కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌

Published Tue, Oct 15 2024 12:52 AM | Last Updated on Tue, Oct 15 2024 12:52 AM

కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌

● జిల్లాలో 266 మందికి.. ● బదిలీ అయి రిలీవ్‌ కాని ఉపాధ్యాయులకు ఊరట

ఆదిలాబాద్‌టౌన్‌: డీఎస్సీ–2024 ద్వారా నియామకమైన కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌ కల్పించనున్నారు. ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి హైదరాబాద్‌లో వీరికి నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే. మంగళవారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి అభ్యర్థులకు మెరిట్‌ ఆధారంగా ఆయా పాఠశాలలను కేటాయించనున్నారు. జిల్లాలో 266 మంది ఈ డీఎస్సీ ద్వారా నియామకమయ్యారు. మొత్తం 324 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ ఉర్దూ మీడియంతో పాటు పలు కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోలేదు. 72 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 194 మంది ఎస్టీజీ కేటగిరీ ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ కల్పించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని డీఈవో ప్రణీత పేర్కొన్నారు.

బదిలీ ఉపాధ్యాయులకు రిలీవ్‌..

ఈ ఏడాది జూలైలో 768 మంది ఎస్జీటీలకు బదిలీలు జరిగాయి. వీరిలో 503 మందిని రిలీవ్‌ చేశారు. 265 మంది బదిలీ జరిగినప్పటికీ పాత చోటే విధులు నిర్వహిస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం వారిని రిలీవ్‌ చేయలేదు. స్థాన చలనం జరిగినా పాత చోటే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో నిరాశ నెలకొంది. ఎట్టకేలకు కొత్త టీచర్ల రాకతో వీరు బదిలీలో ఎంచుకున్న స్థానంలోకి చేరనున్నారు.

అధికారులతో అభ్యర్థుల వాగ్వాదం..

డీఎస్సీ 2024 మెరిట్‌ జాబితాలో ఉన్నా తమకు ఎంపిక చేయలేదని కొంత మంది అభ్యర్థులు వి ద్యాశాఖ అధికారులు, ఉద్యోగులతో వాగ్వాదా నికి దిగారు. ఎస్టీజీ విభాగంలో 12వ ర్యాంకు వ చ్చినప్పటికీ తనను ఎంపిక చేయలేదని, విద్యాశా ఖ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఓ అభ్యర్థి పేర్కొన్నాడు. అలాగే స్కూ ల్‌ అసిస్టెంట్‌ విభాగంలో ఫిజికల్‌ సైన్స్‌లో రెండో ర్యాంకు వచ్చినా ఎంపిక చేయలేదని మరో అభ్యర్థి ఆరోపించాడు. మరాఠీ మీడియంలో ఓ అభ్యర్థికి సైతం అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగ్‌ ఇవ్వకపోతే కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని పేర్కొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణకుమార్‌, వెంకట్‌, శ్రీకాంత్‌, అశోక్‌, స్వామిలు మద్దతు తెలిపారు. డీఈవోతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement