ఎదులాపురం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. యూనియన్ కార్యాలయంలో ఏఎన్‌ఎంల సమస్యలపై ఆదివా రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడు నెలలుగా వేతనాలు అందక ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉ ద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఈఎస్ ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా, వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఏఎన్‌ఎం యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కమల, అనిత, కోశాధికారి సురేందర్, ఉపాధ్యక్షురాలు నర్మద, కామేశ్వరి, జంగు యి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహాసభలను
జయప్రదం చేయండి
ఎదులాపురం: ఈనెల 28 నుంచి మూడు రోజు ల పాటు నల్గొండలో నిర్వహించనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్ కోరారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో మహాసభ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఇందులో జిల్లా కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శులు శివన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment