అప్రోచ్ రోడ్డు సరిగ్గా నిర్మించక ఇబ్బందులు
కొయ్యూరు: జాతీ య రహదారి 516 ఈ నిర్మాణంలో భాగంగా అప్రోచ్‌రోడ్డును సరిగా నిర్మించకపోవడంతో ఇబ్బందులకు గురుతున్నట్టు పనసలపాడు గ్రామస్తులు దుచ్చరి జోగారావు,పద్మ శ్రీనివాస్ తదితరులు తెలిపారు. ఎం.మాకవరం పంచాయతీ పిట్టచలం నుంచి పనసలపాడుకు వెళ్లే రహదారిని సరిగా నిర్మించలేదని వారు చెప్పారు. ఈ మేరకు రోడ్డు వద్ద స్థానికులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిట్టచలం నుంచి పడసలపాడు వెళ్లేందుకు బీటీరోడ్డు ఉందన్నారు.అయితే జాతీయరహదారి వేసిన అధికారులు ఇక్కడ అప్రోచ్‌ను సరిగా వేయలేదన్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయని, పెద్ద వాహనాలు రావడం లేదన్నారు.దీంతో ధాన్యం తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే రోడ్డుపై ఆందోళన చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment