పత్తి కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణ జరిపించాలి
కైలాస్‌నగర్: పత్తి నాణ్యత లేదనే సాకుతో సీసీఐ అధికారులు మద్దతు ధరలో కోత విధించడం శోచనీయమని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించి పలువురు రైతులతో మాట్లాడారు. ఇంద్రవెల్లి, నార్నూర్, బేల, ఇచ్చోడ, గుడిహత్నూర్ మార్కెట్‌లో జిన్నింగ్ మిల్లులున్నప్పటికీ ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే పత్తిని తిరిగి సీసీఐకి అమ్ముతున్నారని తెలిపారు. కౌలు రైతుల పేరిట సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని సీసీఐకి అమ్ముకుంటూ నిజమైన రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నాయకులు శంకర్, గంగయ్య, ఖాదీర్, దిలీఫ్, జంగు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment