![రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17adi26-340148_mr-1734460963-0.jpg.webp?itok=a8TAlbN0)
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని దక్షిణ మధ్య రైల్వేబోర్డు మెంబర్ ఉష్కం రఘుపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో భాగంగా కబడ్డీ ఎంపిక పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది ప్రతిభగల కబడ్డీ క్రీడాకారులు ఉన్నారన్నారు. వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కన్వీనర్ రాష్ట్ర పాల్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ కాంతారావు, సామాజిక కార్యకర్త ఆదిత్య ఖండేష్కర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment