వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. మూడు విడతలుగా రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందజేసి వారికి అండగా నిలుస్తోంది. అయితే రుణాలు పొందిన వ్యాపారులు నెలవారీ కిస్తీలను సకాలంలో చెల్లించడం లేదు. దీంతో వారు మరో విడత సాయానికి అనర్హులవుతున్నారు. కొంతమంది నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి రెండు, మూడు నెలల తర్వాత చెల్లిస్తున్నారు. బ్యాంకు సిబిల్ సైతం పరిశీలనలోకి వస్తోంది. ఇలాంటి కారణాలతో మరో విడత రుణం పొందేందుకు అర్హత కోల్పోతున్నారు. – శ్రీనివాస్, మెప్మా డీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment