పశువుల పాకలు.. నీటి కుంటలు | - | Sakshi
Sakshi News home page

పశువుల పాకలు.. నీటి కుంటలు

Published Mon, Dec 23 2024 1:07 AM | Last Updated on Mon, Dec 23 2024 1:07 AM

పశువు

పశువుల పాకలు.. నీటి కుంటలు

ఉపాధి హామీ నిధులతో మంజూరు

వందశాతం రాయితీతో నిర్మాణం

గ్రాసం పెంపునకు ఆర్థిక చేయూత

పశు పోషకులకు అదనపు ప్రయోజనం

జిల్లాలో..

గ్రామ పంచాయతీలు 473

కేటాయించిన పశువుల పాకలు 340

పరిపాలన అనుమతులిచ్చినవి 232

మంజూరు చేసినవి 108

ఇప్పటి వరకు పూర్తయినవి 61

కేటాయించిన నీటికుంటలు 340

మంజూరు చేసినవి 240

ఇప్పటి వరకు పూర్తయినవి 27

కై లాస్‌నగర్‌: పశుపోషకులతో పాటు చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులకు సరైన వసతి లేక వారు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని సంకల్పించింది. ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. వందశాతం రాయితీతో షెడ్లను మంజూరు చేస్తోంది. వాటితో పాటు సేంద్రియ ఎరువును తయారు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక నీటి కుంటల నిర్మాణానికి కూడా నిధులను విడుదల చేస్తోంది. అలాగే పశుగ్రాసం కొరతను అధిగమించేలా తమకు అనుకూలమైన ప్రాంతాల్లోనే గ్రాసం పెంచుకునేలా అజోల్‌ గడ్డిని సైతం అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు కేటాయించిన పశువుల పాకల లక్ష్యానికి గాను ఇప్పటికే పలుచోట్ల వాటి నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి.

వందశాతం రాయితీతో..

గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషకులతో పాటు చిన్న, సన్నకారు రైతులు సైతం గేదెలు, ఆవులు, మేకలు వంటి మూగజీవాలను పెంచుకుంటారు. అయితే వాటిని ఉంచేందుకు సరైన వసతి ఉండటం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తుండటంతో రోగాల బారిన పడుతున్నాయి. ఊరకుక్కలు దాడి చేసి గాయపరుస్తుండటంతో దూడలు, గేదె పిల్లలు చనిపోతున్నాయి. దీంతో పెంపకందారులకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం గుర్తించింది. వారికి అండగా నిలిచేలా షెడ్ల నిర్మాణాలు చేపట్టాలని సంకల్పించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో వందశాతం రాయితీతో వాటిని మంజూరు చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 340 యూనిట్లను కేటాయించారు. 10/20 సైజ్‌లో నిర్మించే ఒక్కో పశువుల షెడ్‌కు రూ.90వేలు అందించనున్నారు. మూడు వైపులా గోడలు, పైన రేకుల షెడ్‌ వేయనున్నారు. ఒక సైడ్‌ పూర్తిగా తెరిచి ఉంటుంది. ఒక్కో మండలానికి 20 చొప్పున నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు లక్ష్యం పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు.

నీటి కుంటలు, అజోల్‌ పశుగ్రాసానికి సైతం

పశువుల షెడ్ల నిర్మాణాలతో పాటు వర్మి, నాడెడ్‌ కంపోస్టు ఎరువును తయారు చేసుకునేందుకు అవసరమైన నీటి కుంటల నిర్మాణాలకు సైతం ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశం కల్పించారు. గ్రామాల్లో పశుపోషకులు ఎక్కడపడితే అక్కడ పశువుల పేడను నిల్వ చేస్తున్నారు. దీంతో అందులోని మిథేన్‌ గ్యాస్‌ బయటకు వెళ్లకపోవడంతో వాసన వెదజల్లి రోగాలు ప్రబలే అవకాశముంది. ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ కవర్లతో నిర్మించుకున్న కుంటల్లో పేడను నిల్వ చేయడం ద్వారా అందులోని మిథేన్‌ వాయువు బయటకు వెళ్లిపోయి ప్రత్యేక నిర్మాణం ద్వారా వచ్చే గాలి ద్వారా కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఇది అన్నదాతకు అదనపు లబ్ధి చేకూర్చనుంది. దీనికి కూడా రైతులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదు. వంద ఽశాతం రాయితీతో ఉపాధి నిధుల ద్వారా వీటిని నిర్మించుకుకోవచ్చు. ఒక్కో యూనిట్‌కు రూ.20వేల చొప్పున చెల్లించనున్నారు. అలాగే పశుపోషకులకు ఇటీవల పశుగ్రాసం సమస్య కూడా తలెత్తుతుంది. సరిపడా గ్రాసం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని కూడా తొలగించేలా కుండీల్లోనే పశుగ్రాసం పెంచుకునేలా అజోలా గడ్డిని సైతం ఉపాఽఽధి హామీ నిధులతో అందిస్తున్నారు. దీని యూనిట్‌ విలువ కూడా రూ.20వేలు. కుండీల్లో పెంచుకోవడం ద్వారా పెద్దగా స్థల సమస్య కూడా ఉండదు.

సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ గ్రామీణ ఉపాఽఽధి హామీ నిధుల ద్వారా వంద శాతం రాయితీతో పశువుల పాకలను మంజూరు చేస్తున్నాం. వాటితో పాటు కంపోస్ట్‌ ఎరువు తయారు చేసుకునేందుకు వీలుగా నీటి కుంటల నిర్మాణాలకు సైతం నిధులను అందిస్తున్నాం. కుండీల్లో గడ్డిని పెంచుకునేలా అజోలా గ్రాసాన్ని సైతం అందజేస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులతో పాటు పశు పోషకులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆసక్తి గల రైతులు సంబంధిత ఎంపీడీవోలను సంప్రదించి వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్నిచోట్ల ఇప్పటికే నిర్మాణాలను కూడా ప్రారంభించాం. గడువులోపు వందశాతం పశువుల పాకలు నిర్మించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఆసక్తి గల రైతులు ఈ అవకాఽశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పాడి సంపదను పెంచుకోవచ్చు

– సాయన్న, డీఆర్డీవో

మండలం మంజూరైన పూర్తయినవి మంజూరైన పూర్తయినవి

పశువులపాకలు నీటి కుంటలు

ఆదిలాబాద్‌రూరల్‌ 05 02 23 00

బజార్‌హత్నూర్‌ 19 02 03 00

బేల 05 01 28 00

భీంపూర్‌ 20 04 09 01

బోథ్‌ 09 03 10 01

ఇచ్చోడ 10 00 21 00

గాదిగూడ 23 04 29 01

గుడిహత్నూర్‌ 10 00 14 00

ఇంద్రవెల్లి 28 12 23 04

జైనథ్‌ 13 00 00 00

మావల 06 01 03 00

నార్నూర్‌ 14 02 21 00

నేరడిగొండ 15 02 12 00

సిరికొండ 03 01 14 03

తలమడుగు 15 09 14 06

తాంసి 12 12 09 09

ఉట్నూర్‌ 25 06 07 02

No comments yet. Be the first to comment!
Add a comment
పశువుల పాకలు.. నీటి కుంటలు1
1/1

పశువుల పాకలు.. నీటి కుంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement