రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ ● సోయా కొనుగోళ్లు ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో శుక్రవారం సోయా కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోయా కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం, పత్తి కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి మధుకర్, డీసీవో మోహన్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment