పిట్టబొంగరంలో రక్తదాన శిబిరం
ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగరం గ్రామంలో నవజ్యోతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా గురువారం ప్రారంభించారు. శిబిరంలో 150 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నవజ్యోతి సేవా ఫౌండేషన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా మాట్లాడుతూ.. రక్తహీనత ఎక్కువగా ఉందని ఎవరూ బాధపడనవసరం లేదని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఏఎస్పీ కాజల్, నాయకులు రాజేశ్వర్, భీంరావు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, అనదపు డీఎంహెచ్‌వో మనోహర్, డీఎంవో శ్రీధర్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో భాస్కర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment