ప్రారంభమైన ఆయుత చండీయాగం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో 85వ విశ్వశాంతి ఆయుత మహాచండీ యాగం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు గణపతి పూజ, శుద్ధ పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశనం, రుత్విక్ వరుణ, గోసహిత యాగశాల ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించా రు. ఈ పూజల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు పాల్గొన్నారు. యాగ నిర్వాహకులు, శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ, లోక కల్యానార్థం ఆయుధ మహా చండీయాగాన్ని తలపెట్టినట్లు పేర్కొన్నారు. యాగశాల ప్రవేశం పూర్తయిందని, సోమవారం నుంచి జనవరి 6వరకు యాగం కొనసాగుతుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఇందులో పలు వురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment