No Headline
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానిక ప్రభు త్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 2024, సెప్టెంబర్ 27న విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన బొమ్మెన సాగర్ మ ద్యం మత్తులో ఇంట్లోకి ఎత్తుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. స్థాని కుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
2024 నవంబర్ 13న మంచిర్యాల వడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ అదే కాలనీకి చెందిన 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి హైటెక్ సిటీ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. భయబ్రాంతులకు గురైన బాలిక తప్పించుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment