అధ్యక్షా.. బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేయండి●
● అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్: బోథ్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం అసెంబ్లీ ప్రస్తావించారు. ఈ ప్రాంతవాసుల చిరకాల కోరికను నెరవేర్చాలన్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా భాగం గిరిజన ప్రాంతమని, బస్సులు కూడా వెళ్లలేని గ్రామాలు అనేకం ఉన్నాయని అన్నారు. ఎన్ని కల ప్రచారంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి బో థ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఇటీవల బోథ్‌లో పర్యటించిన మంత్రి సీతక్కకు కూడా ఈ విషయమై విన్నవించినట్లు తెలిపారు. దీనిపై రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇస్తూ.. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, అనుకూలంగా ఉంటే బేషజాలకు వెళ్లకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బాల్యవివాహ రహిత భారత్ కోసం కృషి
ఆదిలాబాద్‌రూరల్: బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి రా జేంద్రప్రసాద్ అన్నారు. మండలంలోని బంగారిగూడ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో షూర్ ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ఆడపిల్లల రక్షణ కోసం 1098, 100, మహిళల కోసం 181 హెల్ప్‌లైన్ షీ టీంలు 24 గంటల పాటు పని చేస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ పవర్ యశోద, సఖి కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీశ్, సీడీపీవో వనజ, ప్రిన్సిపాల్ పరిహిన్ సుల్తానా, షూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కె. వినోద్, తదితరులు పాల్గొన్నారు.
దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కోర్టులో ట్రయల్ నడుస్తున్న కేసులకు సంబంధించి సాక్ష్యులను ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. డీఎస్పీ వెంట జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment