మద్దిలపాలెం (విశాఖ): కళాభారతి ఆడిటోరియంలో వార్షిక నృత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీకృష్ణ పారిజాతం నృత్య రూపకం నయనానందకరం సాగింది. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, కళారత్న బాలకొండలరావు శిష్య బృందం ఈ నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. కళాభారతి ట్రస్ట్ కార్యదర్శి గుమ్మూలూరి రాంబాబు, ముఖ్యఅతిథి ఎ.మధుకుమార్, బాలకొండల రావు, టేకుముళ్ల శ్యామల జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నృత్యకళాకారుల పదర్శించిన శ్రీకృష్ణ పారిజాతం నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment