పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కై లాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్–వర్కర్స్ యూని యన్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు శనివా రం ఆందోళన చేపట్టారు. కలెక్టరే ట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప లువురు మాట్లాడుతూ, ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. జీవోనంబర్ 51ను సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేసి, కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించని పక్షం లో సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మికులు ఇంద్రాజ్, లక్ష్మ న్న, రాజు, రఫీ, మోహన్, అరవింద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment