ఇచ్చోడ: రైతులు సాగుతో పాటు పశుపోషణ చేపడితే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు. మండలంలోని బోరిగామలో తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి, జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశువైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. రైతులు సాగుకు అనుబంధంగా పశు పోషణ చేపడితే అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. ఇందులో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కిషన్, విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డెరెక్టర్ మధుసూదన్‌రావు, మండల పశువైద్యాధికారి గోవింద్‌నాయక్, పాడిరైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
● శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ
Comments
Please login to add a commentAdd a comment