సర్వేలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కై లాస్‌నగర్: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడాలనే సమున్నత ఆశయంతో ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోందన్నారు. ప్రణాళికశాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తుందని, ప్రతీ మండలానికి ఒక నోడల్ ఆఫీసర్‌గా జిల్లాస్థాయి అధికారిని నియమించాలని, అదనపు కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, సీపీవో వెంకట రమణ, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment