‘సమగ్ర’ సమ్మెకు బీఆర్‌ఎస్ మద్దతు
● బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ● దీక్ష శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం
కైలాస్‌నగర్: సమస్యల పరిష్కారం కోసం సమగ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 19వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట గల సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్యే శనివారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సెల్‌ఫోన్‌లో మాట్లాడించి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాయ్ తాగేలోపు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న హామీని ిసీఎం ఎందుకు నిలుపుకోవడం లేదని ప్రశ్నించారు. సమగ్ర ఉద్యోగులకు న్యాయం జరిగేంత వరకు వారి పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రూ.50వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు తమను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట మోకాళ్లపై నిలబడి అర్దనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, అధ్యక్షురాలు ప్రియాంక, కార్యదర్శి ధరంసింగ్, శ్రీకాంత్, కేశవ్, ప్రశాంత్‌రెడ్డి, ప్రకాశ్, దేవదర్శన్, మమత, సురేందర్, వెంకటి, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment