న్యాయం చేయాలని..    | Women Suicide Attempt For Justiece | Sakshi
Sakshi News home page

కిరోసిన్‌ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

Published Wed, Jun 13 2018 12:35 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Women Suicide Attempt For Justiece - Sakshi

 కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్న మహిళ 

చిలుకూరు(కోదాడ) : భూ సమస్యను పరిష్కరిం చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే న్యాయం చేయాలని చిలుకూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలి పిన వివరాల ప్రకారం..

మండలంలోని పోలేనిగూడెం గ్రామానికి చెందిన తిరుగమళ్ల కళా వతి అనే మహిళ భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు ఆక్రమించాడని, ఈ విషయంపై పలు మా ర్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని తెలిపింది. తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా తమ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎనిమిదేళ్లుగా అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఏకంగా తమ పొలాన్ని రికార్డులలో నమోదు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే ధర్నా దిగినట్లుగా తెలిపారు. అంతకుముందు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌ కొల్లు దామోదర్‌రావుతో మహిళ కుటుంబసభ్యులు ఘర్షణకు దిగారు. 

హామీ ఇవ్వడంతో ధర్నా విరమణ

మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని తహసీల్దార్‌ దామోదర్‌రావు ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌కు తెలియజేశారు. వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని మహిళకు చాలాసేపు  న చ్చచెప్పారు. అనంతరం తహసీల్దార్‌ వచ్చి న్యా యం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపచేశారు.

అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ ఆ భూమిని వారు విక్రయించారని, ఇప్పటికే ఆ భూమి చాలామంది చేతులు మారిందని తెలిపా రు. భూమి వివాదం కోర్టులో ఉన్నదని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలి యజేసి నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement