అనర్హుడికి కాఫీ ఇన్‌చార్జి ఏడీగా అందలం
పాడేరు రూరల్: జిల్లా కేంద్రంలో కాఫీ విభాగం ఇన్‌చార్జి ఏడీగా అనర్హుడిని నియమించడం తగదని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మన్నపడాల్, బాలదేవ్ విమర్శించారు. ఆదివారం వారు మాట్లాడుతూ అర్హతలేని గిరిజనేతరుడు, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్న ఉద్యోగి అప్పలనాయుడును ఇన్‌చార్జి కాఫీ ఏడీగా నియమించడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా సాగు చేస్తున్న కాఫీ, మిరియం పంటలపై రైతులకు సూచనలు చేసే అవగాహన కూడా ఆయనకు లేదన్నారు. సంబంధిత విభాగంలో ఎంతో మంది గిరిజనులు డిగ్రీలు, పీజీ చదువుకుని సబ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారన్నారు. ఇందుకు అధికారుల వైఫల్యమే కారణమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇన్‌చార్జి ఏడీ బాధ్యతలనుంచి అప్పలనాయుడును తప్పించాలని, లేకుంటే కాఫీ రైతులతో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మన్నపడాల్,
బాలదేవ్ విమర్శ
ఆయనను తప్పించాలని డిమాండ్
లేకుంటే కాఫీ రైతులతో కలిసి
ఆందోళన చేస్తామని హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment