water level
-
వదలని వరద.. తొలగని బురద
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి): ఊహకందని విలయం..మాటలకందని విషాదం నుంచి ఎనిమిది రోజులైనా విజయవాడ నగరం తేరుకోలేకపోతోంది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి మానకపోగా, బురద చేస్తున్న కొత్త గాయాలతో అల్లాడుతోంది. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకూ కంటిమీద కునుకు లేకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలతో పాటు వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ కింద రామరాజ్యనగర్, పంజాసెంటర్, చిట్టినగర్ సొరంగం, కబేళారోడ్డు, సితార సెంటర్, నిజాంగేట్ సెంటర్, వించిపేట, కంసాలిపేటలో వరద తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. బుడమేరు ఉగ్రరూపంగత నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి పరీవాహకప్రాంతం నుంచి బుడమేరుకు భారీగా నీరు వచ్చి చేరింది. మూడు చోట్ల గండి పడింది. వెలగలేరు నుంచి ఆ వరదంతా వచ్చి విజయవాడ నగరాన్ని ఈనెల 1వ తేదీ ఉదయం ముంచెత్తింది. ఆ వరద నీరు ముందుగా ప్రవేశించిన వైఎస్సార్‌కాలనీ, జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతానికి చేరుకున్న తొలిమీడియా ‘సాక్షి’కి అడుగడుగునా బాధితుల కష్టాలు కనిపించాయి. అక్కడ బుడమేరు నేటికీ ఉగ్రరూపంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయిన ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఎనిమిది రోజులుగా నీటిలోనే ఇళ్లు నానిపోతుండటంతో గోడలు ఏ క్షణాన కూలిపోతాయోనని తప్పనిసరై పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందుతున్న బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.కన్నీరేగాని... మంచి నీరేదిబుడమేరు వరదలకు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మందికి తమ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. ముంపు ప్రాంతాల్లో చిధ్రమైన వారి జీవితాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల కన్నీరు ఇంకిపోతుందేమోగానీ ఆ అభాగ్యుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. కనీసం బురదైనా తొలగడం లేదు. వన్‌టౌన్ ప్రాంతంలో వరద నీటిలో రోజుల తరబడి మునిగిపోయిన కాలనీలు, వీధులు, రోడ్లు, ఇళ్లు బురద, చెత్తతో నిండిపోయాయి. ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాటిని తొలగించుకునేందుకు బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కంసాలిపేటలో బురదతో పాటు డ్రెయినేజీ నీటితో పాటు, కాలకృత్యాలు కూడా అదే నీటిలో కలిసిపోవడంతో అదంతా భారీగా దుర్ఘందాన్ని వెదజల్లుతోంది.వరద నీటిలోనే రోజుల తరబడి నరకయాతన అనుభవించిన వారిలో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే, మరికొందరు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం తాగేందుకు మంచి నీరు దొరకడం లేదు. వంట సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నాగానీ వాడుకునేందుకు నీళ్లు లేక పొయ్యి వెలిగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీరూ మురుగుతో నిండి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల భయంతో చాలా మంది ఇళ్లకు తిరిగిరావడం లేదు. దీంతో వారంగా వేలాది ఇళ్లకు తాళాలు వేసే ఉన్నాయి. పూర్తిగా ఇళ్లు కూలిపోయి గూడు కోల్పోయిన వారిలో కొందరు చిట్టినగర్ వద్ద సొరంగంలో తలదాచుకుంటున్నారు. స్ఫూర్తినింపుతున్న ప్రజలువరద వల్ల లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాలు లేక రోడ్డున పడ్డారు. వారిలో కొందరు చిరు వ్యాపారులు విషాదం నుంచి తేరుకుంటున్నారు. దుకాణాల్లో పేరుకుపోయిన బురదను తొలగించుకుని, పాడైపోయిన వస్తువులు, సరుకులు బయటపడేసి మళ్లీ కొత్తగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోలుకోలేని కష్టం నుంచి తేరుకుని దుకాణాలను తెరిచి స్ఫూర్తినింపుతున్నారు. వృద్ధులు, చిన్నారులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సితార సెంటర్, కబేళ రోడ్డు, రామరాజ్య నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నేటికీ వరద నీరు పూర్తిగా తొలగలేదు.ఇక్కడ పలు వీధులకు ఇప్పటికీ ప్రజల రాకపోకలకు అవకాశం లేదు. అలాంటి చోటికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది వాహనాలు నీళ్లలోనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తున్నారు. తరలించేందుకు అవకాశం ఉన్నవాటిని అతి కష్టం మీద మరమ్మతులకు తీసుకువెళుతున్నారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి నీటిలో మొరాయిస్తున్నాయి.సర్వం కోల్పోయాం ఆదుకోవాలిమేము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం బుడమేరు వరద ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో బిల్డింగ్‌పైకి పరుగులు పెట్టాం. రెండు రోజుల పాటు ఆహారం, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాం. కరెంట్ లేదు. ప్రభుత్వ సహాయక చర్యలు మాదాకా రాలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పడవను తెప్పించుకుని ఒడ్డుకు చేరాం. బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నాం. వారం రోజుల తర్వాత ఇంటిలోకి వెళ్లి చూస్తే గృహోపకరణాలన్నీ వరదలో తడిసి పాడైపోయాయి. ఇళ్లంతా బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. – రేగాని సామ్రాజ్యం, వాంబేకాలనీ, సింగ్‌నగర్ లంటీర్లు ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదుఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వరదలో ఇల్లు మునిగిపోయింది. ఆటో వరదలో మునిగి పాడైపోయింది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. వారం రోజులుగా ఆహారం లేక, మంచినీరు అందక నరకం చూస్తున్నాం. వలంటీర్లు ఉంటే కుటుంబంలో అందరికీ ప్రభుత్వంఅందిస్తున్న సహాయ చర్యలు సక్రమంగా అందేవి. ఇప్పుడు ప్రధాన రోడ్డు వరకే ట్రాక్టర్ వస్తోంది. అక్కడకు వెళితే భోజనం ప్యాకెట్లు, వాటర్ ఇస్తున్నారే తప్ప చిన్న వీధుల్లోకి రావడం లేదు. భోజనం ప్యాకెట్లు తెరిచి చూస్తే వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. – పలిశెట్టి సురేష్, సింగ్‌నగర్ -
నాగార్జునసాగర్ అధికారుల పొంతన లేని లెక్కలు
-
శాంతించిన గోదావరి..
-
భారీగా పెరిగిన గోదావరి నీటిమట్టం
-
ఉగ్ర గోదావరి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్‌కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్ మధ్య గోదావరి సబ్ బేసిన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలుమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్‌మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. -
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
Heavy Rains: హుసేన్ సాగర్ కు పోటెత్తిన వరద..
-
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
క్షణక్షణం పెరుగుతోన్న ప్రాణహిత నది నీటి మట్టం!
-
భద్రాచలం వద్ద గోదావరికి పెరిగిన నీటి మట్టం
-
ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
-
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
మండే ఎండల్లోనూ నిండుగా నీళ్లు
కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఒక క్రస్టు గేటును పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. జూన్ మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారని చెపుతున్నారు. గత ఏడాది జూన్ 27న గేట్లు ఎత్తారు. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాజెక్టు వేసవిలోనే నిండుకుండలా మారింది. నెల రోజుల నుంచి మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయానికి నీటిమట్టం 644.60 అడుగులకు (4.36 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో డ్యామ్ అధికారులు మూడో నంబర్ క్రస్ట్ గేటును అర అడుగు మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 644.5 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు.. భవిష్యత్తులో పరిస్థితి అంతే!
సాక్షి, రంగారెడ్డి: భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. ప్రస్తుతం పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వేగంగా.. జిల్లాలో 68 ఫిజో మీటర్లు ఉన్నాయి. 2022 మార్చిలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ నీటి మట్టం స్థాయి 8.60 మీటర్లు ఉండగా, 2023 మార్చి నాటికి 8.89 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా తొమ్మిది మండలాల్లో నీటి లభ్యత మెరుగుపడగా, మరో 18 మండలాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వీటికి సమీపంలో కొత్తగా అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా అపార్ట్‌మెంట్‌వాసులు, వాణిజ్య సముదాయాలు భూగర్భజాలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో వంద ఫీట్లలోపే నీరు సమృద్ధిగా లభిస్తుండగా, మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో వెయ్యి ఫీట్లకుపైగా లోతు బోర్లు తవ్వుతున్నారు. అయినా చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. వేగంగా పడిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం అధికంగా ఉంది. చెరువులు, కుంటలు కూడా చాలా తక్కువ. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు అనుమతి ఉంది. కానీ చాలామంది అనుమతి పొందకుండా నిపుణుల సూచనలు పాటించకుండా 1000 నుంచి 1,200 ఫీట్లు తవ్వుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణం. నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ బావుల వద్ద పొలాల్లో చెక్‌డ్యాంలు, వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో నష్టాలు చవి చూడక తప్పని పరిస్థితి. -
884.80 అడుగులకు చేరిన ‘శ్రీశైలం’ నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రం 884.80 అడుగులకు చేరుకుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,19,093 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. మూడు గేట్లను 10 అడుగుల మేర తెరిచి 83,949 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 66,566 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 95,562 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 5 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్ జలాశయం నుంచి 1,60,129 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589.10 అడుగులుండగా 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు అయితే.. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. -
మూసీ నదికి తగ్గిన వరద
-
శ్రీశైలం డ్యాం.. అందాలు చూడటానికి సిద్దమా!
శ్రీశైలం ప్రాజెక్ట్(నంద్యాల జిల్లా): శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో శనివారం గేట్లు ఎత్తనున్నారు. గురువారం సాయంత్రానికి డ్యాం నీటి మట్టం 880.20 అడుగులకు చేరుకుంది. మరో 4.80 అడుగులు పెరిగితే గరిష్టస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,65,255 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాంకు వస్తోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సగటున 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం నాటికి జలాశయ నీటిమట్టం 882 అడుగులకు పైబడి చేరుకోనుంది. దీంతో ఆదే రోజు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం ప్రాజెక్ట్ చేరుకుని డ్యాం రేడియల్క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 597 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. (క్లిక్: మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!) -
శ్రీశైలానికి పోటెత్తిన వరద!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరదతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక పెరిగింది. నీటిమట్టం డెడ్ స్టోరేజీ (854 అడుగులు)ని దాటింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జూరాల నుంచి 1,52,368 క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988 క్యూసెక్కులు.. కలిపి 3,14,256 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులకు, నిల్వ 90 టీఎంసీలకు పెరిగింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేస్థాయిలో కొనసాగితే ఆరు రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశముంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో తుంగభద్రలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు కూడా నిండి ఉండటంతో వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో మరో రెండు, మూడు రోజులు శ్రీశైలంలోకి ప్రస్తుత స్థాయిలోనే ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కులు (రోజుకు 2.75 టీఎంసీలు) వదులుతోంది. ఇక నాగార్జునసాగర్‌కు దిగువన వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజీకి కూడా ప్రవాహం 11,081 క్యూసెక్కులకు పడిపోయింది. కృష్ణా డెల్టా కాల్వలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగతా 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం
-
శ్రీశైలంలోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఎట్టకేలకు కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటి మట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్లో ఎగువన శనివారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ వరద కనీసం వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, దాని ఉపనదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టిలోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో.. దిగువకు అంతే స్థాయిలో వరదను వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి చేస్తూ.. స్పిల్‌వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో టీబీ డ్యాంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దాంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యాం నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లో టీబీ డ్యాం నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తేసి.. వరదను దిగువకు విడుదల చేస్తారు. ఆ జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. దిగువకు విడుదల చేస్తున్న నీటిలో సాగర్‌కు 29305 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకు 43.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ రాత్రి 11.00 గంటల సమయంలో 48.50 అడు గులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. దీంతో దేవస్థానం వైపు కరకట్ట దిగువ భాగాన ఉన్న స్నానఘాట్లు పూర్తిగా మునిగిపోగా, కల్యాణ కట్టపైకి వరద చేరింది. కరకట్టల వద్ద స్లూయిస్‌లను మూసివేయటంతో భద్రాచలంలో వరద నీరు ఆగిపోయింది. ఆలయం పడమర మెట్ల వద్దకు చేరిన వరద నీరు దీంతో రామాలయ నిత్యాన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరుకుంది. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు కాలనీల ప్రజలను తరలించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 12 గేట్ల ద్వారా 13,888 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చర్ల, వెంకటాపురం మండలాల నడుమ ప్రధాన రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తూ, పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. వరద ఉధృతితో కల్యాణ కట్టలోకి చేరిన నీరు -
గోదావరికి పోటెత్తిన వరద
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతితో గురువారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 17.03 అడుగులు ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 18.90 అడుగులకు చేరింది. అది పెరుగుతూ రాత్రి 11 గంటలకు 33.10 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా వరద నీరు ఉపనదుల ద్వారా గోదావరికి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. అంతేకాకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని దిగువకు వదులుతుండటంతో శనివారం మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు, 1986లో వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టంకన్నా పోలవరం బ్యాక్ వాటర్‌తో ఇప్పుడు భద్రాచలంలో గోదావరి ఒకట్రెండు అడుగులు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందన్న ప్రచారంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
డెడ్ స్టోరేజీ చేరువలో ఎస్సారెస్పీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 1050.30 అడుగుల (6.37 టీఎంసీ) కు పడిపోయింది. ఎండల తీవ్రతకు ప్రతిరోజూ రెండు వందలకు పైగా క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక నిండిపోవడంతో ఐదు టీఎంసీల మట్టానికి తగ్గితే బురద నీరు మారే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఒకటిన్నర టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఈ గ్రిడ్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల తాగునీటి కోసం ప్రతిరోజు 54 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి కోసం 29 క్యూసెక్కులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోసం మరో 54 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తున్నారు. ఆవిరి నష్టాలతో కలిపి మొత్తం ప్రతిరోజు 394 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఏటా ఈ ప్రాజెక్టుకు ఆగస్టులో ఇన్‌ఫ్లో ఉంటుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలకు ఈ నీటినే వినియోగించాల్సి ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం- 6.37టీఎంసీలు ప్రతిరోజూ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీరు- 394క్యూసెక్కులు.. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి మట్టం- 5టీఎంసీలు ఆగస్టులో భారీగా ఇన్‌ఫ్లో.. మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. ఈసారి 2018 ఆగస్టులో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కొన్నిరోజులు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద జలాలు వచ్చి చేరాయి. ఏడాది మొత్తానికి 77.92 టీఎంసీలు వచ్చాయి. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టంగా 83 టీఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటిని వదిలారు. ఎగువ ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు సుమారు 20 టీఎంసీలు సాగునీరు సరఫరా చేశారు. తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు.. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు 6.37 టీఎంసీల నీరుంది. దీంతో ఆగస్టు మాసాంతం వరకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రాజెక్టు ఇన్‌ఫ్లో ఉంటుంది. -శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్