మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజ న కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కార్మికులకు రూ.10వేల వేతనం, సబ్సిడీ కింద గ్యా్‌స్ అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా నెరవేర్చడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సంఘం నాయకులు చిన్నన్న, సంగీత, రేఖ, కవిత, లక్ష్మి, సమీన, నఫీజ్, గంగామణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment