సమస్యలు పరిష్కరించేందుకే ‘మన ఎమ్మెల్యే మా ఊరు’
పాడేరు : గ్రామాలను సందర్శించి స్థానిక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్న లక్ష్యంతో ‘మన ఎమ్మెల్యే మా ఊరు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు వెల్లడించారు. శనివారం ఆయన మండలంలోని కుజ్జెలి పంచాయతీ మారుమూల ఇసుకలు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక గిరిజనులతో మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, జన్‌మన్ పథకంలో కొంతమందికి మాత్రే ఇళ్లు మంజూరు అయ్యాయని వారు ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే ఆయన తాగునీటి సమస్యపై అక్కడి నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే జల్‌జీవన్ మిషన్ పథకంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఇతర సమస్యలను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని గిరిజనులకు ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని అన్ని గ్రామాల్లో తాను పర్యటిస్తానని చెప్పారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు,ఎంపీటీసీ కుంతూరు నర్సింహమూర్తి, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్‌కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజల దృష్టికి కూటమి మోసపూరిత హామీలు
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
కుజ్జెలి పంచాయతీ ఇసుకలు
గ్రామంలో ప్రారంభం
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment