ఇంద్రవెల్లి: విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని దనోర(బి)జెడ్పీపాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాల్యం నుంచే ఆరోగ్య సూత్రలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఆరోగ్యపాఠశాల కార్యక్రమం మరో నాలుగు వారాలపాటు పొడిగించి జనవరి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జనతగూడ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. అక్కడి నుంచి ఆదర్శ జీపీగా ఎంపికై న ఏమాయికుంటను సందర్శించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన వెంట సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీకలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా, డీఈవో ప్ర ణీత, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భా స్కర్, ఎంఈవో మానుకుమార్, హెచ్‌ఎం అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment