‘సమగ్ర’ ఉద్యోగుల వినూత్న నిరసన
కై లాస్‌నగర్: ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన స మ్మె 24వ రోజుకు చేరింది. గురువారం సీఎం రే వంత్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో కూడిన మాస్కులు ధరించి కలెక్టరేట్ సమ్మె శిబిరం నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడల రవీందర్ మాట్లాడుతూ.. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి హామీలు అమలు చేయకుంటే సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక, ప్రధాన కార్యదర్శి ధరమ్‌సింగ్, వెంకటి, పార్థసారథి, శ్రీకాంత్, ప్రవీణ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment