కాఫీ కొనుగోలుకు పెరుగుతున్న పోటీ
కాఫీ ఫలసాయం కొనుగోలుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పోటీపడుతుండటంతో రైతులకు మంచి ధర లభించే పరిస్థితి కనిపిస్తోంది. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో మ్యాక్స్ సంస్థ కొనుగోళ్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో మాతోట తదితర రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలకు అనుగుణంగా రైతులకు చెల్లిస్తామని ప్రకటించాయి. గిరిజన సహకార సంస్థ కూడా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడంతో కాఫీ రైతుల్లో ఆనందం నెలకొంది.
చింతపల్లి: మన్యంలో కాఫీని సాగు చేస్తున్న గిరి రైతులకు మంచి రోజులు వచ్చాయి. అధిక ధరలకు కొనుగోలు చేస్తామని ప్రైవేట్ సంస్థలు ప్రకటించడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో 2.45 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. దీనిలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం వస్తోంది. ఈ సాగుపై సుమారు 1.30 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. సుమారు 17వేల టన్నుల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది పాడేరు డివిజన్ పరిధిలో పాడేరు, జి మాడుగుల, పెదబయలు, హుకుంపేట, అరకు, డుంబ్రిగుడ ప్రాంతాల్లో కాపు ఆశాజనకంగా ఉంది. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో దిగుబడి తగ్గే అవకాశం ఉందని కాఫీ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఐటీడీఏ ఆధ్వర్యంలో 2 వేల టన్నుల కాఫీ పండ్ల కొనుగోలు లక్ష్యంగా మ్యాక్స్ సంస్థ ప్రకటించింది. కిలో రూ.44 చొప్పుస ఇప్పటివరకు 330 టన్నుల కాఫీ పండ్లను కొనుగోలు చేసింది. గిరిజన నహకార సంస్థ ఈ ఏడాది పెంచిన ధరలను సవరించింది. పాడేరు డివిజన్‌లో మూడు రకాలు కలిపి 2వేల టన్నులు కొనుగోలు చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇలావుండగా కాఫీ కొనుగోళ్లకు సంబంధించి ఈ ఏడాది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దూకుడు పెంచాయి. జీసీసీ, మ్యాక్స్ ప్రకటించిన ధరల కన్నా ఇవి ప్రకటించిన ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. మాతోట, గంతన్నదొర, నాంది, కోవెల, మన్యతోరణం, ఆంధ్రా కశ్మీర్, అరుణతార, సుగుమన తదితర
మిగతా 8వ పేజీలో
ముందుకు వస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మెరుగైన ధర చెల్లిస్తామని ప్రకటన
కొనుగోలు ధరలను సవరించిన జీసీసీ
నెలాఖరు నుంచి
కొనుగోలు చేస్తామని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment