ఖాళీ టీ కప్పులతో ‘సమగ్ర’ ఉద్యోగుల నిరసన
కై లాస్‌నగర్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరింది. కలెక్టరేట్ వద్ద గల సమ్మె శిబిరం నుంచి పట్టణంలోని ఎన్టీఆర్‌చౌక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను చాయ్ తాగే లోపు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ టీ ఆకారంలో కూర్చుని ఖాళీ టీకప్పులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే దాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో సంఘం నాయకులు ప్రియాంక, దీప్తి, మల్లిక, నవీన, పార్థసారథి, కేశవ్, వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment