గుడిహత్నూర్ నిందితుడిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: మండలకేంద్రంలో ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు చట్ల పోశెట్టి (25)పై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ సురేందర్‌రావ్ తెలిపారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.
12 మందిపై హత్యాయత్నం కేసు
పోలీసుల విధులకు ఆటంకంకలిగించడం, దాడి కి పాల్పడిన వారిని గుర్తించి ఇప్పటివరకు 12 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన ట్లు ఏఎస్పీ తెలిపారు. మరోవైపు పోలీసు బలగా లు మండలకేంద్రంలో కవాతు నిర్వహించాయి.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ అన్నారు. మండలకేంద్రంలోని నింది తుడి ఇంటిని పరిశీలించి మాట్లాడారు. నింది తుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో విధి ని ర్వహణలో ఉన్న పోలీసులపై కొందరుదాడి చేశా రన్నారు. అలాగే పలు వాహనాలను ధ్వంసం చే సినట్లు తెలిపారు. ఇది శాంతిభద్రతలకు విఘా తం కలిగించే చర్యగా భావించి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment