పలు గ్రామాల్లో పీసా ఎన్నికలు
గంగవరం : మండలంలోని సూరంపాలెం, దొరమామిడి, లక్కొండ గ్రామ పంచాయతీల్లో రాజుపేటలొద్ది, వేమనాపల్లి, దోనెలపల్లి, గొరగొమ్మి, దొరమా మిడి గ్రామాల్లో సర్పంచ్‌లు బల్లెం శివదొర, ప్రతాప్‌రెడ్డి, చంద్రకళ అధ్యక్షతన పీసా ఎన్నికలు నిర్వహించారు. సూరంపాలెం పంచాయతీ పీసా ఉపాధ్యక్షుడిగా కుంజం దొంగబాబు దొర, కార్యదర్శి గా సారపు బాలు దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దొరమామిడి పంచాయతీ పీసా ఉపాధ్యక్షుడిగా మడకం రామారావు దొర, కార్యదర్శింగా చోడి సంకురు దొర, లక్కొండ పంచాయతీ ఉపాధ్యక్షుడిగా ఓ.శివశంకర్‌రెడ్డి, కార్యదర్శిగా కె.రాజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి విశ్వనాఽథ్ వ్యహరించారు. ఆముదాలబంద ఎంపీటీసీ పండా ఆదినారాయణ దొర, పంచాయతీ కార్యదర్శులు అజయ్, రాజకుమార్, భరత్ పాల్గొన్నారు.
పీసా ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు
రంపచోడవరం: ముసురుమిల్లి గ్రామ పీసా కమిటీ ఉపాధ్యక్షుడిగా వీకా నాగేశ్వరరావు, కార్యదర్శిగా కడబాల పెంటారెడ్డి గెలుపొందారు. పంచాయతీ కార్యదర్శి రాంబాబు అధ్యక్షతన జరిగిన పీసా గ్రామ సభలో ఎన్నిక నిర్వహించారు. సర్పంచ్ కోసు రమేష్‌బాబుదొర, ఉప సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, వార్డు మెంబర్ వీకా సత్తిబాబు, బొబ్బా సత్యనారాయణ, కడబాల రామలక్ష్మి, ప్రభావతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment