ఏజెన్సీ కోటా ప్రకటించాలి
ఆదిలాబాద్‌టౌన్: డీఎస్సీ 2024లో ఏజెన్సీ కోటా ప్రకటించిన తర్వాతే నియామకాలు చేపట్టాలని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డీఈవో ప్రణీతకు వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు సోమేష్ మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఐదో షెడ్యూల్, పేసా 1/70 చట్టాలున్నా గిరిజనేతరులకు ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలన్నారు. ఇందులో అభ్యర్థులు గంగారాం, దీపక్, సోమేష్, హరీష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా
కై లాస్‌నగర్: కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ ప్రాంత డీఎస్సీ అభ్యర్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవికి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment