WhatsApp Message
-
ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!
తిరుపతికి చెందిన శ్రీనివాస్ కుమారుడు యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన కొడుకు వివాహానికి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల్లోని బంధుమిత్రులకు ఆహా్వనం పంపేందుకు సన్నాహాలు చేపట్టారు. సమయం కేవలం 12 రోజుల మాత్రమే ఉండడంతో అందరికీ పత్రికలు పంచేందుకు వీలుకాని పరిస్థితి. కుమారుడి సలహా మేరకు బెంగళూరుకు వెళ్లి క్యూర్ స్కానర్‌తో వీడియో వెడ్డింగ్ కార్డులు, ఏటీఎం తరహాలో డిజిటల్ కార్డులు డిజైన్ చేయించారు. కేవలం 10 నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా బంధుమిత్రులకు ఆహ్వానం పలికేశారు. సరికొత్త ట్రెండ్‌తో అందించిన పెళ్లిపిలుపుపై ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.తిరుపతి సిటీ : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివాహ, శుభకార్యాలకు ఆహ్వానించే విధానం వినూత్నంగా మారింది. గతంలో వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులకు పిలవాలంటే కనీసం నెలరోజుల ముందుగా వెడ్డింగ్ కార్డులు ముద్రించి వ్యయ ప్రయాసలకోర్చి గడపగడపకు వెళ్లి పంచాల్సి వచ్చేది. మారుతున్న కాలంతో పాటు అది కాస్తా ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలోకి వచ్చేసింది. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో ఆహా్వన పత్రికలు వీడియో వెడ్డింగ్ కార్డుల రూపంలో హల్చల్ చేస్తున్నాయి. మరింత ముందుకు వెళ్లిన అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ వెడ్డింగ్ కార్డులు వచ్చేశాయి. ఏటీఎం తరహాలో కార్డులు పెళ్లికి బంధుమిత్రులను పిలించేందుకు క్యూఆర్ కోడ్‌తో ప్రింట్ చేసిన ఏటీఎం తరహా కార్డులు ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. వీడియో వెడ్డింగ్ ఇని్వటేషన్స్తో పాటు ఉన్నతస్థాయి బంధుమిత్రుల కోసం విజిటింగ్ కార్డ్స్ రూపంలో ఉండే డిజిటల్ వెడ్డింగ్ కార్డులు పంపుతున్నారు. ఏపీలో తొలిసారి పశి్చమగోదావరి జిల్లాలో ఓ కాంట్రాక్టర్ తన కుమారుడి వివాహం కోసం ఈ తరహా కార్డులను తయారు చేయించారు. ఇందులో కార్డుపై భాగంలో వధూవరుల ఫొటో, పేర్లు, ఆహా్వనించు తల్లిదండ్రుల పేర్లు మాత్రమే ఉంటాయి. వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వివాహనికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. పెళ్లిమండపం అడ్రస్, లొకేషన్ మ్యాప్, పెళ్లి పత్రిక, విందు టైమింగ్స్, ముహూర్త సమయంతో పాటు సంప్రదించాల్సిన వధువు, వరుడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు పొందుపరిచి ఉంటాయి.ఇప్పుడు ఇదే ట్రెండ్ డిజిటల్ యుగంలో యువత బర్త్ డే, ఎంగేజ్మెంట్, గ్రాడ్యుయేషన్, బేబీ షవర్, ఆఫ్ శారీ ఫంక్షన్స్, గృహప్రవేశాలు వంటి అన్ని శుభకార్యాలకు వీడియో కార్డుల ద్వారా ఆహా్వనాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతి వ్యక్తీ ఉచిత టెంప్లెట్స్ను డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లలో ఆహ్వాన పత్రికలను తయారు చేసేస్తున్నారు. కరోనా తర్వాత ఆహా్వనాలను డిజిటల్ పద్ధతిలో పంపేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రింటింగ్ కార్డులపై తగ్గిన మోజు వివాహ మహోత్సవంలో ప్రధాన భూమిక పోషించే వెడ్డింగ్ కార్డులు కాలానుగుణంగా రూపు మార్చుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కార్డులతో మొదలైన పెళ్లి పత్రికలు తర్వాత కలర్, యూవీ, లేజర్, ఫొటో ప్రింట్, సౌండ్ సిస్టమ్ కార్డులుగా మారాయి. ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగింది. రూ.2 నుంచి సుమారు రూ.20 వరకు ఒక్కోకార్డు «ప్రింటింగ్ ధర ఉండేది. ప్రస్తుతం నయా ట్రెండ్ మొదలైంది. డిజిటల్ యుగంలో వీడియో వెడ్డింగ్ కార్డులు మార్కెట్‌ను శాసించాయి. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానర్‌తో రూపొందించిన డిజిటల్ కార్డుల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీంతో ప్రింటింగ్ ప్రెస్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.విశేషంగా స్పందన మా కాబోయే అల్లుడు లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. మాది కొత్త బంధుత్వం. ఆగస్టు 14న బెంగళూరులోని కల్యాణ మండపంలో సెపె్టంబర్ 2న వివాహం జరిపేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. వధువరూలు ఆగస్టు 20న ఇండియాకు వచ్చారు. పదిరోజులు మాత్రమే సమయం ఉంది. బంధుమిత్రులకు ఎలా ఆహా్వనం పంపాలనే ఆలోచనలో పడ్డాం. మా అల్లుడి సలహాతో ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ కార్డులను తయారు చేసి అందరికీ వాట్సాప్ ద్వారా పంపించాం. బంధుమిత్రులు ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని కల్యాణ మండపానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా అనిపించింది. – కోటేశ్వరరావు, తిరుపతిప్రింటింగ్ కార్డులు తగ్గాయి గతంలో ప్రతి ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో సుమూహూర్తాలు ఉన్నందున పెళ్లికార్డుల ప్రింటింగ్‌కు ప్రజలు ఎగబడేవారు. బిజినెస్ అంతా ఆ మూడు మాసాల్లోనే జరిగేది. నగరంలోని ప్రతి ప్రింటింగ్ ప్రెస్ నిర్విరామంగా పనిచేసేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం అడపాదడపా తక్కువ క్వాంటిటీతో పెళ్లి పత్రికల కోసం వస్తున్నారు. సుమారు 50 శాతానికి పైగా బిజినెస్ తగ్గింది. కంప్యూటర్ కాలం, డిజిటల్ ఫోన్లు రాకతో పత్రికలకు డిమాండ్ భారీగా పడిపోయింది. – వెంకటేశ్వర్లు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, తిరుపతి -
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
వాట్సప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్ ఓపెన్ చేయగానే వాట్సప్ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్‌లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్ యాజమాన్యం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన బీటా వెర్షన్ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్గా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లకు నోటిఫికేషన్ వస్తుంది. చదవని వాట్సప్ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అవ్వనున్నాయి. -
వాట్సాప్‌లో తన బాధనంతా చెప్పుకుని.. యువకుడు తీవ్ర నిర్ణయం!
మహబూబ్‌నగర్: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉంటున్న సతీష్ (24) శనివారం సాయంత్రం కాలనీసమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ, జూదానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు స్నేహితుడు గణేష్‌కు మెసేజ్ పెట్టాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా.. తూర్పు గోదావరి జిల్లా చిన్నవంగలపాడు చెందిన సతీష్ పోలేపల్లి ఫార్మా సెజ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తూ పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీలో మరో ముగ్గురితో కలసి అద్దెకు నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 6గంటలు దాటాక తోటి స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్పెట్టాడు. ‘తన మృతదేహం రైలుపట్టాలపై ఉంటుందని, తీసుకుని ఎలాగైనా ఇంటికి చేర్చాలని, డబ్బులు లేకుంటే ఏమి చేయలేమని, తనకు బ్యాంకులో కొంత అప్పు ఉందని, అదికాకుండా బయట రూ.40వేల అప్పు ఉందని మెసేజ్‌లో పొందుపర్చాడు. తాను జూదానికి బానిసైనట్లుగా అందులోనుంచి బయటకు రాలేకపోతున్నానని, అప్పులు తీర్చేమార్గం లేకుండా పోయిందని తెలిపాడు. తాను ఏమి చేయలేనని, తల్లిదండ్రులకు అండగా ఉండి సోదరి పెళ్లి చేయాలనుకున్నా చేయలేదని, తనవల్ల ఎవరికీ లాభం లేదని, అమ్మానాన్నలతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నానని, మన్నించమని వేడుకున్నాడు. సోదరి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులిచ్చేదని, అయినా పెళ్లి చేసి అండగా ఉండాల్సిన వాడిని ఏం చేయలేకపోతున్నానని, తనకు మనోధైర్యం ఇచ్చేవారు లేరని తెలిపాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నాడు. మెసేజ్ చూసిన గణేష్‌తోపాటు ఇంటి యజమాని ప్రకాష్ మరికొందరు కలిసి రైలుపట్టాలపై వెతకగా మృతదేహం లభించింది. దీంతో విషయాన్ని అతడి బావ ప్రసాద్‌కు తెలియజేశారు. జడ్చర్లలోనే నివాసం ఉంటున్న అతడు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక రైల్వే స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించి రాత్రి మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆస్ట్రేలియా వెళ్తున్నా.. నా కోసం వెతకొద్దు
హైదరాబాద్: ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు.. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి వైద్యురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహియా తరన్నం (24) ఈ నెల 3న ఎప్పటిలాగే ఉదయం సబ్జా కాలనీలోని తన నివాసం నుంచి విధులకు వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి మహ్మద్ గఫార్‌కు వాట్సాప్ కాల్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని తన కోసం వెతకవద్దంటూ చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. గత 8 నెలలుగా ఆమెతో పాటు వైద్యుడిగా పని చేస్తున్న నదీమ్‌తో.. పరిచయం ఏర్పడిందని.. బిహార్‌కు చెందిన అతను మాయమాటలు చెప్పి మహియా తరన్నంను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: చిటికెలో రూ.50వేల లోన్! నమ్మారో..
బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో చేరితే చాలంటూ.. ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్‌ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది. 'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. -
పాకిస్థాన్ నుంచి కాల్స్.. వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!
భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్‌లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది. ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్‌లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు. ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్‌లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
వాట్సాప్ స్టేటస్తోనూ సమాచార వ్యాప్తి
ముంబై: వాట్సాప్ యాప్ ద్వారా ఇతరులకు సమాచారం అందించాలనుకునే వారు బాధ్యతాయుత వైఖరి కలిగి ఉండాలని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం పేర్కొంది. వాట్సాప్ ద్వారా మతాల మధ్య విద్వేషాలను పెంచుతున్నారంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. వాట్సాప్ స్టేటస్‌తో యూజర్లు తమ ఉద్దేశాలను ఇతరులకు తెలియజేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ ఈ నెల 12న ఇచి్చన ˘ ఉత్తర్వుల్లో తెలిపింది. -
డేంజర్:వాట్సాప్‌లో పొరపాటున కూడా ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు
వాట్సప్‌లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్‌ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్‌లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్‌లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్‌ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్‌మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్‌లు లేదా లింక్‌లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్‌ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్‌తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్‌లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్‌ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్‌లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్‌ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్‌లోని జాబితాకు మెసేజ్‌లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్‌లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్‌ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్‌ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వివేకా రెండో భార్య వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. లైవ్‌లో చదివి వినిపించిన యాంకర్
-
కవితతో సుఖేష్ వాట్సాప్ చాట్.. ‘ఆ రేంజ్ రోవర్ కారు ఎవరిది?’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎమ్మెల్సీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేష్ చంద్ర లిక్కర్ స్కాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కవితతో తాను చేసిన వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టాడు. ఈ సందర్బంగా లిక్కర్ వ్యాపారంలో వచ్చిన డబ్బును హైదరాబాద్ నుంచి ఆసియా దేశాలకు హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సుఖేష్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు రంగంలోకి దిగారు. దీంతో, రఘనందన్ రావు తాజాగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుఖేష్ చంద్ర లేఖపై ఈడీకి ఫిర్యాదు చేశారు రఘనందన్. ఈ సందర్భంగా రఘనందన్ మాట్లాడుతూ.. కవిత, సుఖేష్ చంద్ర వాట్సాప్ చాటింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. సుఖేష్ వాట్సాప్ చాట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కారులో రూ.15 కోట్లు ఇచ్చినట్టు సంభాషణ ఉంది. నగదు ఉంచిన 6060 నెంబర్ రేంజ్ రోవర్ కారు ఎవరిది? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ పోలీసులు మౌనం వీడాలి. తెలంగాణ భవన్లో మనీలాండరింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. -
వాట్సాప్ స్పామ్ కాల్స్‌తో చిర్రెత్తిపోయారా?
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో వచ్చే స్పామ్ మెసేజెస్, అనుమానాస్పద కాల్స్ విసిగిస్తుంటాయి. అయితే అలాంటి వాట్సాప్ ఫోన్ కాల్స్ నుంచి యూజర్లకు ఉపశమనం కలిగించేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మ్యూట్ చేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్ల సమాచారం. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం..వాట్సాప్ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను సైలెంట్లో పెట్టుకునే సౌలభ్యం కలిగించనుంది. అప్పటి వరకు ఆ కాల్స్ లిస్ట్ నోటిఫికేషన్ సెంటర్ (ఫోన్ డిస్ప్లే మీద కనిపించడం) లో ఫోన్ నెంబర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తే ఇటీవల కాలంలో యూజర్లను అసహనానికి గురి చేస్తున్న స్పామ్ కాల్స్ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌కు వచ్చే స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ వాటిని సైలెంట్‌గా పెట్టుకునే సౌకర్యం లేదు. ఇప్పుడు ఆ ఫీచర్‌పైనే వర్క్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. చదవండి👉 నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు -
Apsrtc: ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రచారం ఫేక్
సాక్షి, కృష్ణా: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్ఆర్టీసీ. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీఎస్సార్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో Apsrtc వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్ చేస్తామని స్పస్టం చేసింది. -
పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్.. కార్డులిచ్చే రోజులు పోయాయి..
సాక్షి వరంగల్: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్ చేయించడం.. సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం.. పెళ్లికార్డు.. పిలుపు ఇలా.. నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్ గ్రూప్ కాల్ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. వాట్సాప్ గ్రూపులో పెళ్లి సందడి.. బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 200 కార్డులే.. కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ తగ్గించారు. – బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, వరంగల్ సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం.. మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు. – పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత.. పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది. – గంగధార మురళి, తండ్రి నెలరోజుల ముందు నుంచే.. గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు. – కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం -
రిస్టోర్ అయిన వాట్సాప్ సేవలు
-
వాట్సాప్ సేవలు పునరుద్ధరణ
భారత్‌తో పాటు పలు దేశాల్లో నిలిచిపోయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 95 నిమిషాల తర్వాత సేవలను పునరుద్ధరించించి మాతృ సంస్థ మెటా. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల యూజర్లు మెసేజ్‌లు పంపేందుకు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత.. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవటం, డబుల్ టిక్, బ్లూటిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో పడ్డారు యూజర్లు. సమస్య తలెత్తిన తర్వాత వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు! -
Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సాప్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 244 కోట్లు మంది ఇప్పటివరకు వాట్సాప్ సేవలను వాడుతున్నారు. నవంబర్ 2009లో ప్రాథమికంగా వాట్సాప్‌ను యాపిల్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. 2010లో అండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ దశ తిరిగింది. కేవలం నాలుగేళ్లలోనూ 200 మిలియన్ యూజర్ల మార్కును చేరుకుంది. వాట్సాప్ పెరుగుతున్న తీరును చూసిన ఫేస్ బుక్.. వెంటనే బేరం పెట్టింది. ఏకంగా 19 బిలియన్ డాలర్లను వెచ్చించి 2014లో సొంతం చేసుకుంది. ఈ మొత్తం వాట్సాప్ విలువ కంటే 12 రెట్లు ఎక్కువ. భారత్ వ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మెసెజ్‌లు పంపుకోవచ్చు. ప్రతీ రోజు దాదాపు పది వేల కోట్ల మెసెజ్‌లను వాట్సాప్ చేరవేస్తుంది. (చదవండి: దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!) వాట్సాప్ వచ్చిన తర్వాత దెబ్బ పడిన మొదటి సర్వీస్ SMS. అప్పటి వరకు ఒక్కో SMSకు కొంత మొత్తాన్ని చార్జ్ చేసిన మొబైల్ నెట్‌వర్క్‌లు వాట్సాప్ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఇక భారతీయులయితే వాట్సాప్‌ను ఎంతగా అభిమానించారంటే.. ఏం చేసినా వాట్సాప్‌లో పంచుకున్నారు. మెసెజ్ షేరింగ్, ఫోటో షేరింగ్, స్టేటస్.. ఇలా ప్రతీ అంశానికి వాట్సాప్‌పై ఆధారపడతారు.కొన్నాళ్లుగా కాలింగ్‌కు కూడా వాట్సాప్ ప్రత్యామ్నాయంగా మారింది. నేరుగా కాల్ చేస్తే రికార్డు అవుతుందనో.. లేక సౌకర్యంగా ఉంటుందనో వాట్సాప్ కాలింగ్‌నే నమ్ముకున్నారు చాలా మంది. ఇక విదేశాల్లో, లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి వాట్సాప్ కాలింగ్ ఎంతో సులభం. దీని వల్ల భారత్ లాంటి దేశాల్లో ISD ఇంటర్నేషనల్ కాలింగ్‌కు ఎంతో దెబ్బ పడింది. మొబైల్ నెట్‌వర్క్‌లు కన్నుమూసి తెరిచేలోపు వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్ ఎంతో ముందుకు వెళ్లింది. ఒకప్పుడు STD, ISD చేయాలంటే బూత్‌లకు వెళ్లేవాళ్లు. అపాయింట్మెంట్లు తీసుకునేవాళ్లు. వీటన్నింటికి వాట్సాప్ బెస్ట్సొల్యూషన్గా మారింది. ఇక వాట్సాప్ గ్రూపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ప్రతీ వాట్సాప్ యూజర్ కనీసం 10 గ్రూపుల్లో చేరడం, తమకు నచ్చిన అంశాలను బేస్ చేసుకుని గ్రూప్‌లు క్రియేట్ చేయడం వీపరీతంగా పెరిగింది. దీనికి తోడు మీడియాకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారింది. ప్రతీ వార్తను వాట్సాప్‌లో షేర్ చేసుకోవడం అనవాయితీగా మారింది. ఏకంగా వాట్సాప్ బేస్డ్గా మీడియా అంటే వార్తా ఛానళ్లు, పబ్లికేషన్లు నడుస్తుండడం ఆశ్చర్యం. గతంలో గోడ పత్రికలన్నీ ఇప్పుడు వాట్సాప్ పత్రికలుగా మారిపోయాయి. (చదవండి: WhatsApp Down కలకలం: స్పందించిన మెటా) -
Whatsapp: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. అయోమయంలో యూజర్లు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో మంగళవారం అంతరాయం ఏర్పడింది. కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించడం లేదు. వాట్సాప్‌లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు. ఇప్పటికే వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్లో వాట్సాప్ యూజర్లు.. ‘వాట్సాప్ డౌన్’ (#Whatsapp Down) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ — Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022 When WhatsApp is Down.#whatsappdown pic.twitter.com/xHgsHd9h8v — ɅMɅN DUВΞY (@imAmanDubey) October 25, 2022 When your WhatsApp is playing up but you come to Twitter and see that everyone else is having the same problem #WhatsAppDown pic.twitter.com/pMcJm0Zn56 — Jamie (@GingerPower_) October 25, 2022 People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU — Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022 చదవండి: షాపింగ్ బంద్, అల్లాడిన యూపీఐ లావాదేవీలు.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్
సాక్షి, జనగామ: రెండేళ్ల క్రితం పంపిన ఓ మెసేజ్.. యువకుడి హత్యకు దారి తీసింది. అన్నతో కాళ్లు మొక్కించారని కోపం పెంచుకున్న తమ్ముడు.. చివరకు కత్తిగాట్లకు బలయ్యాడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పక్కాప్లాన్‌తో మద్యం తాగేందుకు రప్పించి.. అదును చూసి కీచైన్ కత్తితో దారుణంగా చంపేశారు. ఈనెల 16న అర్ధరాత్రి జరిగిన ఈఘటన ‘ఇండస్ట్రియల్ ఏరియాలో హత్య’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈహత్యకు సంబంధించి సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ మూలబావికి చెందిన పకీరు రమేశ్ ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ వివాహిత ఫోన్‌కు రెండేళ్ల క్రితం అసభ్యకర మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె భర్త ఇండస్ట్రియల్ ఏరియాలోని దీప్తి ఇంజనీరింగ్ వర్క్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న పగడాల సందీప్ రమేశ్‌ను మందలించాడు. కాళ్లు మొక్కి తప్పు ఒప్పుకోవడంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది. తన అన్నతో కాళ్లు మొక్కించారనే కోపంతో రమేశ్ తమ్ముడు పకీరు సురేశ్ సందీప్‌కు ఫోన్‌కు చేసి నిలదీశాడు. దీంతో పాటు మెసేజ్ గురించి తెలిసిన వారందరికీ చెప్పాడు. అనంతరం రమేశ్ తన తమ్ముడు సురేశ్, సందీప్ ఇద్దరినీ పిలిచి కాంప్రమైజ్ చేశాడు. అక్కడితో గొడవ ముగియగా.. మూడ్రోజుల క్రితం సురేశ్ మరోసారి సందీప్‌కు ఫోన్ చేసి అదే విషయం గురించి మాట్లాడాడు. తన అన్నతో కాళ్లు మొక్కించుకుంటారా అని పగ పెంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి సందీప్, సురేశ్, మరో స్నేహితుడు విజయ్ ముగ్గురు కలిసి మద్యం తాగారు. ఇక్కడే ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. తాగిన మైకంలో సందీప్ తన వద్ద ఉన్న కీచైన్ కత్తితో సురేశ్‌ను ఇష్టం వచ్చినట్లుగా పొడిచి, మెడకోసి చంపేశాడు. ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని విచారణ సాగించారు. సందీప్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సురేశ్ తండ్రి పకీరు చంద్రయ్యను విట్నెస్గా చూపించి, సందీప్‌ను రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం -
కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..
Tina Dabi.. అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ఆమె రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. కాగా, మరోసారి టీనా దాబి వార్తల్లో నిలిచారు. అయితే, కలెక్టర్ టీనా దాడి ఫొటోనే వాట్సాప్‌లో వాడుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు.. ఓ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేసి, దాంట్లో ఐఏఎస్ టీనా దాబి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అనంతం వాట్సాప్‌లో ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేశాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ చాలా మందికి మెసేజ్‌లు పెట్టాడు. దీంతో, కలెక్టర్ టీనా దాబీనే గిఫ్ట్ కార్డులు అడిగిందే ఏమో అని వారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలంటూ అతడి వాట్సాప్ నుంచి మెసేజ్ వెళ్లింది. దీంతో, ఎందుకైనా మంచిదని ఆమె.. టీనా దాబికి ఫోన చేసి అసలు విషయం అడిగింది. గిఫ్ట్ కార్డు గురించి చెప్పడంతో షాకైన కలెక్టర్ టీనా దాబి.. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు. CM अशोक गहलोत के बाद अब IAS टीना डाबी के नाम पर ठगी, अफसर से ही मांग लिया गिफ्ट#IAS #Tinadabi https://t.co/zTbOOBvIMM — Zee Salaam (@zeesalaamtweet) August 9, 2022 ఇక.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. కాగా, రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగితోనే పరాచకాలా.. తేడా వస్తే ఇలాగే ఉంటంది.. -
వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా అధికారుల ఫోటోలు...అమెజాన్ గిఫ్ట్ కూపన్ల పేరుతో వల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా (డీపీ) పెట్టి, అనేక మందికి సందేశాలు పంపిస్తూ, అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కోరి టోకరా వేస్తున్న, వేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు నైజీరియాలో ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సహా ముగ్గురు ఉన్నతాధికారుల ఫొటోల దుర్వినియోగంపై నమోదైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆయా వాట్సాప్‌ల ఐపీ అడ్రస్‌లు తని ఖీ చేయగా అవన్నీ నైజీరియాలోనే ఉన్నట్లు తేలింది. ఇక్కడి నంబర్ అక్కడ వాట్సాప్.. దేశంలోనే ఉంటూ నేరాలు చేసే నైజీరియన్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వాడుతుంటారు. వీళ్లు బాధితులను బుట్టలో వేసుకోవడానికి అవసరమైన ఫోన్లు చేయడానికి బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుంటారు. వీటిని వీళ్లు కేవలం బేసిక్ ఫోన్లలో వేసి వాడేలా సూత్రధారులైన నైజీరియన్లు జాగ్రత్తపడతారు. ఈ నంబర్లకు సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం నైజీరియాలోని తమ అనుచరులతో యాక్టివేట్ చేయిస్తారు. అక్కడి వాళ్లు వైఫై ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటారు. అందుకు అవసరమైన కోడ్ మాత్రం ఇక్కడి వ్యక్తి దగ్గర ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. దీన్ని వీళ్లు నైజీరియాలోని వారికి చెప్పడంతో వాళ్లు ఎంటర్ చేసుకుని వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. చిక్కకుండా గిఫ్ట్ కూపన్లు.. గతంలో సైబర్ నేరగాళ్లు తమ సందేశాలు అందుకున్న వారి నుంచి డబ్బు అడిగి ఆన్లైన్ ద్వారా లేదా వివిధ వ్యాలెట్స్‌కు పంపాలని కోరేవారు. విషయం పోలీసుల వరకు వెళ్లి దర్యాప్తు చేపడితే నగదు చేరిన నంబర్ ఆధారంగా వీరి వివరాలు బయటపడేవి. ఇటీవల కాలంలో ఎక్కువగా అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలని కోరుతున్నారు. నిర్ణీత మొత్తానికి వీటికి ఖరీదు చేస్తున్న బాధితులు దానికి సంబంధించిన లింకులను షేర్ చేస్తున్నారు. వీటిని ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా రీడీమ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఫలానా దేశంలో కూపన్ రీడీమ్ అయిందని గుర్తించినా చర్యలు సాధ్యంకాదు. అధికారిక వెబ్సైట్లే ఆధారం.. వాట్సాప్ సిద్ధం చేసుకుంటున్న నైజీరియన్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే ప్రముఖ సంస్థల, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల వివరాలు, ఫొటోలు సంగ్రహిస్తున్నారు. ప్రొఫైల్ నేమ్, అబౌట్ తదితరాలను డీపీగా ఎంచుకున్న ఫొటోకు తగ్గట్టే సిద్ధం చేసుకుంటారు. ఈ నంబర్ నుంచి సదరు అధికారి కింద పని చేసే వారికి సందేశాలు పంపుతారు. ఇవీ నేరగాళ్ల చేతికి ఆయా వెబ్సైట్ల ద్వారానే తెలుస్తున్నాయి. కేవలం డీపీలు మాత్రమే చూస్తూ ఆ సందేశం తమ అధికారి నుంచే వచ్చినట్లు భావించి స్పందిస్తున్నారు. ఈ తరహా స్కామ్స్ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సంప్రదించి సరిచూసుకోవాలి డీపీ ఫ్రాడ్స్‌ల్లో ఉన్నతాధికారులు, సెలబ్రెటీల ఫొటోలు వినియోగిస్తారు. ఎవరికైనా తమ పై అధికారులు, పరిచయస్తుల నుంచి డబ్బు, గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మొద్దు. కేవలం డీపీలు చూసి ఆ సందేశం ఫలానా వారే పంపారని భావించద్దు. ఆ వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌ను పరిశీలించాలి. అది వాళ్లు నిత్యం వినియోగించేది కాకపోతే వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
పాతాళగంగలో దూకి మరణిస్తా.. భర్తకు వాట్సప్ మెసేజ్
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలోని పాతాళగంగలో దూకి మరణిస్తానని నంద్యాలకు చెందిన కృష్ణకుమారి తన భర్తకు వాట్సాప్ ద్వారా శనివారం సందేశం పంపించింది. అనంతరం ఆమె అదృశ్యమైంది. దీంతో మత్స్యకారుల సహకారంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయా ల్సిందిగా కోరారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ మెసేజ్ పంపినట్లు తెలుస్తుంది. చదవండి: (అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి) -
వాట్సాప్‌లో అదిరే ఫీచర్..సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాట్సాప్ రాకతో సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం, స్వీకరించడం సులువైంది. అయితే పంపిన సందేశంలో అక్షర దోషాలు, వాక్య నిర్మాణంలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. దాన్ని తొలగించడమో లేదా కాపీ చేసుకుని సరిచేసి మరోసారి పంపాల్సిందే. అయితే పంపిన సందేశాన్ని సరిదిద్దుకునే ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది. దీని వల్ల సమయమూ ఆదా అవుతుంది. ఆన్‌డ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్ వాట్సాప్ బీటా వెర్షన్ భవిష్యత్ అప్డేట్ కోసం ఈ ఎడిటింగ్ ఫీచర్‌పై కంపెనీ నిమగ్నమైంది. ఇది వస్తే ఎడిటింగ్ ఫీచర్ కలిగిన తొలి మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలుస్తుంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ ఇంకా స్పష్టత లేదు. గ్రూప్స్ నుంచి నిష్క్రమించినా అడ్మిన్‌కు తప్ప ఇతర సభ్యులకు తెలియకుండా ఓ ఫీచర్‌నూ వాట్సాప్ రూపొందిస్తున్నట్టు సమాచారం. -
తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?
Matrimonial sites are platforms designed to match: ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఒకటైన జంటలు కోకొల్లలు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? వివరాల్లోకెళ్తే....ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన మంచి సంబంధాలను వెతికి తీసుకువ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తులను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. పాపం బెంగుళూరులోని ఓ తండ్రి అలానే భావిస్తాడు. ఈ మేరకు అతను తన కూతురుకి తగిన వరుడుని మాట్రిమోనియల్ సైట్లలో వెతికి మరీ అతని వివరాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఐతే ఆమె తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. మాట్రిమోనియల్ సైట్లలో ప్రోఫెల్లో సదరు వ్యక్తుల పూర్తి సమాచారం ఉండటం సహజం. ఆమె అతని ప్రోఫెల్ చూసి ముచ్చటపడి ఉద్యోగం ఇచ్చింది. ఇంతకీ ఆమె బెంగళూరులోని స్టార్ట్ అప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్. అంతేకాకుండా తన తండ్రికి ఆ వ్యక్తికి లావదేవీలను సులభతరం చేసే ఫిన్టెక్లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని అందువల్ల తనను క్షమించమని తండ్రికి సందేశం పంపింది. వాస్తవానికి చూసిన ప్రతీ సంబంధం కుదరకపోవచ్చు గానీ ఇలా ఆమె ఆ వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ ఇచ్చిన తీరు ఆమెకు తన కెరీయర్ పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తోంది. ఈ మేరకు ఉదితా పాల్ తనకు తన తండ్రికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సంభాషణ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq — Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022 (చదవండి: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్‌లో బంధువులు) -
Whatsapp: మీ వాట్సాప్ బ్యాన్ అయ్యిందా?
Whatsapp Banned? Find Reasons, How to Recover Whatsapp Blocked Number: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను మన దేశంలో కోట్ల మంది వాడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మెటా కంపెనీ పరిధిలో పని చేస్తున్న వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్‌ల దగ్గరి నుంచి వీడియో కాల్స్ దాకా, వ్యక్తిగత అవసరాల నుంచి ఆఫీసుల పనుల దాకా.. అన్నీ నడిచిపోతున్నాయి. అయితే ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక.. వాట్సాప్ భారత్‌లో తన యూజర్లపై ఎక్కువ అజమాయిషీ చెలాయిస్తోంది. ఈ తరుణంలో వాట్సాప్ అకౌంట్లను క్రమం తప్పకుండా భారత్‌లో అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. పైగా Intermediary Guidelines and Digital Media Ethics Code ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన అకౌంట్లనే బ్యాన్ చేస్తున్నట్లు మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టుల్లో చెబుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు రెండు కోట్ల వాట్సాప్ అకౌంట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని తెలుస్తోంది. ఇంతకీ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తుందో కారణాలు తెలుసా? ►ఫేక్ అకౌంట్లు వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలాంటి వ్యవహారాలు దృష్టికి వస్తే వాట్సాప్ వాటిని బ్యాన్ చేస్తుంది. ►కాంటాక్ట్ లిస్ట్‌లో లేనోళ్లకు.. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నెంబర్లకు ఎక్కువ మెసేజ్‌లు పంపడాన్ని.. అనుమతులు లేని సంభాషణలుగా గుర్తిస్తుంది వాట్సాప్. అందుకే బ్యాన్ విధిస్తుంది. ఒకవేళ తెలిసిన వ్యక్తి అయినా సరే, నోటికి నెంబర్ గుర్తున్నా సరే.. కచ్చితంగా కాంటాక్ట్‌లో సేవ్ చేసుకున్నాకే ఛాటింగ్ చేయండి. ►థర్డ్ పార్టీ యాప్‌లతో.. వాట్సాప్ మెసేంజర్ కాకుండా థర్డ్ పార్టీలు యాప్‌లు ఉపయోగించినా ఈ సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు.. వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్, వాట్సాప్ ఫ్లస్.. ఇలాంటివన్నమాట. వీటిని వాట్సాప్ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు. ప్రైవసీ కోణంలో ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. కాబట్టి, వాటిని డిలీట్ చేయండి. అఫీయల్ యాప్‌కు మొమరీ స్పేస్ ఎక్కువైనా వాడేయండి. ►ఎక్కువమంది బ్లాక్ చేసినా.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా సరే.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ నిషేధిస్తుందని తెలుసా?. కాబట్టి, అడ్డగోలు కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవడం, అవసరం లేకున్నా వాళ్లకు మెసేజ్‌లు పంపడం, ఫార్వార్డ్ మెసేజ్‌లు పంపడం చేయడం తగ్గిస్తే మంచిది. ►ఫిర్యాదుల ఫలితం కూడా.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినా, ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినా.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ బ్యాన్ చేసేస్తుంది. ►మాల్వేర్ లింక్స్ మాల్వేర్(వైరస్)తో కూడిన లింక్స్, స్మార్ట్ఫోన్లకు ప్రమాదం కలిగించే లింక్స్‌గానీ, ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే ఫైల్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపినా వాట్సాప్ ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. ►అసభ్య సందేశాలు.. పోర్న్ సంబంధిత కంటెంట్, అసభ్య సందేశాలు, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే సందేశాలు, బెదిరింపులు, వేధింపులు, విద్వేషపూరిత సందేశాలు.. ఇతరులకు పంపినా సరే బ్యాన్ తప్పదు!. ►హింసను ప్రేరేపించినా.. ఈరోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఫేక్ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందుకే హింసను ప్రేరేపించేవిగా ఉండే కంటెంట్‌ను ఫార్వార్డ్ చేసినా బ్యాన్ వేస్తుంది వాట్సాప్. వీటితో పాటు ఘర్షణలకు ప్రేరేపించే పోస్టులు, పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించిన కంటెంట్ ప్రమోట్ చేసినా వాట్సాప్ బ్యాన్ తప్పదు. కాబట్టి, బ్యాన్ పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడండి. అలాగే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయడం అనేది రిపోర్ట్ లేదా అవతలి వాళ్ల ఫిర్యాదుల ఆధారంగా జరుగుతుంటుంది. పర్సనల్ అకౌంట్లతో పాటు గ్రూపులు ఇందుకు అతీతం కాదు. గ్రీవియెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ ఇబ్బందికారక అకౌంట్ల(ఫిర్యాదుల ఆధారంగా)ను నిశీతంగా పరిశీలించాకే.. వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. ఈ బ్యాన్ టెంపరరీగా లేదంటే శాశ్వతంగా ఉండొచ్చు. తాత్కాలిక నిషేధం ఎత్తివేతకు వాట్సాప్ సపోర్ట్ టీంకి మెయిల్ పెడితే సరిపోతుంది. ఏం చేయాలంటే.. వాట్సాప్ బ్యాన్ అని కనిపించే స్క్రీన్ షాట్‌ను.. అన్‌బ్యాన్(బ్యాన్ ఎత్తేయమంటూ) రిక్వెస్ట్ చేస్తూ support@whatsapp.com కు మెయిల్ పెట్టాలి. అప్పుడు ఎందుకు బ్యాన్ చేసిందో వివరణ ఇస్తూనే.. వీలైతే అన్‌బ్యాన్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ అన్‌బ్యాన్ కన్ఫర్మ్ మెసేజ్ గనుక వస్తే.. యాప్‌ను అన్-ఇన్స్టాల్ చేసి, తిరిగి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే ప్లేస్టోర్‌లో అప్డేట్ కొట్టినా సరిపోతుంది. ఒకవేళ మళ్లీ మళ్లీ బ్యాన్ మెసేజ్ వస్తుంటే.. ఈసారి support@whatsapp.com కు మరోసారి రిక్వెస్ట్ మెయిల్ (ఇంతకు ముందు.. ఇప్పటివి స్క్రీన్ షాట్స్‌తో) పెట్టొచ్చు. అప్పుడు సరైన వివరణ దక్కుతుంది. ఒకవేళ పర్మినెంట్ బ్యాన్ సంకేతాలు గనుక అందితే మాత్రం.. నెంబర్ మార్చేడయం తప్ప మరో మార్గం ఉండదని వాట్సాప్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. మీ తరపున గనుక ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేకుంటే.. grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయడం ద్వారా సమస్యకు ఓ పరిష్కారం పొందవచ్చు. చదవండి: ఇంట్లో కరెంట్ బిల్లును ఆదా చేసే సింపుల్ టిప్స్.. పాటించండి