ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి
● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): విద్యార్థులు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జైనథ్ మండలంలోని లక్ష్మిపూర్ పాఠశాలను శనివారం సందర్శించారు. ‘ఆరోగ్య పాఠశాల లక్ష్మి పూర్ బడి’ అనే కథల పుస్తకాన్ని విద్యార్థులు రచించగా,కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై ఆరా తీశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి సారిస్తారన్నారు. కలెక్టర్ వెంట డీఈవో ప్రణీ త తదితరులున్నారు.
పత్తి పంటను పరిశీలించిన కలెక్టర్..
అనంతరం గ్రామంలో పత్తి పంటను కలెక్టర్ పరిశీ లించారు. జిల్లాలో డిసెంబర్ తర్వాత గులాబీపురు గు ఉధృతి ఉంటుందని, దీంతో రైతులు నష్టం చవి చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సూచనలమేరకు రైతులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. కలెక్టర్ వెంట శాస్త్రవేత్తలు రాజ శేఖర్, వ్యవసాయ అధికారులు విశ్వమిత్ర, పూజ, సాయితేజ రెడ్డి ఉన్నారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment