చలి షురూ
● పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ● కమ్ముకుంటున్న పొగమంచు ● అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా అంటేనే భిన్న వాతావరణానికి నెలవు. రాష్ట్రంలోనే అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటా యి. మరోవైపు వర్షాలు సైతం అధికమే. అడవుల జిల్లాను చలికాలంలో మినీ కశ్మీర్‌గా అభివర్ణిస్తా రు. మొన్నటివరకు ఉక్కపోతతో జనం ఉక్కిరిబి క్కిరి కాగా ప్రస్తుతం చలి తీవ్రత మొదలైంది. రెండు మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రివేళలో చలి ప్రభావంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పాల వ్యా పారులు, పేపర్ బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు వణికిపోతున్నారు. అయితే ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి మరింతగా ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురువడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
వారం క్రితం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్‌పైనే నమోదయ్యాయి. రెండు రోజు లుగా క్రమంగా పడిపోతున్నాయి. బుధవారం జిల్లాలోని భీంపూర్‌లో 13.6 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రివేళలో శీతల గాలులు పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు.
స్వెట్టర్లకు పెరిగిన గిరాకీ..
చలితీవ్రత పెరుగుతుండడంతో ఆదిలాబాద్ పట్ట ణంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో వెలిసిన స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్, రాంలీలా మై దానం, పంజాబ్ చౌక్ తదితర ప్రాంతాల్లో ఈ దుకా ణాలు వెలిశాయి. అలాగే ఆయా రాష్ట్రాల నుంచి పలువురు గ్రామాల్లో తిరుగుతూ స్వెట్టర్లు, బ్లాంకెట్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన చలి తీవ్రత నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వారం రోజులుగా జిల్లాలో నమోదైన
ఉష్ణోగ్రతలు(సెల్సియస్‌లో)
తేదీ కనిష్ట గరిష్ట
7 17.2 32.8
8 16.7 31.8
9 16.2 32.3
10 15.7 32.3
11 16.2 31.8
12 15.2 31.3
13 13.6 31.3
Comments
Please login to add a commentAdd a comment