అర్జీల వెల్లువ
● ప్రజావాణికి 108 వినతులు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ రాజర్షి షా వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని అందుబాటులో ఉన్న అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఫోన్‌లో మాట్లాడి బాధితుల సమస్యలను పరిష్కరించేలా చూడాలని సూచించారు. కాగా, ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 108 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామాలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.
బండరాళ్లను తొలగించండి
మాది భీంపూర్ మండలంలోని నిపానిగ్రామం. మా గ్రామానికి చెందిన 40 మంది రైతులకు 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం అసైన్డ్‌భూములను పంపిణీ చేసింది. అయితే వాటిల్లో పెద్దపెద్ద బండరాళ్లు ఉండి పంటల సాగుకు ఇబ్బందికరంగా ఉంది. వాటిని తొలగించాలని ఆరేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ పథకం కింద ఆ బండరాళ్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
పీఎం కిసాన్ నిధులు రావట్లేదు
మేమంతా జైనథ్ మండలంలోని లక్ష్మింపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులం. 2019లో బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం మాకు దళితబస్తీ కింద మూ డెకరాల చొప్పున భూములను పంపిణీ చేసింది. వాటిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే రూ.6వేల ఆర్థికసాయం అందడం లేదు. వ్యవసాయాధికారుల ను ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోవడం లేదు. ఆర్థికసాయంతో పాటు బోరు మోటార్లు కూడా అందించి ఆదుకోవాలని కోరుతున్నాం.
కోర్టు ఆదేశించినా
పోస్టింగ్ ఇవ్వట్లేదు
నాపేరు మలపతి స్వప్న. తాంసి మండలం పొన్నారి గ్రామం. 2018లో ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ పంచాయ తీ కార్యదర్శుల నియామక రాత పరీక్షలో మొదటి ర్యాంకు సాధించాను. అయితే దరఖాస్తు సమయంలో మహిళకు బదులుగా పురుషుడిగా పొరపా టు జరిగింది. ఈ కారణంతో నాకు పోస్టింగ్ నిలిపివేశారు. అప్పటి నుంచి జిల్లా పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగి నా స్పందించలేదు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబర్‌లో హైకోర్టును ఆశ్రయించగా జనవరి 3లోగా నాకు పోస్టింగ్ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. విచారణ జరిపించి జేపీఎస్‌గా ఉద్యో గం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నా.
విద్యుత్ సౌకర్యం
కల్పించండి
నా పేరు అసద్. మావల మండలంలోని సర్వేనంబర్ 170లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం(2013)లో ఇందిరమ్మ ఫేజ్–3 కింద ఇళ్ల స్థలాల ను పంపిణీ చేసింది. గుడిసెలు వేసుకుని నాటి నుంచి అక్కడే జీవనం సాగిస్తున్నాం. ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. చిమ్మచీకట్లలో అవస్థలు పడుతూ కాలం వెల్ల దీయాల్సి వస్తుంది. వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment