ఉత్తమ ఫలితాలు సాధించాలి
బజార్‌హత్నూర్: ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈవో రవీందర్ సూచించారు. గురువారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిష్టర్లు, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు ప్రతీరోజు స్టడీ హవర్ నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ సునీల్, మోసిన్, అధ్యాపకులు అశోక్‌రెడ్డి, భీమేశ్, గంగాధర్, ప్రదీప్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, సుభాష్, హైమద్ పాల్గొన్నారు.
రెండోరోజుకూ హమాలీల సమ్మె
కై లాస్‌నగర్: హమాలీ రేట్ల పెంపు జీవోను వి డుదల చేయాలనే డిమాండ్‌తో సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజుకు చేరింది. గురువారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో గల సివిల్ సప్లయ్ గోదాంఎదుట బైఠాయించి హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేసేలా హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్వీ నేత
ఉట్నూర్‌రూరల్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీఆర్‌ఎస్వీ జిల్లా ఽఅధ్యక్షుడు ధరణి రాజేశ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ రాజేశ్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment