Y. S. Jaganmohan Reddy
-
‘ఆరోగ్యశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు’
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం’ నిరుపేదలకు ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్తుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. తమకు ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతాం’ అని పేర్కొన్నారు. -
40 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఇదేనా?
సాక్షి, రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని, ఆయన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనగానే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనీ.. ప్రత్యేకహోదాపై వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ వస్తుందన్న భయంతో బాబు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రత్యేహోదాకు ఎవరు మద్దతు ఇస్తారో వారితో కలిసి పోరాడాతామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఎందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. 90 వేల కోట్ల రాష్ట్ర అప్పును రెండు లక్షల కోట్లకు చేసింది మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవమేనా? అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎవరికీ భయపడను అంటూనే కేసులకు చంద్రబాబు భయపడుతున్నారని, ఈ దేశంలో ఆయనను మించిన ఆర్థిక నేరగాడు ఎవరులేరని, అందుకే ఆయనను కేంద్రం దూరంగా పెడుతుందని విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి తాము గర్వపడుతున్నామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
‘అందుకే చంద్రబాబు యూటర్న్‘
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై తమ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఒక్క హామీని నెవేర్చలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవర్చడానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత కుట్రలు, అనైతిక పొత్తులతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన మోసాలు ఎండగడుతూ తమ పార్టీ ప్రజల్లోకి వెళుతుందని భూమన తెలిపారు. ప్రతీక్షణం ప్రజల కోసం పరితపించే వైఎస్ఆర్ ఆశయాలను సమాధి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. విలువలు, విశ్వసనీయత కోసం జగన్ పార్టీని ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటు ప్రాంతీయ పార్టీలు, అటు జాతీయ పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా జగన్ మొక్కవోని దీక్షతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని భూమన పేర్కొన్నారు. -
'అందుకే చంద్రబాబు యూటర్న్'
-
జోగిపేటలో వైఎస్సార్సీపీ పాదయాత్ర
జోగిపేట(అందోల్): వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్ర వెయ్యి కి.మీ పూర్తయిన సందర్భంగా ఆయనకు మద్దతుగా జోగిపేటలో సోమవారం అందోల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, మెదక్ జిల్లా అధ్యక్షుడు బి.సంజీవరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. మార్కెట్ యార్డు, బసవేశ్వర విగ్రహం, హనుమాన్ చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం మీదుగా అన్నాసాగర్ గ్రామ సమీపంలోని ముర్షద్ వరకు పాదయాత్ర కొనసాగింది. వైఎస్.జగన్ నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ అమర్ రహే, వైఎస్సార్సీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు పాదయాత్రలో భాగంగా స్థానిక పబ్బతి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నాసాగర్ దర్గాలో ప్రార్థనలు చేశారు. వైఎస్.జగన్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకున్నారు. హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టిన అనంతరం ముందుకు కదిలారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, దానికి ఆయన చేపడుతున్న పాదయాత్రలకు వస్తున్న ప్రజా స్పందనే సాక్ష్యంగా చెప్పవచ్చని మెదక్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బి.సంజీవరావు, రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు డీజీ మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య చేపడుతున్న పాదయాత్ర నేటికి వెయ్యి కి.మీకు చేరుకుందని చెప్పారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాదయాత్రలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో కూడా పార్టీ పటిష్టంగా తయారవుతోందన్నారు. దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు. నియోజకవర్గంలో యువత పార్టీ వైపు బాగా ఆకిర్షతులవుతోందని అన్నారు. కార్యకర్తలు రాజకీయ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రసిడెంట్ బాగయ్య, మెదక్ జిల్లా యువత విభాగం అధ్యక్షుడు రాజేందర్, మండల శాఖ అ«ధ్యక్షుడు జీ.శంకర్, జోగిపేట పట్టణ అధ్యక్షుడు రాకేష్, సోషల్‌మీడియా ఇన్చార్జి పవన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రమేశ్, పరిపూర్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాండు, జిల్లా నాయకులు బుచ్చయ్య నవీన్, నరేష్, కార్తీక్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. -
హోదా పోరును ఉధృతం చేయాలి
-
రేపు రాష్ట్ర బంద్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు * అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగానే... * జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు? * ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి * బాబు సీఎంగా ఉండడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా తేల్చి చెప్పినందుకు, ఆయన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినందుకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ అరుణ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేక హోదా అనే ది చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు హోదాతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. జైట్లీ ప్రకటనను ఆహ్వానించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారని హెచ్చరించారు. హోదా పోరును ఉధృతం చేయాలి ప్రజలంతా కలిసికట్టుగా బంద్‌ను విజయవంతం చేసి, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ కోరారు. గురువారం అసెంబ్లీకి రావడానికి ముందు తాను కమ్యూనిస్టు పార్టీల నేతలతో మాట్లాడానని, హోదా పోరాటంలో వారి సహకారం కోరానని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేయాలని అన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంద్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు గురువారం వైఎస్ జగన్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ ప్రాంగణంలోకి పాదయాత్రగా వెళ్లారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా పాదయాత్రకు సంఘీభావంగా వెంట నడిచారు. అంతకుముందు అసెంబ్లీ సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జైట్లీ, బాబు కలిసి రాష్ట్ర ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టారని ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించి రాత్రిపూట అరుణ్ జైట్లీ ప్రకటన చేయడం, చంద్రబాబు అర్ధరా త్రి తరువాత మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏం చెప్పారంటే... యువత ఆశలను ఖూనీ చేశారు ‘‘అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకటనలు చేసే పరిస్థితి చూస్తుంటే ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదనే విషయం స్పష్టమవుతోంది. నిజాయితీ ఉంటే, తాము తప్పు చేయడం లేదని భావిస్తే పట్టపగలే ప్రకటనలు చేసే వాళ్లు కానీ ఇలా అర్ధరాత్రి పూట చేయరు. వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు. విభజన వల్ల నష్టపోతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని మరింత సుస్పష్టంగా చెప్పినట్లు అర్థమవుతుంది. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ప్రకటన వస్తుందని బుధవారం ఉదయం నుంచీ చంద్రబాబు మీడియాకు లీకులిస్తూ ఊదరగొట్టారు. అది చూసి ప్రత్యేక హోదాతో కూడిన ప్యాకేజీ వస్తుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు. చివరకు ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ కాదు కదా... ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతూ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులను జైట్లీ పక్కన కూర్చోబెట్టి ప్రజల చెవుల్లో క్యాబేజీ ఎలా పెట్టాలో చెప్పి మరీ ఆ కార్యక్రమం చేయించారు. ప్రత్యేక హోదా అంటే అదేదో డబ్బుల రూపంలో ఇచ్చి పుచ్చుకునేదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగించారు. కానీ, వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం కాదు. హోదా వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వేల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలకు లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను, ఇక్కడి యువత ఆశలను ఖూనీ చేసే విధంగా ఉంది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం. మనం స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి చంద్రబాబును ప్రశ్నిస్తున్నా... అసలు జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి ఆయనెవరు? ఇదేమైనా చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తా? ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉంది. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అందరమూ ఒక్కటవుదాం. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటప్పుడు మనం వెంటనే స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటున్నాను, మీకు మద్దతు కొనసాగించను అని ఏరోజైతే చంద్రబాబు చెబుతారో ఆరోజే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. చంద్రబాబుపై ఒత్తిడి పెరగాలన్నా... ఆయన మనసు మారాలన్నా... రాష్ట్ర ప్రజలంతా కలిసి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఒప్పుకోబోమని బంద్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. రాష్ట్రానికి హోదా కోసం అసెంబ్లీలో కూడా మేము గట్టిగా పట్టుపడతాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్రం చేసిన ప్రకటనకు నిరసనగా ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. బాబు ఆమోదం తర్వాతే కేంద్రం ప్రకటన ‘‘చంద్రబాబులో నిజాయితీ, విశ్వసనీయత, విలువలు లేవు. ఆయన తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను నడిరోడ్డున పడేశారు. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఒకసారి చెప్పారు. ప్రజలు తిరగబడేసరికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. గతంలో జైట్లీ చేసిన ప్రకటనతో తన రక్తం మరిగిపోయిందని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ఆ రక్తం మురిగిపోయిందా? కుళ్లిపోయిందా? చంద్రబాబు స్వయంగా రూపొందించిన డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని తన మంత్రులకు పంపించి జైట్లీ చేత చదివించారు. దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు డ్రాఫ్టుకు ఆమోదం తెలిపిన తరువాతే కేంద్రం ప్రకటన చేసిందని నేను మీడియాలో విన్నాను. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకే జైట్లీ ప్రకటనను ఆహ్వానించారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. 5 కోట్ల మందిని అమ్మేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో రాజీపడి, తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను అమ్మేశారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. తొలి నుంచీ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారని జగన్ దుయ్యబట్టారు. నిన్న టీవీలు చూసిన వారంతా చంద్రబాబు సీఎంగా ఉండటం ఖర్మగా భావించారని చెప్పారు. విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టు ‘‘నిజంగా బుధవారం చంద్రబాబు డ్రామాను బాగా రక్తి కట్టించారు. ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టడం తగదు. విభజన చట్టంలోని అంశాలనే ప్యాకేజీ అంటూ కేంద్రంతో చెప్పించారు. ప్రత్యేక హోదాకు కత్తెర వేశారు. రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలి. విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మిగిలిన కారిడార్లు కూడా విభజన చట్టంలోనే ఉన్నాయి. చట్టంలోని అంశాల విలువలన్నీ కలిపేసి అదే కొత్తగా ప్యాకేజీ అంటున్నారు. హక్కుగా రావాల్సిన వాటికి, ప్రత్యేక హోదాకు కేంద్రం కత్తెర వేస్తుంటే చంద్రబాబు ఆనందించడానికి ఓటుకు కోట్లు కేసే కారణం. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాలి’’ అని జగన్ డిమాండ్ చేశారు. -
ఏపీ హైవోల్టేజ్
రేపు ఏపీ బంద్‌కు ప్రతిపక్షం పిలుపు ‘ఓటుకు కోట్లు’ కేసులో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినచంద్రబాబు రాజీనామాకు జగన్ డిమాండ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు? ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్న ఏపీ ప్రతిపక్ష నేత బాబుపై భగ్గుమన్న ఏపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు బంద్‌కు పది వామపక్షాలు, కాంగ్రెస్ సంఘీభావం వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ శాసన సభ నేటికి వాయిదా మండలిలో ముఖ్యమంత్రి మొక్కుబడి ప్రకటన ప్రజలకు వెన్నుపోటు, కేంద్రానికి లొంగుబాటు (సాక్షి, ప్రత్యేకప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా లేదని కేంద్రం స్పష్టం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు తందానా అంటూ తాళం వేయడం చూసి రాష్ర్టం భగ్గుమన్నది. అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రకటనకు ఐదుకోట్ల గుండెలు మండిపోయాయి. ఆ ప్రకటనను స్వాగతిస్తున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆంధ్రప్రజల రక్తం సలసలా మరిగిపోయింది. తప్పనిసరిగా అమలు చేయాల్సిన విభజన చట్టంలోని అంశాలను కేంద్ర మంత్రి వరసపెట్టి చదువుతుంటే టీవీల ముందు ఆశగా కూర్చున్నవారి ఆగ్రహం ఆకాశాన్నంటింది. ఏడు పేజీల జైట్లీ ప్రకటనపై చంద్రబాబు ఏడు సంతకాలు చేసి పంపించారని, ఆ తర్వాతే జైట్లీ దానిని చదివారన్న సంగతి కూడా బైటపడింది. దాంతో కేంద్రం, చంద్రబాబు కలిసే తమను దారుణంగా వంచించారని రాష్ర్టప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యింది. అందుకే గురువారం ఉదయం నుంచే రాష్ర్టవ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ ధర్నాలు, బైఠాయింపులు, ప్రదర్శనలు చేపట్టారు. వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులు, శ్రేణులు కూడా ఈ కార్యక్రమాలలో భారీ స్థాయిలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా లేదని కేంద్రం మొండిచేయి చూపడం, దానిని స్వాగతిస్తున్నానంటూ చంద్రబాబు రాష్ర్టప్రజలకు వెన్నుపోటు పొడవడానికి నిరసనగా ఈనెల 10వ తేదీన రాష్ర్టబంద్ పాటించాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి ఐదుకోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని ఫణంగా పెట్టిన చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీతో కలసి బంద్ నిర్వహిస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. మరోవైపు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రత్యేక హోదాపై దద్దరిల్లిపోయాయి. ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు మెతకవైఖరి అనుసరిస్తుండడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనతో సభ స్తంభించింది. రాష్ర్టంలో ప్రజల నిరసనాగ్రహాలు, బంద్ సన్నాహాలు చూసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరోమారు జైట్లీ ప్రకటనలోని అంశాలను వల్లెవేశారు. బాబుతో పలుమార్లు చర్చించి ఆయన ఒప్పుకున్నాకే ఈ ప్రకటన చేశామన్నారు. కాగా శాసనమండలిలో ప్రత్యేకహోదాపై ప్రకటన చేసిన బాబు కూడా విభజన చట్టంలోని అవే విషయాలను తిప్పితిప్పి చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. లొంగుబాటెందుకు బాబూ?: విభజన చట్టంలోని అంశాలనే అమలు చేస్తామని కేంద్రం చెబుతున్నా, ప్రత్యేక హోదాకు పాతరేస్తున్నా చంద్రబాబు వినమ్రంగా తలూపడం చూసి విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తప్పని సరిగా అమలు చేయాల్సిన విభజన చట్టంలోని అంశాలను తప్ప మరో కొత్త అంశం గురించి చెప్పకపోయినా చంద్రబాబు వెన్నెముకే లేనట్లు వంగిపోయి వంతపాడడం చూసి విస్తుపోతున్నారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పోటీగా బలమైన రాష్ట్రాలు తమకు కావలసిన నిధులను, కేంద్ర సంస్థలను సాధించుకుంటు న్న తరుణంలో విభజన చట్టం ప్రకారం మనకు న్యాయంగా రావలసిన వాటి కోసం రెండున్నరేళ్లు ఆగి కేంద్రంతో ఓ ప్రకటన చేయించుకుని సంతోషించడం, స్వాగతించడం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం వంటివి చంద్రబాబు కాళ్లూ చేతులు కట్టేశాయని, కేంద్రానికి పాదాక్రాంతం చేసేశాయని, అందుకే ఆయన ఐదు కోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని తాకట్టుపెట్టి కేసుల నుంచి తనను తాను కాపాడుకుంటున్నారని విమర్శకులంటున్నారు. ఆర్థిక సంఘం అడ్డుపడగలదా? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేక పోవడానికి 14వ ఆర్ధిక సంఘం సిఫారసులు అడ్డుపడడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ప్రకటించగా కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అసలు ఆర్థికసంఘం పని ఏమిటి? ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించాల్సిందెవరు? కేంద్ర రాష్ట్రాల మధ్య రెవెన్యూ పంపిణీ బాధ్యతలను ఆర్ధిక సంఘం చూస్తుంది. ప్రత్యేక హోదాపై జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ) నిర్ణయం తీసుకుంటుంది. ఎన్డీసీ చైర్మన్ ప్రధానమంత్రే. కేబినెట్ సహా అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థలన్నిటికీ ప్రధానమంత్రే చైర్మన్. అందువల్ల ప్రధానమంత్రి ఇవ్వదలుచుకుంటే అడ్డుకునేదెవరు? కానీ ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబునాయుడు ఒత్తిడి చేయకపోగా సాగిలపడడం వల్లే కేంద్రం ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ రకరకాల కారణాలు చెబుతున్నదని విశ్లేషకులంటున్నారు. మరింత అవమానం... ఏపీకి ఏమేమి ఇస్తున్నామో గురువారం వెబ్సైట్లో పెడతామని జైట్లీ ప్రకటించారు. కానీ ఆర్థికశాఖ వెబ్సైట్లో లేకపోగా సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నడిచే పీఐబీ సైట్లో జైట్లీ చెప్పిన అంశాలతో కూడిన ఓ మూడు పేజీల ప్రకటనను ఉంచారు. అందులో కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నామో.. ఎలా అమలు చేస్తామో వివరించారు. అంతే తప్ప హోదాతో సమానమైన స్థాయిలో ఏపీకి ఇస్తున్న నిధుల గురించిన సమాచారమేమీ లేదు. హోదా ఇవ్వకపోగారాష్ర్టం విషయంలో ఇంత ఆషామాషీగా వ్యవహరించడం మరింత అవమానకరమని ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు రైల్వే డీఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. అట్టుడికిన అసెంబ్లీ.. అధికారపక్షం జిత్తులకు చెక్... రోమ్ తగలబడిపోతుంటే ప్రశాంతంగా ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి మాదిరిగా.. చంద్రబాబు శాసనసభ కార్యక్రమాలను యథాలాపంగా నడిపించేయాలని చూశా రు. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షను సమాధి చేసేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, అన్ని కార్యక్రమాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా చర్చించాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. సీఎం ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని అధికారపక్షం ప్రతిపాదించగా సభ్యులు చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షం కోరింది. ఎందుకంటే సీఎం ప్రకటన చేసిన తర్వాత మాట్లాడడానికి ఏముంటుంది అన్నట్లుగా ప్రతిపక్ష నాయకుడికి, సభ్యులకు మాట్లాడే అవకాశమే లేకుండా చేయాలనేది అధికారపక్షం ఎత్తుగడ. పదేపదే మైక్ కట్ చేస్తూ.. మంత్రులకే అవకాశం ఇచ్చి ప్రతిపక్షంపై దాడి చేయిస్తూ పబ్బం గడుపుకోవాలనేది వారి వ్యూహం. గతంలో అనేక పర్యాయాలు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు అధికారపక్షం దిగజారడం రాష్ర్టప్రజలంతా చూశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. అయినా సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం ప్రకటన చేయడమే సాంప్రదాయమని, అయననే ముందుగా మాట్లాడడమంటే ఆ అంశాన్ని ముగించేసినట్లవుతుందని శాసనసభ వ్యవహారాల నిపుణులంటున్నారు. అధికారపక్షం ఎత్తుగడను ప్రతిపక్షం సమర్ధంగా తిప్పికొట్టగలిగింది. స్పీకర్ పదేపదే సభను వాయిదావేస్తూ చివరకు శుక్రవారం నాటికి సభను వాయిదా వేసేసి గట్టెక్కించడంతో అధికారపక్షం ఊపిరిపీల్చుకుంది. కానీ సీఎం మాత్రం శాసనమండలిలో ప్రత్యేక హోదాపై మొక్కుబడి ప్రకటన చేసేసి చేతులు దులుపుకున్నారు. -
సేవాదళ్‌లోకి మహిళా శక్తి
సాక్షి, చెన్నై : వైఎస్ఆర్ సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు. మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేపట్ట దలచిన దీక్షకు చెన్నై నుంచి అభిమానులు తరలిరావాలని ఈసందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సేవాదళ్ బలోపేతం లక్ష్యంగా ఉపాధ్యక్షుడు జకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి మేడగం శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను ఏకం చేయడం, సేవాదళ్‌లోకి ఆహ్వానించే పనిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తాజా, మహిళా లోకం కదిలింది. సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు. ఆ దళ్ సంయుక్త కార్యదర్శి ఆబోతుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైకోర్టు మహిళా న్యాయవాది కమలాపురం లక్ష్మీ శ్రీదేవి రెడ్డి నేతృత్వంలో పదిహేను మంది మహిళలు ఆదివారం సేవాదళ్‌లోకి చేరారు. మరో ముప్పై మంది డబ్బింగ్ ఆర్టిస్టులతో పాటుగా పలువు రు సేవాదళ్‌లోకి వచ్చారు. అలాగే, సేవాదళ్ సేవలకు ఆకర్షితులైన ప్రముఖ కాస్మోటాలజిస్టు డాక్టర్ లత మా మలూరు తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. మహిళా లోకం : ఆళ్వార్ తిరునగర్ ఎంఎల్పీ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం సాయంత్రం సేవాదళ్ కార్యక్రమం జరిగింది. జకీర్ హుస్సేన్, మేడ గం శ్రీనివాస రెడ్డి, సైకం రామకృష్ణారెడ్డిల సమక్షంలో మహిళలతో పాటుగా మరో ముప్పైమంది సేవాదళ్‌లోకి చేరా రు. న్యాయవాది లక్ష్మీశ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మీదున్న అభిమానంతో జగనన్నను సీఎం చేయాలన్న కాంక్షతో తాను సైతం సేవల్ని అందించేందుకు ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు. సేవాదళ్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. వైఎస్‌ఆర్‌సేవాదళ్ వేదికగా తెలుగు వారికి న్యాయ పరంగా సేవల్ని అందించేందుకు ముందుకు సాగుతున్నాని పేర్కొన్నారు. డాక్టర్ లత మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి కుటుంబం మీద చిన్నప్పటి నుంచి తనకు అభిమానంగా పే ర్కొన్నారు. ఇక్కడి సేవాదళ్ కార్యక్రమాల్ని పేస్ బుక్ ద్వారా తెలుసుకుని, తాను సైతం ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన వంతు సేవల్ని సేవాదళ్‌కు అందిస్తామన్నారు. మేడగం శ్రీనివాసరెడ్డి, సైకం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జూన్ మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా జరగనున్న అధ్యక్షులు జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు ఇక్కడి నుంచి అభిమానులు బయలు దేరనున్నామన్నారు. ఆ దీక్షకు మద్దతుగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. సేవాదళ్ తరపున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలో న్యాయ పరంగా సేవల కల్పన, వైద్య పరంగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. సేవాదళ్ సంయుక్త కార్యదర్శులు ఆబోతుల శ్రీకాంత్, సిరిపురం నరేంద్ర, దర్శకుడు రోశిరాజు, డబ్బింగ్ ఆర్టిస్టులు రవీంద్రనాథరెడ్డి, లక్ష్మి చిత్ర, డీవీ శ్రీనివాస్, ఏకరాజ్, ప్రసాద్ రాజు, మహిళ నాయకులు రమణి, ఎంకే లక్ష్మి, వి శైలజ, ఎస్ శ్రావణి, పాస్టర్ దేవసహాయం, ఐజాక్ ప్రేమ్‌కుమార్, సేవాదళ్ సభ్యులు కోటిరెడ్డి, సురవరపు కృష్ణారెడ్డి, సవిత వర్సిటీ విద్యార్థి నాయకుడు నరేంద్రనాథ్‌రెడ్డి, వలసరవాక్కం నాయకుడు మల్లేష్, పెద్ద ఎత్తున్న వైఎస్సార్ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు జగన్ రాక
స్కూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఓదార్పు క్షతగాత్రులకు పరామర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం రెండు గంటలకు మధురపూడి విమానాశ్రయానికి జగన్మోహన్రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి వెళ్తారు. ఇటీవల మోరంపూడి జంక్షన్ వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు. ఈ ప్రమాదంలో గోరక్షణపేటకు చెందిన ర్యాలి వెంకన్న, ఏవీ అప్పారావు రోడ్డుకు చెందిన శివనేని మహాలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను జగన్ ఓదారుస్తారు. రాజమండ్రిలో కొద్దిసేపు బసచేసి అక్కడి నుంచి కాకినాడ చేరుకుంటారు. ద్వారంపూడి భాస్కర పద్మావతి ఫంక్షన్ హాలులో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కాకినాడ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. వధూవరులు అంజలి, హర్షవర్థనరెడ్డిలను జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు. రాత్రికి తిరిగి రాజమండ్రి చేరుకుని బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి షెల్టన్ హోటల్లో పార్టీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారు డు నరేన్ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి చేరుకుని, విమానంలో హైదరాబాద్ పయనమ వుతారు. -
కొండంత అండ
కూలిన ఇళ్లల్లో చితికిన బతుకులకు జగన్ భరోసా పేరు పేరునా పలకరింపు కష్టాలు చెప్పుకున్న బాధితులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మూడోరోజు పర్యటన ప్రభుత్వ అసమర్థతపై ధ్వజం సాక్షి, విశాఖపట్నం: భవంతులను కూల్చేసే పెను గాలులు.. మునుపెన్నడూ చూడని ప్రకృతి ప్రకోపాన్ని చూసిన ప్రజలు ఆ భీకర భయానక సంఘటన నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇళ్లు కూలిపోయి, సర్వస్వం కోల్పోయి, తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లాను హుదూద్ చిగురుటాకులా వణికించి ఐదు రోజులు కావస్తున్నా ఇంత వరకూ కనీసం మంచినీటికి కూడా నోచుకోక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతటి కష్టంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి కాస్త ఓదార్పు నివ్వడానికే ప్రభుత్వానికి, పాలకులకు సమయం సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో తమ బాధలు వినడానికి జగన్ వచ్చాడని తెలిసి జనం తండోపతండాలుగా వీధుల్లోకి వస్తున్నారు. ‘బాబూ మా ఇంటికి రా బాబూ..మా కష్టం ఒక్కసారి చూడు బాబూ’అని అడుగుతున్నారు. కూలిన ప్రతి ఇంటినీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటూ, భాధలు తీరుస్తానని భరోసా ఇస్తూ జగన్ పర్యటన సాగిస్తున్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం పర్యటించారు. ఉదయం 9.30 గంటలకు గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి బయల్దేరిన జగన్ సమీప ప్రాంత ప్రజలతో మాట్లాడారు. తాగడానికి నీరు లేదనివారు చెప్పుకున్నారు. అక్కడి నుంచి వైఎస్సార్ కాలనీకి చేరుకుని కూలిన దోకి అనంతరావు ఇంటిని పరిశీలించారు. మీకు సాయమేదైనా అందిందా అని అక్కడి బాధితులను అడిగారు. ఎవరూ రాలేదని, ఏమీ ఇవ్వలేదని, పనికిరాని పులిహోర ప్యాకెట్లు విసిరేసిపోయారని అక్కడి వారు తమ బాధలు చెప్పుకున్నారు. ఇల్లుకూలిపోయి కష్టాలు పడుతున్న దేవిపాటి ఉమావతి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి ధర్మాన నగర్ వెళ్లారు. ప్రమాదంలో కాలు పూర్తిగా కోల్పోయిన సుండి భాస్కరరావును పలకరించారు. ఇల్లు కూలి గూడు కోల్పోయిన ధేబుయేన్ దుర్గను చూసిన జగన్ ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. బీఎన్‌ఐటీఎన్ కాలనీ(రైల్వే కాలనీ)కి వెళ్లి కేంద్ర ప్రభుత్వం కూడా బాధితులను పట్టించుకోకపోవడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సీతమ్మధార వచ్చారు. తిరిగి కాసేపు విరామం అనంతరం తిరిగి పర్యటన ప్రారంభించి బాలయ్యశాస్త్రి లేఅవుట్ వద్ద ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం రాజీవ్‌కాలనీ, ఏకేసీ కాలనీల్లో బాధితులను పరామర్శించారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీవీల్లో ప్రసంగాలు ఇవ్వడంతో సరిపెట్టకుండా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రతి ఇంటికి వచ్చి అవసరమైన సరకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మేం ప్రతిపక్షంలోనే ఉన్నాం తల్లీ..మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ ఒక్క నెలలోనే తీర్చుకుందాం. మీకు పక్కా భవనాలు నిర్మించుకుందాం. ఈలోగా మీకు మంచి జరిగేలా ప్రభుత్వం మెడలు వంచేలా గట్టి ప్రయత్నం చేద్దాం.’అని జగన్ భరోసా ఇచ్చారు. కనీసం నష్టం ఎంతో రాసుకోవడానికి కూడా ప్రభుత్వాధికారులెవరూ రాకపోవడం దారుణమన్నారు. పది రూపాయల పులిహోర ప్యాకెట్లు విసిరేస్తే అవి కూడా తినడానికి పనికిరాకుండా పోతే జనం ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల కష్టాలను వారినే వేదికపై చెప్పమని తెలసుకున్నారు. డి. వెంకటలక్ష్మి అనే డిగ్రీ విద్యార్థిని తమ ఇల్లు నరకానికి నకళ్లుగా ఉన్నాయని జగన్ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో జగన్ వెళ్లి ఆ ఇళ్లను పరిశీలించారు. అక్కడి నుంచి మల్కాపురం వెళ్లి కాకల్లోవ, జయేంద్రకాలనీ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటికే చీకటి పడినప్పటికీ చింతల్లోవలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉంటారని, తమ తరపున చేయాల్సినవన్నీ చేస్తామని అన్నారు. కొత్తగాజువాకలో తుపానుకు దెబ్బతిన్న మసీదును పరిశీలించారు. ముస్లిం సోదరులకు తామెల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. అక్కడి నుంచి రాత్రి బసకు నగరానికి చేరుకున్నారు. జగన్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, పిరియా సాయిరాజ్, పార్టీ నేతలు చొక్కాకుల వెంకటరావు, కోలాగురువులు, తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఐ.హెచ్.ఫరూఖీ, కొయ్య ప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నేటి పర్యటన ఇలా హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శుక్రవారం నగరంలోని సాకేత పురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్‌నగర్, హై స్కూల్ రోడ్, గాజువాక ఏరియాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తుపాను బాధితులకు జగన్ పరామర్శ
నేటినుంచి పర్యటన విశాఖపట్నం సిటీ : హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి మూడురోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం... వైఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం నక్కపల్లి చేరుకుని అక్కడి తుపాను వల్ల నీటమునిగిన పంటపొలాలను పరిశీలిస్తారు. నక్కపల్లి మండలంలో తుపాను బాధితులను పరామర్శించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం జరిగిన తీరును తెలుసుకుంటారు. అనంతరం ఎలమంచిలి, అనకాపల్లిలో హుదూద్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం హుదూద్ తీరం దాటిన పూడిమడక ప్రాంతాన్ని సందర్శించనున్నారు. మంగళవారం రాత్రికి గాజువాక చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధ, గురువారాల్లో విశాఖలో పర్యటిస్తారు. నగరంలోని పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని వివరించారు. -
నేనున్నానంటూ... భరోసా
►నేడు జిల్లాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక ►రెండు రోజులపాటు నియోజకవర్గాల వారీగా పార్టీపై సమీక్ష ►వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేయత్నం వేదిక : గుంటూరు- అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్ సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు, పార్టీ పరిస్థితులను సమీక్షించేందుకు ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం గుంటూరు రానున్నారు. అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో రెండు రోజులపాటు నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై సమీక్ష జరుగుతుంది. ►పూర్తిస్థాయిలో నియోజకవర్గ నేతలతో సమీక్షించి శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ►ఎన్నికల సమయంలో జరిగిన లోటుపాట్లు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు. ►పార్టీ పటిష్టత కోసం అవసరమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, బాధ్యతలు, కమిటీల ఏర్పాటు, విధివిధానాలను చర్చిస్తారు. ►పార్టీ కార్యకర్తలు, నాయకుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తారు. ►ఎన్నికల ఫలితాల తరువాత అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, వేధింపులకు సంబంధించి పార్టీ శ్రేణులు ఐధైర్యపడాల్సిన పని లేదని, మీకు అండగా ఉంటాననే భరోసాను జగన్ ఈ సమీక్ష సమావేశాల ద్వారా కార్యకర్తలకు కల్పించనున్నారు. ►ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు విధానలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రజలతో పార్టీ కార్యకర్తలు మమేకం కావాలని ఆయన సూచించనున్నారు. ►రుణమాఫీ అమలు తీరుకు వ్యతిరేకంగా నరకాసురవధ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిర్వహించిన విషయం విధితమే. ► ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలు, నాయకులు గ్రామాల బాట పట్టాలని జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ►రెండు రోజుల సమీక్ష అనంతరం, ఆగస్టు రెండో తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ వెళతారు. ► ఈ సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు జిల్లా, నియోజక వర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరు కావాలని జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి కోరారు. -
పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి 12 ఏళ్లు
-
సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం విజయవంతం
సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో రహదారులన్నీ స్తంభించాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది.బుధవారం కర్నూలు శివారులో తుంగభద్ర నదిపై హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం వైఎస్సార్ సీపీనాయకుడు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు టాక్టర్లతో జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం తూ. గో. జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు చిత్తూరు సమీపంలో చెన్నై రహదారిపై ఆగిపోయిన వాహనాల అనంతపురంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యార్థుల మానవహారం ఎమ్మెల్యే గురునాథరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం విశాఖనగరంలోని హనుమంతునివాక వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ సమైక్యవాదులు విభిన్నరూపాల్లో ప్రదర్శనలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు పిఠాపురంలో 216 జాతీయరహదారిపై గోడకట్టి బెఠాయించిన పెండెం, రావూరి తదితరులు మంగమూరురోడ్డు జంక్షన్‌వద్ద జాతీయరహదారిపైరాస్తారోకోచేస్తున్న మహిళానాయకులు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు ప.గో.జిల్లా దేవరపల్లిలో రోడ్లపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు -
సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ రహదారుల దిగ్బంధం!
రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం గ్యాలరీ
రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు. తిరుపతి - పుంగనూరు ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు. ----------------------- విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు మునగపాక మెయిన్‌రోడ్డును దిగ్బందం చేసి ఆందోళన తెలుపుతున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రసాద్ సమైక్యాంద్రకు మద్దతుగా మునగపాకలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న దశ్యంర్యాలీగా వస్తున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ----------------------------------------- కదిరిరూరల్,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా మండల పరిధిలోని పట్నం గ్రామం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు పట్నం గంగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం 205 జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. ----------------------------------- చిలకలూరిపేటరూరల్: సమైక్యరాష్ట్రం కొనసాగింపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతత్వంలో ఉద్యమాన్ని ఉధతంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. -
జన తుపాన్
వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. జగన్నినాదం, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. -
ఎల్బీ స్టేడియంలో జగన్ 'సమైక్య శంఖారావం'
ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ సందడిగా ప్రారంభమైంది. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అంచనాలను మించి జనం రావడంతో స్టేడియంతో పాటు చుట్టుపక్కల పలు రోడ్లు కూడా జన ప్రవాహంతో నిండిపోయాయి. -
పోరుబాటలోనే వైఎస్సార్ సీపీ
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లోని శిబిరంలో శక్రవారం 20, 22 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలోని శిబిరంలో పెంటపాడు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. వెలివెల గ్రామ సర్పంచ్ వీరవల్లి రమాదేవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ తదితరులు సంఘీబావం తెలిపారు. తణుకులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం 17వ రోజుకు చేరాయి. ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామస్తులు దీక్షలో పాల్గొన్నారు. వీరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చింతా రామచంద్రారెడ్డి, కార్యదర్శి కె.వెంకటేశ్వరావు తదితరులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ డైరక్షన్లో నడుస్తున్నారని, సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకుడు గ్రంధి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ భీమవరం ప్రకాశంచౌక్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉద్యమకారులకు మాయ మాటలు చెప్పి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
జగన్‌తోనే రాజన్న రాజ్యం
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనతోనే రాజన్నరాజ్యం సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. మం డల పరిధిలోని ఎ.టి అగ్రహారానికి చెందిన వంద కుటుం బాలు బుధవారం పార్టీలో చేరాయి. మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్దే వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భం గా పెనుమత్స మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణయుగం నడిచిందన్నారు. ఆయన అకాల మరణం తర్వాత రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ కలలు కన్న రాజ్యం మళ్లీ జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో మీసాల తాతినాయుడు, మీసాల వెంకటరావు, లెంక శివకుమార్, మీసాల గోవిందరావు, పిన్నింటి రామారావు, ఆబోతుల శ్రీరాముడు, కొర్నాన సత్యవమ్మ, టెక్కలి లక్ష్మి, కోండ్రు సురేష్, లెంక సూర్యారావు, ఆబోతుల శ్రీరామ్మూర్తి, పిన్నింటి సూరప్పలనాయుడు తదితరులున్నారు. జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు.. బొబ్బిలి టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బీబీ నాయన) అన్నారు. స్థానిక దర్బార్మహల్లో పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పట్టణ ంలోని ఎనిమిదో వార్డుకు చెందిన 50 కుటంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో పూటకో మాట మారుస్తుండడం వల్ల కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజల్లో తిరగలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనకు మద్దతు పలకడం వల్ల వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. బొబ్బిలి రాజులను నమ్మి ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన వారందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. పార్టీలో చేరిన వారిలో పొట్నూరు జయంతి, బంటు లక్ష్మణరావు, ముది లి రత్నాకర్, బోగి చిట్టెమ్మ, గంటు బాబురావు, పంట్ల రాధమ్మ, చింతాడ అప్పయ్యమ్మ, పలగర గంగమ్మ, బోనా ల శైలజ, శ్రీనివాసరావు, నింది కరుణ, అరసాడ మేరి, ముదిలి రామలక్ష్మి, చెన్న మహలక్ష్మి. ఎద్దు అప్పన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం మండల కన్వీనర్ చప్ప లకు్ష్మన్నాయుడు, నిడగల్లు మాజీ సర్పంచ్ జి.వెంకటనాయుడు, పారినాయుడు,తదితరులుపాల్గొన్నారు. -
వైఎస్ జగనే కాబోయే ముఖ్యమంత్రి
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భావి ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో రానున్న 25 ఏళ్లకాలంలో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. స్థానిక పోలీస్ ఐలండ్ కొనసాగుతున్న వైసీపీ దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. తొలుత గాంధీ చిత్రపటానికి, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రిలే దీక్షలు చేస్తున్న పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త తోట గోపి, ఇతర నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఒక రోడ్డు మ్యాప్ రూపొందించారన్నారు. మిగిలిన పార్టీ నాయకుల మాదిరి ఆయన వద్ద రెండుకళ్ల సిద్ధాంతాలు లేవన్నారు. మనసా, వాచా, కర్మణా సమైక్యరాష్ట్రం కోసం జగన్మోహన్రెడ్డి పరితపిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే ఈనెల 19న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ తలపెట్టారని, దీనికి జిల్లానుంచి పెద్దఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని కోరారు. అక్కడ జగన్మోహన్రెడ్డి నాయకత్వంతో వినిపించే సమైక్య సింహనాదం ఢిల్లీ వరకు వినిపించాలన్నారు. ఈ నాదంతో విభజన కుట్ర వెనక్కిపోవాలన్నారు. అనంతరం దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. పార్టీ నాయకులు యెగ్గిన నాగబాబు, గుండుమోగుల బలుసులు, గంగుల వెంకటరత్నం, బాలం కృష్ణ, దింటకుర్తి లీలావతి, పైడి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విభజన నిర్ణయంపై వైసీపీ సేనల సమరం
సాక్షి, ఏలూరు : ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలుస్తూ.. వారి సమస్యలపై సత్వరమే స్పందిస్తూ.. జనం కోసం ఉద్యమాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాయి. అన్నదమ్ముల్లాంటి తెలంగాణ, సీమాంధ్రులను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తులపై సమైక్య సమరం చేయడానికి సిద్ధమయ్యాయి. విభజన ప్రకటన వెలువడనుందనే సంకేతాలు అందిన మరుక్షణమే వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులను తృణప్రాయంగా వదిలి ఉద్యమంలోకి వచ్చారు. రెండు నెలలుగా సమైక్యాంధ్ర కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కుట్రల చెరను ఛేదించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనంలోకి రావడంతోనే సమరోత్సాహంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మహాయజ్ఞాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. బుధవారం ప్రారంభమయ్యే ఈ మహాయజ్ఞం ఆంధ్ర రాష్ర్ట అవతరణ దినోత్సవం వరకూ సాగుతుంది. ఇందులో భాగంగా వైసీపీ శ్రేణులు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడుతున్నాయి. దీనికి ఎక్కడికక్కడ విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా మంగళవారం సమావేశాలు నిర్వహించారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొయ్యలగూడెంలో 48 గంటల రిలే నిరాహార దీక్షను బుధవారం ఉదయం నుంచి ప్రారంభిస్తున్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీని వాస్ దీక్ష చేపడుతున్నారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సర్రాజు ఆకివీడు సెంటర్లో దీక్ష చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణం లో దీక్షకు కూర్చుంటున్నారు. పాలకొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గోపాలపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు దొడ్డిగర్ల సువర్ణరాజు, తలారి వెంకట్రావులతో పాటు మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత దేవరపల్లిలో దీక్ష చేపడుతున్నారు. తాడేపల్లిగూడెం పోలీ స్ ఐలండ్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, తణుకులో నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య దీక్ష చేయనున్నారు. ఏలూరు పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ ఫైర్‌స్టేషన్ సెంటర్లో రిలేదీక్షలో కూర్చుంటున్నారు. కొవ్వూరులో నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషే న్‌రాజు, జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, కర్రా రాజారావు, నిడదవోలులో నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ రిలేదీక్షలు చేయనున్నారు. గోపన్నపా లెంలో దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ మార్టేరులో దీక్షకు సన్నద్ధమవుతున్నారు. -
జగన్ బెయిల్‌పై టీడీపీ గోబెల్స్ ప్రచారం: మర్రి రాజశేఖర్
సాక్షి, గుంటూరు : కాంగ్రెస్‌తో అంటకాగుతూ, రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్న సొంత పార్టీ విధానాన్నే ప్రశ్నించలేని టీడీపీ జిల్లా నేతలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో చంద్రబాబు గోబెల్స్ థియరీని అనుకరిస్తున్నారని జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారని, ప్రజల్లో ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌తో జగన్ పొత్తు పెట్టుకోబోతున్నారని, అందువల్లే బెయిల్ వచ్చిందని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారంటే వారి మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. జగన్ బెయిల్ విషయంలో స్పష్టత ఉన్నా దురుద్దేశాలు ఆపాదిస్తున్నారంటే కచ్చితంగా వీరికి మతి భ్రమించిందేమోనని సామాన్యులు చర్చించుకుంటున్న విధంగానే తాము ఆలోచించాల్సి వస్తుందన్నారు. చట్టాలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్న టీడీపీ నేతల తీరును ఏమనాలని ప్రశ్నించారు. తమ రాజీనామాలు ఆమోదింపజేసుకుని పార్టీలో నుంచి బయటకు వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే దమ్ముందా అని మర్రి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖలు రాసి, ప్రత్యేక రాజధాని కోసం ప్యాకేజీ అడిగి విభజనకే కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పిన చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేని ఆ పార్టీ జిల్లా నేతలు జగన్ విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని మాట్లాడుతూ మరింత దిగజారేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య విధానంపై నిర్ణయాన్ని తీసుకుని ఆమరణ దీక్ష చేసి స్పష్టమైన విధానంతో ముందుకు కదులుతున్న జగన్‌పై బురద జల్లడమే పనిగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వైఎస్సార్ సీపీ వైపు మరల్చడానికి ఆ పార్టీ నాయకులు పడుతున్న పాట్లను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. జగన్‌పై విమర్శలు చేయడం సూర్యుడిపై ఉమ్మి వేసిన చందమేనని స్పష్టం చేశారు. -
వైఎస్ఆర్సీపీలో చేరికకు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ.. మరోవైపు జగన్ పునరాగమనం.. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల ఉనికిని సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అధిష్ఠానాల తీరుతో స్థానికంగా ఆ రెండు పార్టీల నేతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో సమైక్యాంధ్ర నినాదంతో పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ వైపు వారు దృష్టి సారిస్తున్నారు. ఇదే తరుణంలో బెయిల్‌పై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బయటకు వచ్చిన సందర్భంగా వెల్లువెత్తిన అభిమానం, హైదరాబాద్‌లో జరిగిన ఊరేగింపులో పోటెత్తిన జనతరంగం నేతలను కుదురుగా ఉండనివ్వడంలేదు. వైఎస్ఆర్సీపీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న కృతనిశ్చయానికి వస్తున్నారు. వలసలతో పార్టీలోకి క్యూ కట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నారు. వలసల వరద కాంగ్రెస్, టీడీపీల నుంచి పెద్ద సంఖ్యలోనే వలసలు ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమదాలవలస నియోజకవర్గంలో ఆ రెండు పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలో పెద్ద సంఖ్యలో చేరికకు రంగం సద్ధమైంది. వచ్చేనెల ఆరో తేదీని దీనికి ముహూర్తంగా నిర్ణయించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నాయకత్వంలో ఆరోజు సుమారు 20 వేల మందితో సభ నిర్వహించి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వారంతా వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ రెండు పార్టీలను జనం తిరస్కరిస్తుండటంతో వాటి అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమైక్య ఉద్యమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఈ పార్టీల నేతలను జనం, సమైక్యవాదులు ఎక్కడికక్కడ అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వారికి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. కుదేలైన కాంగ్రెస్ ఇంతకాలం కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీకి దూరం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీలోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన పార్టీపై అసహనంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ బతి కించిన తనపై నమోదైన కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదన్న అసంతృప్తి ఆయనలో బాగా ఉన్నట్లు తెలిసింది. కేసులు ఒక కొలిక్కి వచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉండి, ఆ తరువాత గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలో చేరాలనే అంశంపై తన సన్నిహితులు, ముఖ్య కార్యకర్తలతో ధర్మాన చర్చించినట్లు తెలిసింది. వైఎస్ఆర్సీపీలో చేరాలని వారి లో ఎక్కువమంది సూచించడంతో ఆయన ఆలోచనలో పడినట్లు తెలిసింది. విజ్ఞత కలిగిన రాజకీయ నాయకునిగా పేరున్న ధర్మాన వైఖరితో జిల్లాలో కాం గ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ కనుమరుగు ఇక జిల్లాలో టీడీపీ ఇప్పటికే నామమాత్రంగా మారింది. ఆ పార్టీలో ముఖ్య నాయకుల్లో ఒక్క రు కూడా మిగలలేదు. కొందరు రాజకీయంగా కనుమరుగై సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. ఎర్రన్నాయుడు మరణంతో పార్టీ కూడా నిర్జీవంగా మారిందని ఆ పార్టీకి చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్న కాస్త ఊపిరిని తీసేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ విడుదలతో అన్నదానం
సాక్షి, చెన్నై : జననేత జగన్ విడుదలతో చెన్నైలోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్ నేతృత్వంలో 20 రోజుల పాటు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బుధవారం లేడీ ఆండాల్ స్కూల్లోని విద్యార్థులకు అన్నదానం చేశారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. ఆయన విడుదలతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నైలోని అభిమానులు సైతం బెయిల్ వచ్చిన రోజు నుంచి తమ ఆనందాన్ని సంబరాల రూపంలో పంచుకుంటున్నారు. బాణసంచాల మోత మోగిస్తూ, స్వీట్లు పంచిపెడుతూ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. అదేవిధంగా చెన్నైలో వివిధ ఆశ్రమాల్లో ఉన్న పేదలకు 20 రోజుల పాటు అన్నదానం చేయడానికి పార్టీ తమిళనాడు విభాగం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా చేట్‌పట్ హ్యారింగ్టన్ రోడ్డులోని లేడీ ఆండాల్ స్కూల్లోని పేద విద్యార్థులకు బుధవారం అన్నదానం చేశారు. వైఎస్సార్ చిత్ర పటానికి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమానికి తమిళనాడు విభాగం నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్ శ్రీకారం చుట్టారు. పేద ఆశ్రమాలు, పేద విద్యార్థులు ఉండే ప్రదేశాల్ని గుర్తించి 20 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బాలాజీ, పాండియన్, రాజేంద్రన్, సతీష్, స్టాన్లీ జగన్, కృపానందన్, పళని, వెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల జగన్ పోస్టర్లు వైఎస్.జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో ఆయనకు ఆహ్వానం పలుకుతూ నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతృత్వంలో ప్రత్యేకంగా ఆయిల్ ప్రింట్ ఆర్ట్స్ పోస్టర్లను సిద్ధం చేశారు. జగన్ ఈజ్ బ్యాక్ నినాదంతో జన సందోహానికి జగన్ నమస్కరించే విధంగా, ఆ దృశ్యాన్ని మహానేత వైఎస్ వీక్షించే రీతిలో ఆర్ట్ ప్రింట్‌గా ఈ పోస్టర్‌ను రూపొందించారు. పెరంబూరు, తండయార్‌పేట, రాయపురం, ప్యారిస్, సెంట్రల్, ఎగ్మూర్, నుంగబాక్కం, వళ్లువర్ కోట్టం, రాధాకృష్ణ సాలై, పురసై వాక్కం, చేట్ పట్, అడయార్, టీ.నగర్, వెస్ట్ మాంబలం, కోడంబాక్కం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అటు వైపు వెళ్లే వారిని ఆకర్షిస్తున్నాయి. ఆనందంగా ఉంది వైఎస్.జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని శరవణన్, జకీ ర్ హుస్సేన్ పేర్కొన్నారు. తమ నాయకుడు జైలు నుంచి బయటకు రావడంతో ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారడం తథ్యమన్నారు. ఆయన రాక సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత బలం చేకూరినట్టు అయిందన్నారు. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతృత్వంలో పార్టీ పటిష్టానికి, జగన్‌కు మద్దతుగా కార్యక్రమాల్ని వేగవంతం చేయనున్నామన్నారు. నగరం, శివారుల్లోని ఆశ్రమాల్ని ఎంపిక చేసి అందులోని పేదలకు 20 రోజుల పాటు అన్నదానం చేయనున్నామని పేర్కొన్నారు. నగరం అంతా జగన్ రాకను ఆహ్వానిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. -
చెన్నైలో జననేతకు జై
జననేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదల కావడంతో చెన్నైలోని అభిమానులు ఆనంద పారవశ్యంలో మునిగిపోయూరు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. జై జగన్..జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి పెట్టారు. సాక్షి, చెన్నై: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణం ఇక్కడి వారిని సైతం శోకసంద్రంలో ముంచింది. వైఎస్ కుటుంబానికి జరుగుతూ వచ్చిన అన్యాయాన్ని చూసి ఇక్క డి అభిమాన లోకం తల్లడిల్లింది. మహానేత తనయుడు, వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించిందన్న సమాచారంతో చెన్నైలో అభిమానులు ఆనందంలో మునిగిపోయూరు. జననేతను చూసేందుకు మంగళవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. ఎప్పుడెప్పుడు జననేతను చూద్దామా అని తపించారు. సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు జగన్ జైలు నుంచి బయటకు అడుగు పెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. రోడ్ల మీదకు పరుగులు తీశారు. బాణసంచా పేల్చారు. మిఠారుులు పంచిపెట్టారు. సంబరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు జాకీర్ హుస్సేన్, శరవణన్ నేతృత్వంలో పెరంబూరు ఎస్ఎస్ నగర్లో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. స్వీట్లు పంచి పెట్టారు. జగన్ ఈజ్ బ్యాక్ నినాదంతో రూపొందించిన పోస్టర్లను నగరంలో ఏర్పాటు చేశారు. బుధవారం అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. ప్యారిస్ వరద ముత్తయప్పన్ వీధిలో వై.ఎస్.జగన్ అభిమానులు శివశంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, ఇమామ్ బాషా, పెంచుల్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి నేతృత్వంలో సంబరాలు మిన్నంటారుు. వైఎస్, జగన్ చిత్రాలతో కూడిన ఫ్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. బాణసంచా మోత మోగించారు. ట్రిప్లికేన్కు చెందిన వైఎస్ అభిమానులు రామప్రసాద్, జనార్దన్ రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, కొండారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరుల నేతృత్వంలో మూడు చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ట్రిప్లికేన్ హైరోడ్డులో ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచా పేల్చారు. పముఖ ఆడిటర్ జేకే రెడ్డి, ఆస్కా ట్రస్టీ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బేతపుడి శేషప్రసాద్, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, రవి, నిర్మాత భాస్కర్‌రాజు తదితరులు టీ నగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద తమ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచి పెట్టారు. కొరుక్కుపేట కామరాజనగర్లోని అభిమానులు శ్రీను, దావేద్, వెంకటేష్, తిరుమలరావు, కన్నయ్య, అబ్రహం, మధు తదితరులు బాణసంచా పేల్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రోడ్డున వెళ్లే వారికి స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టారు. ప్యారిస్ ఆదియప్పన్ నాయకన్ వీధిలో వై.ఎస్.జగన్ అభిమాని కిషోర్‌రెడ్డి నేతృత్వంలో అన్నదానం చేశారు. జగన్‌కు మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. పాండిబజార్లోని తెలుగు వ్యాపారులు నాయుడు హాల్, అరుణా స్వీట్స్, రుషికా రెస్టారెంట్ పరిసరాల్లో చాక్లెట్లు పంచి పెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. టీనగర్ కన్నమపేట శ్రీనివాసపురంలో వైఎస్ అభిమానులు ప్రభాకర్, రమణయ్య, డీవీ అరుణ్‌కుమార్, వసంతకుమార్, సురేష్ అంథోని, సంపత్ కుమార్ స్వీట్లు పంచి పెట్టారు. కోయంబేడు, అరుబాక్కం, తాంబరం పరిసరాల్లోని అభిమానులు లడ్డూలు పంపిణీ చేశారు. జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఆయనకు తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. -
గుండె గూటికి పండగొచ్చింది..
ఎక్కడ చూసినా పండగ వాతావరణం.... బాణసంచా మోతలు...ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వీధుల్లో సంబరాలు, ర్యాలీలు ఇది మంగళవారం పల్లెలు పులకించిన తీరు...పట్టణాలు ప్రభవించిన వైనం. బెయిల్‌పై జగన్మోహన్రెడ్డి విడుదల కావడంతో దసరా, దీపావళి పండుగలు ఒక్కరోజే వచ్చినట్టు కార్యకర్తల్లో ఆనందం ఎగసిపడింది. సామాన్య ప్రజలు సైతం వీధుల్లోకి వచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా మంగళవారం కూడా సంబరాలు మిన్నంటాయి. వాడవాడలా వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. అన్నసంతర్పణలు చేశారు. కేక్‌లు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ స్వర్ణ యుగాన్ని ప్రజలు చూస్తారని, సమైక్యాంధ్ర సాధించి తీరుతామని నాయకులు చెబుతున్నారు. విజయనగరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో స్థానిక నాగవంశపు వీధిలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు వచ్చాడన్నారు. సరైన సమయంలో జగన్ నాయకత్వంలో ప్రజలు వైఎస్ స్వర్ణయుగాన్ని చూస్తారన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, అవనాపు విక్రమ్ అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం టౌన్లో పట్టణ పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేళతాళాలతో బాణసంచా కాల్చి ఆనందోత్సవాలు జరిపారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలే శారు. మండలంలో నర్సి పురం, పెదబొండపల్లి, తాళ్లబురిడి, ఎమ్మార్‌నగరం గ్రామాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి వైఎస్ విగ్రహాలకు పాలా భిషేకాలు చే శారు. నర్సిపురంలో అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతానగరంలో పార్టీ సమన్వయకర్త గర్భాపు ఉదయభాను, నాయకులు వాకాడ నాగేశ్వరరావు, ఉడముల గౌరునాయుడుల ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి సంబ రాలు జరిపారు. హనుమాన్ జంక్షన్ నుంచి వైఎస్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. బూర్జిలో పీఏసీఎస్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 400 మందికి అన్నదానం చేశారు. వంతరాంలో గ్రామ సర్పంచ్ బెవర హేమలత ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. గంగాడలో గంట శంకరరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. బలిజిపేట మండలం నారాయణపురం గ్రామసర్పంచ్ మండల ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ మండల కన్వీనరు శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. బొ బ్బిలిలో వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోటలో టపాసులు కాలుస్తూ జగన్, వైఎస్ ఫొటోలు, వైఎస్ఆర్సీపీ జెండాలు చేతపట్టి పట్టణంలో ర్యా లీ నిర్వహించారు. ఎస్. కోట మండలంలో పెదకండేపల్లిలో గ్రామస్థాయి నాయకులు , కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరిపి, ర్యాలీ నిర్వహించారు. జామి మండలంలో కలగాడ సర్పంచ్ రాయవరపు మాధవి ఆధ్వర్యంలో మూడువేల మందికి అన్నసం తర్పణ నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త డాక్టర్ గేదెల తిరుపతి పాల్గొన్నారు. రామయ్యపాలెంలో వైఎస్ఆర్ సీపీ నేత బండారు పెదబాబు ఆధ్వర్యంలో మందుగుండు కాల్చారు. జాగరంలో మండల కన్వీనరు సూరిబాబు రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిం చారు. కొత్తభీమసింగిలో పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కురుపాం మండలంలో చప్పగుత్తిలి, ధర్మలక్ష్మిపురంలలో మండల కన్వీనరు ఆరిక ఎల్లయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిమ్మల వెంకటరావుల ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి, అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. జియ్యమ్మవలస మండలం చినతుంబలి, చినమేరంగిలో నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, రెడ్డిశకుంతల ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, బాణసంచా కాల్చారు. కొమరాడ మండలంలో పార్టీ నాయకులు గులిపల్లి సుదర్శనరావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. గరుగుబిల్లిలో రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురంలో పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సాలూరులో పట్టణ వైఎస్ఆర్ సీపీ కన్వీనరు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో చిన హరిజన పేటలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎస్సీసెల్ కన్వీనరు మజ్జి అప్పారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముగడ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మండల కన్వీనరు జి.కనకలింగేశ్వరరావు ఆధ్వర్యంలో విజ యోత్సవ ర్యాలీ నిర్వహించారు. మామిడిపల్లిలో తప్పెటెగుళ్లు ప్రదర్శించారు. చీపురుపల్లిలో అంబేద్కర్ నగర్లో యువత, మహిళలు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం మోదవలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో పార్టీ నాయకులు గండిబోయిన ఆది ఆధ్వర్యంలో గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. పెదతాడివాడలో సంబరాలు జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు . నెల్లిమర్లలో బైక్ ర్యాలీని పార్టీ నాయకుడు జనాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
జగన్ విడుదలతో వెల్లువెత్తిన జనోత్సాహం
ఇంతకాలం గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానం కట్టలు తెంచుకుంది. ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆనందంతో గంతులేసింది. సంతోషాన్ని ఆపుకోలేక సంబరాలు చేసుకుంది. అక్రమ నిర్బంధాలు నేతలను జనం నుంచి దూరం చేయలేవని.. మరింత చేరువ చేస్తాయని జగన్ విడుదల సందర్భంగా వెల్లువెత్తిన ఆనందోత్సాహాలు స్పష్టం చేశాయి. టీవీలకు అతుక్కుపోయి జననేత స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగిడిన దృశ్యాలను వీక్షించిన ప్రజల మొహాలు చిచ్చుబుడ్లలా ఆనందంతో వెలిగిపోయాయి. జగన్నినాదాలు టపాసుల్లా పేలాయి. యువతలో ఉరకలెత్తిన ఉత్సాహం బైకులెక్కి షికార్లు చేసింది. ఈ శుభ సందర్భాన్ని ఎవరికివారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ప్రధానంగా మూడు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అవేమిటంటే.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సామాన్యులు.. సమైక్యవాదులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. అందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ధీమా కనిపిస్తోంది. భరోసా వ్యక్తమవుతోంది. అక్రమ నిర్బంధానికి గురైన జన నాయకుడు జగన్మోహన్రెడ్డి కుట్రల సంకెళ్లు తెంచుకొని బయటకు రావడమే దీనికి కారణమని ఆయా వర్గాల మాటలు స్పష్టం చేస్తున్నాయి. చుక్కాని లేని నావలా తయారైన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లేనని సామాన్యులు సంబరపడుతుంటే.. పార్టీకి ఇక ఎదురుండదని.. ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నాయి. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి సై అన్న ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్సీపీయేనన్న భావన బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత బయటకు రావడంతో ఉద్యమానికి కొత్త ఊపు వస్తుం దని సమైక్యవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని వర్గాల్లో నూతనోత్సాహం నింపిన జగన్ విడుదల సందర్భాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఒక సంబరంలా సెలబ్రేట్ చేసుకున్నారు. ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్మోహన్రెడ్డి బయటకు రాకుండా కేంద్రం, టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్మానికి ఎప్పుడూ ఓటమి ఉండదని రుజువైందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం యువకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విజయగణపతి ఆలయంలో పూజలు చేశారు. పార్టీ సమన్వయకర్త వరుదు కల్యాణి, ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అందవరపు సూరిబాబు తదితరులు బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. జగన్ నినాదాలతో ఊరూవాడా హోరెత్తించారు. పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ అధినేత లేకపోయినా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఏ కార్యక్రమం చేపట్టినా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఇప్పుడు అధినేత బయటకు వచ్చారు. కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఆదరణ రెట్టింపవుతుందన్న ఆనందం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. పస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఆయన ఉత్ప్రేరకమవుతారని భావిస్తున్నారు. జగన్‌ను కలుసుకునేందుకు పలువురు సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు మంగళవారం రాత్రే బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం లోటస్‌పాండ్ నివాసంలో వారు జగన్‌ను కలువనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల విషయంలో ఆయన కీలకమైన సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని, పనిచేసే వారికే ఆయన గుర్తింపు ఇస్తారు కనుక ఇక నుంచి పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయక తప్పదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జగన్ విడుదలైన సందర్భంగా అంబరాన్ని తాకిని ప్రజాభిమానం కాంగ్రెస్, టీడీపీలను కంగు తినిపించింది. -
జగన్‌కు బెయిలు జనం జేజేలు
-
జననేతకు బెయిల్‌తో జగమంతా సంబరాలు
-
జగన్‌కు బెయిలు జనం జేజేలు
వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిలు మంజూరు కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయూరు. చెన్నై నగరంలోని పలు కూడళ్లలో సంబరాలు జరుపుకున్నారు. బాణపంచా పేల్చి మిఠాయిలు పంచి పెట్టారు. జై జగన్..జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. జగన్ ధీశాలి అని విజయచందర్ కొనియూడారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి తమిళనాడులోనూ అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన కుమారుడు, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అక్రమం గా అరెస్ట్ చేసిన సమయంలో ఇక్కడి జనం తీవ్ర ఆవేదనకు గురయ్యూరు. జగన్ బయటకు వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు అయింది. ఈ సమాచారం టీవీల ద్వారా తెలుసుకున్న తమిళనాడులోని వైఎస్ అభిమానులు ఆనందంలో ముగినిపోయూరు. సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు శరత్, జాకీర్‌హుస్సేన్, శరవణన్ భారీ సంఖ్యలో అభిమానులతో చెన్నై నగరంలోని విజయరాఘవ రోడ్డుకు చేరుకున్నారు. భారీ ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జై జగన్ అనే నినాదంతో ఆ ప్రాంతం మార్మోగింది. అభిమానుల హడావుడితో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. జగన్‌కు బెయిల్ మంజూరైన సమయంలో చెన్నైలోనే ఉన్న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ నేత గడ్డం వెంకట కృష్ణారెడ్డి అభిమానులను కూడగట్టి స్థానికంగానే సంబరాలు నిర్వహించారు. నగర ప్రజలకు మిఠారుులు పంచి పెట్టారు. ఈ సంబరాల్లో పాల్గొన్న సినీనటులు, పార్టీ సీనియర్ నేత విజయచందర్ మాట్లాడారు. కుట్రలు నిలవవు రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఎక్కువ కాలం నిలవలేవని జగన్‌కు బెరుుల్ మంజూరుతో నిరూపణ అరుుందని విజయచందర్ అన్నారు. సోనియాగాంధీకి ఎదురునిల్చి తెలుగుజాతి గౌరవాన్ని నిలిపిన ధీశాలి జగన్ అన్నారు. ఆయన జైలు నుంచి విడుదల కావడం అభిమానులకు పెద్ద పండుగలా మారిందని చెప్పారు. గడ్డం వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు టీడీపీతో కుమ్మకై జగన్‌పై అక్రమకేసులు బనాయించి జైలు పాలుచేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనాన్ని, జగన్‌పై ప్రజలు చూపుతున్న అభిమానాన్ని తట్టుకోలేక పన్నిన కుట్రలు పటాపంచలై పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. నగరంలో జరిగిన సంబరాల్లో ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అలాగే తమిళనాడులోని తిరువళ్లూరు, పళ్లిపట్టు, వేలూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజమండ్రికి చెందిన శివప్రసాద్ అనే జగన్ వీరాభిమాని తన సహోద్యోగులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుజాతికే పండుగ : దివ్యవాణి, సినీ నటి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించడం తెలుగుజాతికే పండుగలా మారింది. కుట్రపూరిత కేసులతో ఏడాదిన్నరగా జగన్ జైల్లో మగ్గిపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేకపోయారు. ప్రజల ప్రార్థనను దేవుడు మన్నించాడు, ఏసు ప్రభువు కరుణించాడు. జగనన్న జైలు నుంచి బయటకు వచ్చాడు. న్యాయమే గెలిచింది : సత్యాదేవి, తమిళనాడు తెలుగు సమాఖ్య మహిళా విభాగం అధ్యక్షురాలు. జగన్ చేస్తున్న ధర్మపోరాటంలో న్యాయదేవత కరుణించింది. బెయిల్ మంజూరు చేసింది. తండ్రి మరణించిన నాటి నుంచి ప్రజల్లోనే తిరుగుతూ వైఎస్ఆర్ లేని లోటును తీర్చే ప్రయత్నంలో కుళ్లు రాజకీయాల కారణంగా జగన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. రాబోయే కాలంలో ప్రజాశీస్సులే జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తాయి. ఆనందకరం జగన్‌కు బెయిల్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. తమిళనాట ఉన్న తమలాంటి వారిని వైఎస్ మరణం తీవ్రంగా బాధించింది. తర్వాత జరిగిన పరిణామాలు మరింత ఆవేదన కలిగించాయి. ఇది వరకు ఓ మారు జగన్ కోసం శీర్షిక ద్వారా మా ఆవేదన వెలిబుచ్చాను. ఏ రోజుకైనా జగన్ బయటకు వస్తారని ఆశించాం. ఆ కల నెరవేరడం ఆనందంగా ఉంది. - భారతీ కుమార్ (అనకాపుత్తూరు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్) -
జగమంత సంబరం
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 484 రోజుల నిరీక్షణ ఫలించింది. జగనన్న వస్తాడు...తమ కష్టాలు తీరుస్తాడన్న ఎదురుచూపులకు బదులు దొరికింది. ఆయన అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఓదార్పు లభించింది.. సోమవారం ఉదయం నుంచి టీవీలకు అతుక్కుని క్షణక్షణం ఉత్కంఠగా గడిపిన వారికి సాయంత్రం చల్లని కబురందింది. అంతే అందరి కళ్లు చెమ్మగిల్లాయి... గుండెలు పుల కించాయి.... అసంకల్పితంగా చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కరతాళధ్వనులతో తమ హర్షం ప్రటించారు.... పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు.... అభినందనలు తెలుపుకొన్నారు... రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మనసు స్థిమిత పడే వరకూ తీపి ఆనందాన్ని పంచుకున్నారు. విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై జిల్లా వ్యాప్తంగా సోమవారం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటూ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సంబరాల్లో పాల్గొన్నారు. విజయనగరంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ నేతృత్వంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు తదితరులు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయం ముందు భారీ ఎత్తున మందుగుండు కాల్చారు. అలాగే పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని, పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచిపెట్టి విజయోత్సవాలు చేశారు. పార్వతీపురంలో పట్టణ పార్టీ కన్వీనరు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి మేళతాళాలలో పాతబస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను, జెడ్పీ మాజీ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావుతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి కోటలో పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రామసుధీర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బాణసంచా కాల్చారు. సాలూరులో పట్టణ నాయకులు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ముందుగా పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేశారు. నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. జాతీయ రహదారిపై బాణసంచా పేల్చారు. పాచిపెంటలో దండి ఈశ్వరరావు, ఇజ్జపురపు కృష్ణల ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. గజపతినగరం నియోజకవర్గం లక్కిడాం, గంట్యాడ, బోనంగి తదితర గ్రామాల్లో విజయోత్సవాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చారు. గజపతినగరం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు నియెజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. పెద్దినాయుడులతో పాటు కార్యకర్తలు, అభిమానులు స్థానిక జాతీయ రహదారిపై బాణసంచా కాల్చి తీపి పంచుకున్నారు. అనంతరం స్థానిక జాతీయ రహదారిపై ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో సీమాంధ్ర తెలంగాణ అనే వ్యత్యాసం లేకుండా అన్ని చోట్లా పండగ వాతావరణం నెలకొందన్నారు. ఎస్.కోటలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రెహ్మాన్ నేతత్వంలో స్థానిక దేవీ బొమ్మ జంక్షన్లో సంబరాలు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మిఠాయిలు తినిపించారు. రంగులు పూసుకుని ఆనందం వ్యక్తం చేశారు. మేళతాళాలు, భాజాభజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల కన్వీనరు సత్యం, కె.పాల్‌కుమార్, పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మోపాడ కిరణ్‌కుమార్‌లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చీపురుపల్లి మూడురోడ్లు జంక్షన్లో నియోజకవర్గ సమన్వయకర్త శనపతి సిమ్మినాయుడు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచిపెట్టుకుని బాణసంచా కాల్చారు. గుర్లలో మండల కన్వీనరు కెల్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో మీసాల సిమ్మునాయుడు ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మెరకముడిదాంలో కొమ్ము శంకరరావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కురుపాం నియోజకవర్గంలో పార్టీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. కురుపాం, రావాడ కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. త్రినాథస్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో మండంగి భూషణరావు, పత్తిక లక్ష్మణరావు తదితర నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. గరుగుబిల్లి మండలంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణతో పాటూ బొబ్బిలి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. జియ్యమ్మవలస మండలంలో దత్తి లక్ష్మణరావుతో పాటు నాయకులు స్వీట్లు పంచుకున్నారు. నెల్లిమర్ల మండలంలో మొయిద, సతివాడ, కొండవెలగాడ, నెల్లిమర్ల తదితర గ్రామాల్లో కార్యకర్తలు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి డ్యాన్సులతో సంబరాలు చేసుకొంటూ మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది సంబంరాల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకొన్నారు. -
జననేతకు బెయిల్‌తో జగమంతా సంబరాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ, ఉద్విగ్నతల మధ్య నలిగిపోయిన జిల్లా ప్రజలు.. సాయంత్రం ఉత్కంఠ వీడిపోవడంతో సంబ రాల్లో మునిగితేలారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై బనాయించిన కేసుల్లో సీబీఐ దర్యాప్తు పూర్తి కావడం, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారం వెలువడనున్నట్లు వార్తలు రావడంతో ఉదయం నుంచే ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. న్యూస్ చానల్స్ చూస్తూ ఉత్కంఠతో కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూశారు. ఉదయమే సీబీఐ కోర్టులో నోట్ దాఖలు చేసింది. జగన్‌పై నమోదైన 8 కేసుల్లో క్విడ్‌ప్రోకోకు ఆధారాలు లేవని అందులో పేర్కొనడం.. హైకోర్టు ఆదేశించిన అన్ని కేసుల్లోనూ దర్యాప్తు పూర్తి చేశామని నోట్లో వివరించినట్లు చానళ్లలో వార్తలు రావడంతో జగన్‌కు బెయిల్ తప్పకుండా వస్తుందని భావించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు తీర్పు రాకపోవడంతో భోజన విరామం అనంతరం తీర్పు వెలువడుతుందని భావించారు. అదే ఉత్సుకతతో టీవీలు చూస్తూ గడిపారు. అయితే గంటలు గడుస్తున్నా తీర్పు వెలువడకపోవడంతో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ మళ్లీ బెయిల్ నిరాకరిస్తారేమోనన్న అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు జగన్‌కు బెయిల్ మంజూరైనట్లు బ్రేకింగ్ న్యూస్ రావడంతో కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులతోపాటు సామాన్య ప్రజలు పరస్పరం అభినందనలు చెప్పుకొంటూ మిఠాయిలు పంచుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల లు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. యువకులు పార్టీ పతాకాలు పట్టుకొని బైకులపై ఊరంతా తిరిగి సందడి చేశారు. సమైక్యాంధ్ర దీక్షల్లో ఉన్న నాయకులు కూడా జగన్‌కు బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ మినహా, ఏ రాజకీయ పార్టీ సమైక్యాంధ్ర కోసం కనీసం ప్రకటనలు కూడా చేయకపోవడం, ఒకటి, రెండు పార్టీలు చేస్తున్నా ద్వంద్వ విధానాలు అవలంభిస్తుండడంతో వారు ఆ పార్టీలను నమ్మటం లేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించడంతో తమ పోరాటానికి అండగా నిలబడే నాయకుడు దొరికాడని వారంతా భావిస్తున్నారు.