పరిశీలిస్తున్నసెక్షన్ అధికారి, సిబ్బంది
తాంసి: పిప్పల్‌కోటి శివారులో పులి సంచరించినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని అటవీ సెక్షన్ అధికారి అహ్మద్‌ఖాన్ తెలిపారు. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి శివారులోని పంట చేలో శనివారం మూడు పశువులను అటవీ జంతువులు హతమార్చిన విషయం తెలిసిందే. కాగా పులిదాడిలోనే మరణించినట్లు భావించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సెక్షన్ అధికారి సిబ్బందితో కలిసి ఆదివారం అక్కడికి చేరుకున్నారు.
పశువులు మృతి చెందిన ప్రదేశాలు, చుట్టు పక్కల ఉన్న అడవిని పరిశీలించారు. వాటి కళేబరాల వద్ద పశువైద్యాధికారి సుభాష్ రాథోడ్‌తో కలిసి పంచనామా నిర్వహించారు. కాగా పశువులను హతమార్చిన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అందులో ఎలాంటి జంతువుల కదలికలు కనిపించలేదని సెక్షన్ అధికారి తెలిపారు.
ప్రస్తుతం పులి సంచరించినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేనందున రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. అటవీ జంతువులు సంచరించినట్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వారి వెంట బీట్ అధికారి సాయి కుమార్, ఎనిమల్ ట్రాకర్స్ కృష్ణ, సోనేరావు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment