అసైన్మెంట్ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. దీన్ని బేఖాతర్ చేస్తూ నితిన్‌సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట ఏకంగా 155.88 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందుకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సహకరించారు. పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసేశారు. ఆధారాలు ఇవిగో.. నితిన్‌సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట వరదాపురం సూరి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం పరిధిలో 48–2, 50, 52–3, 53–2, 54–1, 57–1, 57–2, 63–1, 63–2, 63–3, 84, 85–1, 85–2, 86, 87–1ఎ, 87–1బి, 87–2, 88, 96–1, 96–2, 97, 106–2,106–3, 113, 119, 134, 199, 203, 378 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అనాదీన, అసైన్డ్, గయాలు లాంటి నిషేధిత జాబితాలోని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పొలానికి వెళ్లనివ్వడం లేదు.. ముక్తాపురం, చండ్రాయునిపల్లి మధ్యలో 330 ఎకరాలకు పైగా కొనుగోలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మేం పొలానికి వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదు. అక్కడ మాకు మధ్యలో పది ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తుండంతో దిక్కు తోచడం లేదు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. – వెంకటేశ్ నాయక్, ముక్తాపురం తండా మా గ్రామాన్ని కాపాడండి.. వరదాపురం సూరి ఇక్కడ భూములు కొన్నప్పటి నుంచి మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా పొలాల వద్దకు వెళ్లాలంటే సూరి భూములను దాటుకుని వెళ్లాలి. ఆయన మా పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఈ దౌర్జన్యాలను తట్టుకోలేక ఇప్పటికే చండ్రాయునిపల్లి ఖాళీ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మేం కూడా ముక్తాపురం వదిలి వెళ్లక తప్పదు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. – కేశవ, ముక్తాపురం -
ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్: సూరీ.. ప్రమాణానికి సిద్ధమా ?
సాక్షి, ధర్మవరం టౌన్: ‘మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే అన్ని సౌకర్యాలతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ఎంఐజీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఇస్తోంది. అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో ఎల్లో మీడియా, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి దుష్ప్రచారానికి తెరతీయడం సిగ్గుచేటు’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంఐజీ లేఅవుట్లపై ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా చూపించారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీఐఐసీ కుణుతూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఎకరా రూ.4.75 లక్షలు నిర్ణయించి 126 ఎకరాలను ఎంఐజీ లేఅవుట్ కోసం సేకరించిందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ప్రకారం పరిహారం అందించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఇక జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్ కింద ఇస్తున్న ప్లాట్లు అభివృద్ధి చేయకుండానే ఇచ్చేస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లేఅవుట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందని, ఈనెల 17న టెండర్ కూడా పూర్తి చేశామన్నారు. ఈ ఏడాదిలోపే లేఅవుట్లో సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు. ఇవేవి తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద జల్లే వార్తలు రాయడం దారుణమన్నారు. ఎంఐజీ సమీపంలో తాను కూడా వెంచర్ వేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నానని ఆరోపిస్తున్నారని, వాస్తవంగా ఎంఐజీ లేవుట్ ప్రతిపాదన రాక ముందే తాను వెంచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంఐజీ లేఅవుట్ ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోందని, ఆ లేవుట్ రావడం వల్ల ప్రైవేటు వెంచర్లకు నష్టం తప్ప లాభం ఉండదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: (Railways: ఇకపై ఆ రైళ్లలో జనరల్ ప్రయాణం) సూరీ... ప్రమాణానికి సిద్ధమా ? ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సూరి చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. తాను ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో బ్రిటీష్ కాలంలోనే పట్టాలు పొందిన రైతులకు సంబంధించిన 25 ఎకరాలను కొనుగోలు చేశానన్నారు. ఎన్ఓసీ లేకుండానే వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వం 575 జీఓ ఇచ్చిందని వివరించారు. ఇవన్నీ పక్కన పెట్టి వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించిన ఆర్‌హెచ్, డైక్లాట్, రైతుల వివరాలను మీడియాకు అందించారు. తాను కొనుగోలు చేసిన భూమిలో రూ.25 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మిస్తే రూ,కోట్లతో ఇంటి నిర్మాణం చేపట్టానని ఆరోపించడం హేయమన్నారు. రూ.7.50 లక్షల వ్యయంతో కొన్న చిన్నబోటును చెరువులోకి తీసుకెళ్తే... స్టీమర్లు కొన్నారని సూరి చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. గత లాక్డౌన్లో హార్స్‌రైడింగ్ నేర్చుకునేందుకు తాను, తన స్నేహితులు అనంతపురం నుంచి గుర్రాలను అద్దెకు తెచ్చుకుంటే... రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని సూరి ఆరోపించారని మండిపడ్డారు. తుంపర్తి పొలంలో నాగమ్మ దేవాలయాన్ని ఆక్రమించానని, గుప్తనిధులు తీశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాగమ్మ కట్ట వద్ద ఉన్న వేప చెట్టు స్థలాన్ని వదిలి కంచె వేసిన ఫొటోలను, చెరువు ఆక్రమించలేదని నిరూపించే శాటిలైట్ చిత్రాలను మీడియాకు అందించారు. వరదాపురం సూరికి దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలో గానీ, తాడిపత్రి చింతల రాయుడు దేవాలయంలో గానీ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. -
అక్రమాల ‘వరద’
-
‘సూరీ.. నీచ రాజకీయం మానుకో’
సాక్షి, ధర్మవరం టౌన్ : ‘సూరీ... వ్యక్తిగత స్వార్ధం కోసం నీచ రాజకీయాలు చేయడం మానుకో.. గత ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశావు.. అంతులేని అవినీతి చేశావు. నీ అవినీతిపై విచారణను తప్పించుకునేందుకు ధర్మవరంలో అలజడులు సృష్టిస్తున్నావు.. పోలీసులు, అధికారులపై రాళ్లతో దాడులు చేయించి విధ్వంసానికి కుట్రపన్నుతున్నావు. నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేస్తున్న అనైతిక ఆరోపణలపై నిప్పులు చెరిగారు. మంగళవారం ధర్మవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. వేసిన రోడ్లకు, కాల్వలకు మళ్లీ మళ్లీ బిల్లులు చేసుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నాం పోలీసులను ఫ్లెక్సీలకు కాపలాదార్లుగా పెట్టిన నీచమైన సంస్కృతి వరదాపురం సూరి హయాంలో జరిగిందన్నారు. టీడీపీ హయాం మొత్తం అమాయక వైఎస్సార్సీపీ కార్యకర్తలు, హోదా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వ్యవస్థలను ప్రక్షాళన చేసి మీరు చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. రాళ్లు విసరడం సూరీ కుట్రే ఇటీవల ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో 60 అడుగుల మాస్టర్‌ప్లాన్ రోడ్డును కొంతమంది ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారన్నారు. ఈ విషయమై ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’లో ప్రజలు తన దృష్టికి తీసుకు రావడంతో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. న్యాయబద్ధంగా ఆక్రమణలను అధికారులు తొలగిస్తుంటే సూరీ కుట్రపన్ని రాళ్లు విసిరించారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బత్తలపల్లిలో హత్య కేసులో సుపారీ ఇచ్చారన్న ఆరోపణలున్న ఈశ్వరయ్య అనే వ్యక్తికి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయించారని మండిపడ్డారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసిన విషయంపై విచారణ జరుగుతోందన్నారు. నేరచరితులపై రౌడీషీట్ ఎత్తివేయిస్తారా? తెలుగుదేశం పాలనలో సూరి చేసిన ఒకే ఒక్క పని రౌడీషీట్ ఎత్తివేయించుకోవడమేనని కేతిరెడ్డి విరుచుకుపడ్డారు. నేరచరితులపై రౌడీషీట్ ఎత్తివేయించి వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన వరదాపురం సూరీతో పాటు వార్తను ప్రచురించిన పత్రికా యాజమాన్యాలపైన పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. నిరాధార ఆరోపణలు మాని పట్టణ అభివృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో తగిన విధంగా బుద్ధి చెబుతామని హితవు పలికారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన పాలనను అందించి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్న ఆశయంతో తాను పని చేస్తున్నానన్నారు. అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పారదర్శక పాలనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. -
తెలుగుదేశం పార్టీకి షాక్, వరదాపురం సూరి రిజైన్
సాక్షి, అనంతపురం : ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా అంతకు ముందు వరదాపురం సూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. అనివార్య కారణాల వల్ల తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీ అధిష్టాన ప్రతినిధులతో సంప్రతింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. -
కొండలు పిండి చేస్తున్న ‘నితిన్ సాయి’
టీడీపీ నేతలు.. అక్రమార్జనకు అలవాటుపడ్డారు. ఇన్నాళ్లూ అధికార అండతో సహజ సంపదను దోచుకున్నారు. కొండలపై కన్నేసి వాటిని పిండి చేశారు. అక్రమంగా క్వారీ, క్రషర్లు నిర్వహిస్తూ రూ.కోట్లకు పడగలెత్తారు. కంకర కోసం నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న క్వారీల దందాతో నిరుపేదల ఇళ్లు బీటలువారగా.. సమీపంలోని పచ్చని పొలాలన్నీ దుమ్ముకొట్టుకుపోయాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. – రాయదుర్గం/ రాయదుర్గం రూరల్ క్వారీ, క్రషర్ నిర్వహించాలంటే రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖ అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి. అనుమతులన్నీ వచ్చినా.. క్రషర్, క్వారీ ఏర్పాటు చేయకముందుగానే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ టీడీపీ నేతలు ఇవేమీ పాటించలేదు. అధికారం అండతో అధికారులను మచ్చికచేసుకుని రాయదుర్గం నియోజకవర్గంలో ఇష్టానుసారం క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. అయితే సమీపంలోనే ఓ టీడీపీ నాయకుడు క్వారీ ఏర్పాటు చేసి ఇష్టానుసారం బ్లాస్టింగ్లు చేస్తున్నారు. దీంతో కాలనీలోని ఇళ్లు బీటలు వారాయి. క్రషర్, క్వారీ నుంచి వస్తున్న దుమ్ము, ధూళి ఇళ్లలోకి రావడం.. బ్లాస్టింగ్ జరిగిన ప్రతిసారీ భూమి కంపిస్తుండడంతో భయాందోళన చెందిన నిరుపేదలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక క్వారీ దుమ్ము సమీపంలోని పొలాలపై దుమ్ముధూళి పడటంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి బీటలు వారిన ఇందిరమ్మ ఇల్లు నిబంధనలకు నీళ్లు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య మాత్రమే బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో పేలుళ్లు జరుపుతున్నారు. ఇక క్వారీ సమీపంలో చెట్లును పెంచి వాటిని సంరక్షించే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎక్కడా ఒక్క మొక్కను కూడా నాటలేదు. బ్లాస్టింగ్ కోసం ఉపయోగించే మందుసామగ్రిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. లైసెన్స్ ఉన్న వారితో మెటీరియల్‌ను కొనుగోలు చేయాలి. ఇందులో ఏ ఒక్కటీ పాటించడం లేదు. ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్ క్వారీ, క్రషర్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై మల్లాపురం వాసులు మూకుమ్మడిగా రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్వాహకులిచ్చే మామూళ్లు తీసుకుని వారికే వంతుపాడారు. పైగా మంత్రి కాలవ జోక్యం చేసుకోవడంతో క్వారీలపై ఫిర్యాదు చేసిన గ్రామస్తులపైనే కేసులు పెట్టించారు. కాలవ అండదండలతోనే... క్వారీల నిర్వాహకులకు అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని మరింత రెచ్చిపోయారు. కొందరైతే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్రషర్లు నిర్వహిస్తున్నారు. దీనిపై మల్లాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గతంలో విజిలెన్స్, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి సుమారు రూ. కోటి వరకు జరిమానా విధించారు. క్రషర్‌ను సీజ్ చేయాలని ప్రయత్నించగా... అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి క్రషర్ సీజ్ చేయకుండా చూశారు. ఇక జరిమానా కూడా సగానికి పైగా తగ్గించేలా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. పెద్దఎత్తున కంకరను నిల్వచేసిన క్వారీ, క్రషర్ నిర్వాహకులు ఖజానాకు భారీ గండి క్వారీ, క్రషర్ల నిర్వాహకులు రాయల్టీ సైతం చెల్లించకుండా ఖజానాకు భారీ గండి కొట్టారు. ఒకటి, రెండు పర్మిట్లు తెచ్చుకుని వాటిపై తేదీలు వేయకుండా వాటితోనే వందల ట్రిప్పులు కంకరను తరలిస్తున్నారు. ఇక రాత్రిపగలు తేడా లేకుండా మిషన్లు నడిపిస్తూ అనుమతులకు మించి బ్లాస్టింగ్లు చేస్తూ సంవత్సరంలో తరలించే కంకరను మూడు నెలల్లోనే రవాణా చేసుకుంటున్నారు. అంతేకాకుండా రెండు మొబైల్క్రషర్ యూనిట్ల సాయంతో కంకరను తీసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది. ‘నితిన్ సాయి’ నిర్వాకం అనంతపురం నుంచి 56 కిలోమీటర్ నుంచి 106 కిలోమీటర్ మొళకాల్మూరు రోడ్డు వరకు 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి, టీడీపీ నాయకులు పురుషోత్తంనాయుడుకు చెందిన లేఖాన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకున్నాయి. ఈ రోడ్డుకు కావాల్సిన కంకర కోసం ఈ రెండు కంపెనీలు రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో సర్వేనంబర్ 132లోని 11.70 ఎకరాల విస్తీర్ణంలో (దొణగుడ్డం)డోలగుట్ట కొండను లీజుకివ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అధికారులు అనుమతులు ఇవ్వకుండానే కొండను పిండి చేస్తూ కంకరను తరలిస్తున్నాయి. ఇక వేపరాల క్రాస్ సమీపం సర్వేనంబర్ 270జీ, ఎఫ్లలో ఇద్దరు నిరుపేద రైతులకు చెందిన డీ పట్టాభూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంసీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీ పట్టాభూములను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, కార్యాలయం కోసం గది ఏర్పాటు చేసుకుని కార్మికులకు కూడా ఇక్కడే తాత్కాలిక ఇళ్లను నిర్మించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు మేల్కొని కంకర క్వారీ, క్రషర్ యూనిట్లో అక్రమాల నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం క్వారీ, క్రషర్‌పై దాడులు నిర్వహిస్తాం. అనుతులు ఉన్నాయో లేదో చూస్తాం. త్వరలోనే విచారణాధికారిని నియమించి నిబంధలను పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నుడుతుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటరమేష్‌బాబు, తహసీల్దార్, రాయదుర్గం -
పోలింగ్ తర్వాత వరదాపురం సూరి హింసను ప్రేరేపిస్తున్నారు
-
వరదాపురం సూరిపై కేతిరెడ్డి ఫైర్!
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరిపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత హింసను సూరి ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. సోమవారం అనంతపురం ఎస్పీని కలిసిన ఆయన సూరి ఆగడాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారన్నారు. ఆడియో టేపుల్లో కూడా సూరి వాయిస్ స్పష్టంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఆస్తుల విధ్వంసం, భౌతిక దాడుల కేసుల్లో సూరిని నిందితుడిగా చేర్చాలని కోరారు. వరదాపురం సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ధర్మవరంలో రెచ్చిపోయిన టిడిపీ ఎమ్మెల్యే సూరి అనుచరులు
-
చేనేత వ్యాపారులపై వరదాపురం సూరి వివాదస్పద వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే అభ్యర్థికి గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు..!
-
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..!
సాక్షి, ధర్మవరం: టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని పాండురంగ వీధిలో పర్యటించారు. స్థానిక సమస్యలపైన మహిళలు ఆయన్ను గట్టిగా నిలదీశారు. ‘ఇంటి పట్టాలకోసం ఐదేళ్లలో పది సార్లు అర్జీలు ఇచ్చినాం.. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా.. నీ వెనుక తిరిగే వాళ్లకు పట్టాలు ఇచ్చినావ్’ అంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండా సూరి దాటేసుకుని వెళ్లిపోయారు. స్థానిక నాయకులు ‘మేమున్నాంలేమ్మా.. మళ్లీ అధికారంలోకొస్తే ఇప్పిస్తాం ’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. చూసినాం పోప్పా..’ అంటూ వారిని అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అక్కడా నిలదీతే.. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తమకు అందేలా చేయలేదని చేనేతలు సైతం గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి)ను నిలదీశారు. ‘చేనేత ముడిపట్టు రాయితీలూ బకాయి ఉంది.. ఇంకేం చేశారని మీకు ఓటు వేయాలి.. ఈ ఐదేళ్లలో మీ ఇంటి వద్దకు ఎన్నిసార్లు తిరిగినాం.. ఒక్క మగ్గం లోన్ అయినా ఇప్పించారా? ఒక్క బీసీ రుణ మైనా మంజూరు చేశారా? ఏమన్నా అంటే మీ వార్డు కౌన్సిలర్‌ను అడుగు, మీవార్డు ఇన్‌చార్జ్‌ను అడుగండి అంటారు’ అని చేనేత అన్నలు ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా గుక్కతిప్పుకోండా.. టీడీపీ నాయకుల వైఖరిని ఎండగట్టారు. -
టీడీపీలో చల్లారని అసమ్మతి
సాక్షి, అమరావతి: ఎన్నికల సమీపిస్తున్నా టీడీపీలో అసమ్మతి చల్లారలేదు. టిక్కెట్ రాని నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఇక టీడీపీని వదిలి వెళ్లేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనూ అస్మమతి కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పూతల పట్టు నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్య అనుచరుల ఒత్తిడితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో అవమానించారు వైయస్సార్ జిల్లా బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయజ్యోతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్నంత కాలము తనను చిత్ర హింసలకు గురిచేశారని, అవమానించారని వాపోయారు. టీడీపీ మోసం చేయడంతో ఆ పార్టీని వదిలిపెట్టినట్టు చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు. సూరికి ఎదురుదెబ్బ అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేతలు నాగశేషు, మద్దిలేటి, జయశ్రీ సహా 1500 మంది టీడీపీ కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వరదాపురం సూరి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వరప్రసాద్ గుడ్‌బై గుంటూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ వరప్రసాద్ (బుజ్జి) బుధవారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు డైరెక్టర్ పదవుకి రాజీనామా చేశారు. తాళ్లూరు సొసైటీ అధ్యక్షుడు బుజ్జి, మునుగోడు సొసైటీ మాజీ అధ్యక్షుడు చిట్టిబాబు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. -
బట్టబయలైన టీడీపీ హత్యా రాజకీయాలు