వణికించిన పులి, ఏనుగు
● తొలిసారిగా ఏనుగు దాడిలో ఇద్దరి మృతి ● పులి దాడిలో మరొకరు.. ● రెండు పులులు కూడా మరణం ● ఈ ఏడాదిలోనూ వన్యప్రాణులు, మనుషులకు ఘర్షణ
రెండు పులుల మరణం
మరోవైపు ఈ ఏడాదిలోనే రెండు పులులు మ రణించాయి. ఐదారేళ్ల వయస్సున్న మగపులి (ఎస్ 9)ని విషమిచ్చి చంపారు. గత జనవరిలో కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివి జన్ దరిగాం, సర్కెపల్లి మధ్య బూడిద మా మిడి అడవుల్లో ఏడాదిన్నర ఆడపులి, అదే నెల 8న ఐదారేళ్ల మగపులుల కళేబ రాలను గుర్తించారు. ఈరెండింటిలో ఆడపులి మాత్రం మరోపులి తో పోరులో చనిపోగా, మగపులి మాత్రం విషంతో చనిపోయిన ట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు పులల మరణంతో అటు అ టవీ అధికారులపై చర్యలతోపాటు ప లువురు రైతులపైనా కేసులు నమోదయ్యా యి. అంతేకాక మరోసారి ఎవరూ పులు లకు ముప్పు కలిగించకుండా, పశువులు, మ నుషులపై దాడి చేస్తే పరిహారం పెంచడంతో పాటు 24 గంటల్లోనే చెల్లించేలాఏర్పాటు చేశారు.
సాక్షి ప్రతినిధి,మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో ఈ ఏడాది వన్యప్రాణులు అలజడి రేపాయి. ఏటా చలికాలంలో పులుల సంచారం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించా యి. రెండేళ్ల తర్వాత గత నెలలో కాగజ్‌నగర్ మండలం గన్నారానికి చెందిన మోర్లే లక్ష్మిని పత్తి చేనులోనే దాడి చేసి చంపేయగా, సిర్పూర్(టీ) పరిధి దుబ్బ గూడలో రైతు సురేశ్‌పై దాడిచేసింది. అయితే ఆయ న ప్రాణాలతో బయటపడ్డారు. ఇక రైతుల పశువులు, మేకల మందలపైనా దాడులు చేస్తున్నా యి. దీంతో అటవీ సమీపప్రాంతాల్లోని గ్రామాల ప్రజల కు కునుకు లేకుండా పోతోంది. రోడ్లు దాటు తూ, జన సంచారం ఉన్న చోటు వరకు పులులు, చిరుతలు కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాదిలోనూ మనుషులు, వన్యప్రాణులకు ఘర్షణ కొనసాగింది.
వలస పులులతో భయం
ఈ ఏడాది పొడవునా మహారాష్ట్ర నుంచి కవ్వాల్ టై గర్ రిజర్వులోకి పులులు రాకపోకలు సాగించాయి. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల వరకు ఓ మగపులి, సిర్పూర్(టీ) మీదుగా మరోపులి, ఆసి ఫాబాద్ జిల్లాలో మరో పులి సంచరించింది. వీటిలో రెండు మగవి, కాగా ఒకటి ఆడపులి ఉంది. ప్రస్తు తం రెండు వలస పులులు సంచరిస్తున్నాయి. మరోవైపు ఇద్దరిపై దాడిచేసి పులి మహా రాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో సంచరిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మొ దలై జన్నారం వరకు పులు లు సంచరించాయి. దీంతో ఆయా చోట్ల ఉన్న స్థానికులు బెంబేలెత్తారు.
తొలిసారిగాఏనుగు రాక
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఓ ఏనుగు ఉమ్మడి జిల్లాకు వచ్చింది. మూడు రోజులపాటు సంచరిస్తూ అలజడి రేపింది. ఇద్దరిపై దాడి చేసి చంపేసింది. గత ఏప్రిల్‌లో 25నుంచి 30ఏళ్ల వయస్సు మగ ఏనుగు చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో మిరపతోటలో రైతు శంకర్‌ను చంపేసింది. మరుసటి రోజే పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో కారు పోశన్నపై దాడిచేసి చంపేసింది. దీంతో స్థానికులు చేన్లలోకి వెళ్లాలంటే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చివరకు మురళి గూడ సమీపంలో ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు భవిష్యత్తులోనూ ఏనుగులు వచ్చే అవకాశం ఉన్నట్లు ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికను సైతం అటవీశాఖ సిద్ధం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment