women suicide attempt
-
విషాదం: ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ఆమె మృతిచెందింది. వివరాల ప్రకారం.. గౌతమ్ నగర్‌కు చెందిన సుజి(37) ఆదివారం మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం గమనించిన స్థానికులు ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నట్లు మల్కాజిగిరి సీఐ రవికుమార్ తెలిపారు. ఆమె మృతికి గల కారణాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
ఆత్మహత్యకు రెడీ అయిన మహిళ.. పోలీసు తెలివికి ఫిదా.. వీడియో వైరల్
ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె నివాసం ఉంటోన్న అపార్ట్మెంట్ కిటికీలోని నుంచి కిందకు దూకెందుకు రెడీ అయ్యింది. ఇంతలో ఎంతో చాకచక్యంగా ఫైర్‌ఫైటర్ ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జపాన్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె అపార్ట్మెంట్లోని కిటికిలోని నుంచి కిందకు దూకెందుకు సిద్దమైంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ఫైర్‌ఫైటర్.. ఎంతో ధైర్యంతో, చాకచక్యంగా ఆమెను కాపాడాడు. సదరు మహిళ అపార్ట్మెంట్ పైనున్న ఫ్లాట్‌లోకి వెళ్లిన ఫైర్‌ఫైటర్ తాడు సాయంతో కిటికి వద్దకు వచ్చి.. ఆమెను ఒక్కసారిగా రెండు కాళ్లతో లోపలికి తన్నాడు. దీంతో, ఆమె కిటికిలోని నుంచి లోపలపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Vid of a Japanese firefighter rescuing a suicidaI lady was a job well-done 🔥😂😂😂😂😫 pic.twitter.com/8ocMHJahPN — Communicator of Ilorin (@usman__haruna) October 13, 2022 -
కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన వాహనదారులు.. ఈ విషయాన్ని లేక్ పోలీసులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన లేక్ పోలీసులు.. యువతి కోసం స్పీడ్‌బోట్స్‌తో గాలిస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)గా పోలీసులు గుర్తించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, స్వప్నకు ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, కేబుల్ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్ ఆధారంగా ఆమె ఆధారాలు సేకరించారు. దీంతో, పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు కేబుల్ బ్రిడ్డి వద్దకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్డిపై నుంచి దూకి దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. -
కేటీఆర్ ఇలాకాలో సంచలనం.. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘టీఆర్ఎస్ నాయకులు వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లికి చెందిన మ్యాన పద్మ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు చావే శరణ్యమంటూ బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. వివరాల ప్రకారం.. బాధితురాలు పద్మ బద్దెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. స్థానిక టీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు ఆమె నుంచి పెట్రోల్ బాటిల్‌ను లాగేశారు. -
మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: గుర్తు తెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదరు యువతి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి మెట్రోస్టేషన్ గోడ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్లో ఉన్న సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమె మాటల్లో పెట్టి రక్షించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా యువతి పట్టించుకోలేదు. ఎలాగైనా ఆమె కాపాడాలన్న ఉద్దేశ్యంతో జవాన్లు.. ఆమె పై నుంచి దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. యువతిని కాపాడాలని సిబ్బంది ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా యువతి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ముందు జాగ్రత్తగా అధికారులు అంబులెన్స్‌ను పిలిపించడంతో వెంటనే ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 Something dangerous that I witnessed today when I reached Akshardham metro station...This girl in white shirt wanted to commit suicide, while DMRC employees and jawans tried their best to convince this girl. Although she jumped from the edge, but was rescued.@NewsroomPostCom pic.twitter.com/la2XCyu9Tn — Neha Singh (@NehaSingh1912) April 14, 2022 -
Disha App: ప్రాణాలు కాపాడిన ‘దిశ’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): దిశ యాప్ ఒక మహిళ ప్రాణాలు కాపాడింది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చివరిక్షణంలో దిశకు సమాచారం అందించటంతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను సంరక్షించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన జ్ఞానప్రసన్న (31) కృష్ణలంకలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల కిందట భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా జీవిస్తోంది. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే సింగ్‌నగర్ లూనా సెంటర్‌కు చెందిన షేక్ అఖిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అఖిల్‌కు అతడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసిన ప్రసన్న లూనాసెంటర్‌లోని అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అఖిల్, అతడి కుటుంబసభ్యులు ఆమెను తిట్టి, కొట్టి అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చివరి క్షణంలో దిశ యాప్‌కు సందేశం పంపింది. చికిత్స పొందుతున్న జ్ఞాన ప్రసన్న క్షణాల్లో స్పందించిన పోలీసులు ప్రసన్న ఫోన్ నుంచి వచ్చిన సందేశంతో డీజీపీ కార్యాలయంలో దిశ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా న్యూరాజరాజేశ్వరీపేటలో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐ హేమచంద్, కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డ్ చంద్రశేఖర్ 10 నిమిషాల్లోనే ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. చదవండి: రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసన్న ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. ఆమె కుమార్తెను వైద్యసిబ్బంది సంరక్షిస్తున్నారు. ప్రసన్న ఇంకా మాట్లాడే స్థితికి రాకపోవడంతో పోలీసులకు పూర్తి వివరాలు తెలియలేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రసన్న తల్లిదండ్రులకు, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ అధికారులు, పోలీసులకు ప్రశంసలు కేవలం ఓ సందేశం ద్వారా నిమిషాల వ్యవధిలో మహిళ ఇంటికి చేరుకుని మృత్యువాత పడకుండా ఆమెను కాపాడిన దిశ కార్యాలయం అధికారులు, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
కొడుకు పెళ్లికి కూతురు వద్ద అప్పు
మంచిర్యాలక్రైం: అప్పు ఇచ్చిన పాపానికి తల్లిదండ్రులే చావుపోమన్నారని కూరుతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జిల్లా కేంద్రంలోని మ్యాదరివాడకు చెందిన చేను తిరుపతి రాజేశ్వరిల కూతురు తిరుమలను పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి చెందిన ముదిరికోళ్ల రమేష్‌తో 15ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. ఏడాది క్రితం తిరుపతి కొడుకు నవీన్ (తిరుమల తమ్ముడు) వివాహానికి అల్లుడు రమేష్ వద్ద రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాలని పలుమార్లు మామను అడగగా దాటవేస్తూ వచ్చాడు. తిరుమల శనివారం పుట్టింటికి వచ్చి తల్లితండ్రులతో డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగింది. నీవు చచ్చినా డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులు అనడంతో మనస్తాపానికి గురైన తిరుమల బయటకు వెళ్లి పురుగుల మందు తీసుకుని వచ్చి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం తిరుమల పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి తల్లిదండ్రులు, తమ్ముడు, అతడి భార్యపై చర్యలు తీసుకోవాలని రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక ఎస్సై మారుతిని వివరణ కోరగా ఫిర్యాదు అందిన విష యం వాస్తవమేనని తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపాడు. -
భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం
ధర్మపురి: ‘నాయకుల పలుకుబడితో నా భర్తను అణగదొక్కడానికి రౌడీషీట్ ఓపెన్ చేసిండ్రు. అవమానం భరించలేకనే శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డా’నని బాధితురాలు అనూష రోదిస్తూ తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నేరెల్ల గ్రామానికి చెందిన జాజాల అనూష(28) అదే గ్రామానికి చెందిన జాజాల రమేష్‌ను 2017లో ప్రేమవివాహం చేసుకుంది. వీరికి చైత్రిక(15 నెలలు) కూతురు ఉంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అనూష, ఎంపీటీసీ పదవికి రమేష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రమేష్‌పై 2015, 2016, 2018లో మొత్తం మూడు కేసులున్నాయని, ఏడాది క్రితం ఒకటి, ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం రెండు కేసులు కొట్టుడుపోగా మిగిలిన చిన్నపాటి కేసు కరీంనగర్లో నడుస్తోందని తెలిపింది. కొందరు నాయకులు పలుకుబడితో తన భర్తపై రౌడీషీట్ ఓపెన్ చేశారని, పలువురు పలు విధాలుగా మాట్లాడుతూ హేళన చేస్తున్నారని వివరించింది. ఈక్రమంలో మనస్తాపానికి గురై శనివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్ ముందు క్రిమిసంహారకమందు తాగి స్టేషన్లోకి వెళ్లింది. కొంత సేపటికి కిందపడిపోగా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అవమానం భరించలేకనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. జరిగిన సంఘటనపై ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా అనూష భర్త రమేష్‌పై రౌడీషీట్ ఉందని, రైడీషీట్కు ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదని, కుటుంబకలహాలతోనే క్రిమిసంహారకమందు తాగి స్టేషన్‌కు రాగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పరామర్శించిన అడ్లూరి.. జగిత్యాలక్రైం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనూషను సాయంత్రం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. కాగా, ఆమె భర్తపై రౌడీషీట్ కేసు నమోదు చేశారని, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
కావ్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, సీతమ్మధార(విశాఖపట్టణం) : ఇసుకతోట జంక్షన్ రామాలయం వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి మంటలతో పరుగులు తీసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితుడు చెన్నా నరేంద్రను పోలీసులు విజయనగరంలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ వై.వి.నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్ఏడీ జంక్షన్‌కి చెందిన చెన్నా నరేంద్ర అంబులెన్స్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏఎన్‌ఏంగా విధులు నిర్వహిస్తున్న కావ్య తన సోదరితో ఇసుకతోట జంక్షన్ రామాలయం వద్ద ఉంటోంది. నరేంద్రకు ఏడాది క్రితం కావ్యతో పరిచయం ఏర్పడగా.. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తనను పెళ్లి చేసుకోవాలని కావ్య పలుమార్లు ఒత్తిడి చేయగా నరేంద్ర ముఖం చాటేశాడు. మంగళవారం రాత్రి కావ్య తాను ఇసుకతోట జంక్షన్లో ఉన్నాను.. వెంటనే రావాలని నరేంద్రకు ఫోన్ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వెంటనే నరేంద్ర అక్కడకు చేరుకోగా కొద్దిసేపు వారు మాట్లాడుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని కావ్య కోరగా అందుకు అతడు నిరాకరించాడు. అప్పటికే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఉన్న కావ్య నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించడంతో నరేంద్ర ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి చేతులు కూడా కాలిపోయాయి. భయాందోళన చెందిన అతడు అక్కడ నుంచి విజయనగరం పారిపోయాడని ఏసీపీ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కావ్యను 108లో కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది. కాల్ డేటా ఆధారంగా.. ద్వారకాజోన్ ఏసీపీ వై.వి.నాయుడు నేతృత్వంలో పోలీసు సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేశారు. కావ్య పనిచేస్తున్న ఆసుపత్రిలోను, తన అక్కను విచారించి కొంత సమాచారం సేకరించారు. మంగళవారం రాత్రి 8.20 గంటల సమయంలో కావ్యను ఆసుపత్రి నుంచి బైక్‌పై తీసుకెళ్లి ఆర్కే బీచ్‌లో దించినట్లు అక్కడ పనిచేస్తున్న యువకుడు తెలిపాడు. తరువాత ఆమె బస్సులో వెళ్లినట్లు తెలపడంతో పోలీసులు దర్యాప్తు మరింత ముందుకు సాగింది. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆమె ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించారు. చెన్నా నరేంద్రతో చాటింగ్ చేసినట్లు తేలింది. నరేంద్ర విజయనగరంలో ఉన్నట్లు కాల్ డేటా ద్వారా తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. -
తిరుపతి వినాయకనగర్‌లో ఉద్రిక్తత
సాక్షి, చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల మోసానికి స్థానికులు రోడ్డుపాలయ్యారు. డబ్బులు తీసుకుని టీడీపీ నేతల ఇప్పించిన భూముల్లో స్థానికులు కొందరు నిర్మాణాలు చేసుకున్నారు. అయితే అవి అక్రమ నిర్మాణాలని అధికారులు తొలగించే ప్రయత్నం చేయడంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులకు, వారికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా తగ్గని అధికారులు...పోలీసుల సాయంతో నిర్మాణాలను కూల్చివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై...ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి , రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామానికి నరాల పార్వతి పేదింటి మహిళ. ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన ఆమె 2006 నుంచి 2014 వరకు ఆశా వర్కర్‌గా పనిచేసేది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ గ్రామ సర్పంచ్ సుంకర సత్తిరాజు(చిన కాపు) అరకొర జీతంతో ఏం చేస్తావని, పంచాయతీలో బిల్లు కలెక్టర్‌గా వేయిస్తాను, పర్మినెంటు అయ్యేలా చేస్తాను అంటే సరేనంది. అన్నట్టుగానే పంచాయతీలో తీర్మానం చేయించి 2015 లో ఆమెను గుమస్తాగా నియమించాడు. మూడేళ్లు పనిచేసిన తరువాత వేరొక మంచి ఉద్యోగంలోకి మారుస్తానని చెప్పి ఉన్న ఉద్యోగం నుంచి తప్పించాడు. ఆ తరువాత ఆమె ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. దీనితో ఆమె స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ఆశ్రయించింది. ఆయన తన పీఏ కుమార్‌తో చెప్పానని, తనతో మాట్లాడుకోమని చెప్పడంతో పదమూడు నెలలుగా వారి చుట్టూ తిరుగుతున్న ఆమె ఇప్పటికీ ఉద్యోగం కల్పించకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఈనెల 20న ఆత్మహత్యకు పాల్పడి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, రామచంద్రపురం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఏరియా ఆసుపత్రిలో ఆమెను కలసి పరామర్శించారు. వారి వెంట పార్టీ జిల్లా కార్యదర్శి టేకుమూడి సత్యనారాయణ, పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పంతగడ విజయప్రసాద్, పార్టీ నాయకులు సత్తి శంకరరెడ్డి, గుబ్బల గణ, చప్పిడి వీర్రాజు, దంగేటి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కోటగల్లికి చెందిన వివాహిత గురువారం బాసర వద్ద గోదావరి నదిలో మృతదేహామై తేలింది. అయితే, ఇది ఆత్మహత్యా లేక హత్యనా? అన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, ఆమె రెండేళ్ల కూతురి ఆచూకీ లేకుండా పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన నిఖిలేశ్, భవాని (29) దంపతులు కోటగల్లిలోని అద్దెకుంటున్నారు. వీరికి రెండేళ్ల కూతురు శ్రీహర్ష ఉంది. ఏం జరిగిందో ఏమో కానీ భవాని గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి, తాళం చేవితో పాటు తన ఫోన్‌ను ఇంటి యజమానికి ఇచ్చి బయటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అనంతరం ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాసర వద్ద గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకినట్లు బాసర ఎస్సై తోట మహేష్ తెలిపారు. అయితే, భవాని మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భవాని బాసర బ్రిడ్జి వద్ద గోదావరి నదిలోకి దూకే సమయంలో రెండు బైకులపై ఇద్దరు మగవాళ్లు, చుడీదార్ ధరించిన మహిళ అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఆ ముగ్గురు ఎవరు, వారికి భవానికి గల సంబంధం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు జరిగాయా.. వీరి మధ్య వివాదానికి వేరే మహిళ కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాసర పోలీసులు నిఖిలేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఆమె భర్త నిఖిలేశ్ మధ్యాహ్నం 1.20 గంటలకు భవాని తల్లి జ్యోతి వద్దకు వెళ్లి తన భార్య గురించి వాకబు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నిఖిలేశ్‌కు అతడి స్నేహితుడు ఫోన్ చేయడంతో ఇద్దరు కలిసి బాసరకు వెళ్లారు. అప్పటికే నదిలో బయటపడిన తన భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. మరోవైపు భవాని తన వెంట తీసుకెళ్లిన రెండేళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. -
వివాహిత అనుమానాస్పద మృతి
లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కిల్లారి లక్ష్మి(24) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. లావేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉంగరాడ లక్ష్మునాయుడు కుమార్తె లక్ష్మిని అదే గ్రామానికి చెందిన కిల్లారి వెంకటికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఈ నెల 1న లక్ష్మి ఉపాధి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆరు గంటల సమయంలో ఆవుకు దాణా పెట్టడం కోసమని లక్ష్మిని తండ్రి పిలవగా ఇంటి నుంచి ఎంతకూ రాలేదు. దీంతో లోపలికి వెళ్లి చూడగా కుమార్తె సోఫాలో పడిపోయి నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే గ్రామస్తులకు విషయం తెలియజేసి లక్ష్మిని ఆటోలో లావేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న లావేరు తహసీల్దార్ ఎస్.సుధాసాగర్, ఎస్ఐ చిరంజీవిలు శనివారం రిమ్స్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. లక్ష్మి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను, భర్తను అడిగితెలుసుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. లావేరు ఎస్ఐ కేసు నమోదు చేశారు.లక్ష్మీ మృతి వెనుక కారణాలు తెలియరావడం లేదు. ఆత్మహత్య చేసుకుందా లేదా పాముకాటుకు గురైందా అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవని మృతురాలి తండ్రి లక్ష్మునాయుడు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆత్మహత్యాయత్నం
సాక్షి, కర్నూలు: జిల్లాలోని త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఇద్దరు మహిళలు ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. తమ కుమారుడిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ భాదితులు వాపోయారు. 19 లక్షల అప్పుకు సంబంధించిన విషయంలో పోలీసులు తమ కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై పోలీసులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. -
‘మేం కూటికి పేదవాళ్లమే.. గుణానికి కాదు’
ఆమె నిరుపేద. ఆ పెద్దాయన ఇంటిలో పని మనిషిగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఇన్నేళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్న ఆమెపై ఆ ఇంటి పెద్దోళ్లు అభాండం వేశారు. దీనిని ఆమె అవమానంగా భావించింది... భరించలేకపోయింది... బలవంతంగా తన ప్రాణాలను తానే బలి తీసుకుంది. ఆ అభిమానవతి, అభాగ్యురాలు... మద్దికుంట భార్గవి. అభియోగం మోపిన ఆ పెద్దోళ్లు...పులిపాటి ప్రసాద్ కుటుంబీకులు.. ఖమ్మంక్రైం: తనకు దొంగతనం అంటగట్టడాన్ని భరించలేని ఓ నిరుపేద ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతానికి చెందిన ఆమె పేరు మద్దికుంట భార్గవి(35). ఆమెకు భర్త బాలరాజు (మార్కెట్లో హమాలీ), పిల్లలు మౌనిక, సంతోష్ ఉన్నారు. ఆమె గత 15 సంవత్సరాలుగా జమలాపురం కేశవరావు పార్క్ సమీపంలోగల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పులిపాటి ప్రసాద్ ఇంట్లో పనిచేస్తోంది. ఆమెది రెక్కాడితేకాని డొక్కాడని కటుంబం. కుటుంబం గడవటానికి పూలు కూడా కట్టేది. తమ ఇంట్లో భార్గవి దొంగతనం చేసిందంటూ కొన్ని రోజుల క్రితం పులిపాటి ప్రసాద్ కుటుంబీకులు అభాండం వేశారు. తనకు ఏ పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆమె ఎంతగా నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా వారు వినలేదు. ఇన్నేళ్లపాటు ఎంతో నమ్మకంగా పనిచేసిన తనపై ఇంతటి అభాండం మోపారంటూ భర్తతో చెప్పి ఏడ్చింది. తనకు రావాల్సిన జీతం డబ్బులు 6000 రూపాయలు తీసుకునేందుకని యజమాని ఇంటికి శుక్రవారం వెళ్లింది. అక్కడ ఆమెను పులిపాటి ప్రసాద్ కుటుంబీకులు తీవ్రంగా దూషించారు. అనరాని మాటలు అన్నారు. జీతం డబ్బులు ఇవ్వకుండా వెళ్లగొట్టారు. ‘‘మేం కూటికి పేదవాళ్లమే. గుణానికి మాత్రం కాదు’’ అని, చెబ్బబోయినా వినలేదు. అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేకపోయింది. ఆమెకు గుండె పగిలినట్టయింది. ఇంటికి వచ్చింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. కూతురు మౌనిక.. కళాశాలలో, కుమారుడు సంతోష్.. పాఠశాలలో, భర్త బాలరాజు.. మార్కెట్లో ఉన్నారు. ఆమె అత్త బాలామణి కూడా ఊరికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన భర్త బాలరాజు... ఉరికి వేలాడుతున్న భార్యను చూసి షాకయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. ఆమెను కిందక దించారు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వచ్చారు. భార్గవి ఆత్మహత్యపై ఆమెతో పనిచేయించుకుని, అభాండాలు వేసినట్టుగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంటి యజమాని పులిపాటి ప్రసాద్ కుటుంబీకులను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘మేము భార్గవిని వేధించలేదు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు’’ అన్నారు. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత చదివినా.. ఉద్యోగం రాలేదు..
ఇద్దరూ చదువుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా జీవితం బాగు పడుతుందనుకున్నారు.. ఎంత శ్రమించినా ఒకరికి కూడా రాలేదు.. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి టౌన్(వైఎస్సార్ కడప) : ‘నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. నాకు సొంత జీవితం లేదు. అలాంటప్పుడు నేను చచ్చినా.. బతికినా ఒక్కటే. అందుకే నాకు నేను ఆత్మహత్య చేసుకొంటున్నాను’ అని రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న కుసుమ అనే నిరుద్యోగ మహిళ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నా చావుతో నా తల్లిదండ్రులు, భర్తకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొంటున్నానంటూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి పట్టణ పరిధిలోని బోస్ నగర్లో నివాసం ఉండే మురళీకృష్ణ భార్య కుసుమ (27) ఆదివారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండలం బొగ్గలవారిపల్లెకు చెందిన వెంకటరమణ, నాగ రత్నమ్మకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మురళీకృష్ణ, రెండో కుమారుడు శివ. మురళీకృష్ణ ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. ఆయనకు అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన కుసుమతో వివాహం జరిగింది. ఆమె కూడా బీకాం పూర్తి చేసింది. వీరు కొన్నేళ్లు అన్యోన్యంగా జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ.. ఇద్దరూ కలసి రాయచోటి పట్టణానికి వచ్చి ప్రైవేట్ సంస్థలలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మురళీకృష్ణ ముందుగా ఓ విద్యాసంస్థలో పని చేస్తుండే వాడు. వేతనం చాలకపోవడంతో మరో విద్యాసంస్థలో చేరాడు. ఆమె కొన్నాళ్లు ప్రైవేట్ సంస్థలలో పని చేసింది. ఇలా తక్కువ వచ్చే జీతాలతో ఎలా కాపురం సాగించాలంటూ బ్యాంక్ కోచింగ్ చేస్తూనే.. ఆర్ఆర్బీకి సిద్ధం అవుతోంది. దీనికోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంటిలోనే ఉంటూ ఎంతో శ్రద్ధగా చదివేది. ఇలా గంటల కొద్దీ చదివితే ఎలా అంటూ భర్త అనేక సార్లు వారించినా వినేది కాదు. ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే తపనతో మరింత కఠోరంగా శ్రమించేది. నిర్వేదానికి లోనై.. గత పోటీ పరీక్షలలో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయింది. తీవ్ర నిర్వేదానికి లోనైంది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకొనేది. ఇలా ఉండటంతో పది రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని పుట్టింటికి తీసుకెళ్లి మానసిక వైద్యుడితో చికిత్స చేయించుకొని వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన భర్తతో కొంత వాగ్విదానికి దిగింది. చాలా పొద్దుపోయే వరకు ఇద్దరూ గొడవ పడటంతో.. నీతో వాదించలేనంటూ మురళీకృష్ణ పక్క దగిలోకి వెళ్లి పడుకొన్నాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. ఇక పడుకొంటుందిలే అనుకొని నిద్రపోయాడు. ఈ సమయంలో ఆమె తనకు తానుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసే సరికి ఫ్యాన్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులకు విషయాన్ని తెలిపాడు. అంతలోనే పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆస్పత్రిలో అధికారులు ఎవరూ లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. మధ్యాహ్నం సమయానికి కుసుమ పుట్టింటి వారు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే అల్లుడు మురళీకృష్ణ తీవ్ర నిర్వేదంలో రోదిస్తుండగా వారు ఆయన వద్దకు చేరుకున్నారు. ‘చాలా మంచి వాడివని, నా కూతురికి దొరికిన దేవుడవని సంతోషించాం కదా నాయనా.. ఇలా ఎందుకు జరిగింది’ అంటూ రోదించారు. వారు మురళీకృష్ణను పట్టుకొని బోరున విలపించారు. -
తొగర్‌పల్లిలో విషాదఛాయలు
కొండాపూర్(సంగారెడ్డి) : తాను లేని చోట తన పిల్లలకు దిక్కెవరూ అనుకుందో ఏమో గానీ తా నూ విషపు గుళికలు తీసుకొని చిన్నారులకు సైతం ఇచ్చింది. ఈ ఘటనలో 17 నెలల వయసు గల చిన్నారి మృతిచెందగా, మూడు సంవత్సరాలు బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో తల్లి మాత్రం సురక్షితంగా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక సీఐ రవి కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొగర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఐదు సంవత్సరాల క్రితం హత్నూర మండలం బడంపేట గ్రామానికి చెందిన లక్ష్మితో వివా హమయింది. శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు ప్రణ తి (14 నెలలు), మనోజ్‌కుమార్(4) సంతానం. శ్రీనివా స్ భార్య లక్ష్మి తరచూ అనారోగ్యానికి గురయ్యేది. ఒక్కోసారి వారం రోజులు మంచంపైనే ఉన్నా ఇంట్లో ఎవరూ పలకరించేవారు కారనీ, కనీసం భర్త కూడా పలుకరించేవాడు కాదనీ ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనీ నిర్ణయించుకొంది. తన మరణానంతరం తన పిల్లల భవిష్యత్ ఆలోచించి, పిల్లలు అనాథలు అవుతారనుకొని ఇంట్లోని యూరియా గుళికలను తీసి వాళ్లకు ఇచ్చి తాను మింగింది. పొలానికి వెళ్లిన భర్త తిరిగొచ్చి ప్రణతిని ఎత్తుకోవడానికి చేతిలోకి తీసుకోగా డీలా పడిపోతుంది. అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన భార్యను అడగ్గా విషయం చెప్పినట్లు సీఐ తెలిపారు. వెంటనే చికిత్సకోసం మొదటగా సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రణతి (14 నెలలు) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. లక్ష్మి, మనోజ్‌కుమార్‌లకు ప్రథమ చికిత్స చేసి న అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబా ద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ వివరించారు. ప్రస్తుతం తల్లి లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉండగా కుమారుడు మనోజ్‌కుమార్ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందనీ, 3రోజుల వరకు ఏ విషయం చెప్పలేమనీ వైద్యులు తెలిపారనీ సీఐ వివరించారు. గ్రామంలో విషాదఛాయలు.. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యాయత్నం వార్త దావనంలా వ్యాపించడంతో తొగర్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 14 నెలల చిన్నారి ప్రణతి మృతి చెందడంతో బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చిన్నారి ప్రణతి అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. -
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
భువనగిరి క్రైం : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన తల్లి పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనతో పాటు ముగ్గురి పిల్లలకు పురుగుల మందు తాగించింది. స్పందించిన స్థాని కులు వెంటనే 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాలో గురువా రం జరిగింది. భువనగిరిరూరల్ పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డినాయక్ తండాకు చెందిన భూక్య రెడ్డినాయక్ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య భారతి ఇంటివద్ద ఉంటుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పల్లవి, ఉదయ్, వైష్ణవిలు. వీరు స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. గతంలో దంపతులిద్దరూ గొడవ పడగా భారతి తన పుట్టినిల్లు అయిన మేడ్చల్ జిల్లా రాజుబొల్లారంతండాకు వెళ్లిపోయింది. ఇటీవల రెడ్డినాయక్ రాజుబొల్లా రం వెళ్లి తన భార్యను తిరిగి రెడ్డినాయక్ తండాకు తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి మళ్లీ భార్యాభర్తకు గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి గురువారం పిల్లలను పాఠశాలకు కూడా పంపించలేదు. మధ్యాహ్నం సమయంలో పిల్లలను తీసుకుని వ్యవసాయబావి వద్దకు వెళ్లి ముగ్గురు పిల్లలకు క్రిమిసంహారక మందు తాగించి తాను కూడా తాగింది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి క్రిమిసంహారక మందు తాగినట్టు చె ప్పింది. భారతి తండ్రి వెంటనే రెడ్డినాయక్ తండాలోని భారతి ఇంటి పక్క వాళ్లకు సమాచారం అం దించాడు. సమాచారం తెలుసుకున్న ఇంటి పక్క వాళ్లు వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వా రిని చూసి 108కి సమాచారం అందించారు. 108 వచ్చే లోపే ద్విచక్ర వాహనాలపై వారు నలుగురిని తీసుకుని అనాజీపురం గ్రామం వద్ద 108కి ఎదురుగా వెళ్లి ఎక్కించారు. వెంటనే వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు వారిని ఉప్పల్‌లోని ఓప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భారతి ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఏస్ఐ సాగర్‌రావు తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
జడ్చర్ల : తనపై అత్యాచారం జరపడమే గాక పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మంజుల ఇంట్లోకి ఆమె భర్త లేని సమయంలో విద్యుత్ లైన్మెన్గా విధులు నిర్వరిస్తున్న బత్తుల కృష్ణయ్య గతేడాది సెప్టెంబర్ 10న రాత్రి ప్రవేశించి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపెద్దలు కృష్ణయ్యను పిలిచి విచారించగా తప్పును మన్నించాలని, ఇక నుంచి వారి జోలికి వెళ్లనని చెప్పి తిమ్మాజిపేట మండలానికి బదిలీ చేయించుకున్నారు. అనంతరం ఇటీవల మంజుల భర్త రూ.9 లక్షలు తనకు అప్పు ఉన్నాడని పేర్కొంటూ కృష్ణయ్య వనపర్తి కోర్టు నుంచి నోటీసులు పంపాడు. అలాగే, మంజులను తనతో పంపాలని, లేకుంటే ఆమె భర్తను చంపేస్తానంటూ బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది. ముందుగా ఈ నెల 2న ఎస్పీ అనురాధ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆమె జడ్చర్ల పోలీసులను సంప్రదించాలని సూచించింది. అయితే ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతుండగా.. తనకు అనుమానం ఉందని చెబుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసినట్లు మంజుల వివరించింది. కేసు నమోదు.. సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లోకి తన తండ్రితో కలిసి వచ్చిన మంజుల ముందుగా ఎస్ ఐ వెంకటనారాయణ, తర్వాత సీఐ బాలరాజుయాదవ్‌ను కలిసి సమస్యను వివరించింది. అనంతరం అకస్మాత్తుగా స్టేషన్ ఆవరణలో బైఠాయించి కవర్లో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి ఒంటిపై పోసుకుంది. గమనించిన పోలీసు లు వెంటనే పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. దీం తో సీఐ తన చాంబర్లోకి పిలిపించి విచారించారు. తాము ఎవరి పక్షాన పనిచేయడం లేదని, ఎ లాంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా లేవన్నారు. సం ఘటన గతేడాది సెప్టెంబర్‌లో జరగడంతో సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్పీ సూచన మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
నా స్థలంలో అన్న క్యాంటీన్ ఎలా పెడతారు?
పెద్దాపురం: ప్రైవేట్ స్థలంలో ‘అన్న క్యాంటీన్’ ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులను ఓ మహిళ నిలదీసింది. పట్టణంలో ఇంకెక్కడ స్థలం లేదా అని ప్రశ్నించింది. పేదల స్థలమే కావాల్సి వచ్చిందా అని బోరున విలపించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆమె స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగింది. పట్టణానికి చెందిన జాలా కన్య మరియ, జాలా పుష్పల తండ్రికి ప్రభుత్వం 1983లో స్థానిక మున్సిపల్ సెంటర్లో రెండున్నర సెంట్లు ఇచ్చింది. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్ అధికారులు ఆదివారం ఆ స్థలం వద్దకు వచ్చారు. దీంతో మరియ అధికారులను అడ్డుకుంది. అయినా కూడా వారు వినకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంతలో స్థానికులు, ఆమెను అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ఐ కృష్ణ భగవాన్ ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకపోతే.. ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని అధికారులు చెప్పారు. అందుకే ఆ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కాగా, రోడ్డు విస్తరణ వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైందని బాధితురాలు చెప్పింది. విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకుందామనుకుంటే.. ప్రభుత్వమిలా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితురాలి సోదరి కరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టీపీవో భాస్కరరావులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. -
ఐ లవ్యూ అమ్మా..ఐ మిస్ యూ అమ్మా..
మంచిర్యాలక్రైం : వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఇరువురు ఒక్కటవుదామని ఆశపడితే తల్లితండ్రులు కాదని చెప్పడంతో ప్రేమకథ ఊరి పెద్దల వద్దకు చేరుకుంది. వరుని తల్లిదండ్రులు నిరాకరించడంతో పెద్దలు చేతులెత్తేసారు. న్యాయం చేయాలని యువతి పోలీసు బాసును కలిసి కోరడంతో కేసును స్థానిక ఏసీపీకి రెఫర్ చేశారు. గురువారం ఉదయం ఏసీపీ వద్దకు వెళ్లగా మధ్యలో దూరిన కొంతమంది పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు యువతికి న్యాయం జరగకుండా అడ్డుకోవడంతో చేసేదేమిలేక పోలీసులు కూడా మిన్నకుండిపోయారు. దీంతో మనస్తాపం చెందిన యువతి గురువారం ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట్రాక్ట్ బస్తీకి చెందిన బామండ్లపెల్లి సంధ్యరాని హన్‌మన్‌బస్తీకి చెందిన గడ్డం రవితేజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిప్రేమకు రవితేజ తల్లిదండ్రులు అడ్డుపడుతుండడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా రవితేజ తల్లితండ్రులు ఒప్పుకోకుండా రూ.10లక్షలు కట్నం తీసుకస్తేనే పెళ్లి చేస్తామని యువతిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను కలిసి న్యాయ చేయాలని వేడుకుంది. భరోసా కల్పించిన సీపీ కేసును బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ వద్దకు పంపించాడు. ఎట్టకేలకు గురువారం ఏసీపీ ఇరువురిని పిలిపించి మందలించాడు. సంధ్యను వివాహం చేసుకోవాలని సూచించాడు. అయినా వారు సమాధానం చెప్పకుండా వెళ్లి పోయారు. దీంతో ఎక్కడా న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన సంధ్య ఇంటికి వెళ్లి సూసైడ్ నోట్ రాసి సూపర్ వాస్మల్ 33 తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సూసైడ్ నోట్లో ఏముంది? ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను తేజ లేకుండా బతకలేను. తేజ వస్తాడనుకున్నా. కానీ వాళ్ల అమ్మానాన్నలకు భయపడి నన్ను వదులుకుంటాడని అనుకోలేదు. అందుకే నేను చావాలని అనుకున్నా. పెద్దమనుషులు నాకు న్యాయం చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. పోలీసులైనా న్యాయం చేస్తారనుకున్నా. అక్కడ కూడా నాకు న్యాయం జరుగలేదు. దీనంతటికి కారణం పెద్ద మనుషులు కుసుమ మధుసూదన్, రాజేష్, తేజ తల్లిదండ్రులు లక్ష్మీ, రమేష్. వీళ్లంతా ఉండగా నాకు న్యాయం జరుగదమ్మా. అందుకే చావాలనుకున్నా. నువ్వేం బాధపడకమ్మా. డాడీని బాగా చూసుకో.. మీరు బాగుండండి. ఐలవ్యూ అమ్మ, ఐమిస్‌యూ అమ్మ ఇట్లు నీ కూతురు సంధ్య -
న్యాయం చేయాలని..
చిలుకూరు(కోదాడ) : భూ సమస్యను పరిష్కరిం చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే న్యాయం చేయాలని చిలుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని పోలేనిగూడెం గ్రామానికి చెందిన తిరుగమళ్ల కళా వతి అనే మహిళ భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు ఆక్రమించాడని, ఈ విషయంపై పలు మా ర్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని తెలిపింది. తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా తమ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్లుగా అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఏకంగా తమ పొలాన్ని రికార్డులలో నమోదు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే ధర్నా దిగినట్లుగా తెలిపారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ కొల్లు దామోదర్‌రావుతో మహిళ కుటుంబసభ్యులు ఘర్షణకు దిగారు. హామీ ఇవ్వడంతో ధర్నా విరమణ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని తహసీల్దార్ దామోదర్‌రావు ఎస్ఐ సుధీర్‌కుమార్‌కు తెలియజేశారు. వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని మహిళకు చాలాసేపు న చ్చచెప్పారు. అనంతరం తహసీల్దార్ వచ్చి న్యా యం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపచేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఆ భూమిని వారు విక్రయించారని, ఇప్పటికే ఆ భూమి చాలామంది చేతులు మారిందని తెలిపా రు. భూమి వివాదం కోర్టులో ఉన్నదని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలి యజేసి నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని తెలిపారు. -
డబుల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని ధర్నా
చిన్నకోడూరు(సిద్దిపేట) : తమకు జీవనాధారమైన భూములు లాక్కుని.. ఇతరులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించవద్దని నిర్వాసితులు ధర్నాకు దిగిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి చెలుకపల్లి మధిర ఎల్లాయపల్లిలో జరిగింది. నిర్వాసితులు భూములలో టెంట్ వేసుకుని ధర్నాకు దిగారన్న విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నం చేసారు. దీంతో నిర్వాసితురాలు పల్మారు భూలక్ష్మి(62) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను తమ వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆందోళనకారుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం
కాశిబుగ్గ : ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం వరంగల్ నగరంలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద చోటుచేసుకుంది. ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లేబర్ కాలనీకి చెందిన మౌనిక కీర్తినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సమీర్‌ను మూడేళ్లుగా ప్రేమిస్తోంది. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మౌనిక ఆవేశంలో హెడ్‌పోస్టాఫీసు వద్దకు చేరుకోని ట్రాఫిక్ పోలీసులు చూస్తుండగానే చేతిపై బ్లేడ్‌తో గాయం చేసుకుంది. రక్తం పోతుండగా కేకలు వేస్తున్న బాధితురాలిని అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు చేరదీసి కర్చిప్‌తో కట్టుకట్టి ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడికి చేరుకుని ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని సీఐ రవికుమార్ తెలిపారు. -
దేశం’ నేతల సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం
కాకినాడ : ‘‘లక్షన్నరపోసి కొన్న స్థలంతో ఇల్లు కట్టేందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. మరికొంత సొమ్ము ఇస్తేగానీ ఇల్లు కట్టనిచ్చేది లేదని ఇబ్బందుల పాల్జేస్తున్నారు. టీడీపీ సమావేశాలకు రావాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కాదంటే దాడి చేసి కొడుతున్నారు. ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర ముఖ్యనేతల సమక్షంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం రేపింది. జిల్లా కేంద్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్లో శుక్రవారం జరిగిన టీడీపీ ధర్మ దీక్ష వేదికగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘మీ అండ చూసుకునే మా ప్రాంతంలోని టీడీపీ మహిళానాయకురాలు ఇలా వేధింపులకు పాల్పడుతోంది’ అంటూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చి అంతలోనే పురుగు మందు తాగేసింది. ధర్మదీక్ష జరుగుతోన్న దీక్షలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆమెను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. స్థలం కొనుగోలుపై వివాదం బాధితురాలి కథనం ప్రకారం.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే పోలినాటి సత్యవేణి నుంచి కాకినాడ మహాలక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన మల్లాడి లక్ష్మి సుమారు 40 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. దాదాపు లక్షన్నర సొమ్ము కూడా చెల్లించింది. కొన్న స్థలంలో ఇల్లు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంది. దీంతో స్థలం అమ్మిన సదరు టీడీపీ నాయకురాలు మల్లాడి లక్ష్మి వద్దకు వచ్చి మరికొంత సొమ్ము ఇస్తేగానీ ఇల్లు కట్టేందుకు వీలులేదంటూ హెచ్చరించింది. ఎంతగా బతిమాలినా ఆమె ససేమిరా అనడంతోపాటు ఎదురు తిరిగితే దాడి చేసేందుకు సైతం వెనుకాడలేదు. పైగా తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరిగితే తప్పనిసరిగా హాజరుకావాలని, ఆమె రాలేకపోతే కూతురినైనా పంపాలంటూ ఒత్తిడి చేసేది. వీటన్నింటిని అంగీకరించకపోవడంతో అనేక వేధింపులకు గురి చేస్తోందంటూ బాధితురాలు వాపోయింది. కుమార్తెపైనా దాడి.. మహిళకు చికిత్స సర్పవరం (కాకినాడసిటీ): బాలాజీచెరువు సెంటర్లో టీడీపీ దీక్షస్థలంలో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మల్లాడి లక్ష్మి (40)ని కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో తల్లిని చూసి కుమార్తె రోధిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కేవలం మా అమ్మ ధర్మపోరాట దీక్షకు వెళ్లకుండా డ్యూటీకి వెళ్లినందుకు తన జుట్టు పట్టుకుని గోడకు వేసి కొట్టిందని కుమార్తె మౌనిక వాపోయింది.