మొక్కజొన్నపై అడవిపందుల దాడి
బోథ్: మండలంలోని బోథ్(బి) శివారులో రజిని అనే మహిళా రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో శనివారం రాత్రి అడవిపందులు దాడులు చేసి పంటను ధ్వంసం చేశాయి. దాదాపు రెండెకరాల్లో పంటను ధ్వంసం చేసినట్లు బాధిత రైతు వాపోయింది. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది.
కంది పంట దగ్ధం
బజార్‌హత్నూర్: మండలంలోని కిన్నరపల్లిలో టోంపే సునీల్‌కు చెందిన కంది పంట ఆదివారం దగ్ధమైంది. సదరు రైతు తనకున్న ఐదెకరాల్లో కందిపంట సాగు చేశాడు. పంట కోతకు రావడంతో గత వారం కోసి మెదళ్లను కల్లంలో కుప్పగా పెట్టాడు. అర్ధరాత్రి పంటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో సుమారు 20 క్వింటాళ్ల కందులు బూడిదయ్యాయని బాధిత రైతు వాపోయాడు. సుమారు రూ.2 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. పంటకు నిప్పుపెట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. ఆయన వెంట రైతులు తుకారాం, మురళి, సురేష్, తదితరులు ఉన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పెల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ప ట్టుకున్నట్లు ఎస్సై సుమలత తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన నడిపి రాజన్న ఇంట్లో ఆదివారం తనిఖీలు నిర్వహించగా 6 క్వింటాళ్ల రేషన్ బి య్యం పట్టుబడ్డాయి. అనంతరం తదుపరి చ ర్యల నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు నివేదించినట్లు ఆమె తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
చెట్టును ఢీకొన్న మారుతి వ్యాన్
బోథ్: మండలంలోని సొనాల గ్రామ సమీపంలో ఓ ప్యాసింజర్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఆదివారం చింతలబోరి నుంచి సొనాలకు బయలుదేరిన మారుతి వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటన సమయంలో వాహనంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాహన చోదకునికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment