చిరుతపులి దాడిలో ఆవు మృతి
తలమడుగు: చిరుతపులి దాడిలో ఆవు మృతిచెందింది. మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన నలుగురు రైతులకు చెందిన 30 ఆవులను మేత కోసం కూలీలు సోమవారం ఉదయం మేత కోసం నందిగ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు 29 ఆవులు రాగా, ఒకటి రాలేదు. కూలీలు అటవీ ప్రాంతంలో వెతకగా మంగళవారం ఆవుకు గాయాలై మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌ఆర్వో పుండలిక్, గుడిహత్నూర్ ఎఫ్‌ఎస్‌ఓ ఇమ్రాన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత పులి దాడి చేసినట్టు గుర్తించారు. మృతి చెందిన ఆవు విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని, అధికారులు నష్టపరిహారం అందించాలని బాధిత రైతు ముడుపు కేదరేశ్వర్‌రెడ్డి కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment