జిల్లా ఓటర్లు @ 4,58,338
● పురుషుల కంటే మహిళలే అధికం ● ముసాయిదా ఓటరు జాబితా విడుదల ● నవంబర్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణ
కై లాస్‌నగర్: జిల్లాలో 4,58,338 మంది ఓటర్లు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టరేట్‌తో పాటు ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయాలు, అన్ని తహసీల్దార్ కార్యాలయాల నోటీసుబోర్డులపై అందుబాటులో ఉంచారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్‌వో)ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,23,176 మంది, మహిళా ఓటర్లు 2,35,154 మంది, ఇతరులు మరో 8 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే జిల్లాలో మహిళా ఓటర్లు 11,978 మంది ఎక్కువగా ఉన్నారు.
28 వరకు అభ్యంతరాల స్వీకరణ
ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 29 నుంచి నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీ, యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించారు. నవంబర్ 9, 10 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సైతం నిర్వహించనున్నారు. అధికారులకు అందిన అభ్యంతరాలు, ఆక్షేపణలను డిసెంబర్ 24లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించి 2025 జనవరి 6న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment